ఋతుపవనాలొచ్చేసాయ్...

ఎట్టకేలకు ప్రళయ భానుడి ప్రకోపాన్ని తగ్గించడానికన్నట్లు చల్లని గాలులని మోసుకుంటూ చిరుజల్లుల సమేతంగా ఋతుపవనాలొచ్చెసాయి మా హైదరాబాదుకి. తొలకరిజల్లుల తాకగానే నేలతల్లి పులకించిపోయి సువాసన సౌరభాలను వెదజల్లింది. ఆ పరిమళం అమోఘం.....


వంగదేశపు ఎండలు తట్టుకోలేక కొన్నిరోజులు ఇంటిదగ్గర గడుపుదామనివస్తే ఇక్కడ ఇంకా దారుణంగా ఉండింది పరిస్థితి. ఏ రోజుకూడా 42కి తగ్గిందిలేదు. ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండిపోదామనుకుంటే మాది గ్రౌండ్‌ఫ్లోర్‌ కట్టడం మాత్రమేనాయె. పగలు సూర్యారవుగారి ప్రత్యక్ష ఎండ బాదుడు, రాత్రుళ్లు పగలు పీల్చుకున్న సెగ వదులుడుతో ఇన్ని రోజులు దిమ్మతరిగిపోయింది. హమ్మయ్య...., చివరకు మేఘాలు తీపి కబురు మోసుకొచ్చాయి.  చిటపటమంటూ చినుకులు మొదలైనాయి.....ఆల్ హ్యాపీసు.

చినుకులు పడుతుంటే కాసేపు అలా తడుద్దామనుకున్నా. అట్లా చేస్తే మా ఇంట్లో వాళ్లు నన్ను ఉతికి ఆరేస్తారని ఆగిపోయా...హ్మ్...ఏం ఫరవాలేదు, నేను మా కాలేజికెల్లి అక్కడ వానలో enjoy చేస్తా. వర్షంలో క్రికేట్టాడాలని మహా కోరిక నాకు, ఇంతవరకు తీరలేదు. ఆ ముచ్చటకూడా తీర్చుకోవాలి. మీరు మాత్రం ఏమాత్రం అవకాశం కలిగినా వర్షంలో తడిసిపోండి.
అలాగని తుఫానువల్లో, అల్పపీడనంవల్లో కురిసే వర్షంలో తడిసేరు.....natural వర్షమైతేనే తడవండి.


ఋతుపవనాగమన శుభాకాంక్షలు
వేడివేడి పకోడీలు ప్రాప్తిరస్తు

2 వ్యాఖ్యలు.. :

సుజాత వేల్పూరి said...

అప్పుడేనా? ఆగండి!

రుతుపవనాలు ఎప్పుడూ ఇలాగే ఊరిస్తాయి..! వస్తున్నాయి అని ప్రకటిస్తారు. మళ్ళీ నాల్రోజులాగి "గమనం మార్చుకున్న రుతుపవనాలు..ఇప్పుడప్పుడే వానలు రావు"అని అనౌన్స్ చేస్తారు. అలా చెప్పిన మరుసటి రోజే వానొస్తుంది. ఇలా వెదర్ రిపోర్టులిచ్చేవాళ్లతో రుతుపవనాలు ప్రతి ఏడాదీ భలే ఆడుకుంటాయి.

..nagarjuna.. said...

@సుజాతగారు: నిజం చెప్పారు. వార్తల్లొ రెండ్రోజుల్లొ ఋతుపవనాలు కేరళను తాకుతాయి మన రాష్ట్రంలో ప్రవేశించడానికి ఇంకో నాలుగైదు రోజులు పడుతుంది అన్నారు. అది వచ్చిన రెండ్రోజులకే ఇక్కడ జల్లులు పడ్డాయ్.

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis