చెత్త పోస్టు, సుత్తి పోస్టు - పని లేకపోతేనే చదవండి

మళ్ళి చెబుతున్నా.... రివ్యూనో, పక్కవాడిలో గమనించిన విషయాలో చెప్పను. పూర్తిగా చెత్తపోస్టు ఇది. టైం బ్యాడ్‌గా ఉంది అనుకుంటేనే చదవండి.....

చదువుదామంటే...
--కామెడి పోస్టులు నవ్వు తెప్పించడంలేదు, [ తోటరాముడి బ్లాగు కూడా నవ్వించలేక పోయింది ]
--సీరియస్ పోస్టులు బాధను/సానుభూతి భావనను కలిగించడంలేదు.
--కెలుకుడు  పోస్టులు ఆసక్తి కలిగించడంలేదు.
something is terribly wrong with me, i guess.

ఈ-మెయిలు చెక్ చేస్తూ ఓ ఫ్రెండ్ పంపించిన మెయిల్ చూసా...

ఓ చిన్నపాప [మూడు వారాల వయసు ఉండొచ్చు] ఫొటో, ఆ పాపకు ఏదో భయంకరమైన జబ్బంట, పాప తల్లిదండ్రుల దగ్గర డబ్బుల్లేవంట. ఈ సమయంలో ఓ తొక్కలో ఈ-మెయిల్ కంపెనీగాడు పాప ఫొటోతో ఉన్న మెయిల్ ను ఎంతమంది ఎన్నిసార్లు ఇతరులకు చేరవేస్తారో అన్ని రూపాయలు/సెంట్లు/యెన్‌లు, నా బొంద, ఆ పాప తల్లిదండ్రులకు ఇస్తారంట. ప్లీ..........జ్ మీకు హృదయం అనేది ఏడిస్తే ఫార్వర్డ్ చేయండి అని రాసుంది.
చదవంగానే మెయిలు పంపించిన ఫ్రెండును గూబమీద ఒక్కటి పీకాలనిపించింది. ఈ దరిద్రపు ప్రపంచంలో ఈ-మెయిలు ఇంకొకళ్లకు పంపించినదానికే డబ్బులిచ్చే తలకుమాసిన వెధవెవడైనా ఉంటాడా......ఇట్టాంటి మెసేజీలు వేరేవాళ్లకు పంపించేపుడు కాసేపైనా ఆలొచించొచ్చుగా.......ఊహూ అక్కడకు ఈళ్లొక్కల్లే హృదయం ద్రవించిపోయిన మనుషులు. ఏవన్నా అంటేనేమో 'ఏమో, నిజంగానే పాపకు జబ్బు తగ్గడానికి డబ్బులు ఇస్తారేమోననే ఆశ/నమ్మకం' అంటారు.  To hell with your sentiments అని అరవాలనిపిస్తుంది. చేతకాక....చేయలేక ఇవి అబద్దం అని చెప్పే అంతర్జాల లింకు ఒకటి పంపించినోడి మొహం మీద పడేస్తాను.

ఈ పోస్టును ఇంకా ఎవరైనా చదువుతుంటే వాళ్లకు ఒక విజ్ఞప్తి....
అమ్మలారా/అయ్యలారా... మీరు ఈ-మెయిల్లు ఫార్వార్డ్ చేసినంత మాత్రాన ఎవడూ ఎవడికి డబ్బులియ్యరు. తలకుమాసిన సన్నాసులు కొందరు మానవ సహజమైన భావోద్వేగాలతో అడుకునే పరమచెత్త చేష్ట అది. మీకు అలాంటివి తగిలినపుడు హృదయం ద్రవించిపోయి వేరేవాళ్లకు పంపిస్తే ఆ వికృత పాచికలో మీరు భాగస్వాములు అయినట్టే.

ప్రస్తుతం నేనుకూడా అలాంటి పనే చేసాను. నాకు ఎటూ పాలుపోక మీ సమయాన్ని వృధా చేయడానికి ఈ పొస్టు రాసాను . చూడబోతే psycho లక్షణాలు ఎక్కువౌతున్నాయి ఏంటో లేకపోతే హిట్స్ పెంచుకోవడానికి తప్ప ఉపయోగపడిని నా ఈ పోస్టెందుకో.... . పాఠకులకు వీలైతే మన్నించండి లేకపోతే మీ భావావేశాలను వెళ్లగక్కండి....కామెంటు బాక్సు మీకోసమే పడుంది

17 వ్యాఖ్యలు.. :

Indian Minerva said...

ఈ మధ్యే ఈ mail reply-all లో ఫార్వార్డ్ చేసినందుకు ఎవరికో గట్టిగా ఇచ్చుకున్నాను.

Unknown said...

ఏమయ్యింది అంతలాగా రియాక్ట్ అయిపోయావ్ ..

నువ్వు గొంతు చిన్చుకోడం వల్ల ఎవ్వడు మారడు ..కదా ..

కూల్ బాబు కూల్ .. సరేనా ..

Sravya V said...

రవి గారు బాగా చిరాకు వచ్చినట్లుంది మీకు :)
మీ చిరాకు చూపిస్తే , మానవత్వం లేని materilist గ్రూప్ లో కలిపేస్తారు జాగ్రత్త .
ఇప్పుడు ఈ కామెంట్ చూసి పని పాట లేకుండా కామెంట్ రాయటం ఎందుకు తిట్టకండి :D

ప్రవీణ said...

మీరు చిరాకులో కూడా భలే పోస్ట్ రాసారండి.. మీ చిరాకుకు సానుభూతి తెలుపుతూ నా చిరాకును కూడా ఆడ్ చేస్తున్నా..

ఆ.సౌమ్య said...

ఇలాంటివి ఒకటి రెండూ కాదు. ఒక మైల్ - భర్త కి కేన్సరో వల్లకాడో, చేతిలో చిల్లిగవ్వ లేదు, సహాయం చెయ్యండి అని - నాకు తెలిసి ఓ 150-200 సార్లు నాకు ఈ మైల్ వచ్చుంటుంది, ఎంత చిరాకేస్తుందో.

ఇంకో రకం ఉన్నాయి. దేవుడి ఫొటోలు, మంత్రాలు పంపించి ఓ 100 మందికి పంపండి. పంపితే మేజిక్ జరుగుతుంది, లేకపొతే మీరు సర్వనాశనం అయిపోతారు అని వస్తాయి మైల్స్...ఏ పుట్టలో ఏపాముందో అని జనాలు address book లో ఉన్నవాళ్లందరికీ fwd చేసెస్తారు..చిర్రెత్తుకొస్తుంది ఇలాంటివి చూస్తే. భగవంతుడు ఇలాంటి మైల్స్ కి బద్ధుడు కాడు అని వాళ్ళకు తెలీదూ?...మరీ ఇంత మూఢ నమ్మకాలా అనిపిస్తుంటుంది.

Anonymous said...

అప్పుడప్పుడూ జీవితంలో అట్లాకూడా జరుగుతూంటుంది బాస్. లైట్ తీస్కోడమే!

Sravya V said...

ఓహ్ నాగార్జున ఈ బ్లాగ్ మీది కదా , రవి గారి బ్లాగు అనుకున్నాను :D

..nagarjuna.. said...

మినర్వా గారుః తప్పదండి అప్పుడప్పుడు అలా ఇచ్చుకోవాలి, లేకపోతె మట వినరు...
కావ్యః పిచ్చి పీక్ స్టేజిలోకి వెళ్ళింది.... :|
ప్రవీణగారు: మీరు చిరాకు పడ్డారా...., హ్మ్, టైటిల్ జస్టిఫికేషన్ బాగా చేసానన్నమాట.
సౌమ్యాజీః మీ వ్యాఖ్యలో రెండో పేరా గురించి మాట్లాడను కాక మాట్లాడను. అలా చేసి మూతి కాల్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయ్. పైగా మెదటి క్యాటగిరి వాళ్లకు సమాధానం చెప్పడమంత సులువుకాదు వీళ్లకు వివరించడం.

శ్రావ్యాజీ: బ్లాగులోకంలో Identity crisis నాకు ఎపుడో మొదలైంది లెండి. మీరు 'రవి గారు బాగా చిరాకు వచ్చినట్లుంది....' అంటే Indian Minerva గారి అసలు పేరు రవి అనుకున్నా :|

అజ్ఞాత: లైట్ తీసుకున్నాను కాబట్టే ఇక్కడ రాసాను బాస్, అదే ఆర్కుట్ లోనో, ఫేస్‌బుక్ లోనో రాసుంటే ' రాత్రి తాగింది దిగలేదా?' అనో , 'తిక్కకుదిరింది రా నీకు' అనో ఇంకా ఏవేవో అంటారు జనాలు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

పనీ పాడు లేని వాడనైనా కొంచెం లేట్ ఆలస్యంగా చూశాను ఈ మీ పోస్టు. పనీ పాడు లేని వాళ్ళు పంపుతారు అలాంటి మైలులు. పని పాడు లేనప్పుడు మళ్ళీ మీరు, ఆ పంపిన వారికి మైల్ చెయ్యండి మీ ఈ పోస్టు.

మీ చిరాకు కి నా మద్దత్తు.

..nagarjuna.. said...

>>ఆ పంపిన వారికి మైల్ చెయ్యండి మీ ఈ పోస్టు.

అద్భుతంగా సెలవిచ్చారు గురూజీ.., ప్రతీకారమే పరమపదసోపానం అని వర్మ ఎందుకన్నాడో ఇప్పుడు తెలుస్తుంది :)

Ravitheja said...

ప్రతీకారమే పరమపదసోపానం అని వర్మ ఎందుకన్నాడో ఇప్పుడు తెలుస్తుంది
-----------------


:)

Anonymous said...

:)

Ennela said...

నాకు తెలిసున్న ఒకావిడ కమ్మ్యూనిటీ సెంటర్ లో పని చేస్తారు...మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని మెయిల్స్ పంపుతారో...చాలా సార్లు "నేను చదువుతో చాలా బిజీ అండీ, నాకు జంక్ మెయిల్స్ కొన్ని రోజులు పంపొద్దు " అని చెప్పా కూడా...డిలీట్ బటన్ కనిపెట్టిన వారికి కృతజ్ఞతలు...

..nagarjuna.. said...

బ్లాగులకు పునః స్వాగతం ఎన్నెలగారు :)

>>డిలీట్ బటన్ కనిపెట్టిన వారికి కృతజ్ఞతలు...
ఈ లెఖ్ఖన (నా) బ్లాగు పోస్టులకు డిలీట్ బటన్ లేకపోవడంతో మనం (మీరందరు) ఎంత ఇబ్బంది పడుతున్నామో (పడుతున్నారో) !

Ennela said...

నాగార్జున గారూ,
మనం మాట్లాడుకుంటున్నది జంక్ మెయిల్స్ గురించి అనుకున్నా...బ్లాగ్ ల గురించా??????

..nagarjuna.. said...

మాట్లాడుతుంది జంక్ మెయిల్స్ గురించే ఎన్నెలగారు కాకపోతే మీ కవిత్వానికి నా పైత్యం కొంత రంగరించి బ్లాగులకు కూడా అన్వయించేసాను :D

శిశిర said...

ఏమైపోయారండీ? బ్లాగులు చదవలేక అజ్ఞాతవాసమా?

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis