మాకి నచ్చట్లేదు హై......

అవును మాకి  హేమి నచ్చట్లేదు ఇది. అరే అసలే తల/బుర్ర సరిగా పనిచేయని,పనిచేసే వాళ్ల మధ్యన ఉంటున్నాం.., కొంచెం తెరిపి కోసం గోడును గాలికి చెబుదాం అని బయటకు (లోపలికి) బయలుదేరితే నాలా చెప్పుకోవడానికి ఆల్రెడి చేరుకున్నోళ్లు గంపెడు. ఒకరు హంసధ్వని రాగంలో పాడుతుంటే మరొకరు హింసధ్వని రాగంలో ఆలపిస్తుంటారు. నేనేమో ఏదో తెలియని నా రాగం అందుకొని గోడు వెళ్లగక్కుతాను. అరుపులు కేకలు మధ్యమధ్యలో వాటంతట అవే దూరుతాయి. ఈ గోడు అటుగాపోయే దారినపోయే సాటి గోడయ్యలకు/గోడమ్మలకు నచ్చితే ‘ఓహ్ అలానా సోదరా’ ,‘భేష్ భేష్’,‘నాదీ గోడు  నీదీ గోడు ఒకటే హై’,‘థూ నీ గోడు చెడ’ అని సవాలక్ష (అంత కాకపోవచ్చు ఓ సవావంద  ఉండొచ్చు ) చాక్లెట్లు, వాతలు ఇచ్చేస్తారు. ఈళ్లెవ్వర్రా అని తరచి చూస్తే అబ్బో....ఆనంధభైరవి,శంకరాభరణం ( ఎక్కువడగొద్దు నాకు తెలిసిన రాగాలు ఇవే) కలిపి గుండేలో....తుల్లోంచి మాట్లాడి ఆడిపాడేవారు కొందరు, ఎండలో మాడిపోతున్న జనాలకు గోడు కాకుండా గోళీషోడా ఇచ్చేవారు కొందరు (దండేసి దణ్ణం పెట్టాలీళ్లకు), అయ్యబాబోయ్ అసలీడేందుకు గోడుతన్నాడ్రా సామి అనుకుంనేంతగా తీవ్ర హింసధ్వని ఆలాపించేది ఇంకొందరు....

ఏదో ఒకటి.., షోడా బాబులు (దీనికి సమాంతర ఆడ స్త్రీ లేడి మహిళా పదం ?), రాగ-మేళకర్తలు ఉన్నారుగా అని సంతోషిస్తుంటాను. ఇది ఈళ్లకు నచ్చదేమో, అశ దోశ అప్పడం ఆలు అని జంపు జిలానీలుగా తయారైనారు. పోన్లే ఒకరిద్దరే అని ఊరుకుంటుంటే హమ్మా...రోజురోజుకీ ఈ జాగాలో జంపు జిలానీల బ్యాచ్ ఎక్కువైపోతుంది. చెప్పులు లేవని జంపు, ఇళ్లు మారానని జంపు, మొలకలు వచ్చాయని జంపు, చెట్టు విరిగిందని జంపు....టూ మచ్ టూటూ మచ్. అందుకే అసల అస్సలు నచ్చట్లేదు

అప్పుడేపుడొ ఆ గోళీషోడాలమ్మే ఆయన జంపన్నాడు, కొద్దిరోజులకు ఆయన బెదరు కూడా పత్తాలేకుండా పోయాడు. వేరే షోడా బాబులు (మళ్ళి తెలుస్తలేదు, దీనికి సమాంతర ఆడ స్త్రీ లేడి మహిళా పదం) ఉన్నారు, వస్తున్నారు కాని ఎంతైనా old is gold కదా.... ఈ షోడా సంగతి పక్కన పెడితే మొన్నీమధ్య మంచిగోడులు చెప్పేటాయన ఓసారి నేనూ కూడా జంపోచ్  అని  దాదాపు చాపచుట్టేసేంత పని చేసాడు ఇదేమిటయ్యా మగడా ఏమైనా పద్దతిగా ఉందా నీకు అనేసరికి  కాదు కాదు టెంపరవరీ మౌనవ్రతం అని గమ్మునుండిపోయాడు. కబుర్లు చెప్పే కబుర్లమ్మ చెప్పా పెట్టకండానే వెళ్ళిపోయింది. అపుడు అసలేంత ఫీలయ్యానో వీళ్ళకేం తెలుసు యువరానర్ అధ్యక్ష్యా!!.   ఆ తరువాత లాజిక్కులు, మ్యాజిక్కులు అడిగే ఓ ఆసామి అల్‌విదా అల్‌విదా అని పాట పాడేసి సినిమాలో జ్యొతిలక్ష్మిలా కనిపించి కనపడాకుండా వినిపించి వినపడకుండా తిరుగుతున్నాడు భూతంలాగా(ఈ మాట ఎవరైనా పుసుక్కునెళ్ళి ఆయనకు చెప్పేరు బాబ్బాబు అక్కఅమ్మలు ఆ పని చేయకండి. చెప్పాక గోడడానికి నేను, నేను గోడిన గోడులు రెండు మిగలవు,.ఆయనకో బ్యాచ్ టైపులో జనం ఉన్నారు మరి)...యే డైరెక్టుగానే రావచ్చుగా ఉహూ రారు.... ఊకనే మొండి చేస్తున్నారు నాకు తెలుసు.

ఇపుడు కొత్తగా, జస్ట్ టూ డేస్ బాక్,  బెమ్మాండంగా పాడతారు అని పిలవబడే ఇంకొకరు యెళ్ళిపోయారంటా..నేనైతే ఆ సదరు పాటలు వినలేదు కాని ఎంతైన పాపులర్ పర్సనాలిటీ అంటే పాటలు బానే పాడతారనడంలో నిజం ఉండే ఉంటుంది కాబట్టి జంపు జంపే....చాప చుట్టేస్తానంటే  వాతలు పడతాయనేమో కొత్త పథకం కింద లాంగ్‌లీవులు పెట్టేస్తున్నారు ఉద్యోగులు. అఫ్‌కోర్స్ ఇంకా అమృతధ్వని రాగంలో గోడేవాళ్లున్నారు కాని ఈళ్ళంతా ఇలా వరసపెట్టి జంపేస్తుంటే ఇక్కడ మాగతేంగాను మంచోళ్లందరూ మైనారిటీలో పడిపోతే జోగిజోగి కలిసి బూడిద రాల్చవూఊఊ...దీనికి సమాధానం చెప్పాల్సిందే అని బల్లగుద్ది, అవసరమైతే పక్కవాడి గుండుగిద్ది అడుగుతున్నా ఆనర్ అద్దేచ్చా...

అందుకే ఈ యవ్వారం నాకి హేమి నచ్చట్లేదు హై...మీకీ కూడా నచ్చట్లేదు హై అయితే రండి, ఇక్కడ ఆ గోడు కక్కి, అరుపులు కేకలు పెడదాం

******************************************************************
పోస్ట్‌లో ప్రస్తావించిన బ్లాగరులు, వారి అభిమానులు నేను ఏమైనా దెప్పిపోడిచే విధంగా మాట్లాడాను అని భావిస్తే క్షంతవ్యుడిని. అది నా అభిమతంకాదు. బ్లాగును విరమించడానికి వారి సొంత కారణాలు వారికున్నాయని చెప్పారు. ఎటొచ్చి ఇంతమంది తెలిసిన బ్లాగ్మిత్రులు వారి బ్లాగులు ఇకపై కనపడరు అనే తలపు  పట్టలేక రాసినది, ఇంకెటువంటి భావనా లేదు.    
I wish all of them  good luck in their endeavors and hope they will get back to blogging again soon

17 వ్యాఖ్యలు.. :

..nagarjuna.. said...

అవునూ ’బాబు’కు సమాంతర స్త్రీలిం పదం ’అమ్మా’, ’తల్లి’...ఇవి నాకు పోస్టు రాసేప్పుడు ఎందుకు తట్టలేదూ...? అది సరే పోస్టు రాసిన తరువాత ఓ 150 యునీక్ విజిట్లు అయ్యాయి...చదివిన బ్లాగర్లు ఒక్కరూ చెప్పలేదేంటి.నాకు, మీకు ఇది ఇంకో మిలియన్ డాలర్ ప్రశ్న..,మీకేమైనా తెలుసా...?

నేను said...

కరక్టే "కబుర్లమ్మ" కనీసం బై అని కూడా చెప్పలేదు :(,
ఈమధ్య క్రిష్ణప్రియగారు కబుర్లమ్మని రీప్లేస్ చెస్తున్నారు.

"అయస్కాంతం.....ఆకర్ష ఆకర్ష"(http://ayaskantam.blogspot.com/) కూడా మిస్సింగ్. ఈయన కూడా పెళ్ళి చేసుకున్నాడనుకుంటా.

..nagarjuna.. said...

అయస్కాంతం గారి బ్లాగు ఎక్కువగా చూడలేదండి...ఓ రెండు పోస్టులవరకు చూసుంటానేమో..

హరే కృష్ణ said...

బావుంది :)
మాకూ నచ్చట్లేదు హై!

..nagarjuna.. said...

హమ్మయ్య ఓ ఇద్దరినైనా పోగేసాను...చాలు. వీలు చూసుకొని అరవడం మొదలెడదాం, ఏమంటారు బద్రిజీ, కృష్ణాజీ

శ్రీనివాస్ said...

=))

ఆ.సౌమ్య said...

మాకీ నచ్చట్లేదు హై.

గోళీసోడా బాబు జంప్ అయిపోవడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.

ఇంతకీ కబుర్లమ్మ ఎవరో తెలిసింది కాదు నాకు.
............

భలే రాసారాండి పోస్టు...మంచి ఐడియా, బాగుంది.

నేస్తం said...

నాక్కూడా కబుర్లమ్మ ఎవరో తెలియలా

..nagarjuna.. said...

శ్రీనివాస్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు :)

@ నేస్తం, సౌమ్య గారు: పూర్తి పేరు తెలియదుగాని కబుర్లమ్మంటే లక్ష్మీ గారు...బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో పేపర్‌లో చూసి లక్ష్మిగారి బ్లాగు చదవడం మొదలుపెట్టా..చాలా బాగా రాసేవారు ఆమె రాసిన ఆఖరి పోస్టు ’ఉప్మాయణం’. చెప్పకుండానే బ్లాగు మూసేసి వెళ్లిపోయారు ప్చ్.... :(

krishna said...

మంచి మంచి బ్లాగులు మిస్సయ్యిపోతే ఇలా.. కష్టమే! నేను అయస్కాంతం.. ఆకర్ష..ఆకర్ష బ్లాగుని చాలా ఇష్టపడ్డాను, కానీ అదేమిటో నేను బ్లాగింగు కి వచ్చాక ఒక పోస్టు కూడా లేదు ఆయన దగ్గర నుండి!ప్చ్..

వేణూశ్రీకాంత్ said...

అవునవును మాకీ భీ నచ్చట్లేదు హై :-P :-D

..nagarjuna.. said...

@ కృష్ణ, వేణూగారు : మీకు పోస్టు నచ్చినందుకు :)

స్పందించడానికి ఆలస్యమైనందుకు మన్నించగలరు

..nagarjuna.. said...

ఐబాబోయ్ ఇదేటిది..!! నేను ఎవరి గురించైతే నచ్చట్లేదు అని రాసానో ఆయనే వచ్చి :P అని పెట్టేసెళ్లిపోతే మహదానంద పడిపోయానేటి....

శ్రీకాంత్‍ భాయ్.., ఇలాక్కాదుగాని బ్లాగు రాయడం మళ్ళి ఎపుడు మొదలెడతావో చెప్పుముందు లేకపోతే నీకు బోల్డు :P
:)

నాగప్రసాద్ said...

=)) :))

..nagarjuna.. said...

@నాగా: నా బ్లాగుకి శానాదినాల తర్వాత విచ్చేసినందుకు పునఃస్వాగతం నాగా...మరి ఆ కిందపడిపోయి తెగనవ్వేసుకోడానికి అర్థమేమీటొ చెప్పవా తిరుమలేశా!!

నాగప్రసాద్ said...

నాగార్జున: ఏమీ లేదు.వికటకవి నవ్వుతున్నాడు కదా అని నేను కూడా నవ్వుతున్నా. అంతే. :))

..nagarjuna.. said...

నాగా:రాసింది ఆయన గురించికాదు గనక నవ్వాడంటే అర్థముంది..మరినేవెందుకు నవ్వితివి చెప్పుడి

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis