చర్మ సౌందర్యం, శరీర సౌష్టవం

పీల్చే గాలి, తినే తిండి,చేసే పనిలో నాణ్యత లోపించి నేటి ఈ ఆధునిక కాలంలొ మనిషికి అందాల్సిన పోషకాలు తగినంత శారీరిక శ్రమ దొరకడం లేదు. ఫలితమే కళా కాంతి లేని చర్మం, మాంసాన్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దపోసినట్టో దాన్ని మొత్తం జుఱ్ఱేసినట్టో ఉండే శరీరాకృతులు...

ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా పద్దతులు, సాధనాలు, ఉత్పత్తులు వచ్చాయి. ఆశకొద్ది జనం వాటిని ఉపయోగిస్తున్నారు. ఐతే అవి మనకు నప్పడమూ, వాటి సైడ్‌ ఎఫెక్టులు, వ్యాయామాలు గట్రా చేయడానికి బద్దకమూ వగైరా వగైరా కారాణాల నేకం వలన satisfactory results అందటం లేదు. ఐనా మహిళామణులు రోజులు నెలల తరబడి బ్యూటి పార్లర్లు, సౌందర్య వికాస ఉత్పత్తులు వాడటం, మగమహారాజులు జిమ్ముల వెంట తిరగడం చేస్తూనే ఉన్నారు. కంపెనీలు, డాక్టర్లు, ఫిజియోలు, బ్యూటి పార్లర్లు, జిమ్ములు డబ్బు దండుకుంటూనే ఉన్నాయ్. మరి దీనికి పరిష్కారం...?

ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన నిపుణుల, ఇంజనీర్ల ఎన్నో యేళ్ళ  ప్రయోగాలు, మార్పులు చేర్పుల ఫలితంగా ఓ అధ్బుతం ముందుకొచ్చింది. సమస్య ఏదైనా సరే రోజులు నెలలు కాకుండా క్షణాల్లో పరిష్కారం!! డబ్బా మొహాల నుండి చంద్రబింబం లాంటి మోము కావాలన్నా, బరువు పెరగాలనుకున్నా, తగ్గాలనుకున్నా అన్నింటికి సర్వరోగ నివారణి.
ప్రవేశ పెడుతున్నాంమా ఈ ఉత్పత్తిని వాడిన వారికి అందిన ఫలితాలు, అదికుడా క్షణాల్లొ

చూసారుగా......వాడటంలో ఎటువంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవు, అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు, పత్యాలు వగైరాలు అసలే లేవు, పగలు సాయంత్రం మాత్రమే లాంటివి అసలే లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తమ్ మీకు అనుకూలమైనట్టుగా.... కాబట్టి ఆలస్యం చేయకుండా నేడే..., ఇప్పుడే వాడండి. మిమ్మల్ని మీరు స్టార్లుగా మార్చుకోండి.

***********************************************************************
ఓ SMS ఆధారంగా.


8 వ్యాఖ్యలు.. :

..nagarjuna.. said...

హరే కృష్ణ (?) అన్నారు:
హ ఆహా ఏమనుకున్టున్నావు నాగార్జునా నీ గురించి !!
నీ బ్లాగులో మధ్యాహ్నం నుండి ఎన్ని సార్లు ట్రై చేస్తున్నానో తెలుసా కామెంట్ రాయాలని
తొక్క లో టెంప్లేట్ వల్ల అనుకుంటా కామెంట్ రాయడం కుదరడం లేదు వేరే సిస్టం కి వెళ్ళినా కూడా same ప్రాబ్లం
దయచేసి సవరించగలరు
ఒక విషయం గమని0చార మధ్యాహ్నం నుండి ఒక్క కామెంట్ కూడా మీ బ్లాగ్ లో రాలేదు
దయచేసి ఏదో ఒకటి చేసి పుణ్య కట్టుకోగలరు

ఇంద్ర ధనుస్సు అభిమాని :) ఎక్కువయింది కదా కాని నిజమేనండోయ్ :)

*******************
Thanks for the feedback bro. కొత్త టెంప్లెటు ఎంతో నచ్చింది కాని ఏం చేస్తాం కామెంట్లు పోస్టు అవడం లేదంటున్నారుగా...తీసేసాను.

rishi said...

బ్లాగుల్లో కూడా మార్కెటింగ్ మొదలయ్యిందా అనుకున్నా మొదట:)
బాగుంది మీ ప్రోడక్ట్.ఇంతకీ మీరు వాడారా లేదా..వాడితే రిజల్ట్ మాకూ చూపించండి మరి :)

ranjani said...

^^ కామెంట్లు కనిపించకపోవడానికి , కొత్త టెంప్లేటుకి
సంబంధం లేదనుకుంటా.. ఇలా కామెంట్లు బ్లాగులోకి
ప్రచురించకపోవడం అప్పుడప్పుడూ అవుతూనే ఉంటుంది
నిన్నటి నుండి కూడా అదే మరలా అవుతోంది..

ఇక్కడ చూడండి:

http://www.google.com/support/forum/p/blogger/thread?tid=3dcb02c83302034f&hl=en

http://groups.google.com/group/telugublog/t/b726b6c098bdb73b

సుజాత said...

బ్లాగర్ లో సమస్య ఉన్నట్లుంది. గత కొద్ది రోజులుగా చాలా మంది బ్లాగుల్లో ఇదే సమస్య వస్తుందట. కామెంట్స్ అప్రూవ్ కూడా కావట్లేదట కొందరికి!

అన్నట్లు ఫొటోషాప్ మాయాజాలం చాలా బావుంది.

మధురవాణి said...

Superb products! :-D

..nagarjuna.. said...

@రిషిగారు: ఏమో ఇప్పటికే చాలా జరుగుతున్నాయి బ్లాగులోకంలో...మార్కెటింగు కూడా మొదలవచ్చు ( అదే జరిగితే నేను మార్కెటింగ్ ఆద్యుడుగా పోస్టుల్లో, చరిత్రలో టైపులో, మిగిలిపోతానేమో.. :) :D )
వాడకపోవడమేమిటి దాన్ని వాడి వాడి అరదదీస్తేనూ కాకపోతే నాకు ప్లబ్లిసిటి అంతగా నచ్చదు అందుకే ఫొటొలు పెట్టలేదు..మీరు ఇంత మొహమాట పెదుతున్నారు కాబట్టి ఇక్కడ చూడండి
వాడకముందు

వాడినతరువాత


@సుజాత,రంజనిగారు :టెంప్లెటుని 10 రోజుల క్రితమే మార్చానండి కామెంట్లు స్వీకరించకపోవడం అప్పడినుండే ఉంది :( ఇలా జరుగుతుందని కృష్ణప్రియగారు కూడా చెప్పారు. బహుశా వాళ్ల సిస్టంలోనే ప్రాబ్లం ఉందని ఊరుకున్నా, హరేకృష్ణగారు కూడా చెప్పాక తప్పేదిలేక మార్చాను.

@మధురవాణిగారు :మీకు నచ్చిందా...? అయితే వెంటనే ఆర్డరిచ్చేయండి. డిమాండు చాలా ఉంది. తెలిసినవారు కనక మీకు స్పెషల్ ఆఫర్‌లో ఒకటి కొంటే మరొకటి ఉచితం(ఈ-మెయిలు షిప్పింగు చార్జిలు అదనం :) ). వెల $100/- మాత్రమే

హరే కృష్ణ said...

ఏమేమీ ఖండకావరము
మేము మీకు మెయిల్ చేస్తే మీరు ఇలా పట్టించుకోకపోవుటయా

అని రాసి బ్లాగులో కి వచ్చాను హమ్మయ్య బతికించావు/బతికిపోయావు :) కామెంట్ రాసేసి

సబ్జెక్టు రాయకుండా కేవలం మెసేజ్ మాత్రమే రాసి బతికించావు బాసూ! :D

ఆ మొదటి ఫోటో చూసారా మాట్రిక్స్ లో హీరోయిన్ Carrie-Anne Moss లా బాగా తయారుచేసారు.

..nagarjuna.. said...

@హరే కృష్ణ: మీరు ఉత్తరము పంపించుట మేము పట్టించుకోకపోవుటయా !? శివ శివ, సారి, కృష్ణ కృష్ణ....
ముందు సబ్జెక్టు కూడా పెడదామనుకున్నా, కాని అది మీరు పెట్టారంటే ఎంతమంది నమ్ముతారో ఎదురు నన్నే ఎంతమంది చెడుగుడాడుకుంటారో నని భయమేసివదిలేసా...ఆయ్ !!

నిజమేనండోయ్ ఆ ఫొటొ విషయం నేను కూడా గమనించలేదు

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis