మళ్ళి చెబుతున్నా.... రివ్యూనో, పక్కవాడిలో గమనించిన విషయాలో చెప్పను. పూర్తిగా చెత్తపోస్టు ఇది. టైం బ్యాడ్‌గా ఉంది అనుకుంటేనే చదవండి.....
చదువుదామంటే...
--కామెడి పోస్టులు నవ్వు తెప్పించడంలేదు, [ తోటరాముడి బ్లాగు కూడా నవ్వించలేక పోయింది ]
--సీరియస్ పోస్టులు బాధను/సానుభూతి భావనను కలిగించడంలేదు.
--కెలుకుడు పోస్టులు ఆసక్తి కలిగించడంలేదు.
something is terribly wrong with me, i guess.
ఈ-మెయిలు చెక్ చేస్తూ ఓ ఫ్రెండ్ పంపించిన మెయిల్ చూసా...
ఓ చిన్నపాప [మూడు వారాల వయసు ఉండొచ్చు] ఫొటో, ఆ పాపకు ఏదో భయంకరమైన జబ్బంట, పాప తల్లిదండ్రుల దగ్గర డబ్బుల్లేవంట. ఈ సమయంలో ఓ తొక్కలో ఈ-మెయిల్ కంపెనీగాడు పాప ఫొటోతో ఉన్న మెయిల్ ను ఎంతమంది ఎన్నిసార్లు ఇతరులకు చేరవేస్తారో అన్ని రూపాయలు/సెంట్లు/యెన్‌లు, నా బొంద, ఆ పాప తల్లిదండ్రులకు ఇస్తారంట. ప్లీ..........జ్ మీకు హృదయం అనేది ఏడిస్తే ఫార్వర్డ్ చేయండి అని రాసుంది.
చదవంగానే మెయిలు పంపించిన ఫ్రెండును గూబమీద ఒక్కటి పీకాలనిపించింది. ఈ దరిద్రపు ప్రపంచంలో ఈ-మెయిలు ఇంకొకళ్లకు పంపించినదానికే డబ్బులిచ్చే తలకుమాసిన వెధవెవడైనా ఉంటాడా......ఇట్టాంటి మెసేజీలు వేరేవాళ్లకు పంపించేపుడు కాసేపైనా ఆలొచించొచ్చుగా.......ఊహూ అక్కడకు ఈళ్లొక్కల్లే హృదయం ద్రవించిపోయిన మనుషులు. ఏవన్నా అంటేనేమో 'ఏమో, నిజంగానే పాపకు జబ్బు తగ్గడానికి డబ్బులు ఇస్తారేమోననే ఆశ/నమ్మకం' అంటారు. To hell with your sentiments అని అరవాలనిపిస్తుంది. చేతకాక....చేయలేక ఇవి అబద్దం అని చెప్పే అంతర్జాల లింకు ఒకటి పంపించినోడి మొహం మీద పడేస్తాను.
ఈ పోస్టును ఇంకా ఎవరైనా చదువుతుంటే వాళ్లకు ఒక విజ్ఞప్తి....
అమ్మలారా/అయ్యలారా... మీరు ఈ-మెయిల్లు ఫార్వార్డ్ చేసినంత మాత్రాన ఎవడూ ఎవడికి డబ్బులియ్యరు. తలకుమాసిన సన్నాసులు కొందరు మానవ సహజమైన భావోద్వేగాలతో అడుకునే పరమచెత్త చేష్ట అది. మీకు అలాంటివి తగిలినపుడు హృదయం ద్రవించిపోయి వేరేవాళ్లకు పంపిస్తే ఆ వికృత పాచికలో మీరు భాగస్వాములు అయినట్టే.
ప్రస్తుతం నేనుకూడా అలాంటి పనే చేసాను. నాకు ఎటూ పాలుపోక మీ సమయాన్ని వృధా చేయడానికి ఈ పొస్టు రాసాను . చూడబోతే psycho లక్షణాలు ఎక్కువౌతున్నాయి ఏంటో లేకపోతే హిట్స్ పెంచుకోవడానికి తప్ప ఉపయోగపడిని నా ఈ పోస్టెందుకో.... . పాఠకులకు వీలైతే మన్నించండి లేకపోతే మీ భావావేశాలను వెళ్లగక్కండి....కామెంటు బాక్సు మీకోసమే పడుంది