Showing posts with label ఫొటోలు. Show all posts
Showing posts with label ఫొటోలు. Show all posts

ఓ చిట్టి (ప్రేమ)కథ



అల్లంత దూరాన అందమైన విరివనంలో



విరబూసిందొక అందాల భరిణ. నక్షత్రాలలోని తళుకులన్నీ, వెన్నెలలోని స్నిగ్ధత్వాన్నంతా నింపుకొని సొగసంతా తానే అయి రూపుదాల్చిందా కుసుమం.




ముద్దాడి వెళ్లే పిల్లగాలికి తన ఈడువారితో ఊయలలూగుతూ  ముత్తయిదువల కొంగుచాటు నుండి ప్రపంచాన్ని చూస్తూ కాలం గడిపేది.



























ఈ సకుమారికి ఒకనాడు భావప్రపంచపు బాటసారి - పాట ఎదురైతే  ఆ మాటకారిని చూసి సిగ్గు మొగ్గలయిపోయింది... భువనాలను సమ్మోహనం చేసే సొగసు చూసి పాట ఆ చోటే నిలిచిపోయింది.











ఒకరికొకరు గుండెవూసులు చెప్పుకుంటూ, సరాగమాడుతూ... ఓసారి తనకోసం పల్లవించమని పాటను అడిగింది గోముగా


























మదిదోచిన పుత్తడిబొమ్మ కోసం పాట గలగల పారే సెలయేటి ప్రవాహమయింది, మధుపాతంలా వర్షించింది. తాను మధుర రాగాల జడివాన కురిపిస్తే  ఆ ముద్దుగుమ్మ  అమ్మ ఒడిలో హాయిగా ఆడుకొనే పాపలా సంతోషించింది,  శరత్ ఋతువులో పున్నమినాటి జాబిల్లిలా నవ్వింది, అలనాడు బృందావనిలో గోవిందుడి మురళీరవానికి పరవశించిన గోపిక అయింది.




ముచ్చటైన ఈ జంటను చూసి  ఏ తుంటరి తుమ్మెదకు కన్నుకుట్టిందో ఇద్దరి మధ్య ఓ చిలిపి తగవు వచ్చి కూర్చుంది. నువ్వుంటే నువ్వని పోరుపడి  పువ్వు అలిగి ముఖం తిప్పేసుకుంది. పాట చిన్నబోయింది.





దూరం అయ్యేది దరిచేరేందుకే కాబోలు!  విరహ వేదనలో ఒకరికోసం ఒకరు తపించిపోయి ఇక కలలోనైనా విడిపోవద్దనుకొని  పలకరించుకున్నాయి. కలిసి బ్రతుకుదామని బాసలు చేసుకున్నాయి.



మనసేలిన స్వరానికై పువ్వు చేతులు చాచితే  నెచ్చెలిని తన కౌగిట ఆర్తిగా పొదివికొంది పాట.  ఒకటిగా పెనవేసుకున్న ఆ రెండు  మనసుల కథ ప్రణయమయ్యింది.



      సంధ్యాసమయంలో, మరొక అందమైన రోజు మొదలవుతుండగా , చెట్ల కొమ్మలలో రెక్కలు విప్పుకుని కువకువ మంటూ పక్షులు ప్రాగ్దిశలో నింగికెగిసాయి....ఈ జంట కథను జగమంతా వినిపించేందుకు.
మరి మీరు విన్నారా ఈ కథను ?

హలో...!! నవ్వండి సార్

నవ్వటం ఒక భోగం నవ్వలేకపోవటం ఒక రోగం అంట...కాబట్టి నవ్వండి సార్

నవ్వుకో పిచ్చినాయనా నిన్నాపేదెవ్వరు.....ఓ నవ్వు నవ్వితే కొత్త ఖర్చేమిరాదే ఇప్పుడు.....

ఇగోలు, ఇజాలు, కోపాలు, తాపాలు,రాజికియాలు,రౌడిఇజాలు కాసేపు అలా... పక్కనపడేశి లచ్చనంగా నవ్వేసుకోండి


నవ్వలేకపోవడం రోగం అన్నారుగాని నవ్వడం ఒక అంటువ్యాధి లాంటిది......పక్కనోడికి అంటేస్తదంతే



ఇంతకీ ఈ పోస్టు ఎందుకు వేసాను...?  ఆ.....గుర్తొచ్చింది నిన్న రాత్రి మీగొట్టం ( YouTube ) నుండి         ‘SP Balu గారితో జయప్రదం’ చూసా.....ఆ ప్రోగ్రాం అని కాదు వేరే ఎక్కడ కార్యక్రం చేసినా బాలుగారు చాలా సరదాగా ఉంటారు. జయప్రదంలోనైతే ఇంకా ఎక్కువ....ఎదో  కాలేజి కుర్రాడిలా మహా సరదాగా కానిచ్చాడు ఇంటర్వ్యూని...



ఎప్పుడైనా Fusion music విన్నారా.... i mean శాస్త్రీయ సంగీతం + మోడర్న్ వెస్ట్‌ర్న్ మ్యూజిక్...ఇప్పుడు నేను అదే వింటున్నా. స్వర్గలోకపు అంచులు, ఆనందం అవధులు అని అదేదో అంటారే eggjatlee అక్కడే ఉన్నాను.....ఒహ్ సోది ఎక్కువైంది కదూ, మీరు పనిగానివ్వండి



















గాంబీర్యం ప్రదర్శించకపోతే మీ పనవ్వదా...ఫరవాలేదు మనసులో నవ్వుకోండి.


పరాజితులా..? అస్సలు ఫరవలేదు. ఇంకోసారి ప్రయత్నించే అవకాశం ఉంటుంది...ఇప్పటికైతే హాయిగా నవ్వేస్కోండి
             


టీచర్:  ఏంటిబాబు.., స్కూల్ అయిపోయాక కూడా ఇక్కడే కూర్చున్నావు. ఇంటికి వెళ్లవా...?

పిల్లాడు: నాకు పదిహేనేళ్ళు వచ్చే వరకు స్కూళ్ళొ ఉండాలని అమ్మ చెప్పింది మరి :(


ఏంటి ఇంకా నవ్వటం లేదా... మీరుగాని  భగ్న ప్రేమికులా ?వో...... సారి.....,మిమ్మల్ని అనవసరంగా  ఇబ్బంది పెట్టాను....మీ పని మీరు కానివ్వండి. నా ఫుల్‌ సపోర్ట్ మీకే.

మిగతావాళ్ళు కామెంట్ల బదులు ఓ నవ్వు పడేసి పోగలరు...మిమ్మల్ని చూసి నేనూ వాతలు పెట్టుకుంటాను


Note: Please let me know about any claim on copyright of the images posted herein. They will dealt with accordingly

మా తుఝే సలామ్

మదమెక్కిన పొగరుతో జాతిప్రజలందరను తొత్తులుగా చేసుకొనేందుకు ప్రయత్నించిననాడు తమలో తమకి ఎన్ని భేదాపిప్రాయాలున్నా తామంతా ఒక్కరమే అని, స్వేఛ్చ అనే వెలకట్టలేని సంపదను జాతిజనులకు పంచడానికి ఎందరో వీరులకు, విప్లవకారులకు, మహనీయులకు స్ఫ్హూర్తినిచ్చిన మాతా, తుఝే సలామ్‌



రవీంద్రుడు కొరుకున్నట్లుగా..


Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
by narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake



నాకు తెలుసు ఈరోజు దేశంలోని అన్ని పాఠశాలలో చాక్లెట్లు, అవార్డుల నెపంతో పిల్లలను రప్పించి, పోరాడి సాధించిన స్వాతంత్ర్యం గొప్పదనం ఎంతో వాళ్లక చెప్పలేకపోవచ్చునని. రాజకీయ నాయకులు, అవినీతి మన విలువలను భ్రష్టుపట్టిస్తున్నాయని  తెలిసీ తెలియని ఆ పసివాళ్లకు ఉపన్యాసాలిస్తారని. ఎన్నో పత్రికలు, ఆదివారం కనుక, పత్రిక మొదటిపేజీలో తన్మయంలో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను పెట్టి లొపలి పేజీల్లొ, వీలైతే ఓ ప్రత్యేక సంచికలో,  సమస్యల వలయంలో ఉన్న దేశాన్ని మరింత దయనీయంగా చూపిస్తారని. ఎటుపోతుంది ఈ  దేశం అని సాటి మనిషిని కొంత నిరుత్సాహపరచవచ్చునని. వారందరికి నాలోంచి వచ్చిన సమాధానం కాకపోయినా అరువు తెచ్చుకొని చెబుతున్నా





అందరికి స్వాతంత్ర్యదినొత్సవ శుభాకాంక్షలు

అహం

నేను,
నిప్పులు కక్కుతూ భగభగలాడు అగ్నిపర్వత
హృదయం.
భీతావాహ ప్రళయాన రుద్రుడి
త్రినేత్రం

శ్రమను వెచ్చి జీవం పెంచే
భూమిపుత్రుడను,
ఆతడిగా మలచుకున్న పుడమిని.

ధాత్ర్రిని నేను నింగిని నేను

పాపం పుణ్యం,
స్వర్గం నరకం నేను

ఆనందమున బ్రహ్మండమంతటా నిండిన
విశ్వాత్మను,
శోకమున అణువుగా కృంగి నశియించినది నేను

అహం శూన్యోస్మి
అహం బ్రహ్మస్మి
అహం బ్రహ్మస్మి....

చర్మ సౌందర్యం, శరీర సౌష్టవం

పీల్చే గాలి, తినే తిండి,చేసే పనిలో నాణ్యత లోపించి నేటి ఈ ఆధునిక కాలంలొ మనిషికి అందాల్సిన పోషకాలు తగినంత శారీరిక శ్రమ దొరకడం లేదు. ఫలితమే కళా కాంతి లేని చర్మం, మాంసాన్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దపోసినట్టో దాన్ని మొత్తం జుఱ్ఱేసినట్టో ఉండే శరీరాకృతులు...

ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా పద్దతులు, సాధనాలు, ఉత్పత్తులు వచ్చాయి. ఆశకొద్ది జనం వాటిని ఉపయోగిస్తున్నారు. ఐతే అవి మనకు నప్పడమూ, వాటి సైడ్‌ ఎఫెక్టులు, వ్యాయామాలు గట్రా చేయడానికి బద్దకమూ వగైరా వగైరా కారాణాల నేకం వలన satisfactory results అందటం లేదు. ఐనా మహిళామణులు రోజులు నెలల తరబడి బ్యూటి పార్లర్లు, సౌందర్య వికాస ఉత్పత్తులు వాడటం, మగమహారాజులు జిమ్ముల వెంట తిరగడం చేస్తూనే ఉన్నారు. కంపెనీలు, డాక్టర్లు, ఫిజియోలు, బ్యూటి పార్లర్లు, జిమ్ములు డబ్బు దండుకుంటూనే ఉన్నాయ్. మరి దీనికి పరిష్కారం...?

ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన నిపుణుల, ఇంజనీర్ల ఎన్నో యేళ్ళ  ప్రయోగాలు, మార్పులు చేర్పుల ఫలితంగా ఓ అధ్బుతం ముందుకొచ్చింది. సమస్య ఏదైనా సరే రోజులు నెలలు కాకుండా క్షణాల్లో పరిష్కారం!! డబ్బా మొహాల నుండి చంద్రబింబం లాంటి మోము కావాలన్నా, బరువు పెరగాలనుకున్నా, తగ్గాలనుకున్నా అన్నింటికి సర్వరోగ నివారణి.
ప్రవేశ పెడుతున్నాం



























మా ఈ ఉత్పత్తిని వాడిన వారికి అందిన ఫలితాలు, అదికుడా క్షణాల్లొ





చూసారుగా......వాడటంలో ఎటువంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవు, అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు, పత్యాలు వగైరాలు అసలే లేవు, పగలు సాయంత్రం మాత్రమే లాంటివి అసలే లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తమ్ మీకు అనుకూలమైనట్టుగా.... కాబట్టి ఆలస్యం చేయకుండా నేడే..., ఇప్పుడే వాడండి. మిమ్మల్ని మీరు స్టార్లుగా మార్చుకోండి.

***********************************************************************
ఓ SMS ఆధారంగా.


Kgp-Hyd-Mum-Kgp

ఇంటికెళ్లి అయిదు నెలలవుతుంది. అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కలవాల్సిన వాళ్లు చాలామంది ఉన్నారు ఎటొచ్చి ప్రొఫెసరు ఇంటికెళ్లడానికి ఒప్పుకుంటాడొలేదో అనుకుంటూనే అడిగాం, ఓ పది రోజులకు పర్మిషన్. తరువాత తెలిసిందేంటంటే ఆయన కూడా లీవ్ పెట్టబోతున్నారని. ఏమి నా భాగ్యం అనుకొని పది రోజుల ట్రిప్‌ను నాకు నేనే సర్వసత్తాకంగా  పదిహేను రోజులకు పొడిగించుకొని క్రితం నెల 25న బయల్దేరా. వెళ్లేటపుడు ట్రెయిన్‌లో ఒకటే ఆలోచన- కాలేజీలో అయితే రోజుకి 9-10 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నా, కరెంటు కట్ అనేదే తెలీదు ఇంటికెళితే కరెంటు కట్ ఉంటుంది, అదేపనిగా కంప్యూటర్ పైన  వా్లిపోతే అమ్మో, నాన్నో తాటతిస్తారు, ఎలా మానేజ్ చేయాలా అని.

అలా అలోచిస్తూ చిస్తూ హైదరాబాదులో అడుగుపెట్టా. ఇంటికి చేరుకునేసరికి మా ఇళ్లు కొత్త పెళ్ళికూతురిలా వెలిగిపోతుంది. నే రావడానికి కొద్దిరోజులముందు ఇంటికి సున్నాలద్దారు అదీ దాదాపు పదేళ్ల తరువాత. ఏదైతే ఏమిగాని మా ఇళ్లు మాత్రం అందంగా తయారైంది నా రాక కోసమే అన్నట్లు


                                                                       

                                              కొత్తసీసాలో పాత సారా   అన్నమాట 



ఇంటికెళ్లినా కాలేజిలో ఒంటబట్టిన అలవాటు పోలా...రాత్రి 3:00 అయినా నిద్రపట్టేది కాదు. అందరూ పడుకున్నాక మేల్కోలేక, పడుకున్నా నిద్రరాక డాబా మీద కాలుకాలిన పిల్లిలా అటూఇటూ తిరిగేవాణ్ణి. ఏ 4:00 కో 5:00 కో నిద్రపోయి మధ్యాహ్నం  పన్నెండు, ఒంటి గంట దాటాక మేల్కోవడం ఇలా ఓ నాలుగు రోజులు నిద్రార్పణం అయ్యాయి. ఎలాగైనా తొందరగా నిద్రపోవాలని అలసట తెప్పించుకోవడానికి రాత్రి 7 దాటాక తెగ నడవడం మొదలుపెట్టా. అలా తిరుగుతున్నప్పుడే కనిపించాయి మా ఏరియాలో కొత్తగా పెట్టిన ఓ నాలుగు banquet halls, ఓ కొత్త ATM center.ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా....ఐతే మీకు మా ఏరియా గురించి చెప్పాలి.

ఓ పక్క నాగార్జున సాగర్ రోడ్డు మరోవైపు విజయవాడ హైవే..., ఈ రెండు రోడ్ల మధ్య ఉంటుంది మా ఏరియ

ఆ సంతోష్‌నగర్ నుండి కర్మన్‌ఘాట్ వరకు మూడు కిలోమీటర్లు, ఈ మూడు కిలోమీటర్ల దూరంలో ఒక్క సాగర్  రోడ్దుమీదే   పద్దెనిమిది ఫంక్షన్‌ హాల్స్ ఉన్నాయి, అటుపక్క ఇన్నర్ రింగ్ రోడ్దు మీద ఓ పది దాకా ఉంటాయి. చిన్నాచితకా అనుకుంటున్నారేమో..peak seasonలో ఈ హాల్స్ బుక్ చేసుకోవాలంటే  లక్ష వరకు ఖర్చవుతుంది. ఇన్ని ఫంక్షన్‌ హాల్స్‌ ఉన్నాయని ఈ మూడు కిలోమీటర్ల వరకు సాగర్ రోడ్దును అనధికారంగా Gardens Street అంటారు. పెళ్లిళ్ళ సీజన్‌లో ఉంటుంది సామి ట్రాఫిక్ జాము, దరువు.....జజ్జనక జ్జజ్జన జనక జనక. ఇపుడు కొత్తగా పెట్టిన ఆ నాలుగు కలుపుకుంటే మొత్తం 36.
ఇక ATM సంగతికొస్తే నాకు తెలిసి హైదరాబాదులో మరెక్కడా ఇన్ని బ్యాంకుల ATMలు ఒకే దగ్గర ఉండవు. ఇప్పటి వరకు మూడే ఉండేవి ( Andhra bank, SBI, Canara Bank) కొత్తగా HDFC వాడు పెట్టాడు. మీకు తెలిసి హైదరాబాదులో కాని ఇండియాలో మరెక్కడైనా కాని ఇంతకంటే ఎక్కువ ATMs ఒకే దగ్గర ఉన్నట్టు తెలిస్తే చెప్పండి లేకపోతే నేను దీని గురించి లిమ్కా రికార్డుకోసం చూద్దామనుకుంటున్నా---కూసింత రీజినల్ ఫీలింగ్ ;)




ఇంటికొచ్చి స్నేహితులను కలుద్దామనుకుంటే వాళ్లు జాబ్స్‌లో బిజీ బిజీ. పోని శని- ఆదివారాల్లో వీలవుతుందనుకుంటే వాళ్లు బంధువులిళ్లకు వెళ్లడమో , షాపింగ్ అనో దొరకలేదు. ఏం చేసేది లేక మమః అన్నట్టు ఇద్దరిని ప్రత్యక్షంగా కలిసి, మరికొందరిని కలవాలనుకున్నా కుదరక ఫోన్లోనే పలకరించి ఇంకొందరిని అసలు ఏ విధంగా కుడా కలవకుండా ముంబై బయల్దేరా. అక్కడ IIT లో మా ప్రెండొకడున్నాడు వాణ్ణి కలవడానికి.
ముంబై వెళ్లడానికి Rs. 272 ట్రైన్ టికెట్టు దొరక్క తత్కాల్ చేసుకుందామని పొద్దునే 5గంటలకు లేచి రిజర్వేషన్ కౌంటరుకెళ్లా. ఆరోజు నా లక్కు అఘోరించినట్లుందనుకుంటా నా ముందు ఇంకో ముగ్గురు ఉన్నపుడు ఓ వెధవ ఆ రిజర్వేషన్‌ చేసే ఆవిడతో గొడవకు దిగాడు ఆవిడేమో అటు గొడవ పెట్టుకోలేక ఇటు రిజర్వేషన్ చేయలేక ఊరకే తాత్సారం చేసింది. పక్క కౌంటరులో ఒకరిద్దరు ముంబైకే బుక్ చేసుకుంటున్నారు...టికెట్లు టపా టపా పిట్టల్లాగా రాలిపోతున్నాయి,  మా లైనులో ఆ సనుగుడుగాడు వెళ్లడంలేదు, పైగా నా ముందు కాన్సిలేషన్  కోసం ఓ కాండిడేటు. కాస్నిలేషన్ కోసం అంత పొద్దునే లేచి తత్కాల్  లైనులో ఎందుకు నిల్చున్నాడో ఎంత బుర్రగోక్కున్నా అర్థం కాలేదు. బాబు నీది కాన్సిలేషనే కాదా ఓ పది నిముషాలయ్యకైనా చేసుకోవచ్చు మేము బుకింగ్ చేసుకోవాలి పక్కకు తప్పుకోరా నాయనా అన్నా వినలేదు. పర్యవసానమేంటొ మీకు చెప్పనక్కర్లేదనుకుంటా. అక్కడి నుండి ఊసూరుమనుకుంటూ వచ్చి నా బ్యాడ్ లక్‌ను, ఆ సనుగుడు వెధవని, ఆ రిజర్వే‌షనావిడని, ఆ కాన్సిలషన్‌గాడిని తిట్టుకుంటూ 1000 పెట్టి ( సారి 992 మాత్రమే ) RTC బస్సులో బయల్దేరా. బస్సులో రాష్ట్రం అవతల ప్రయాణించడం అదే మొదటిసారి. వచ్చే దారిలొ వాతావరణం చల్ల చల్లగా వుంది అంతకు ముందు రోజు రాత్రి వర్షం పడింది కాబోలు పొద్దున తొమ్మిది గంటల ప్రాంతంలో ఖండాలా చేరుకున్నాం, ఆకాశం మబ్బులు పట్టి ఉంది. బస్సు కిటికిల్లొంచి కనిపించిన ఆ లోయల అందం ఎంత వర్ణించినా తక్కువే.

ముంబైలో ఈ నెల 11న దిగాను. ఫ్రెండ్‌ రూంకి వెళ్లాక బ్లాగు లోకం ఎలా ఉందో చూద్దామని ‘మాలిక’ ఓపెన్ చేసా.మంటలు కక్కుతూ పోస్టులు కనపడ్డాయి వాటిలో చలికాచుకోవడమో, చేతులు కాల్చుకోవడమో ఇష్టం లేక (నిజం చెప్పాలంటే భయమేసి) అక్కడున్న నాల్రోజులు ఇంటర్నెట్  వైపే వెళ్లలేదు. ఓ మూడు రోజులు బీచుల వెంబడి తిరిగాము. బీచులు అందునా ముంబై బీచుల వెంట కుర్రాళ్లం మేము  మూడు రోజులు ఎందుకు తిరిగామో మీకు చెప్పక్కర్లేదనుకుంటా ;)  ;)


చివరిరోజు Gateway of India  నుండి ఎలిఫెంటా కేవ్స్‌కు లాంచిలో వెళ్లాము. గంటసేపు ప్రయాణం.  సముద్రంలో ప్రయాణించడం , సముద్రంలో పెద్ద పెద్ద షిప్‌లను, కంటైనర్లను చూడటం అదే మొదటిసారి . వెళ్ళేటపుడు వాతావరణం ప్రశాంతంగవుంది.తీరా ఆ కేవ్స్‌కు వెళితే అక్కడ ఆర్కియాలజి డిపార్టుమెంటు వాళ్ళు పండులొ గుజ్జు తినేసి టెంకలు మిగిల్చారు. అదే మహాప్రసాదమనుకొని తిరుగు ప్రయాణమయ్యాం. అరగంట తరువాత వర్షం మొదలైంది గాలులు ఎక్కువైయ్యాయి. సముద్రంలో అలజడి. మా బోటు అలలకు పైకి కిందకు కదులుతుంది కొంతమంది భయపడుతున్నారు ఏమౌతుందోనని, ఇంకొందరు అలలు లాంచిలోకి వస్తుంటే ఆనందిస్తున్నారు ఆ రెండొ గ్రూపులో నేనుకూడా కలిసిపోయా. బోటు తిరిగి Gateway of India దగ్గరకు వచ్చేసరికి అలలు ఇంకా ఎక్కువయ్యాయి, అప్పుడే మా బోటు ఇంజన్‌లో తాడు చిక్కుకొని ఆగిపోయింది.....

కొంతమందిలో భయం మొదలైంది. పక్కనే ఇంకో బోటు ఉండడంతో మా లాంచి నుండి దానికి తాడు లంగరు వేసి మరొక ఒడ్డువైపు తీసుకెళ్లారు అదే అలలగుండా వెనక్కి వెళుతూ. తీసుకెలుతున్నపుడు మధ్యలో తాడు విడిపోయింది.బోటులో ఉన్నవాళ్లలో మళ్లి కలకలం. బోటులో ఇద్దరు High class ఆడవాళ్లు వాళ్ల పిల్లలతో (మరీ చిన్నవాల్లేం కాదు 16-22  మధ్య ఉంటారు) వచ్చారు. ఇంజన్ ఆగిపోయిన దగ్గరనుండి వాళ్ల పిల్లలు ఇద్దరు ఏడవటం మొదలుపెట్టారు ఆ అమ్మలేమో ‘ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, దేవుడిని ప్రార్దించండి, మీ వాళ్లకు ఫోన్లు చేసుకోండి’ అనడం మొదలుపెట్టారు వాళ్ల మాటలకు ఆ పిల్లలు, ఇంకొందరు కూడా భయపడడం మొదలుపెట్టారు.   కుర్ర జంటలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. లాంచిలో ఓ మరాఠి ఫ్యామిలి ఉంది- లొయర్ మిడిల్‌క్లాస్ అనుకుంటా అందులోంచి ఒకాయన ‘మరేం ఫరవాలేదు సముద్రంలో ఇలాంటివి మామూలే, లాంచి వాళ్లు ఇలాంటివి చాలానె చుసుంటారు ఎవరికి ఏం అవదు’ అంటూ సర్దిచెబుతున్నాడు వాళ్ల కుటుంబంలో ఆడవాళ్ళు కూడా ఏమి గాబర పడటం లేదు.

లాంచివాడు ఆ విడిపోయిన తాడును మళ్ళి కట్టి వేరే పనిలో పడ్డారు. నేను, నా స్నేహితుడు లాంచి వాడి దగ్గరకు వెళ్లి ఎటు తీసుకెళుతున్నారో కనుక్కున్నాం...కాసేపట్లో చేరిపోతాము అని పక్కవాల్లకు చెప్పి ఊరుకున్నాం. లాంచిలో ఓ పంజాబీ యువకుడు, కుటుంబంతో వచ్చిన ఓ ముస్లిం యువకుడు  కూడా ఏమి అవదు అది చాలా చిన్న సంఘటన అని ధైర్యం చెబుతున్నారు. ఆ high class ఆడవాళ్లు మాత్రం ఆగటం లేదు. లాంచివాడిని ‘మీ ఓనర్ నెంబరు ఉందా?’, ‘ఇంజన్ ఇంకా ఎందుకు బాగు చేయలేదు’, ఆ మరాఠి ఆయన్ను ‘మీకెలా తెలుసు కాసేపట్లో చేరుకుంటామని?’ అంటూ తను హైరానా పడుతూ మిగతావాళ్లను కూడా హైరానా పెట్టింది. ఆ గోల భరించలే నేను ఆ మరాఠి ఆయన్తో కబుర్లు చెప్పటం మొదలుపెట్టా. Gate way of India నుండి మళ్ళి సుమారు గంట తరువాత  మా లాంచి్ మెజగాన్ డాక్ దగ్గర ఆగింది. అందరం సురక్షితంగా బయటపడ్డాం. కాని ఆ గంటసేపు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోయే సమయం. మనిషిలో ‘చావు’ అనే భయాన్ని, High classలో డాంబికాన్ని, మధ్యతరగతలో ధైర్యాన్ని దగ్గరగా చూసా. అక్కడ భయపడటానికి వాళ్లు high class వాళ్లొ, ధైర్యంగా ఉండటానికి, చెప్పడానికి ఆ మరాఠి అతను మిడిల్‌ క్లాసో అవనవసరం లేదు. కాని సాధారణంగా మనం ఈ తరగతుల గురించి వినే మాటలను ప్రత్యక్షంగా చూడటం నిజంగా ఓ deep impression కలిగిస్తుంది. ఎన్నిసార్లని గనుక ఇటువంటివి ఎదురౌతాయి!!

అక్కడున్నపుడు ‘తాళము వేసితిని గొళ్లెము మరచితిని’ పని చేసా.  IIT mumbai students కు విండోస్7 ఒరిజినల్ వెర్షన్ ఉచితంగా ఇస్తారు అని అంటే ఎగేసుకుంటూ install చేసుకున్నా...తరువాత వెలిగింది బల్బు firefoxలొ బ్లాగు ఫీడులను బుక్‍మార్క్ చేసిన ఫైల్‌ను  బ్యాకప్ చేయడం మరచిపోయానని.....వా :( .
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అప్పుడెపుడో క్రితం సంవత్సరం ఖరగ్‌పూర్ వచ్చేముందు బుక్‌మార్క్ ఫైలుని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసా. కాని అందులో అన్ని ఫీడ్స్ లేవు. గుడ్డిలో మెల్ల, ఆ మాత్రమైనా ఉన్నాయి. నిన్నంతా కూడలి, హారం, జల్లెడ, మాలికలు తిరగేసి మిస్ అయినవాటిలో కొన్ని తిరిగి సంపాదించా....

బొటు విహరం నుండి తిరిగొచ్చా రాత్రి 8 కి జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఎక్కిరావాలి, వర్షం మొదలౌతుండగా ఆఘమేఘాల మీద ఓ ఆటో పట్టుకొని బయల్దేరాం. తీరా స్టేషను చేరుకొనేసరికి అక్కడ ట్రైను ఎనిమిది గంటలు వాయిదా అని announce చేసారు ఎందుకని వాకబు  చేస్తే రెండు వారాల క్రితం మావోయిస్టులు ట్రైను పేల్చినప్పటినుండి ఉదయం నాలుగింటికి మార్చారంట...మాకు మామూలుగా తిక్కరేగలేదు. అసలే ఆన్‌లైన్‌లో  తత్కాల్‌లో బుక్ చేసుకున్నాం అందులో వాయిదా అని ఏం చెప్పలేదు, పైగా స్టేషను చేరుకునేప్పుడు గొడుగు పోగొట్టుకున్నాం, దానికి తోడు ఉదయం జరిగిన లాంచి సంఘటన....ఒక్కసారిగా పిచ్చిపట్టినట్టు అనిపించింది. అయినా ఆ మావోలకి బలిసి కాకపోతే ఏం దొరకలేదా. ఎవడో చేసినదానికి అమాయకులను చంపేసారు....వీళ్లకు వంతపాడుతూ విప్లవ సంఘాలు..damn these people.

వాయిదా అని తెలిసి ఆ స్టేషనులో ఉండలేక కాంపస్‌కు తిరిగి వెళ్లాం. అర్థరాత్రి రెండుగంటలకు లేచి ఆటో వెతుక్కొని స్టేషన్ వచ్చా. ఎనిమిది గంటలు వాయిదా పడటం, ప్రయాణంలో రైలు  నాలుగు గంటలు ఆలస్యం వెరసి 36 గంటలు రైల్వే వారి సేవలో మునిగిపోయి ఖరగ్‌పూర్‌లో తిరిగివచ్చిపడ్డా.
ఖరగ్‌పూర్‌లో దిగగానే చేసిన మొదటిపని, స్టేషను బయట ఉండే Taaz ధాబాలో ఓ వేడి వేడి చికెన్ బిర్యాని లాగించడం. చూడ్డానికి చిన్న ధాబా లాగుంటుంది కాని ఇక్కడ చేసిన బిర్యానియంత బాగా ఎంటై.....ర్ ఖ‌రగ్‌పూర్‌లో దొరకదు.

ఈ సంగతి మీకు తెలుసా ?

తూచ్ మరేమి లేదు, ఇవాళ ఉగాది కదా ఊరికే రొటీన్ title పెడితే అగ్రిగేట్ర్లల్లో కొట్టుకుపోతుందని కాస్త విభిన్నంగా, పిలిచి చెబుదామని అలా పెట్టాను.

తెలుగువారందరికి ‘వికృత’నామ సంవత్సర చైత్ర శుద్ధపాఢ్యమి శుభాకాంక్షలు.
ఈ నూతన సంవత్సరం ఎటువంటి కలహాలు లేకుండా సుఖ-సంతోషాలతో గడచిపోవాలని కోరుకుంటూ మీకు మరొక్కసారి

సొగసు చూడతరమా....



రష్యాలో కనపడే సైబేరియన్‌ పులి ఇది. మన బెంగాల్‌ పులులు రాజసానికి పెట్టింది పేరైతే సైబేరియన్‌ పులులు చూడ్డానికి అందంగా వుంటాయి. చలి ప్రదేశాల్లొ నివాసం కాబట్టి చర్మం మీది వెంట్రుకలు దట్టంగా, ముదురు రంగులో ఉంటాయి. ముదురు గోధుమ రంగుపైన నల్లని చారలతో గ్లామరస్‌గా ఉంటాయి. ఫోటొ జూస్తే తెలుస్తలే..
అడవుల నరికివేత, మనుషుల వేట కారణంగా వీటి సంఖ్య ప్రమాదంలో పడిపోయింది.
ఫోటొ విషయానికి వస్తే ఈ pose లొ బంధించడానికి ఫొటొగ్రాఫర్‌ గంటల తరబడి దాని చుట్టుపక్కనే ఉండాల్సి వచ్చిందట. చాలా దగ్గరినుండి తీసాడంట...ఎలా ఉండగలిగాడో మరి.


పెపంచకంలో ఇంతకన్నా సుఖమైన పని ఏమైనా ఉంటుందా బాబయ్యా.
ఏ చేప పిల్ల దొరికిందని కలగంటుందో ఏంటొ...డిస్టర్బ్‌ చేయకండి

ద్రువపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సీళ్ళ చర్మం కోసం, వాటి కొవ్వు నుండి తీసే నూనెల కోసం ఒకప్పుడు వీటిని విచ్చలవిడిగా చంపేసేవారు.



హిమాలయాలు, నేపాల్, చైనా ప్రాంతంలో కనపడే ఎర్ర పాండాలు ఇవి. Fire Fox అనికూడా అంటారు. నలుపు-తెలుపు పాండాల దగ్గరి పొలికల్తో ఉంటుంది. వాటిలాగే శాకాహార జీవి. అధికారిక లెక్కల ప్రకారం వీటి జనాభా సుమారు 2500.
అడవుల నిరికివేత కారణంగా వీటి మనుగడ ప్రమాదంలో పడింది.








కోరల్‌ రీవ్స్‌...భూమిపైన జలంతర్భాగంలో ఉండే స్వర్గం. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిస్కవరీలోనో, Nat Geoలోనో చూసేఉంటారు. వీటి చుట్టుపక్కల ఉండే జీవవైవిద్యం ఎక్కడా ఉండదు. సెంటీమీటరు సైజు చేపల నుండి పదడుగుల పొడవుండె షార్క్‌ చేపల వరకు అన్నీ కనిపిస్తాయి. భూవాతావరణంలోని ఉష్ణొగ్రతల మార్పులకు చాలా ప్రభావితమౌతాయి. సముద్రపు ఉప్పు శాతం పెరిగినా, సాధారణ ఉష్ణోగ్రత పెరిగినా ఇవి దెబ్బతింటాయి.



ఉత్తర, దక్షిణ అమేరికాలలో ప్రముఖంగా కనిపించే కౌగార్‌ పెద్దపిల్లులో నాలూగో అతిపెద్దది ( పులి, సింహం, జాగ్వార్‌ ల తరువాత ). ఇప్పటికైతే వీటి మనుగడకొచ్చిన ముప్పేమీలేదని WWF చెబుతుంది. కానీ కొన్ని అమెరికా రాష్ట్రాలలో వీటిని వేటాడటం చట్టబద్దమేనట. ఆ రకంగా ప్రమాదంలో ఉంది.








తలమే బ్రహ్మకునైన నీ నగమహత్వఁ బెన్న.....
( పదో తరగతిలో ‘ప్రవరుని స్వగతం’లో చదివిన పద్యం, వ్యాకరణ దోషాలేమైన ఉంటే మన్నించండి)

ఇంజనీరింజ్‌లో మేము మనాలీ వెళ్ళినప్పుడు తీసిన ఫోటొ . రోతాంగ్‌ పాస్‌ వేళ్ళే సమయానికి మంచు ఏక్కువ కురుస్తుందని ఆ దారి మూసేసారు.....చివరికి సోలాంగ్‌ valleyకు వేళ్ళాం.దారిలో తీసిన క్లిక్కు ఇది. హైదరాబాదులో చిన్న గుట్టలే చూసిన నాకు అంతంత పెద్ద కొండలు చూసేసరికి ఎవరూ కొట్టకుండనే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాకైంది. తెల్లటి మంచుకొండలపైన ఎండపడి వెలిగిపోతుంటే......చూడ్డానికి నాలుగు కళ్లు చాలలేదు ( నాకు కళ్ళజోడు ఉందిమరి).
పెరిగిపోతున్న భూవాతావరణం కారణంగా వీటిపైన ఉండే మంచు త్వరగా ( ఎండాకాలం ముందుగానే) కరగుతుందంట.
ఇలాగే కొనసాగితే మున్ముందు అక్కడ రాళ్లకొండలే ఉంటాయి కాబోలు.

టాపా రాస్తుంటే winampలో ‘ఓయ్!’ సినిమా పాట ప్లే అవుతుంది...,
"అనుకోలేదేనాడు  ఈ లోకం నాకోసం
అందంగా ముస్తాబైవుంటుందనీ...."
నాకోసం సరే అందంగానే ఉంది......కాని వచ్చే తరానికి.....?
వీటి సొగసు రానున్న తరాలు చూడశక్యమా......

ShareThis