రావణ రాజనీతి- సినిమా చూసిన వారికే

గమనిక : ఒకవేళ మీరు గనక ‘రావణ్’ , ‘రాజ్‍నీతి’ సినిమాలు చూడకపోయినట్లైతే ఈ పోస్టు చూడనక్కరలేదు. మీకు ఉపయోగపడే సమీక్షలు చాలా దొరుకుతాయి. ఈ సినిమాలను చూడద్దనో చూడమనో ఇక్కడ చెప్పడంలేదు.
 *********************************************************************************

కత్రీనా సోనియా పాత్ర పోషిస్తుందట, నసిరుద్దిన్ షా, నానా పటేకర్, అజయ్ దేవ్‌గన్‌, రణ్‌బీర్ కపూర్ లాంటి స్టార్లలందరు ఉన్నారనగానే చాలా ఆత్రుత కలిగింది. ఇంటికేళ్లినప్పుడు ఎలాగైనా చూడాలనుకున్నా. తోడేవరు లేకపోవడంతో కాలేజిలో వచ్చిన పైరేటేడ్‌ వెర్షన్ చూసా. సినిమా మధ్యలోనే అనిపించింది, నటీనటుల కౌశలాన్ని సరిగా ఉపయోగించుకొలేదని.....పైగా చాలా చెత్తగా ఉపయోగించుకున్నారు. ఎంచుకున్న కథకు ట్విస్టులు, సస్పెన్స్‌లు అస్సలు అవసరంలేదు. screenplay, పాత్రల పరిచయ విషయాల్లో కాస్తంత బుర్ర పెట్టుంటే బాగుండేది. సినిమా మొదట్లో నసిరుద్దిన్‌ షా పాత్ర అసలు అవసరమే లేదు. అంత పెద్ద యాక్టింగ్‌ జీనియస్‌ను అనవసరంగా దిష్టిచుక్కలాగా వాడుకున్నారు.
తరువాత వచ్చే అజయ్‌ దేవగణ్‌ పాత్ర, ఆ పాత్ర పరిచయం ఇంకా చెత్త. అతనుండే ఆజాద్‌ నగర్‌ అనే స్లమ్‌ ఏరియాలొ అతను అక్కడి జనం మెచ్చిన లీడర్. ఆ లీడర్ రేంజ్ ఎంటో చెప్పలేదు. సినిమాలో చూస్తే అతనో కాలనీకో, వార్డుకో నాయకుడిలా చూపించారు సింపుల్‌గా చెప్పాలంటే గల్లి లీడర్‌లా.... కాసేపయ్యే సరికి అసెంబ్లీ ఎలక్షన్లు మొదలౌతాయి. మన హీరోగారు ఆ ఏరియా అసెంబ్లి టికెట్ కావాలంటాడు (అదీ ఆ ఆజాద్‌ నగర్ బాగు కోసం)...అదీ ఓ రాష్ట పార్టి కార్యాలయానికి నేరుగా వెళ్లి...‘ముఝె పార్టి టికెట్ చాహియే’. వెంటనే మనోజ్ బాజ్‌పాయ్ తన బాబాయ్ కొడుకుకి ప్రత్యర్ది దొరికాడని పొంగిపోయి ఉప్పొంగిపోయి  అతనికి పార్టి టికెట్, బలహీన వర్గాల విభాగనికి అధ్యక్ష పదవి ఇస్తానంటాడు. ఆ డవిలాగు విన్నాక కాసేపు నాకు అవి అసెంభ్లి ఎలక్షన్లు అని చెప్పాడో మున్సిపల్‌ వార్డు ఎలక్షన్లు అని చెప్పాడో అర్థంకాలేదు. పోనీ ఎదో విధంగా విలన్ గ్రూపులో చేరిపోయాడు అనుకున్నా.....అంతలోనే సడెన్‌గా ఈయనగారిలో విలన్ లక్షణాలు కనిపిస్తాయి. ఉన్నపళంగా జనంలోంచి వచ్చినోడికి రాక్షస బుద్దులు ఎక్కడినుంచొచ్చాయొ ఆలోచిస్తే మిగిలింది బొచ్చే.... ఈ పాత్ర కర్ణుడికి పోలిక అనుకుందామనుకున్నా భారతంలో ఎక్కడా కర్ణుడిని లీడర్‌లా చూపించింది లేదు. పార్దుడికి సరైన ప్రత్యర్ది దొరికాడని ధుర్యోధనుడు అక్కున చేర్చుకుంటాడు అదీ కర్ణుడి ప్రతిభ చూసిన తరువాత. ఇలా సినిమాలో చూపించినట్టు ఓ మంచి గల్లి నాయకుడు లెక్కా పత్రం లేకుండా పోటికి రావడం ఆ తరువాత చెడ్డవాడవడం---కామన్ సెన్సును కూడా మరచినట్లున్నారు.

సినిమాకి ఇంకో బొక్క సోనియా గాంధి పాత్ర ఉందంటూ చేసిన హడావిడి.  మార్కెటింగ్‌ గిమ్మిక్‌ తప్పిస్తే మరోటి కాదు. చివర్లో కత్రీనా ఓ రెండు క్షణాలు చీర కొంగును తలపైన పట్టుకొని ప్రజలకు అభివాదం చేస్తుంది దానికోసం సోనియా పేరుని వాడి నిరాశ పరిచారు. తెలుగులో వచ్చిన ‘లీడర్’ చూసాక రణ్‌బీర్ పాత్ర interestingగా అనిపించలేదు. నానా పాటేకర్ కూడా ‘లీడర్’లో కోటాను తలపిస్తాడు. కొద్దొగొప్పో ఈ సినిమాలో నచ్చిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి మనోజ్ బాజ్‌పాయ్, అర్జున్ రాంపాల్ పాత్రలు. అధికారం కోసం వెంపర్లాడే పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్, పెదనాన్న ఇచ్చిన అధికారం నిలబెట్టుకోవడానికి బలహీనతలున్నా ప్రయత్నించే పాత్రలో అర్జున్‌రాంపాల్ మెప్పించారు. మొదటి పావుగంట అవసరమే లేదు. రామాయణంలో పిడకల వేటన్నట్టు ఓ ఐటమ్ సాంగ్...#%^#^#*)(#
హరేకృష్ణ గారి బ్లాగులో  పియా మోరా పాట బాగుందన్నారు...సినిమాలో చిన్న చిన్న బిట్లుగా వినపడిందా పాట. బహుశా పైరేటెడ్ ప్రింట్ కాబట్టి కట్ అయిందనుకుంటా... ఆడియో సాంగ్ మాత్రం బావుంది.

 రావణ్ రిలీజ్ అయ్యాక  అందులో మణిత్నం సినిమా అనిపించదగ్గ అంశాలేవి లేవని ,ట్విస్టులు లేవని (నాకర్థం కానిది, రామాయణం లాంటి తెలిసిన కథలో ఎలాంటి ట్విస్టుల్ని ఎక్స్‌పెక్ట్ చేసారో ఈ రివ్యూ చేసిన వాళ్లు) , చూడ్డం దండగని చాలా రివ్యూలొచ్చాయి. మా తమ్ముడైతే ఏకంగా ఝండు బామ్ సేల్స్ పెంచాలనుకుంటే రావణ్ చూడొచ్చు అన్నాడు. అయినాసరే, ఎంతయినా మణిరత్నం సినిమా, చూసి తీరాలనుకున్నా. సినిమా సగం అయ్యేంతవరకు ‘రావణ్’  చేసిన కిడ్నాప్‌కు కారణం తెలియరాదు. అంతవరకు ఏవైనా కట్టిపడేసే ఎలిమెంట్స్ చెప్పుకోవాల్సి వస్తే అది కెమెరా వర్క్ మాత్రమే. కేరళ అందాలు చూపించడానికేమో అన్నట్లు ఉంది మొదటి భాగం. ద్వితీయార్థంలో నైనా ప్రియమణి పార్టు, క్లయిమాక్సులో డైలాగులో కొంచెం పట్టు ఉండబట్టి సరిపోయింది లేకపోతే మా తమ్ముడు అన్నట్లు ఘండు బామ్ సేల్స్ పెంచి ఉండేవాణ్ణి.
మణి రత్నం సినిమాలో తప్పులు చూపే సాహసం కాదు కాని సినిమాలో కొన్ని లోపించాయని చెప్పొచ్చు. ఫ్లాష్‌‍ బ్యాక్ పార్టులో తప్పితే ఎక్కడ నటుల మొహాల్లో ఎమోషన్స్ కనపడలేదు. పలికించాలనుకున్న భావాలన్ని వాళ్ల మొహాలకు అద్దిన రంగులను చూసి తెలుసుకోవాలి. ‘రావణ్’ మొహానికి సన్నివేశానికో రంగు అద్దారు కాసేపు సున్నం, కాసేపు పసుపు, కాసేపు బొగ్గు, కాసేపు మన్ను. ఐశ్వర్య చెట్టు మీద నుండి పడేప్పుడు ఒక స్లో మోషన్  ఫ్రేము, పడ్డాక నీళ్లల్లోంచి లేచేప్పుడు ఓ స్లో మోషన్ ఫ్రేము....వీటన్నిటిని అర్థం  చేసుకోవాలంటే చూసేది  భావుకులన్నా అయి ఉండాలి లేకపోతె ఫొటొగ్రఫి ఆస్వాదించే వారన్నా అయిఉండాలి.  మణి మ్యాజిక్ చూడాలనుకునే సగటూ ప్రేక్షకుడికి ఏమాత్రం అర్థం కాని ఎలిమెంట్స్ సినిమా టైములో సగానికి పైగా ఉంటాయి. రిలీజ్‌ ముందు ఇది రామాయణం బేస్ చేసుకొని తీస్తున్న సినిమా అని  చెప్పకపోయి ఉండనట్లైతే సినిమాను కనీసం ఓ పోయటిక్ ఎక్స్‌ప్రెషన్‌గా నైనా స్వీకరించేవాళ్లెమో. ఇపుడు అలాగే అనిపిస్తుంది నాకు  It's more  a poetic expression than a celluloid magic.

7 వ్యాఖ్యలు.. :

బ్లాగు బాబ్జీ said...
This comment has been removed by a blog administrator.
మనోహర్ చెనికల said...

బాగుంది మీ రివ్యూ, ఈ రెండింటికీ రెండు విడి టపాలు అవసరం లేదని ఒకే దాంట్లో పడేసారన్నమాట..

రావణ చూసాక ఎందుకు చూసానా అనిపించింది. బహుశా అభిషేక్ ఎక్స్‍ప్రెషన్స్ మీద నమ్మకం లేక మసి పూసినట్టున్నాడు మణిరత్నం.

..nagarjuna.. said...

@ మనోహర్ గారు :>>అభిషేక్ ఎక్స్‍ప్రెషన్స్ మీద నమ్మకం లేక మసి పూసినట్టున్నాడు మణిరత్నం.<< బాగా చెప్పారు :)

శ్రీ said...

విక్రం ఉన్నాడు కాబట్టి నాకు రావణ్ తమిళ్ బాగనే అనిపించింది.

రాజనీతికి అంత సీన్ లేదు.

చివరగా ఒక విన్నపం, పైరసీని ప్రోత్సహించవద్దండి.

Anonymous said...

baaga raasararu

ఆ.సౌమ్య said...

రాజనీతి నేను చూడలేదు కానీ, రావణ్ నాకు బాగానే ఉంది అనిపించింది. నేను తమిళ్ లో చూసాను. విక్రం నటన నాకు బాగా నచ్చింది. దీనికి రామాయణంతో ముడిపెట్టి ఉండకూదదు అంటూ నేనో టపా రాసాను, వీలైతే చూడండి

http://vivaha-bhojanambu.blogspot.com/2010/06/blog-post_21.html

..nagarjuna.. said...

@ శ్రీ గారు: చాలా రోజులైందండి మీ ‘కాలాస్త్రి’ని చూసి. మీరూ నా బ్లాగులొ వ్యాఖ్యానించినందుకు ఆనందంగావుంది.
పైరేటేడ్ సినిమాలంటారా... కొత్త సినిమా రిలీజ్ అయిన రొండొ రోజునే మా క్యాంపస్‌ DC++లో ఠపీమని దిగిపోతుంటాయి హి హి. బయటకెళ్ళి చూద్దామంటే ఇక్కడ థియేటర్లు అంత బాగోవు. తప్పక ఇలా కనిస్తున్నాము. ఇక్కడనుండి బయటపడ్డాక మీరు చెప్పినట్లే చేస్తా థియేటర్లో చూసిన అనుభూతి పైరేటేడ్ చూసినపుడు రాదుగా... :)

@ రెండో అజ్ఞాత: కృతజ్ఞతలు :)

@సౌమ్య గారు: మా తమ్ముడు అదే అన్నాడు అభిషేక్ కన్నా విక్రం బాగా చేసాడని. మా దగ్గర తెలుగు/తమిళ్ వెర్షన్ ఇంకా రాలేదు హింది మాత్రమే ఉంది కాబట్టి అది చూసేసా.
అసలు మీది, మహేష్ గారి పోస్టు టైటిళ్లు చూసాకె కదూ రావణ్ చూడాలని ఇంకా గట్టిగా అనుకున్నది. కాని ఆ పోస్టులు చదవలేదు. ఎందుకోమరి మొదట్నుంచి నేను ఓ కొత్త సినిమా చూడాలనుకుంటే దాని రివ్యూలు గట్రా చదవను. సినిమా కథ, సస్పెన్సు వగైరా ముందే తెలిసిపోతాయని...
సినిమా చూసాక చదివాను పోస్టులను...నాకూ అలాగే అనిపించింది. సినిమాను ‘రావణ్’ perspectiveలో తిసాడని.

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis