ఏకవచన సంబోధన, కొన్ని సందేహాలు

Due thanks to Sharath ji for inspiring me to write first part of this post through his        'గారుకి' గౌరవం

1) బ్లాగు మొదలుపెట్టాక ఊరకే ఉంటామా? ఉండము కదా, తోచింది రాస్తాము . మరి ఆ రాసిందాన్ని దాని మానాన ఉండనిస్తారా..లేదు దారినపోయేవారు చూసి చదివి వ్యాఖ్యానించి వెళ్తారు. అద్గో అక్కడే వచ్చింది సమస్య. నేనేమో ఈ విశాల జీవితంలో క్వార్టర్‌ సెంచరికి కుంచెం  దగ్గరలో ఉన్న పిల్ల మేధావి-వెధవని. మరి ఈ వ్యాఖ్యానించేవాళ్ళు 'గారు' అనేసి మాట్లాడేస్తుంటే మా సెడ్డ ఇబ్బందిగా ఉండేది. బ్లాగు మొదలెట్టిన కొత్తలో అయితె ఈ ఇబ్బంది చెప్పనలవికాదు. అప్పటికి మాలాంటి యంగ్‌ అండ్ డైనమిక్ అండ్ చార్మింగ్ యువతరం సంఖ్య తక్కువ. ఒకరికి ఒకరం ఎరుక లేదాయే, సో పోస్టులకు కామెంటేవాళ్లలో చాలామంది నాకన్నా పెద్దవారు. వాళ్ళుకూడా గారు అని సంబోధిస్తుంటే, ఎప్పుడు అలవాటులెని పిలుపు కదా, అదోలా ఉండేది. మనకేమో సీరియస్‌లో సరదాగా, సరదాలో సీరియస్‌గా ఉండటం అలవాటు..వాళ్ళు అలా మాట్లాడేస్తుంటే వీలు పడదాయే. అలా లాక్కొలేక పీక్కొలేక గడిపేసాను. కొన్ని నెలలయ్యాక నేను కొందరి బ్లాగుల్లో 'బాసు', 'గురు',' బెదరు', 'భాయ్' లాంటివి వాడటం మొదలుపెట్టాను. దానివల్ల వారుకూడా తిరిగి కామెంటేపుడు కాస్త చొరవ తీసుకొని పలకరించేవరు, నేను కొంచెం అనవసరపు సీరెయెస్‌నెస్ మేంటైన్‌ చేయల్సిన తప్పేది.

ఇక ఈ మధ్యన తెలుగు బ్లాగ్లోకంలో కుర్రకారు సంఖ్య కొంచెం ఎక్కువైంది కాబట్టి శరత్‌ భాయ్ బ్లాగులో జ్యోతి గారన్నట్టు అభిమానం మనసులో ఉండాలి ఇలా ఈకలు, తోకలలో ఉండాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి  ఒక అలోచన చేస్తున్నాను. నా  యేజ్‌ గ్రూపు బ్లాగర్లను 'గారు', 'అండి' లతో పిలవను. అంటే మరీ సంబోధ ప్రథమా విభక్తి ఉపయోగించి ఓయి, ఓరా, ఓసి అనకుండా బ్లాగరు పేరుతో పిలవాలనుకుంటున్నా. మిగతా పెద్ద బ్లాగర్లను ముడ్‌ని బట్టి గారు, బాసు...లాంటివి జోడించి పిలుద్దామని. పెద్దబ్లాగర్లు, కుర్రబ్లాగర్లు నా బ్లాగులో వ్యాఖ్యానించేపుడు, నేను పెట్టిన వ్యాఖ్యలకు స్పందించేపడు కూడా తోకలు ఈకలు పెట్టవద్దని మనవి. నామటుకు నన్ను అరెయ్, ఒరెయ్ etc etc పెట్టి పిలవనంతవరుకు ఎలా పిలచినా ఓకే. But i'd prefer non-formal addressing. దీనికి ఎంతమంది ఒప్పుకుంటారో తెలియదుగాని ఇప్పటికైతే కొందరు మా కుర్రతరం బ్లాగర్లు హరే కృష్ణ, కత పవన్, సాయి ప్రవీణ్, వెంకట కృష్ణ, రామ కృష్ణ.....లాంటి వాళ్లను, కొందరు మహిళా బ్లాగర్లను పెరు పెట్టేసి పలకరించాలనుకుంటున్నా. కాబట్టి బ్లాగు సుజనులారా మీకు నా అవిడియా  బాగుందనిపిస్తే, అఫ్‌కోర్స్ బాలేదనిపించినా, చెప్పండి. And మిగతా కుర్ర బ్లాగర్లు ఎవరైనా ఉంటే ( ఆల్రేడి లిస్టులో ఉన్నవాళ్లతో సహా ),  నేను మీ బ్లాగులో ఎప్పుడైనా వ్యాఖ్యానించి ఉంటే, మీకు నా ఆలొచన నచ్చినట్లైతే మీ అమోదం, అయిష్టం తెలుపగలరు.


2) చాలా రోజులనుండి అనుకుంటున్నా...ఎవరిని అడుగుదామా అని. ఎవరిని ఏ బ్లాగులో అడగాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోయా. ఈమధ్యన మా స్నేహితుడిని ఒకణ్ని అడిగితే వాడికీ తెలియదన్నాడు. ఆత్రం అపుకోలేక అడిగేస్తున్నా...రాయల వారి పద్యం ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగేను...’ కు ప్రతిపదార్థం ఎవరికైనా తెలుసా. బ్లాగర్లు  ఎంతోకొంతమందికి తెలిసే ఉంటుంది. దయచేసి నాకు చెప్పండి.

ఇంకొకటి, మనం ఎదైనా పనిని క్రమం తప్పకుండా చేయాలి అని చెప్పడానికి తరచుగా 'తూ.చ' తప్పకుండా అని వాడుతుంటాం. ఇదీ ఒక పదమే అని అనుకొందామంటే దాని మధ్యలో ఒక చుక్క ఉంది. అంటే ఒక పెద్ద పదానికి ఇది abbreviation అయి ఉండవచ్చు. ఆ పెద్ద పదం ఏంటని స్కూల్లో ఉన్నపుడు మా తెలుగు  మాష్టారుని అడిగాను. ఆయన నాకు తెలియదని జవాబిచ్చాడు. అప్పటినుండి ఇది తిరని సందేహంగా మిగిలిపోయింది. దానర్థం ఎంటో తెలిస్తే చెప్పండి.ఇట్లు,
నాగార్జున aka  చారి

124 వ్యాఖ్యలు.. :

Anonymous said...

అపరిచితుల/ అసంబంధితుల/ ఆత్మీయులు కానివారి మధ్య ఏకవచనాలు పూర్తి అమర్యాదాకరం, ఎన్ని సమర్థనలు వినిపించినా సరే, వాటిలో అప్రయత్నంగా ధ్వనించే మొరటుదనాన్నీ, అనాగరికతనీ, సంస్కారహీనత్వాన్నీ వాదనతో కప్పిపెట్టడం అసాధ్యం. ఒక విషయం చెబితే ఏమీ అనుకోరుగా ? ఆంధ్రావారి కంపెనీలలో తెలంగాణవారు మరీ ఎక్కువగా లేకపోవడానికి గల బలమైన కారణాల్లో ఒకటి - తెలంగాణవారు సుపీరియర్లనీ, బాసుల్ని కూడా ఏకవచనంతో సంబోధించడం. ఎంత చిన్నవిషయం (చిన్న విషయం అనుకున్నది) ఎంత పెద్దపని చేసిందో చూడండి.

ఈ ఏకవచనాలు మొదట్లో సరదాగా అనిపించినా ఆ తరువాత కొంతకాలానికి పరస్పర చులకనభావాలు పెరిగి, హద్దులు దాటి ఆఖరికి గొడవలకే దారితీస్తాయి. జీవితంలో చిన్నవి అనుకునేవే నిజానికి చాలా పెద్ద విషయాలు. ఇతరుల్ని గౌరవిస్తూ సంబోధించే అవకాశాన్ని పాశ్చాత్యుల భాషలు వారికి కల్పించలేదు. కాని మన సంస్కృతి, భాష కల్పిస్తున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మన ధర్మం. ఒకవేళ ఈ అవకాశం పాశ్చాత్యభాషలలో ఉండి, మన భాషలలో లేకపోతే మన భాషల్ని తిట్టడానికి అదొక సాకు అయివుండేది. తెలుగులో గుడ్ మార్నింగులూ, గుడ్ ఈవినింగులూ, గుడ్ నైట్లూ లేవని ఈసడించుకునేవాళ్ళని చూడట్లేదా ?

..nagarjuna.. said...

thanks for your response అజ్ఞతగారు. అప్రయత్నంగా జరగవచ్చుకదా అని చెప్పి అసలు ఒక మంచి రిలేషన్ ఏర్పడే అవకాశం చేజార్చుకోవడం ఎందుకు అని నా ఆలోచన. పైగా ఇంతకుముందే చెప్పాను నాకు formal పిలుపులు అలవాటులేదని, స్నేహితుల మధ్యే పెరిగినవాణ్ణి కదా పైగా తెలంగాణాలోనే పెరిగినవాడను దాని ప్రభావమూ అయిఉండొచ్చు(let's not speak about andhra-telangana issues again in this post though i appreciate your citation :) ). నాకన్నా పెద్దవారిని గౌరంగా సంబోధించడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. ఈ టపా రాసింది ప్రధానంగా నా వయసు బ్లాగర్లను ఉద్దేశించి మరియూ పెద్దలు నన్ను మామూలుగానే పిలవచ్చు అని చెప్పడానికి.
ఒకవేళ నా ఆలోచన మొత్తం నచ్చకపోయినా కనీసం తదుపరి భాగాన్నైనా consider చేయమని.‌

నీలు said...

బ్లాగ్ చూస్తె చిన్నవాళ్ళో పెద్దవాళ్ళొ ఎలా తెలుస్తుంది? :p

Wit Real said...

1. పేరెట్టి పిలిస్తే ప్రాబ్లమేటంట?

2. ప్రతిపదార్ధం వీలు సూసుకొని నా బ్లాగులో రాస్తా....ఇప్పటికి సింపుల్ గా ఇదేస్కో

కృష్ణదేవరాయలు తెలుగు లో ఆముక్తమాల్యద అనే పుస్తకం రాస్తా, "తెలుగులోనే ఎందుకు రాస్తన్నానంటే, దేశభాషలందు తెలుగు లెస్స! అందుకు" అని సెప్తన్నాడా పద్దెం లో

3. సంస్కృతం నుంచి తెలుగులోకి తర్జుమా సేసేటప్పుడు, మనోల్లు ఉన్నదున్నట్టుగా దింపేటొల్లు. అయితే, వ్యాకరణావసరాలనుబట్టి సంస్కృతం లో ఎవరైనా "తు" లేక "చ" అని వాడితే, అవి అవసరం లేకపొయినా వాతిని "తు" "చ" తప్పకుండా తీసుకొచ్చేటొల్లన్నమాట. అక్కడినుంచి వచ్చిందీ మాట.

శరత్ said...

"కుర్రతరం బ్లాగర్లు హరే కృష్ణ, కత పవన్, సాయి ప్రవీణ్, వెంకట కృష్ణ, రామ కృష్ణ....."

పైలిస్టులో ముందు నాపేరే వుండాలి. కనీసం ఆఖర్న కూడా లేదు. అందుకు నా నిరసనని తెలియజేస్తున్నాను. నా మనోభావాలు మీరు గాయపరిచారు. అర్జంటుగా ఓ క్షమాపణ వేస్కోండి. నేనూ కుర్రకారు బ్లాగర్నే. నన్ను వృద్ధ జంబూక బ్లాగర్ల లిస్టులో పెట్టకండి బాబోయ్.

..nagarjuna.. said...

@నీలు: అమ్మాయ్‍, బ్లాగును చూస్తే వయసు తెలిసిపోతే శానా బాగుంటుంది. ప్చ్, ఆ ఛాన్స్‌లేదే :( !! కాకపోతే కొన్ని కిటుకులున్నాయ్, బ్లాగర్లు రాసే పోస్టులను గమనిస్తే వాళ్లు ఎప్పుడొకప్పుడు వారి వయసు ప్రస్తావన తీసుకొస్తారు. నీ/మీ వ్యాఖ్యను బట్టి చూస్తే అయితే సరదా ఉండే పెద్దాళ్లన్న అయుండాలి లేకపోతే నా యేజ్‌ గ్రూప్ గడుసు అమ్మాయైనా అయుండాలి. ఇలా అనమాట. ఇంతకూ తార ఇచ్చిన లింకును దర్శించితిరా..

@witreal: బెదరూ, పేరేట్టి పిలిస్తే అద స్వీకరించడం ఎదుటిమనిషిపై ఆధారపడుతుంది. what is the problem అంటే ఏం చెప్తాం. అందుకే అడిగా ఎవరికైనా any problems ఉన్నాయా అని.
మిగతావాటికి వివరణు ఇచ్చినందుకు ధన్యవాదాలు :)

Sai Praveen said...

నాకు ప్రాబ్లం లేదు బాసు :)
నిజానికి మన వయసు వాళ్ళను గారు అనడానికి అప్పుడప్పుడు నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. రెండు మూడు సార్లు పరస్పర బ్లాగుల్లో కామెంట్లు రాసుకుని పరిచయం పెరిగాక ఇంకా అనిపిస్తుంది. అలాంటప్పుడు నేను సంబోధనలో గారు వదిలేసి మాటల్లో మాత్రం అండి వాడుతుంటానన్నమాట.

ఇక witreal గారు చెప్పినట్టు తు,చ సంస్కృత పద్యాలలో గణ పూరకాలు. వాటికి పెద్దగా అర్ధం లేకపోయినా కాని వాటిని కూడా వదలక పోవడం అనే అర్ధంలో మొదలైంది ఇది.

..nagarjuna.. said...

@ శరత్‌ జీ: చిన్నవారు అంటే హైటులో చిన్నవారని కాదు మహదేవ వయసులో చిన్నవారు అని ;). అయినా, మీలాంటి డైనమిక్‌ డేరింగ్‌ మనుషులను తరాలు గడచినా ’వృద్ధ’ అని అనగలమా....,పాపం కదూ :D

Anonymous said...

I don't think Ekavachanam is by itself such a bad thing. But, be careful to not start a (any) relationship with Ekavachanam ever. Allow it its own time to evolve and grow intimate enough to address each other in Ekavachanam. Bide your time to be considered intimate, but not force yourself upon others in the name of imaginary informalness or intimacy. That way, Ekavachanam is prone to misuse.

..nagarjuna.. said...

థాంక్స్ ప్రవీణ్.. :)

Anonymous said...

పదహారేళ్ళ శరత్ గారిని పట్టుకొని ఏంతేంత మాటలు అంటున్నారు హన్నా...

తెలుగు శూరుడు said...

తు, చ అర్థంలేని పదాలని ఎవరు చెప్పారు ? సంస్కృతంలో తు అంటే particularly, but అని అర్థం.

శిష్యః పుత్త్రసమానః - శిష్యుడు కొడుకుతో సమానం
పుత్త్రస్తు స్వయమేవ శిష్యః - కొడుకేమో (కొడుకొచ్చేసి) స్వయంగా శిష్యుడే.

చ అంటే and అని అర్థం.

రామశ్చ లక్ష్మణశ్చ - రాముడూ, లక్ష్మణుడూను.

venkat said...

I concur ;)

- venkat

..nagarjuna.. said...

@ అజ్ఞాత 2:గేట్లు ఓపెన్ చేయకుండానే ప్రొసీడ్‌ అవనులెండి.అందుకే కొందరి పేర్లే ప్రస్తావించాను ఇంకా కొందరు పేర్లు consideration లో పెట్టాను. thanks for the response.

@తార: అందుకేకదా మాష్టారు ఆయన్ను డేరింగ్ డైనమిక్ అన్నది, వృద్ద అంటే పాపమూ అనీనూ..

@తెలుగు శూరుడు: వివరణకు ధన్యవాదాలండి

@వెంకట్: థాంక్స్ బ్రో :)

Malakpet Rowdy said...

I used to love it when people were calling me "Orei Rowdy" on Indiainfo - I miss those days

మాలా కుమార్ said...

మీరన్నది నిజమే కానీయండి , మరీ ముక్కూ మొహం తెలీయని వాళ్ళను పట్టుకొని నువ్వు అన్లేము కదా . అందులో ఇక్కడ ఎవరు పెద్ద , ఎవరు చిన్న తెలియదు . ప్రతి వాళ్ళని మీ వయసెంత అని అడిగి మరీ పిలవాలంటే కష్టమే . మీరు చెప్పారు గా ఇకనుండి మీరు అని మిమ్మలిని పిలవరు లెండి .

Malakpet Rowdy said...

మీరు చెప్పారు గా ఇకనుండి మీరు అని మిమ్మలిని పిలవరు లెండి .
__________________________________________________


LOOOOOOL

Anonymous said...

తు - చ: తెలుగుశూరుడు గారు చెప్పింది రైట్.
తెలుగదేలయన్న పద్యం

జ్యోతి said...

నాగార్జున తెలుగదేల పద్యం యొక్క అర్ధం ఇది

http://amuktamalya.blogspot.com/2010/05/blog-post_25.html

krishna said...

నా వరకు నేను చాలా టైము తీసుకుంటాను ఏక వచన సంభొధనకి :) ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని మొహమాటం కొంత , నువ్వు అని పిలిపించుకునే దగ్గరితనం లేకపోవడం కొంత !
నా వరకు నేను నాగ్‌ని మలక్‌ని నువ్వు అని పిలవగలను, వాళ్లు నన్ను అలా పిలిచినా నాకు ఏమి అదొలా అనిపించదు;)
ఇద్దరితో ఈ చనువుకి కారణలు వేరు అనుకోండీ, కానీ దగ్గరితనం అయితే వుంది.
కదా మలక్ .. 857 కామెంట్ల దగ్గరితనం మనది ;)
ఇంకో మాట నాగ్,
పొరపాటున అయినా శరత్ గారిని మన లిస్టులో పెట్టమాక :) ఆయనకి ఆయన అంత ఎత్తు వున్న ఇద్దరు పిల్లలు వున్నారంట !

హరే కృష్ణ said...

బాగా చెప్పావ్
నువ్వు పోస్ట్ బాగా రాసావు నాగార్జున:)

Anonymous said...

http://www.metacafe.com/watch/4046603//

dammunna vallu mundu e video choodandi

ఆ.సౌమ్య said...

"కొందరు మహిళా బ్లాగర్లను" అని కూడా అన్నట్టున్నారు. ఇంతకీ నన్నే గ్రూపులో కట్టావయ్యా.

నాకూ చాలా సార్లు ఈ సందేహం వస్తూ ఉంటుంది. మరీ పరిచయస్థులని, నాకంటే చాలా చిన్నవాళ్ళు అని తెలిస్తే గారు, అండి లు అస్సలు తగిలిచబుద్దెయ్యదు. కానీ వారు వద్దనకుండా మనం ఎలా పీకేస్తాం, అందుకే తగిలిస్తూ ఉంటాం. ఎవరైనా పీకేయమంటే మాత్రం నేను మహదానందంగా పీకేస్తాను. మారీ పెద్దవాళ్ళయితే, వాళ్ళు వద్దన్న నేను గారు, అండి తగిలిస్తాననుకోండి, అది వేరే విషయం. సరే తమ సమవయస్కులని ఏకవచన సంబోధన చేస్తాము, వారు కూడా చెయ్యొచ్చు అంటున్నారు. మరి తమరి కంటే పెద్దోరు తమరిని ఏకవచన సంబోధన చెయ్యొచ్చా?


ఇంక తెలుగు భాష పద్యానికి అర్థం జ్యోతిగారి బ్లాగులో ఇచ్చారు, చూసారు కద.

శివరంజని said...

నిన్నటి వరకు "పేరు" నచ్చలేదు... ఇప్పుడు "గారు" నచ్చలేదండీ మీకు ... ఒకే age group వున్నాంత మాత్రాన మేల్ బ్లాగర్స్ ని ఏకవచనం లో పిలవడం కష్టమే కదండీ

Anonymous said...

>>మేల్ బ్లాగర్స్ ని ఏకవచనం లో పిలవడం కష్టమే కదండీ

శివరంజని గారి ఆత్మన్యూన్యతని వ్యతిరేకిస్తున్నాను.

ఆ.సౌమ్య said...

@శివరంజని
ఇదేంబాలేదండీ....మగ బ్లాగర్లకేమైనా రెండు కొమ్ములెక్కువున్నాయా, ఏకవచనంతో సంబోధించలేకపోవడానికి? ఏకవచన సంబోధన కష్టమంటే మగ, అయినా ఆడ అయినా కష్టమవ్వాలి.

శివరంజని said...

తార గారు , సౌమ్య గారు...Sorry.. Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..
Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..

తప్పుగా అర్ధం చేసుకోకండీ బాబు ...... అలా పిలవడం అలవాటు లేదు అని చెప్పబోయి ఇలా చెప్పేసాను.... ....అయ్యబాబోయ్ .... ఇదే మొదటి తప్పు ..క్షమించేయండీ


...పోస్ట్ రాసిన నాగర్జున గారు చక్కగానే ఉన్నరు మద్యలో నన్ను ఇరికించవద్దు బాబోయ్ .... నాకేమి తెలీదు బాబోయ్

హరే కృష్ణ said...

మీరు కేవలం సౌమ్య గారికి మాత్రమే సారీ చెప్పారు
తార కి చెప్పలేదు

దీని వాళ్ళ తార మనోభావాలు గాయపడ్డాయి తను water కూడా తాగడం లేదు

తార గారు , సౌమ్య గారు..ఇద్దరికీ Sorry.. అని చెప్పాల్సింది గా డిమాండ్ చేస్తున్నాం
:) :)

శివరంజని said...

ఇద్దరి పేర్లు ప్రస్తావించాను సార్ ...

శివరంజని said...

తార గారు ,Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry.Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..
Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..

శివరంజని said...

సౌమ్య గారు...Sorry.. Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..
Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..

శివరంజని said...

హరే కృష్ణ గారు...Sorry.. Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..
Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..

శివరంజని said...

నాగార్జున గారు.. Sorry.. Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..
Sorry..Sorry..Sorry..Sorry..Sorry..Sorry..

శివరంజని said...

హరే కృష్ణ గారు.చాలునాండి సారీ లు

Anonymous said...

==========
మగ బ్లాగర్లకేమైనా రెండు కొమ్ములెక్కువున్నాయా,
==========

అంటే, ఒక కొమ్మెక్కువుంటే OK నా??

మంచు said...

సౌమ్య , తారా, హరేకృష్ణ.....
ఎంటి మా గొదావరి అమ్మయిని... చిన్నపిల్లని చేసి ఆడేస్కుంటున్నారు... మీకేం పన్లేదా ఆయ్...

..nagarjuna.. said...

@భరద్వాజ: రౌడిగారు నా బ్లాగులో LOL అనికాకుండా, argument కాని వ్యాఖ్య కాకుండా మామూలుగా కామెంటారు ఏమి నా భాగ్యం అనుకున్నా...పెట్టెసావా, LOL అని పెట్టేసావా మహానుభావా!! ధన్యోస్మి :)

@అజ్జాత 3 : మీరిచ్చిన లింకు మళ్ళి జ్యోతిగారి లింకుకు redirect అయ్యింది. thanks anyway :)

@సౌమ్యగారు : ఎంతమాట ఎంతమాట, మిమ్ములను నేను ఏకవచనముతో సంబోధించుటయా, శివశివా. మీరసలే PhD కానిచ్చుకున్నవారు. మరిమేమేమో కనీసం partial damage కూడా అవని వారమాయే. ఎట్టా కుదిరేది.
హబ్బా..,నేను నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్పేది అదే కదా సౌమ్యా జీ, నాకంటే పెద్దవారు నిరభ్యంతరంగా ఏకవచనంతో పిలవచ్చు అని.

శివరంజని said...

ఎవరినైనా నొప్పించినట్టు మాట్లాడితే I am really sorry అండి ... ఇక్కడితో ఈ విషయం వదిలేయండి plzzzzzzzzzzzzzz...

..nagarjuna.. said...

@మాలాకుమార్ గారు: అందుకేకదండి నా బ్లాగుముఖంగా కొందరిని గమనించి, వారిని short list చేసి ఏవైనా అభ్యంతారాలున్నాయా అని.
ఇకపోతే అనను అనను అంటూనే అన్నారేమిటండీ ’మిమ్మల్ని’ అని. సెటైరా ?

@కృష్ణ: పాజిటివ్‌ response ఇచ్చినందుకు థాంక్స్ కృష్ణ. ఐతే ఇంకో ఆరునెలల్లో bachelor status కు గండిపడొచ్చు అన్నారు కాబట్టి అప్పుడపుడు భాయ్‌ లు గట్రా వాడతాను.

..nagarjuna.. said...

ఏంటొ ఒక బ్లాగరుకు తిరిగి సమాధానం ఇచ్చేలోపు ఇంకొన్ని కామెంట్లు పడిపోతున్నాయ్... ఉన్న రెండు చేతులు సరిపోవట్లేదు :(

..nagarjuna.. said...

@శివరంజని గారు: మీరు ఖషి సినిమాను చాలాసార్లు చూసినట్టున్నారే. అన్నిసార్లు సారి ఏంటండి బాబు. ఐనా వాళ్ళేదో చమత్కారానికి అంటే మీరు అంత సీరియస్‌గా తీసుకున్నారేంటండి..... లైట్ :) :)

మంచు said...

@శివరంజని: వాళ్ళందరూ సరదాగా నిన్ను ఆటపట్టిస్తున్నారు...నువ్వేం పట్టించుకోకు.... అందరూ మనవాళ్ళే :-)))

..nagarjuna.. said...

@మంచు భాయ్: అగ్గదీ అట్టా అడగండి..,లేకపోతే మాలాంటి కుర్రబ్లాగర్లు భయపడిపోరు.....

@హరేకృష్ణ: బాసు.., ఆ యమ్మాయిని మరీ అంత డిమాండు సెయ్యాల్నా. నేను నా జీవితంలో అన్ని సారిలు చెప్పుండను. మన్లో మనం తన్నుకుంటే ఎట్టా సెప్పు. ఇప్పుడు ఎన్ని చాకెట్లు ఇవ్వాలో లేక ఆమె బ్లాగులో ఎన్ని కామెంట్లు రాయాలో !!!

@తార గారు: అన్నాయ్‌ మీద రిసెర్చి చేసి చేసి అందరినీ ఒకే స్టయి‌తో కుమ్మేస్తున్నారు బాసు. మీ భీకర రౌద్ర బాణాలను తట్టుకోలేకున్నాం. శాంతించండి శాంతించండి. :)

@అజ్ఞాత 4: బాబు ,ఇన్నిరోజులవరకు ఆయన రాతలు, మాటలు వినే భాగ్యమే ఉండింది నాకు. మీల్ల ఆయన ముఖారవిందమూ కూడా చూచితిని. నేను మీకు ఏ జన్మలో ఏం పుణ్యం చేసితిని.

Anonymous said...

>>అంటే, ఒక కొమ్మెక్కువుంటే OK నా??

OK నే అట బాసు

..nagarjuna.. said...

@శివరంజని: కష్టమేమి కాదు కాకపోతే మనకు మొహమాటం పిలిస్తే ఏమనుకుటారోనని. కాబట్టి నా కేస్‌లో నేను కొంచెం ముందుకొచ్చి చెప్పేసాను నాకేమి అభ్యంతరంలేదని. ఇక్కడ reply ఇచ్చిన కొందరు మిత్ర్లులను చూసారుగా.., వారికి ఎటువంటి ప్రాబ్లంలేదు. కావలసింది కాస్త పరిచయం. ఈ పోస్టు రాయడానికి పరిచయం పెమ్చుకోవడమూ ఒక కారణం.

ఇకపోతే ఇప్పుడు మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ లైట్‌ తీసుకున్నాను అని కామెంటలేదో మీరు నాతో శివరంజనీ అని పిలుపించుకోవాల్సుంటుంది మరి. పాత ఒప్పందం రద్దైపోగలదు

@సౌమ్యగారు:" మగ బ్లాగర్లకేమైనా రెండు కొమ్ములెక్కువున్నాయా, ఏకవచనంతో సంబోధించలేకపోవడానికి? " బాగా చెప్పారు

@అజ్ఞాత : మరీ ఒకటే కొమ్ముంటే బాగోదు కదా బెదరూ, fashionable కూడా కాదాయే :P
పోతే ఇక్కడ కావాలని చేసే వెటకారానికి చోటులేదు బాస్...గమనించండి

..nagarjuna.. said...

@కృష్ణ: ఇప్పుడు శరత్‍గారిని మొహమాటానికైనా మన్లో కలిపేసుకున్నాం అనకపోతే మనల్ని ఎక్కడ పిల్ల వానర బ్లాగర్ల లిస్టులోనో, ఆయన కామెంట్లు రాయదల్చుకోలేని బ్లాక్‌లిస్టులోనో పెడతారేమోనని చూస్తున్నా... :|

@హరేకృష్ణ: కామెంట్ల వరదలో పడి నీ మొదటి కామెంటు చుడలేదు బాస్. thanks for the response :)

శివరంజని said...

ఫస్ట్ కామెంట్స్ చూడగానే కోపమేమి రాలేదు ఎవరి మీద... కొంచెం భయం వేసింది అంతేనండి ... సౌమ్య గారు, తార గారు, హరేకృష్ణ గారు smile plzzzz

శరత్ said...

@ శివరంజని
నాకు సారీ చెప్పకుండా నా మనోభావాలని మీరు గాయపరిచారు.
@ నాగార్జున
కాళ్ళతో కూడా కామెంట్లు వ్రాయండి. వెరయిటీగా కూడా వుంటుంది. అప్పుతచ్చులని మన్నిస్తాం.

శివరంజని said...

ఫస్ట్ కామెంట్ అంటే మొదటి కామెంట్ అని అర్ధం కాదు ... ముందుగా నన్ను ఉద్దేసించి పెట్టిన కామెంట్ అని అర్ధం .. sorry చిన్న టైప్ ఎర్రర్

శరత్ said...

ఎవరెవరు నన్ను వృద్ధ బ్లాగరు అని ఎగతాళి చేస్తున్నారో చూస్తూనేవున్నా, చూస్తూనేవున్నా...లిస్టు తీస్తా, లిస్టు తీస్తా...

@ నాగార్జున
ఏంటి బాబూ, నువ్వు ఇంకా వర్డ్ వెరిఫికేషను తియ్యలేదా? అయినా సరే అందరూ హింత ఓపిగ్గా ఎలా కామెంట్లు వేస్తున్నారబ్బా!

అమ్మయ్య మీకూ కామెంటు కష్టాలు తెలిసి వచ్చాయా? రిప్లయ్లు ఇవ్వడం నా వల్ల కాక నేను చేతులెత్తేసాను. మరీ నేను స్పందించాల్సి వున్న వాటికి మాత్రమే ఇస్తున్నాను. మీరు కూడ నా ప్రతి కామెంటుకీ రిప్లయ్ ఇవ్వక్కరలేదు.

మంచు said...

నాగర్జున: నువ్వు వర్డ్ వెరిఫికెషన్ తీసెయ్యి బాబు... :-))
శివరంజని: నువ్విలా సారి లు చెప్పుకుంటూ పొతే. మరొ ఏకలింగం అయిపొతావ్... :-))
శరత్: మీరంటే నాలుగు బ్లాగులు రాయాలి కాబట్టి మీకు కామెంట్లకి టైం సరిపొవడం లేదు... నాగర్జునకి ఒక్క బ్లాగె కదా పర్లేదు లెండి

శరత్ said...

ఏంటీ, ఇక్కడెవరో నన్ను లైట్ తీసుకుంటున్నట్టున్నారు! మర్యాదగా, వినయంగా, ఓపిగ్గా, గౌరవంగా సారీ అడిగితే కూడా చెప్పరా? హ? ఎంత ధైర్యం? అస్సలు అస్సలు నేను ఎవరో తెలుసునా?

@ మంచు - మాలిక పెట్టేసేక ఏకలింగానికి స్టయిల్ ఎక్కువయ్యి సారీలు చెప్పనంటున్నారు. శివ(రంజని) ని డిసైడ్ చేద్దాం దీనికి.

Malakpet Rowdy said...

Krishna

Hehehe .. perfect

శరత్ said...

హ? శివరంజని గారు ఇంకా నాకు సారీ చెప్పలేదా? లాభం లేదు. వారు సారీ చెప్పేదాకా మా ఆఫీసులో నేను పని చేయనని భీష్మించుకొని కూర్చున్నాను. ఇజ్జత్ కా సవాల్. అందరికీ అప్పనంగా సారీ చెప్పి నాకు చెప్పకపోవడం నాకు అవమానం. నా మానవ హక్కులకు తీరని భంగం.

మంచు said...

శివ (రంజని) చేత ఇన్ని సారీ చెప్పించినందుకు హరేకృష్ణ, తారా, సౌమ్య,,, ఈపొస్ట్ రాసిన నాగార్జున ...దీనికంతటికి కారణమయిన మనసుపలికే అపర్ణ కలసి శివ(రంజని) కి సారి చెప్పాలని డిమాండ్ చెస్తున్నా...

వీళ్ళు సారి చెప్పేవరకూ మన టై'గే'ర్ శరత్ గారు నిరాహార దీక్ష చేస్తారు అని తెలియచేసుకుంటున్నా

Anonymous said...

తొడకొట్టే వారు కొట్టకుండావుండవచ్చునుకానీ, మేము క్షమాపణ చెప్పాలా, అసంభవం.. నేను చెప్పా, ఎన్ని రోజులు నిరాహారదీక్షచేస్తారో నేనూ చూస్తాను..

నావంతుగా హై ప్రొటీన్ బిస్కెట్ ప్యాకెట్ పంపిస్తున్నాను శరత్ గారికి

మనసు పలికే said...

నాగార్జున గారు, నాకైతే మీ ప్రతిపాదన నచ్చింది..:) సారీ "నీ". మరీ మొదటి/రెండవ సారి కష్టం గా ఉంటుంది కానీ, కొంచెం పరిచమయ్యాక అయితే అండీ అని పిలవడమే కష్టం నాకైతే(పెద్ద వారిని కాదు లెండి).
నన్ను అపర్ణ అనే పిలవచ్చు. ఇంకా ఎక్కువ అనిపిస్తే అప్పు అనేస్కో..
మంచు గారూ.. ఇది నిజ్జంగా అన్యాయం.. మధ్యలో నా ప్రస్తావన ఎందుకొచ్చింది అని అడుగుతున్నాను. అహ కాదు కడుగుతున్నాను. నా మానాన నేను నాగార్జున గారి టపాకి కామెంటడంలో ఏదో technical problem వస్తుంది, దాన్ని ఎలా అధిగమించాలా అని తీవ్రంగా ఆలోచిస్తుంటే.. నా మీద ఇన్ని కుట్రలా..? హన్నా..
నాగార్జున.. నీకు మాత్రం ఇవిగో నా హృదయపూర్వక ధన్యవాదాలు..:) హాఫ్ సెంచరీ పూర్తి చేసినందుకు.

Anonymous said...

అందరికీ బేసిక్ ఎకనోమిక్స్ తెలియకుండా నెట్లు ఓపెన్ సెసేస్తారు, technical problem వస్తే 350 ఇచ్చి బాగుచేయించుకోవాలి గాని ఎవరికి వారే బాగుచేసుకుంటే ఏలా?

అప్పు ఆ, నేను రడీ, నా బ్యాంక్ ఎక్కవుంటు తెలుసా? ఓ వందకి రెండొందలు తెలుసుగా..

ఆ ఏకలింగంపిల్లకాయని, మంచు, శరత్ గార్లని ఎన్ని పాలు అడిగినా ఒక్క సారికుడా అపాలెజీ సెప్పలా, ఈ పిల్లకాయ అడక్కుండానే సెప్పేసినాడి, భలే ముచ్చటేసినాది శ్రియమ్మా

మనసు పలికే said...

క్షమించాలి.. నా అభినందనలు .. ధన్యవాదాలు కాదు..:)

శరత్ said...

మర్రెదే. నేను ఏం దీక్ష చేస్తున్నానో సరిగ్గా చూడకుండా బిస్కట్ ప్యాకెట్లు పంపిస్తే ఎంచక్కా మింగేస్తా. నేను చేసేది నిరా'పని'దీక్ష. నాకు సారీ వచ్చేంతవరకు అఫీసులో పని చెయ్య. హమ్మా, నిరాహార దీక్ష అని నేను పొరపాటున అంటే ఇదే అవకాశంగా మీరు ఎవర్నీ సారీలు చెప్పనివ్వకుండా కుట్రలు చేస్తారని తెలిసే ఇలా వచ్చా.

మనసు పలికే said...

తార గారు, ఇచ్చెయ్యండి మీ అకౌంట్ నంబర్.. అలాగే పాస్వర్డ్ కూడా ఇచ్చి పుణ్యం కట్టుకోండి..

Anonymous said...

మీకు ఏ బ్యాంక్ ఎక్కవుంట్ కావాలి, ICICI, HDFC, Axis, HSBC, ADB, World Bank,SCB??

దేనికైనా ఒకటే నెంబర్ 08942278135
పాస్వార్డ్ : నాగరాజా

..nagarjuna.. said...

యాహూ...2 years బ్లాగింగ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి 50+ కామెంట్స్....జజ్జజ్జనక ఎహె జజ్జనక ఎహె జజ్జనక
Thanks you alll guys :) :-*


సారిలు చెప్పనవసరంలేదు అంటున్నానా అయినా మళ్ళి సారి చెప్పేసింది శివరంజని....హేమిటొ ఈ అమ్మాయ్!!

@శరత్‌ భాయ్: >>’నిరాపని దీక్ష’ ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి బాబయ్య. అసలే ఒబామా మావొళ్ల పనిని ఇండియా, చైనా లాగేసుకుంటున్నాయ్ అంటున్నాడు. అలా కాసేపు కామ్‌గా ఉన్నారంటే ఆళ్లపని ఆళ్లు సూసుకుంటారు.

కాళ్లతోం మేము రాయగలంగాని వాటిని కతవితల అంటాన్నేను. నా కతవిలను అర్థం చేసుకొనే జ్ఞానులు బ్లాగ్లకంలో లేరుకాబట్టి ఊరుకుంటున్నా...


@మంచుగారు: ఒర మినుష, వర్డ్ వెరిఫికేషన్ తీసెస్తుము

@అపర్ణ: thanks సరాసరి ఇప్పటినండే ఏకావచనంలో పిలవాలంటే కష్టం మరి, let me practice :)

@తార, అపర్ణ: ఇదన్యాయం, అక్రమం. వ్యాఖ్యలు చేసేదేమో నా బ్లగులో అలా చేయమని చెప్పి సలహా ఇచ్చించేమో నేను. మరి నిజాయితీగా పైసల్‌ ఎవర్కి రావాలే..., నాగ్గద. నన్నదిలేశి మీరు మీరు పంచుకుంటే ఎట్ల

శరత్ said...

నాకు సారీలు రాకపోయినా ఫర్వాలే, నాకు కూడా పైసల్ రావాలే. నేను శంశాబాద్ విమానాశ్రయంల దిగ్గానే హుండీలొ వేసి డబ్బుల్ నాకివ్వుండ్రీ. నాతాన బాంకు అక్కవుంట్లు నడువవ్.

..nagarjuna.. said...

బాబులు.., అప్పుడెపుడొ క్రీస్తు పూర్వం నీలు అనే చాటర్‌ బాక్స్ అమ్మాయి తార గారు ఇచ్చిన సైన్సుబాబు లింకు పట్టుకెళ్ళింది. ఇంతవరకు జాడలేదు.., ఎలాఉందో ఏమిటొ ఎవరికైనా ఎరుకనా ?

మంచు said...

శరత్ గారు నిరాహార దీక్ష చెయ్యనంటే మేము ఊరుకుంటామా ....

శరత్ said...

పాపం నీలు :( ఆమె మానసిక శాంతి కోసం అందరం ఓ నిముషం ఈ బ్లాగులో మౌనం (అనగా కామెంట్లు వెయ్యకుండా) పాటిద్దామా?

Anonymous said...

మంచుగారు మనంతగ్గొద్దు, ఆరు నూరు ఐనా, నూరు రెండు నూర్లు ఐనా, శరత్ గారు నిరాహార దీక్ష చెయ్యాల్సిందే..(శరత్‌గారు సలహాలొ కోసం విజయవాడ గోపాల్ గారిని సంప్రదించగలరు)

నాగ్,
౧. వార్డ్ వెరిఫికేషన్ తీసేయి, లేదా తీసేయటం రాదూ అనుకోవల్సివస్తుంది..
౨. ఆ నెంబర్కి ఫోన్ చేసి, నాగారాజా అని చెప్పేయి, నీకు ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలో చెప్తే వచ్చేస్తుంది.

శరత్ గారు కావాల్సివస్తే మీరూ ప్రయత్నించొచ్చు..

Anonymous said...

శరత్ గారు, లంకె ఇచ్చిన పాపానికి నేను ఒక పావు గంట మౌనం పాటిస్తున్నాను..

హరే కృష్ణ said...

శివరంజని గారు అసలు ఏంటి సారీ ల వ్రతం ఏమన్నా చేస్తున్నారా !
మేము సరదాగా అన్నాం నిజంగా నిజం :)
మనం అంతా నాగార్జున ఫ్రెండ్స్ అంతే
:) :) :) :) :)

హరే కృష్ణ said...

బ్రదర్ కుమ్మేసావ్
అర్ధ century
వంద చేస్తావు రేపటి లోపు ఇదే మా ఆన
Congratulations Nagarjuna :)

శరత్ said...

ఆగండి బాబూ. లంచ్ టైం అయ్యింది. తినేసి వచ్చి మీకోసం, మీ బాధ చూడలేక ఓ అరగంట నిరాహార దీక్ష చేస్తాను. మరి అరగంట తరువాత నాకు నిమ్మరసం ఇచ్చే ఏర్పాట్లు అవీ చూడండి ఈలోగా.

Anonymous said...

Tara garu
i want , HDFCnumber

Anonymous said...

HDFC ఆ, దేనికైనా అదే నెంబరప్పా..

Anonymous said...

ఇంతకు ముందు ఎక్కడో చదివినట్లు గుర్తు, మనస్సు కుర్రగా ఉంటే చాలు, వయస్సు, జుట్టు తో సంబంధం లేదు

మనసు పలికే said...

హిహ్హిహ్హి.. మీ సంభాషణ బహు బాగు..:)
తార గారు, మీ అకౌంట్ నంబర్ చాలా బాగుంది. మొత్తానికి పాపం శరత్ గారి చేత అందరూ కలిసి నిరాహార దీక్ష చేపించేసేలా ఉన్నారు :(
ఇంతకీ మంచు గారు నాకు సమాధానం చెప్పలేదు..:(

శరత్ said...

@ అపర్ణ
నా నిరాహార దీక్ష అయిపోవచ్చిందండీ, ఏం చేస్తాం, శివరంజని గారు సారీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ ఎవరయినా ఓ గ్లాసుడు నిమ్మరసం ఇస్తే సంతోషిస్తాను.

హరే కృష్ణ said...

:) :)

http://whatscookingamerica.net/Foto4/LemonJuice3.jpg

enjoy!

మనసు పలికే said...

నాగార్జున.. నాదొక చిన్న మనవి. నీకు నచ్చితేనే చెయ్యి, లేదంటే పర్వాలేదు. నీ comment settings కొంచెం మార్చవా, కామెంట్ బాక్సు మిగిలిన రెండు విధాల్లో ఏదైనా పర్వాలేదు. నేను నీ బ్లాగులో సరిగ్గా కామెంటడంలేదని అక్కడ నా బ్లాగులో కృష్ణ చాలా చాలా బాధ పడ్డారు. భోజనం కూడా సరిగ్గా సహించడం లేదట.

హరే కృష్ణ said...

అవును నాగార్జున తిండి ఎలా తింటాము చెప్పండి
పార్టీ ఇస్తాము అని చెప్పి పస్తులుంచాక కూడా! :(

..nagarjuna.. said...

@హరేకృష్ణ: కేవ్........... :))
పండగ చేసుకో శరత్ భాయ్....., మీరు నిరాహారదీక్ష చేస్తే మా లేత మనసులు తట్టుకోలేవు

..nagarjuna.. said...

@అపర్ణ: మిగతారెండు విధాల్లో అయితే కామెంటడానికి కిందదాక స్క్రోల్‌ చేయనక్కరలేదనా....ఎంబేడ్ బాక్స్‌ నుండి ఫుల్ పేజ్‌కు మార్చాను. lets check this for some time!!

ఐనా పస్తులుంచడం ఏం బాలేదు మరి. అసలే మా కృష్ణ మాట కోసం పేరెడి పాట ఇచ్చే మనిషి.

@తార గారు: మీరక్కడే ఆగండి బాబొయ్...., ఇంకా నయం బ్లాగింగు కూడా రాదనుకుంటాననేరు. వర్డ్‌ వెరిఫికేష్‌న్ తిసేసాను

మనసు పలికే said...

హహ్హహ్హా. మొత్తానికి నాగార్జున చేత ఈ రోజు రెండు మార్పులు చేపించాము..:) నాకు కడుపు నిండిపోయింది..:)

మనసు పలికే said...

శరత్ గారు, గ్లాసుడు ఏం ఖర్మ.. బిందెలు బిందెలు ఇచ్చేస్తాం. ముందు మీరు నిరాహార దీక్ష ముగించండి. కొరియర్ లో వచ్చేస్తున్నాయి బిందెలు..

హరే కృష్ణ said...

బ్రదర్
ఒపెనేర్ గా వచ్చ్సిన అపర్ణ వంద చేసేసారు
మీరు one డౌన్ వచ్చి కూడా ఇంత స్లో గా ఆడుతున్నారు why
అఫ్కోర్సు most expensive బౌలర్ ని నేనే అనుకుంటా మీ ఇద్దరికీ :P

శరత్ said...

నాగార్జునా,
వంద కామెంట్లొస్తే పార్టీ ఇస్తా అన్నారుకదా. నేను హైదరాబదులో వుండే డేట్లు చెబుతా. అప్పుడు ఏర్పాటు చెయ్యండేం. ఆ పార్టీలో నా కామెంట్ల వాటాకు తగ్గ షేర్ నాకు రావాలి మరి.

మనసు పలికే said...

నాగార్జునా.. ధన్యవాదాలు అడగగానే మార్చినందుకు..:) ఇక ఆఫీసు నుండి కూడా కామెంటగలను..:)

మనసు పలికే said...

అదే రోజు నా పార్టీ కూడా అరేంజ్ చేసేస్కోండి కృష్ణ..

హరే కృష్ణ said...

Aparna నాకు కడుపు నిండలేదండీ మీరు పార్టీ ఇస్తా అని చెప్పి మాతో నిరాహార దీక్ష చేయిస్తున్నారు
నాగార్జున నువ్వే న్యాయం చెప్పాలి

శరత్ said...

@ అపర్ణ
ఇంకా నయ్యం. హరేక్రిష్ణ నిమ్మరసం లింక్ ఇచ్చినట్లు మీరు నిమ్మరసం బిందెలు ఈమెయిల్లో పంపించారు కాదు!

మనసు పలికే said...

శరత్ గారూ.. క్షమించాలి .. పై వ్యాఖ్య మీకు..:) దయచేసి మళ్ల్ నిరాహార దీక్ష / నిరా పని దీక్ష మొదలెట్టకండి.. :(

హరే కృష్ణ said...

అపర్ణ మీరు జన్మ భూమి మొదటి విడత రెండో విడత టైపు లో విడత విడతలు గా మీ పార్టీ ని ఇస్తున్నారు అని మర్చిపోకండి
ఆధారాలు అన్నీ ఉన్నాయి అని మర్చిపోకండి

మనసు పలికే said...

శరత్ గారు, మీకు తెలియకుండానే మీరు చాలా గొప్ప సలహా ఇచ్చారండీ.. ఇదేదో బాగుంది. మీ కోరిక మేరకు అలాగే బిందెలు మెయిల్ లో అటాచ్ చేసి పంపిస్తా..:)

హరే కృష్ణ said...
This comment has been removed by the author.
..nagarjuna.. said...

@హరేకృష్ణ:>>ఓపెనర్‌గా వచ్చిన...<< ఇప్పుడామాటంటే అపర్ణ పోకిరి సినిమాలోంచి డైలాగ్‌ కోట్టేసేయగలదు. ఇన్ని రోజుల వరకు సరైన పిచ్ దొరక్క, శరత్‌గారి లాంటి కోచ్ దొరక్క మంచు, తార గారి లాంటి చీరింగ్ ఆడియన్స్‌ దొరక్క ఇదిగో మ్యాచ్‌కు జోడి అయిన నీ లాంటి బౌలర్ దొరక్క వెనకడిపోయా

@శరత్‌గారు: షేర్‌ ఏంటి మహానుభావ మొత్తం కామెంట్లు పరోక్షంగా మీ వల్ల వ్చ్చినవే కదా...మొత్తం మీరే తీసుకొండి. అయితే ఏం కావాలి మీకు? బిందెలు బిందెలు నిమ్మకాయ రసమా? కార్టన్లు కార్టన్లు హై ప్రొటీన్ బిస్కెట్లా..

మనసు పలికే said...

కృష్ణ.. ఆ విడతలన్నీ ఒకేరోజు పెట్టేస్కుందామే..?? మీకు కూడా మాటి మాటికీ కాలెండర్లో డేట్ బుక్ చేస్కోవాల్సిన అవసరం ఉండదు..:)

హరే కృష్ణ said...

శరత్ గారు
బిందెలు అపర్ణ fedex లో పంపిస్తారు అని సమాచారం
http://www.youtube.com/watch?v=-332uSOnvmg&feature=related

ఈ బిందెల తో ఎంజాయ్ చెయ్యండి :)

మనసు పలికే said...

శరత్ గారు ప్రస్తుతానికి నిమ్మకాయల మీదే మోజు పడ్డారు..:) అవే కానిచ్చెయ్యండి.. ఏమంటారు శరత్ గారూ..?

మనసు పలికే said...

99

హరే కృష్ణ said...

నాతో పోకిరి గురించి మాలలా మాట్లాడారు లెండి
నాది హామీ
మొన్న ఒక పాట రాసాను లెండి
బ్లోకిరి పోస్ట్ ఇంకా చదవలేదు in my blog :)

మనసు పలికే said...

100

హరే కృష్ణ said...

మీరు కూడా మా పళ్ళు పుచ్చ్సిపోఎవరకు చాక్లెట్లు కొనాల్సిందే అభిమానులందరికీ

హరే కృష్ణ said...

హహహహహః
వంద నాదే

మనసు పలికే said...

వ్వ్యా.....ఆ...

హరే కృష్ణ said...

నేస్తం బ్లాగ్ లో వంద నూట యాభై కూడా చెయ్యనివ్వకుండా చేసారు
అపర్ణ బ్లాగ్ లో కూడా వంద చెయ్యనివ్వలేదు
హహహహః
నాగార్జున విజయం మనదే :) :)

మనసు పలికే said...

ఇప్పుడు మన అందరికీ నాగార్జున మరియు కృష్ణ గారు పార్టీలు ఇవ్వాలి. సెంచరీ కొట్టినందుకు మరియు సెంచరీ కొట్టినించినందుకు..

హరే కృష్ణ said...

మీ పార్టీ ల చిట్టా నా దగ్గర సేవ్ కూడా చేసుకున్నా
స్క్రీన్ షాట్ తీసి నాగార్జున కి పంపిస్తా
నాగార్జున నువ్వు fwd చేసేయ్

Sai Praveen said...

రెండేళ్ళ చరిత్రలో మొదటి హాఫ్ సెంచరి అన్న కొద్ది గంటలకే సెంచరి.
పండగచేస్కో :)
ఇవాళ ఆఫీసులో ఉన్నంత సేపు నా జీ-మెయిల్ కి నిమిషానికి ఒక మెయిల్ వస్తూనే ఉంది.
డిస్కషన్ భలే ఇంటరెస్టింగ్ గా ఉంది సుమీ :)

..nagarjuna.. said...

తథాస్తు మిత్ర్లులారా....మీ అభిలాష నాకు శిరోధార్యం
special thanks to Hare Krishna, Manchu gaaru, tara gaaru, Aparna for speeding up the process :)

మనసు పలికే said...

హిహ్హిహ్హి.. సరే ఇక గుడ్ నైట్.. రేపు కృష్ణ గారి టపాకి వంద వ్యాఖ్యలు ఇద్దాం. ఈరోజుకి బై.. నాగార్జున గారు.. నా అభినందనలు అందుకోండి సెంచరీ కొట్టినందుకు.

హరే కృష్ణ said...

ఇదిగో సాయి ప్రవీణ్ నీ పేరు ఎన్ని సార్లు రాసాను బాస్
నువ్వు ఒక్కసారైనా పట్టించుకున్నావా అని
అక్కయ్య కి కంప్లైంట్ చేస్తా!

..nagarjuna.. said...

హే.., అందరికి రిప్లై‍లు ఇచ్చానుగాను ఒకరికి ఇవ్వడం మరిచాను.
జ్యోతి గారు..., పద్యంమొక్క అర్థం తెలియజెప్పినందుకు కృతజ్ఞతలు

Anonymous said...

శరత్ గారు ఏమైపోయారు
ఆ వీడియో లో
శోభన్ బాబు ప్లేస్ లో మీ బావ ని తలుచుకొని పడి పడి నవ్వుతున్నారా ?

Sai Praveen said...

ఎక్కడో... ఏదో... మిస్సింగ్
నా పేరు ఎక్కడ వచ్చిందో నిజంగా నేను చూడలేదు ... నో కోపమ్స్ ప్లీస్ :)
ఇప్పుడు అక్కని డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు కాని, మనం మనం పరిష్కరించేసుకుందాం. ఏమంటావ్?

..nagarjuna.. said...

సాయి ప్రవీణు..., పండగలాంటిదే చేస్కుంటున్నాను బాసు.., అసలు ఇది నా బ్లాగేనా రెండు పదుల కామెంట్లు తెప్పించుకోడానికే ఆపసోపాలు పడినోన్ని..ఒక్కసారిగా ఇన్ని చుసేసరికి నమ్మబుద్దేయట్లా..

Good night Aprna ji, ఆ పని తప్పకుండా చేద్దాం

హరే కృష్ణ said...

Sai
ok :) :)

peepli live కి వెళ్ళాలి అసలే పొద్దున్న
good night అభిమానులారా!

హరే కృష్ణ said...

వంద దాటి నూట పదహార్లు కూడా చదివిన్చేసాం !
now ur in the lead
congratulations :)

శరత్ said...

నూటాపదహారు కామెంట్లు దాటిపోయాయని పొద్దునే లేచి నాకు సన్మానం చెయ్యమని గోలెట్టడు కదా నాగార్జున?

నేస్తం said...

శివరంజని అన్నట్లు మొదట పేరు తోను తరువాత గారు తోను పేచీయా ..ఇంతకి మిమ్మల్ని మీరు అనద్దు నువ్వు అనాలి అని మీ అబిప్రాయం అంటారు .. అలాగేనండి ఇక మీదట నువ్వు అనే అంటాను లెండి చారిగారు :)

NOMAD said...

funny.....

శివరంజని said...

అసలు నేనొక తింగరి కామెంట్ పెట్టడం వల్లే కదా ఇన్ని కామెంట్స్ వచ్చాయి..అలాంటిది.. నాగార్జున గారు సెంచరీ దాటినందుకు అందరికి థాంక్స్ చెప్పి నాకు థాంక్స్ ఎందుకు చెప్పలేదు???? ..

హ.. హ.. మనోభావాలు అల్రెడీ గాయపడిన వారికి ,,, గాయ పడుతూ వున్నవారికి , గాయపడబోయే వారికి కూడా sorry లు...
అందరికి స్వాత్రంత దినోత్సవ శుభాకంక్షలు

..nagarjuna.. said...

@శరత్‌: ఎదో మీ అభిమానంకొద్ది కానిచ్చేయండి :D

@నేస్తం: ఆ వ్యాఖ్యకర్థం ఒప్పుకున్నటనా లేదనా :-?

@శివరంజనిగారు: thanks చెబుదామంటే ఏరీ మీరు మళ్లా కనపడలేదే.ఇప్పుడు వచ్చారుగా అందుకోండి..

Thank you... Thank you...
Thank you...Thank you...
Thank you...Thank you...
Thank you...Thank you...
Thank you...Thank you...
Thank you...Thank you...
Thank you...Thank you...
Thank you...Thank you...
Thank you...Thank you...
Thank you...Thank you...

ఇంతకీ మీరు ఖుషి సినిమా ఎన్నిసార్లు చూసారో చెప్పలేదు ;)

Anonymous said...

శివరంజని గారు మనోభావాలు గాయపడని వారికి, గాయపడబోని వారికీ, సారీ చెప్పనందుకు నా మనోభావాలు (బాలు, ఘంటసాల భావాలు కుడా) గాయపడ్డాయి.

ఆ.సౌమ్య said...

వామ్మో శిజ్జనకా కేక పెట్టించారుగా సారీలతో...4'E' నీకు భలే కామెంట్ల పండగయిందోయ్. అంటే ఇకనుండీ ఎక్కడైనా కామెంట్ల పంట పండించాలంటే శియా చేత సారీ చెప్పించాలన్నమాట...సూపరు అవిడియా :P

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis