బ్లాగారిష్టమ్స్...ఓ బ్లాగరి బాధల కథ

ఇల్లు అలగ్గానే పండగ కాదు, house decoration no festival-అన్నాట్ట ఎవరో పెద్దాయన
ఇల్లు కట్టిచూడు, పెళ్ళిచేసి చూడు- అని ఇంకో ఎవరో పెద్దాయన అన్నాట్ట
నా అనుభవాల మూలంగా ఈ సామెతల పరంపరలో నేను కొత్తగా కనిపెట్టిన సామెతలనుకూడా చేర్పించాలనుకుంటున్నాను అవి " బ్లాగు పెట్టిచూడు, పోస్టు రాసిచూడు", "బ్లాగు రిజిస్ట్‌ర్‌ చేయగానే పనైపోలేదు, blog register work not over".

ఏంటి...."వీడికి మతిపొయింది","ఈ చెత్తని కూడా సామెతలనాలా బాబు..." అని అనుకుంటున్నారా....ఐతే కూసింత ఆగి నా కష్టాలు ఓసారి వినండి...సారి.. చదవండి....తరువాత మీరె ఒప్పుకుంటారు నేను కనిపెట్టిన సామెతళు ఉత్కృష్టమైనవని.
అంతా సిద్దమేనా........ఐతే ఆలకించండి

మొట్టమొదటగా అంటే ఫస్ట్ ఫస్ట్‌......కొంతకాలంగా పనిపాటా లేని కారణంగా కంప్యూట‌ర్‌తో కాపురం మొదలుపెట్టాను. ఆ క్రమంలో నెట్‌లో ఉన్న బ్లాగులపైన కన్నుపడటం అందునా తెలుగు బ్లాగులపైన పడటం జరిగి లోకకళ్యాణార్థం నేనుకూడా ఓ బ్లాగు తెరవాలనిపించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేంటని అనుకున్నదే తడవుగా గూగుల్‌ వారి సౌజన్యంతో, సహాయ సహకారాలతో, ప్రెమాభిమానాలతో, వంకాయ బీరకాయలతో.....వగైర వగైరలతో మార్గదర్శిలో చెరకుండానే ఓ బ్లాగు అడ్రసు సంపాదించుకున్నాను. ఇక్కడనుండి మొదలైంది crocodile festival.....జజ్జనక జనారే.

అడ్రసు రిజిస్ట్‌ర్‌ చేసుకోగానే దాన్ని ఓ మూలపడేసాను...తరువాత కొన్నాళ్ళకు జ్ఞానోదయం అవడం చేత పునరుద్దరణ కార్యక్రమం మొదలుపేట్టాను. సో... దానికోసం బ్లాగు template ఒకటి సెట్‌ చేయాలి. పాపం గూగుల్‌ గారు మ'ల్లి' వాత్సల్యాభిమానంతో కొన్ని templates కానుకగా ఇచ్చారు. అంత వీజిగా దొరికితే మనమెందుకు తీసుకోవాలనుకొని గో..........ప్ప...గా శోధించి శోధించి ఓ టెంప్లెట్‌ వెతికి పట్టుకొని దాన్ని నానా విధాలుగా దిగ్గొట్టి-ఎగ్గొట్టి, మడతలు పెట్టి-ముడతలు విప్పి బ్లాగుకి అంటించుకున్నా. ఈ తతంగం పూర్తి అయ్యెసరికి నేను తారె జమీన్‌ పర్‌ ఫ్రీగా చూసాను. ఫ్రీగా చూసాను అంటే పైరేటేడ్‌ CD తెప్పించుకొని చూసాననుకొనేరు.....చుక్కలు కనపడ్డాయి అని కాస్త సింబాలిక్‌గా చెప్పాను.

తరువాతి కార్యక్రమం బ్లాగుకి ఓ పేరు పెట్టడం.నామకరణం. దీనిక్కూడా ఓ మోస్తారు శోధనచేసి, మేథోమధనంగావించి "హరివిల్లు" అనే పేరు పెట్టాను(wat a lovely name....). ఓ పోస్టు కాడా రాసేసిన కొన్నిరోజులకు కూడలిలో జాయిన్‌ చేసా.ఎన్ని హిట్లు వస్తున్నాయో తెలుకునేందుకు code కూడా తగిలించుకున్నా. so far well and good. మొదటి పోస్టుకి ఆశించినన్ని హిట్లు లేవు. not bad, i'm not a popular blogger afterall అనుకొని అడ్జ్‌స్ట్‌ అయ్యా. రెండో టాపా పోస్టు చెసిన తరువాతరోజు ఒక్కసారిగా హిట్లు పెరిగిపోయినాయి.....పట్టలేని ఆనందం.....Eureka sakamIkA అని పాడెసుకున్నా.....తరువాత తెలిసింది నా లాంటి హరివిల్లులు (హరివిల్లు, హరివిల్లు) ఇంకో రెండు ఉన్నాయని......
బహుశా వాళ్ళ బ్లాగు అనుకొని నా బ్లాగుని చూసినట్టున్నారు (దీనికి గాను జయచంద్ర గారికి, శ్రీనివాస గారికి క్షమాపణలు-వారి హిట్లు తగ్గించినందుకు) .
నేను వాటిని పరికించాను, రాశిలోనూ వాసిలోనూ పెద్దవే. అదే పేరు తగిలించుకుంటే identity crisisతొ బాధపడాల్సి వస్తుంది.....so, పేరు మార్చాలి లేకపోతే ఆ ఇద్దరినీ నయానో భయానో ఒప్పించి వాళ్ల బ్లాగు పేర్లు మార్పించాలి. రెండొది కాస్త కష్టం అనిపించి (అంటే ఈమధ్యన ఎక్సర్‌సైజ్‌ చేయడం మానేసాను బాడి కొంచెం వీకైంది...) నాదాన్నే కర్రవిరక్కుండా పాము చచ్చేలా మార్చవలసివచ్చింది. "ఇంద్రధనస్సు" అని
హతోస్మి.
బ్లాగు జీవితంలో ఫస్ట్‌ psychic shock.


ఇహ ముఖ్యమైనది, తేల్చుకోవలసినదీ టాపాలు రాయడం. టాపాలు రాయడంతో సమస్య అన్నాను అంటే విషయాలు దొరక్కకాదు, తెలుగులో రాయడం అని. తెలుగు తెలీదనికాదుగాని 'ల'కారానికి ,'ళ'కారానికి ళంకె కుదరటంలేదు. మామూలు పదాలు ఓకేగాని,
'పళ్లెం' అనాలా 'పళ్ళెం' అనాలా
'గొళ్లెం' అనాలా 'గొళ్ళేం' అనాలా
'కళ్లు' అనాలా 'కళ్ళు' అనాలా
'పెళ్లి' అనాలా ' పెళ్ళి' అనాలా ఇలాంటివి అన్నమాట-సెకండ్‌ progressing psychic shock.
రాస్తూపోతూఉంటె అవేతెలుస్తాయిలె but తెలుసుకొనేతలోపు ఎవరైనా పోస్టులు చూసి ల-ళ చూసి జుట్టుపీక్కుంటే.....అదో తళనొప్పి.

అందుకే అనుకున్నాను " బ్లాగు పెట్టిచూడు, పోస్టు రాసిచూడు", "బ్లాగు రిజిస్ట్‌ర్‌ చేయగానే పనైపోలేదు, blog register work not over".

చూసారా నా కష్టాలు చదవంగానే మీకు బకేట్లకొద్దీ కన్నీరు కారుతుంది. ఏడవకండి, మీరు నాలాగే గుండె రాయి చేసుకోండి.మనుసున్న మనిషికే కష్టాలు....తప్పదు, అదే జీవితం.

త్వరళోనే ఇంకో టాపాతో మల్లి కళుసుకుందాం.

18 వ్యాఖ్యలు.. :

Indian Minerva said...

ఒహో అందుక్కన్న మాట మీ బ్లాగు పేరు ఇంధ్రధనుస్సయ్యింది. కానీ "హరివిళ్ళు" అన్నపేరు చాలా బాగుండేది :)
ఇదే విషయంలో నాకు "ర/ఋ/ఱ/" కారముల దగ్గర పే.............ధ్ధ confusion. తాడేపల్లి గారి బ్లాగు చదివినప్పుడల్లా తెలుగులో నేనెన్ని తప్పులు రాస్తున్నానో అర్ధమవుతుంటుంది.

...Padmarpita... said...

ఎడ్చేసి, నవ్వేసి మీ తదుపరి టపా కోసం ఎదురుచూస్తున్నా!

హరే కృష్ణ . said...

బావుంది కొత్త బ్లాగ్
మళ్ళీ అనాలా మల్లీ అనాలా ?
keep going

నాగప్రసాద్ said...

ఇంద్రధనుస్సు లో రంగలు బాఘా ఎక్కువయినట్టున్నాయి. టపాలోని సగం అక్షరాలను మింగేస్తున్నాయి. :)

(ఇక్కడ మళ్ళీ మీరు జుట్టు పీక్కోకండి. బాగా అనాలా, బాఘా అనాలా అని). :) టపా చాలా బాగా రాశారు. (రాశారు అనాలా? వ్రాశారు అనాలా?) :)

Anonymous said...

:)

దాదాపు రెండేళ్ళ క్రితం నేనూ అడిగాను: ళ్ళ మరియు ళ్ల లలో ఏది సరైనదని. అక్కడా ఓ సారి చూడండి.

రమణి said...

హహ్హ హ బాగా నవ్వించేసారు.. చేశారు అనాలా చేసారు అనాలా వ్రాసారు అనాలా రాశారు అనాల రాసారు అనలా.. మీ టపా చదివేయగానే నాకు బోల్డు సందేహాలు వచ్చేస్తున్నాయి. అవునూ పోస్ట్ ని టపా అనే ఎందుకంటారు.. ఇంద్రధనస్సు ... హరివిల్లంత బాగుంది.

రమణి said...

వర్డ్ వెరిఫిచషన్ తీసేస్తే బాగుంటుందేమో అదే పద నిర్ధారణ

Anonymous said...

వెరిఫిచషన్ అనాలా వెరిఫికేషన్ అనాలా ?

nagarjuna చారి said...

@Indian Minerva
ఇకపై ఆ సమస్య ఉండదనుకుంటా...చిన్నప్పుడు పుస్తకాల్లో చదివనట్టు గుర్తు, ’గుఱ్ఱం’,’ఋతువులు’,’ఎఱుపు’ అని.ఈమధ్య అలా లేదు వార్తాపత్రికల్లో కూడా ’రుతువులు’ అనేస్తున్నారు....ఒక్క పెద్ద బాలశిక్షలో మాత్రమే ఇంకా ఋ/ఱ లు వాడుతున్నారు.

@padmarpita
:)

@హరేకృష్ణ
ఇందాక అన్నట్టు ఋ/ఱ పోయి ’ర’ సెటిలైపోయింది.....భవిష్యత్తులో 'ళ' ను ఎత్తేసి 'ల' తో సర్దుకుంటామేమో....అప్పటి వరకూ ఏదైనా వాకే.

@నాగప్రసాద్‌
గ్రాంధికం నుండి గల్లీ భాషైనా ఫరవాలేదు.....రాశారు/వ్రాశారు/రాశ్న్‌వ్‌ ఏదైనా సరే... :)
templateని మళ్ళి దిగ్గొట్టి-ఎగ్గొట్టాను.ఈ రంగులు మీకు నచ్చుతాయనుకుంటా.. :)

nagarjuna చారి said...

@veeven
హ హ్హ హ...same pinch. ఇవే అనుకుంటే వేరే డౌట్లు తీసుకొచ్చారు రానారె గారు. చూడండి
http://mynoice.blogspot.com/2009/05/blog-post.html

@రమణి
:)
హి హ్హి హి...సందేహాలు ఏమైనా ఉంటే నాగప్రసాద్‌గారిని సంప్రదించండి...ఆల్ క్లియర్‌

కిషన్ రెడ్డి said...

హ హ బాగున్నాయి మీ బ్లాగ్ కష్టాలు...దాదాపుగా మొదటిలో అందరూ పేస్ చేసేవే...ఇంకో విష్యం ఏమిటంటే, మొదటిలో నేనుకూడా హరివిల్లు అనే బ్లాగ్ పెట్ట...కానీ ఒక్క పోస్ట్ కూడా రాయలేదు...అది మూలాన పది ఉండగానే, తర్వాత ఆకాశవీధిలో అని మొదలెట్టా...అది మీరు చూసిందే...

snigdha said...

నాగార్జున గారు(ఈ పేరు కి ఫిక్సయ్యిపొమ్మంటారా):),

మీ బ్లాగ్ని చూడగానే శతసహస్ర వర్ణసోభితమీ జీవితం అన్న బాగా ఆకట్టుకుంది.పేరు చాలా చక్కగా పెట్టారు అని కొంచెం scroll చెయ్యగానే అసలేమి జర్గుతోంది అన్న టపా కనిపించింది. మేటర్ ఏంటా అని చదివితే ఘాటైన వ్యాఖ్యలు కనపడ్డాయి.అసలే నేను బ్లాగ్లోకం లో తప్పటడుగులు వేస్తున్నాను మనకి ఎందుకువచ్చిన గొడవలు అని వేరెవి చూస్తున్నాను.మీ "పేరులోనేముంది" టపా చదివాను.ద్రోణాచార్య గారు, మీ కష్టాలు చదివాక నాకు కన్నీళ్ళు ఆగలేదు. మీ బ్లాగ్లో మొదటిసారి కామెంట్ రాస్తున్నాను,కన్నీళ్ళతో రాయడం ఎందుకని ఆలోచిస్తుండగా ఇంతలో మీ "బ్లాగారిష్టంస్" టపా కనిపించింది. మీ కష్టాలు చదివి ఇక ఆగలేకపొయా అందుకే ఈ కామెంట్. మీరు చెప్పినట్లు కష్టాలు మనసున్న మనిషికేనండీ...ఏం చేస్తాము తప్పదు. ఇప్పుడు నాక్కూడా బోలెడు సందేహాలు వచ్చేస్తున్నాయి... తీరిగ్గా సందేహాలని రాస్తాను...

టపాలన్నీ చాలా బాగా ఉన్నాయి..అభినందనలు...

nagarjuna said...

@స్నిగ్ధగారు: తీరికచేసుకొని నా బ్లాగు పోస్టులు చదివినందుకు చాలా సంతోషం :) :) కన్నీళ్ళు వచ్చాయన్నారు మరి అవి ఆగిపోయాయా...తొందరగా కడిగేసుకొండి లేకపోతే సందేహాలడగలేరు.

పోతే ’ఈ పేరు కి ఫిక్సయ్యిపొమ్మంటారా’ అన్నారంటే మీరు నా అసలుపోస్టు చూసినట్టులేరు

http://naa-payanam.blogspot.com/2010/08/blog-post.html

ఇది చదివిన తరువాత మీ ఇష్టం

శిశిర said...

స్నిగ్ధగారి కామెంట్ చూసి ఈ టపా చదివా. ఈ టపా మిగిలిన టపాలన్నిటినీ చదివించింది.
ఇన్ని కష్టాలా? ఎలా భరిస్తున్నారండి? :)

nagarjuna said...

@శిశిర గారు: మంచి వాడిని మనసున్న వాడిని మంచి మనసున్న వాడిని కాబట్టి భరిస్తున్నా... :D

(Due apologies to VamsiKrishna for using his 'about me' )

snigdha said...

మీ బ్లాగ్లో మొదటి సారి కామెంట్ రాసాను కదండీ అందుకే గారు అని సంభోందించాను. మీరెమో formalities అవసరం లేదని మీ టపాలో రాశారు. మీకెలాగ ఇష్టమైతే అలా కానివ్వండీ..

is it ok,nag or chary??

nagarjuna said...

@Snigdha గారు: ఓహొ అలా వచ్చారా..., మీరు మొదటి వ్యాఖ్యలో అన్ని టపాలు చదివాను అని ’ఇలా ఫిక్సవమంటారా’ అనేసరికి ఆ పోస్టు లింకు ఇచ్చాను...అదీ matter :)

Unknown said...

ఇన్న్న్ని కష్టాలు పడ్డారా?:) Radhika (nani)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis