సెంచరీ కొట్టాన్రోయ్!!!

యస్‌ సెంచరీ...ఈ సంగతి ఇంత మధురంగా, ఆనందంగా ఉంటుందని అనుకోలెదు. కాని ఇప్పుడు సచిన్‌ ప్లేస్‌లో నేనే ఉండి 200 కొట్టినట్లు, బ్లాగ్‌కు వందలు వందలు కామెంట్ల వచ్చినంత ఆనందం......

సంగతేందంటే  నేను ఇంగ్లీష్‌లో కూడా ఓ బ్లాగు రాస్తన్నా THE ROAD అని‌‍ కాకపోతే అక్కడ అమావాస్యకోసారి పున్నమికోసారి కాకుండా ఏకంగా గ్రహణానికోసారి రాస్తున్నా....పైగా పబ్లిసిటి లేకపోవడమూ, మన రాతలు అంత సూపరేమికాదు కాబట్టి అది దగ్గుతూ ములుగుతూ బ్రతుకుతుంది. అలా ఓ ఏడాది కాలంనుండి వారానికో హిట్టు అన్నట్టు ఉంది దాని పరిస్థితి. మొన్నోసారి ఎందుకో అలా దాని statistics ఎలా ఉన్నాయేమిటని చూస్తే 98 Unique Visitors అని చూపెట్టింది......అహా ఏమి భాగ్యమూ ఏమి అదృష్టమూ అని పొంగిపోయి ఎప్పుడెపుడు వంద చేరుకుంటుందా అని గోతికాడ నక్కలా ఉండిపోయా. ప్రతి అయిదు నిముషాలకోసారి ఆ stats ఓపెన్ చేయడం వంద చేరిందాలేదా అని  చూడటం...ఇలా చేసాన కొన్ని రోజులు. తరువాత నా లక్కు తాటిచెట్టంత హైటెక్కి మాకు కాలేజిలో అతివీర భయంకర Grand Viva ఘట్టం జరగడం, ఆ తరువాత మా జూనియర్లకు ఫ్రేషర్స్‌ ఇవ్వడం కొసం తిరగడం (అవకాశం  వచ్చింది కాబట్టి  చెప్తున్నా మా జూనియర్లు మాత్రం రచ్చ, కేక, మెరుపు, బంగారం....చాలా బాగా చేసుకున్నాం ఫ్రెషర్స్‌ ) జరిగి ఈ stats గోల పట్టించుకోలేదు.
ఇవాళ పొద్దున్న చూస్తే 102 అని చుపెట్టింది.......అలా ఆకాశం, ఆనందం అంచుల దాకా వెళ్ళొచ్చా.


ఈ కొన్ని రోజులూ బ్లాగ్లోకంలో చాలా పోస్టులు పడ్డాయి అవన్నీ తీరిగ్గా చదివి కామెంటాలిప్పుడు....

20 వ్యాఖ్యలు.. :

శిశిర said...

హ్హహ్హహ్హా.. నా బ్లాగులాగే ఉందే మీ (ఇంగ్లీషు) బ్లాగు. సెంచరి మీద రెండు కొట్టిన సందర్భంగా శుభాకాంక్షలు.

nagarjuna said...

థాంకులు శిశిరగారు....,మీ బ్లాగుకేంటండి బాబు కనీసం నెలకోసారైనా రాస్తున్నారు, రచన శైలికూడా బావుంది. నాకు శుభాకాంక్షలు చెప్పారుగా, మీకు అర్జంటుగా ఓ 2000 హిట్లు రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నా :)

మాలా కుమార్ said...

congrates

nagarjuna said...

మాలాగారు- Thank You :)

Sai Praveen said...

అదిరిందయ్యా నాగార్జునా,
నీ బ్లాగులో హిట్ల గురించి రాసుకున్నావు, నా ఆంగ్ల బ్లాగయితే అసలు పోస్ట్లే లేక వేల వేల బోతోంది :))
నీ విజయానికి అభినందనలు :)

శ్రీ said...

బ్లాగాభినందనలు!

చిలమకూరు విజయమోహన్ said...

అభినందనలు.

sunita said...

congrates.

3g said...

Congrats.........

చెప్పాలంటే.... said...

అభినందనలు.

హరే కృష్ణ said...

hearty congratulations buddy !

వేణూ శ్రీకాంత్ said...

హ హ కంగ్రాట్స్ :)

nagarjuna said...

@సాయి ప్రవీణ్‌: ధన్యవాదములు అ.తె యువ మిత్రమా :)

ఇకనైననూ టపాలు మొదలుపెట్టుము తదుపరి కార్యక్రమము మేము చూసుకొందుము

@శ్రీ, విజయమోహన్‌,సునిత,3g,చెప్పాలంటే,హరేకృష్ణ, వేణుశ్రీకాంత్ : Many many thanks అండి, బ్లాగ్కృతజ్ఞలు :)

రాధిక(నాని ) said...
This comment has been removed by a blog administrator.
రాధిక(నాని ) said...

అబినందనలు నాగార్జున గారు.

nagarjuna said...

@రాధిక అక్క: ఇది మరీ బాగుంది. అక్కడేమో తమ్ముడు అని ఇక్కడేమో గారు అనడమేంటొ. నేను ఈ ద్వంద వైఖరిని, Hypocrisy ని ఖండిస్తున్నా అద్దేచ్చా..

మనసు పలికే said...

నాగార్జున.. నన్ను క్షమించేసెయ్యవా ప్లీజ్.. ఇంత లేట్ గా నీకు వ్యాఖ్య పెడుతున్నందుకు..:( ఎలా మిస్ అయ్యనబ్బా..?
మొత్తానికి సెంచరీ కొట్టేసినందుకు అభినందనలు..:)

మనసు పలికే said...

నాగార్జున.. అక్కడ హరే కృష్ణ బ్లాగులో 100 పూర్తి చేద్దామని చెప్పి ఇలా ఒక్క కామెంట్ కూడా పెట్టవేంటి..?

nagarjuna said...

@అపర్ణ: హ్మ్...మన్నింపా అదియేల ? మాకు తెలుసును మీ సాఫ్ట్‌వేర్‌ పాట్లు కనుక ఫరవలేదు :) అభినందనలకు :)
ఇహ, వాడిన బాల్‌తో సెంచరీ కొడితే గొప్పేముంది. ఎటూ హరేకృష్ణ మాం......చి బౌలర్ కదా, కొత్త పోస్టుతో రాని అప్పుడు చూపిద్దాం బ్యాటింగ్ ప్రతాపం

మనసు పలికే said...

అంతే అంటావా నాగార్జున..:) అయితే ఇప్పుడు మనం కృష్ణ ఇంకో టపా రాసేంత వరకూ వేచి చూడాల్సిందేనా.?

ShareThis