చేదుపాట

నిన్న రాత్రి తెలిసిన బ్లాగులు కొన్ని తరచి చూస్తూ కృష్ణప్రియ గారు  సమీర్ పైన రాసిన పోస్టునొకటి చూడడం జరిగింది. నిజానికి ఆ పోస్టు ఎప్పుడొ నా ఫీడ్ బర్నర్ లో వచ్చింది కాని టైటిల్‌లో ‘కథ’ అనివుండే సరికి నిజంగా కథ అయివుండవొచ్చని ఇన్ని రోజులు చదవలేదు. కాని నిన్న ఆ పోస్టును చదివిన దగ్గరినుండి నాలో ఎదో దుఃఖం లాంటిది ఏర్పడింది. ఆ సమీర్ ఎవరో నాకు తెలియదు. కాని ఇప్పుడు అతను గనక ఎదురైతే అతన్ని హత్తుకొని ‘Every thing is all right bro' అని అనాలనిపిస్తుంది. అతణ్ణి గురించి కృష్ణప్రియ గారు చెప్పిన ఓ పేరాను ఇక్కడ చూడండి
ఒకసారి ఒకబ్బాయి.. ముజఫ్ఫరాబాద్ బీహార్ లో ఉందనుకున్నాడు. ఇతను ఉగ్ర రూపం దాల్చి.. 'అదేంటి ? ఆ మాత్రం తెలియదా? పీ ఓ కే లో ఉంది. అక్కడ జనాలు అంతమంది చస్తుంటే.. మీకు కనీసం ఎక్కడుందో ఐడియా కూడా లేదా ? అని హుంకరించాడు. నేను కలగచేసుకుని.. 'అతనికి తెలియదు.. ఓ కే.. నువ్వు చెప్పు కర్ణాటక సీ ఎం ఎవరో చెప్పు మొదలు..' అంటే చెప్పలేకపోయాడు. మూడేళ్ళపాటు ఉంటున్నావు బెంగళూర్లో. నీకామాత్రం తెలియదు. ..? ' అంటే.. నవ్వేసి.. 'యూ గాట్ మీ ఆన్ దట్ ' అని వెళ్ళిపోయాడు.
 అతని స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఆ కోపాన్ని అలాగే కొనసాగించే వారు. అతనో కాశ్మీరి పండిట్ కుటుంబానికి చెందినవాడు. పండిట్ల పట్ల కాశ్మీర్‌లో జరుగుతున్న అకృత్యాలను తెలిసినవాడు. అతను పై సందర్బంలో కోప్పడడంలో తప్పులేదనిపించింది....అయినా చివరకు తేలికయ్యాడు. మనలో ఎంతమంది అలా చేయగలం ?
పోస్టు మొత్తం చదివాక గుండె బరువెక్కిపోయింది. అతను ఎక్కడ ఉన్నా క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నా...ఆ ఫీలింగ్‌ నుండి బయట పడడానికి పాటలు వినడం, వేరె బ్లాగులు ఓపెన్ చేయడం, నా బ్లాగుకి వచ్చిన వ్యాఖ్యలు చూడడం మొదలుపెట్టా...ఉహూ అస్సలు వీలవలేదు. ఎదో తెలియని బాధ.  అదే సమయంలో అంతకు ముందురోజు చూసిన వజ్రాల తవ్వకాలలో నలిగిపోతున్న ఆఫ్ర్రీకా ప్రజలమీద తీసిన బ్లడ్ డైమండ్ సినిమా, నా తెలంగాణాలోంచి మిగతావారిని తరిమేయాలని కేసిఆర్ చేస్తున్న చర్యలు, అప్పుడేపుడొ చేతన్ భగత్ three mistakes of my life  పుస్తకంలో ఒక కాశ్మిరీ పండిట్ పాత్ర గుర్తుకొచ్చాయి. అప్పటిదాకా మనస్సులో ఉన్న బాధ ఎక్కువై కళ్లలో నీళ్లు తిరిగాయి.

అసలు మన దేశంలో ఉన్నవారి గురించి మనకేం తెలుసు. కాశ్మీర్‌లో ప్రజలు పడే బాధలు, ఈశాన్య భారతంలో సైనికుల అకృత్యాలు, విప్లవం పేరుతొ మావోయిస్టులు శాంతి పేరుతో పోలీసులు-ప్రభుత్వాలు చేస్తున్న దురాగతాలు , తిండిలేక నిర్లక్ష్యపు వరదలో కొట్టుకుపోతున్న జనం మనకేం తెలుసు (నేనేమి మినహాయింపు కాదు). బండేసుకు తిరగడానికి తక్కువ ధరలో పెట్రోలు, మాట్లాడటానికి చేతిలో సెల్లు, వీకెండ్స్ ఆనందంగా గడపడానికి పార్కులు పబ్బులు ఉన్నాయని సంబరపడుతున్నాం. రెండంకెల జీడిపి ని తలుచుకొని మురిసిపోతున్నాం. నాణేనికి మరోవైపు ఇంత చీకటి ఉన్నాకూడా. అన్నీ బాగుండాలి, నాకో idealistic ప్రపంచం కావాలని కాదు, కాని ఇన్నేళ్లుగా సమస్య అలాగే ఉన్నా స్తబ్థత ఎందుకు మనలో, ఎందుకు ఈ నిర్లక్ష్యం ?

సమీర్ గురించి చదివాక శ్రీశ్రీ గారి కవితలు కొన్ని గుర్తోచ్చాయి...
ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం...
లేదు సుఖం, లేదు సుఖం
లేదు సుఖం జగత్తులో
బ్రతుకు వృధా, చదువు వృధా
కవిత వృధా!,వృధా,వృధా!
మనమంతా బానిసలం
గానుగులం, పీనుగులం
ఆలోచన, ఇంగితం ఉన్న మనుషులుగా పుట్టాక తినడానికి ముప్పూటలా తిండి, చుట్టూ అభిమానించే జనం,చేయడానికి శ్రమ సంపాదించుకోలేమా...? ఎందుకీ ద్వేషాలు, పౌరుషాలు, మోసాలు...

I realize that the world is more sinner and cynic than i thought it to be and I do believe that it has much more love and humanity to rescue this place from the tyranny and brutality of human oppression . But will we ever let it show up ?

9 వ్యాఖ్యలు.. :

Sravya V said...

చాల చక్క గా రాసారండి.నిజం గా ఆ పోస్టు చూసి నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు . ఇలా కామెంట్లు రాసి లిప్ సింపతి చూపించటం తప్ప ఏమి చేయలేకపోవటానికి నేను నిజం గా సిగ్గు పడుతున్నా !

వెంకట్ said...

@Nagarjuna,sravya

well i may sound too practical but this is what i believe in

మనలో ప్రతి ఒక్కరూ దేశాన్ని ఉద్దరించే నాయకులు కాలేరు అలాగే అందరూ మదర్ తెరెస్సా లాగా జీవితాలను సేవ కోసమే అంకితం చేయలేక పోవచ్చు అంత మాత్రాన బాధ పడవలసిన అవసరం లేదు మనం చేయగలిగిందల్లా పక్క మనిషిని మనిషిగా గౌరవించడం చేయగలిగినంత సాయం చేయడం.

..nagarjuna.. said...

@ శ్రావ్యగారు: నేనైతే ఏమి చేయలేని నా చేతకాని తలచుకొని అసహ్యించుకొంటున్నా... రోడ్లు విలాసాల వగైరాల సంగతి దేవుడెరుగు ముందు భయం లేకుండా బతకడానికి వీలుకల్పించండని అరవాలనుంది....

@వెంకట్ గారు : మీరు చెప్పింది అక్షరాల నిజం ప్రతిఒక్కరు నాయకులు కాలేరు, ప్రతి ఒక్కరు సేవకులు కాలేరు. మనం సాయం చేయగలం. కాని ఆ సాయం ఎప్పుడు చేస్తున్నాం? ఎవరైనా వీధిన పడ్డప్పుడు, ఆకలి అని ఎవరైనా అరచినపుడు. అలా కాకుండా సొంత ప్రాంతం నుండి పండిట్లు తరిమివేయబడకుండా ఉండటానికి ఎంత సహాయం చేస్తున్నాం, తరిమివేయబడిన వారు తిరిగి అక్కడకు వెళ్లడానికి ఎంత సహాయం చేస్తున్నాం..?

1954లో 15% జనాభాగా ఉన్నవారు ఇప్పుడు 2001లో 1% కు చేరుకున్నారంట.

ఈ పరిస్థిని మార్చగలం...కాని అంతకన్నా ముందు మన వైఫల్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఒప్పుకుందాం.

కొత్త పాళీ said...

well said.
మీరు కోట్ చెయ్యబోయినదేదో అర్ధం కాని లిపిలో కనిపిస్తున్నది

..nagarjuna.. said...

@కొత్తపాళి గారు: మీరంటున్నడి మూడో quote box గురించనుకుంటా..అది ఈనాడు ఈ-పేపర్‌లో వాడే ఫాంట్‌లో ఉంది. శ్రీశ్రీ గారి చేదుపాటలోని కొంతభాగమది. దాన్ని అలాగే కాపి చేసాను అందుకే కనిపించలేదేమో. ఇప్పుడు సవరించాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Nagarjuna gaaru,
I read the post in KrishnaPriya's blog. It was a very good post. I liked your post on this more than the actual post. It reinforces my hope when I see people like you who try to understand rather than just involving in emotional rhetoric.

..nagarjuna.. said...

@ weekend politician: Thank you for those kind and encouraging words.

VASU said...

madam your oosts are ineretings ps post more posts

..nagarjuna.. said...

@వసంత్: మీరు ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యను రాసారొ తెలియడంలేదు... :-/

ఒకవేళ కృష్ణప్రియగారికి చెప్పాలనుకోబోయి రాసినట్టైతే i'll put it across to her
ఒకవేళ నాకే వ్యాఖ్య రాసినట్టైతే.. :)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis