wordpress బ్లాగులు- నా తిప్పలు

బ్లాగులు రాసుకోడానికి గూగుల్ బ్లాగర్ ఒక్కటే ఉంటే సరిపోయేది నాకు తిప్పలు తప్పేవి.
మంచి పోస్టు ఒకటి చదివాక వ్యాఖ్యానించకుండా వుండలేము, అలా చేద్దామని బయలుదేరే ఇప్పుడు wordpress blogలో వీలుకాక తలపట్టుకుంటున్నా wordpress వాడేమైనా నన్ను కామెంట్లు రాయకుండా బహిష్కరించాడేమోనని!!


నా ఈ తిప్పలకి ఆరంభం అబ్రకదబ్ర గారి బ్లాగ్‌తో పరిచయమయింది. నచ్చిన పోస్టులకి comments వేద్దామని బయల్దేరతాన్నేను wordpressవాడు తాపిగా ‘ పేరు’, ‘ఈ-ఉత్తరం’ బ్రాకెట్లో ‘అవసరం’ అంటాడు. సరే ఆ తంతు ఏదో కానిచ్చి కామెంటు రాసి సమర్పయామి అనేస్తా. అంతే ఆ వ్యాఖ్య ఎటువెళ్లిందో, దాని గతి ఏమయిందో ఏది అంతుపట్టదు.అది అచ్చయిందేమొనని నే ఎదురుచూస్తా, ప్చ్ అవదు. గూగుల్‌ బ్లాగుల్లో అయితే ఎంచక్కా ‘ your comment is pending for approval ’ అనో, ‘ your comment is rejected ’ అనో, ‘ నువ్వు కామెంట్లు రాస్తున్నావేంట్రా వెధవ, రచయిత చెప్పింది ఏదో అర్థమయినట్లు ’ అనో (వాడు అన్కపోయినా లోపలనుండి బ్లాగారాం గాడు అంటాడులెండి అప్పుడప్పుడు) వస్తుంది. ఏది ఆ  wordpressలో ఇట్టాంటిది కనపడి చావదే.  ఆ బ్లాగులో కొన్ని పోస్టులతో   ఇలాంటి అనుభవమయ్యాక అబ్రకదబ్రగారు IP adress discrimination  చేస్తున్నారని అపార్థం చేసుకొని అక్కడ కామెంటడం మానేసా. అప్పటికి నాకు తెలిసిన  wordpress బ్లాగు అదొక్కటే, దాంతో వేరే బ్లాగులని అపార్దం చేసుకోలేకపోయా.

ఈ మద్య రీసెంట్‌గా కట్టావిజయ్ గారి బ్లాగ్‌లో ఇలాంటి అనుభవమే మళ్ళి ఎదురైంది, ఒహో ఈయనగారు కూడా వివక్ష చూపిస్తున్నారా అనుకున్నాను. వేరే wordpress బ్లాగులో నేను చేసిన వ్యాఖ్య అచ్చవడంతో నా అపార్దం binani + nagarjuna (నా కంపెని కాదులెండి) + ultratech+ ACC cements  తో కట్టిన బిల్డింగ్‌ అంత స్ట్రాంగ్‌ అయి కూర్చుంది.

జస్ట్ 2 hrs బ్యాక్, మన పిల్లకాకి  ఉరఫ్ కృష్ణ  బ్లాగులో వచ్చిన పోస్టు తెగ liking  అయ్యి కామెంటుదామని బయల్దేరా... ఉహూ ఎంతకి అయిచావదే!!! గూగుల్ అకౌంటుతో అవకపోవడంతో దాన్ని మార్చి ఈసారి wordpress account ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని ఉపయోగించి చాకిరేవులో ప్రయత్నించా.....damn it అదీ పనిచేయలా. అన్ని అనుభవాలు  ఒక్కొక్కటే  గుర్తుతెచ్చుకొని ఇందులో బ్లాగర్ల తప్పులేదని, "హేవిటి ఇన్ని రోజులు సాటి తెలుగు బ్లాగర్లనా అనుమానించింద"ని NTR స్టయిల్లో వాపోయి దీనంతటికి wordpress వివిక్షపూరిత చర్యలే కారణమని నిర్దారించేసుకున్నా మా హాస్ట్లల్ వెనక ఇప్పుడు ఇంత అర్థరాత్రి ఎవడొ వెధవ నిద్రాభంగం కలిగేంతగా వాయిస్తున్న డప్పుల మోత సాక్షిగా.

కాబట్టి సాటి గూగుల్ బ్లాగర్లకు నా విన్నపం ఏంటంటే మనకు సహకరించని ఈ వర్డ్‌ప్రెస్‌ బ్లాగులకు మనమూ సహకరిమ్చవద్దు.  "షొయాబ్ నాకు మోకాళ్ల పైన నుంచొని సారి" చెప్పాలన్న ఆయేషా అన్నట్టు వర్డ్‌ప్రెస్ యాజమాన్యంకూడా చెప్పెంతవరకు మనం వెనక్కు తగ్గొద్దు, నష్టపరిహారం లాంటిది ఇస్తే మరీ మంచిది...(నాతో సహకరించినందుకు మీక్కూడా కొంత ఇస్తానులెండి నేను మంచివాడిని కదా!!!). దీనికి wordpress బ్లాగర్లు కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్బంగా కోరుకుంటున్నా.....వీలుని బట్టి మా గూగుల్ బ్లాగర్లకు పంచినతరువాత మిమ్మల్ని కుడా తగురీతిలో..____ అది.

కాబట్టి మై కామ్రేడ్స్
విప్లవం....  (ఈ silence ఏంటో)
విప్లవం..., జిందాబాద్ అనండయ్యా..
విప్లవం.... ఆ వినపడుతుంది చిన్నగా సన్నగా జిందాబాద్ అని

16 వ్యాఖ్యలు.. :

Anil Dasari said...

మీ కామెంట్స్ ఎందుకోగానీ spam లోకి వెళ్లిపోయాయి. మీ టపా చదివాక గమనించానా విషయం. ఇప్పుడు de-spam చేశాను.

నిజానికి బ్లాగర్‌కన్నా వర్డ్‌ప్రెస్ బాగుంటుంది - maintenance విషయంగా. ప్రయత్నించి చూడండి.

Anonymous said...

ఏడాది నుండి వ్రాస్తున్నాను.ఇప్పటికి 300 వ్రాశాను.ఇప్పటిదాకా ఎలాటి కంప్లైంటూ లేదు.నాకైతే బ్లాగర్.కాం కంటె వర్డ్ ప్రెస్ చాలా బాగుంటుందనిపించింది.నాకు బ్లాగర్ లో ఇంగ్లీషుంది.

Anonymous said...

నాగార్జున గారు మీ కామెంట్ ఇప్పుడే చూసాను.స్పాములో కి వెళ్ళి కూచుంది.దానికి స్పందించే లోపు మీ ఈ పోస్టు కనిపించింది.చాలా థాంక్స్!నాకు కూడా బ్లాగర్ లోనొ ,బ్లాగ్‌స్పాటు లోనె ఇలాంటి అనుభవమే అయ్యింది.బహుశా సుజాత గారి 'మనసులో మాటా లో రెండు సార్లు కామెంటాననుకుంటా!అవి కూడా అతా పత్తా లేవు!మమ్మలని అపార్దం చేసుకోక నిజాన్ని రాబట్టినందులకు మీకు జిందాబాదు ;).

కెక్యూబ్ వర్మ said...

renditlonu chinna chinna lopalunnaayi. oke comment nu 2,3 times post cheste ala spam loki potayani mahigrafix mahesh chepparu. spam ok cheyadam valana ibbandemi vundannaru. blogs lo ibbandulu vunna bhavaprakatanaku mnchi saadhanalukada. kaaniddam ilaa... meeru word verification pettaaru, ilaa pade pade chesina spam loki veltayanta. idi teeseyandi.

Ravi said...

సమస్యంతా వర్డ్‌ప్రెస్ లో ఉన్న అకిస్మెత్ అనే ప్లగ్ ఇన్ వల్ల వస్తుంది. అది ఈ వ్యాఖ్యను ఎందుకు స్పామ్ లోకి పంపించేస్తుందో తెలియదు. నేను రెగ్యులర్ గా చెక్ చేస్తుంటాను కాబట్టి పొరబాటున స్పామ్ లోకి వెల్లిన వ్యాఖ్యలను తొందరగానే పబ్లిష్ చేస్తాను.

అయినా బ్లాగర్ కూడా అంత పతివ్రతేమీ కాదు :-) అసలు ఒక్కోసారి కామెంట్లన్నీ కూడా మాయమై పోతుంటాయి. సాంకేతిక సమస్యలు ఎక్కడైనా ఉండేవే. we have to live with them. :-)

Anonymous said...

నాకూ వర్డ్ ప్రెస్సే నచ్చింది.ప్రయత్నించి చూడండి. బ్లాగర్లో ట్రై చేశాను.అది కొంచెం సరళంగా ఉందేమో అనిపించింది. ఐనాగానీ, వర్డ్ ప్రెస్సే బావుంది.
-రేరాజ్
rayraj.wordpress.com

ఆ.సౌమ్య said...

నేను కొద్ది నెలల క్రితం బ్లాగరా, వర్డ్ ప్రెస్సా అని తెగ ఆలోచించి చించి బ్లాగరుకి ఓటేసాను. అది నా మంచికొరకే అని ఇప్పుడు తెలిసింది.

ఇక్కడ సందర్భం కాకపోయినా రాస్తున్నాను

మీరు వెంకటేశానికిచ్చిన ఉపదేశం బావుంది :)

..nagarjuna.. said...

@ అబ్రకదబ్ర,కెక్యూబ్,రవిచంద్ర,వెంకటకృష్ణ : ఓస్ దీని తస్సాదియ్యా అదన్నమాట సంగతి. కామెంటు వేసాక acknowledgement రాకపోతే డబుల్ స్ట్రాంగ్‌గా వుంటుందని ఇంకోన్నిసార్లు కామెంటేవాడిని ఇన్నాళ్లు తిక్కరేగి చివరికి స్పాం బుట్టలో వేసిందా అమాయకపు వర్డ్ ప్రెస్సు. ఇకనుంచి ‘ఎక సమయం ఎక కామెంటు’ విధానాన్ని పాటిస్తాను.

ఇంతకన్నా పెద్ద విషాద విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితం నా పోస్టుకి నేను రాసుకున్న కామెంటే గల్లంతయింది :( టైం బ్యాడ్‌ అనుకొని మళ్ళా కామెంటిచ్చుకున్నా, ఓ రొండు రోజుల తరువాత పాత వ్యాఖ్య ఠపీమని ఊడిపడింది..... ఏమిటొ బ్లాగ్మాయ!!

..nagarjuna.. said...

@హరెఫల,రెరాజ్ : వర్డ్ ప్రెస్ బాగోదని కాదు..., కొన్ని అనుభవాలతో ఆయసపడి దాన్ని పంచుకుందామని ఈ పోస్టు రాసాను. నాక్కుడా wordpressలో అకౌంటువుంది, ఒక్క బ్లాగునే సరిగా మెయింటెయిన్ చేయనివాడను ఇంకొకటి ఎందుకని దాన్ని వాడట్లేదు.
రెరాజ్ గారు మీ బ్లాగ్‌ చూసాను.. కాప్షన్ అదిరింది.


@ సౌమ్యగారు : హమ్మయ్య మొత్తానికి ‘బ్లాగర్’కి అనుకూలంగా ఒక్కరైనా దొరికారు i'm happies, and thanks for your compliments

హరే కృష్ణ said...

వర్డుప్రెస్సు కంటే బ్లాగేర్ చాలా బెటర్ :)
బ్లాగుల మీద ఒక సినిమా ఆడుతోంది నా బ్లాగులో వీలైతే ఒక లుక్కేయండి

Anonymous said...

are you in iit kgp??

..nagarjuna.. said...

@అజ్ఞాత : అవును

raju said...

Saw this comment in bhaskar ramaraju's post.

>>తగ్గుడు సంగతొద్దుగాని పెరుగుడు ముచ్చటేదన్నుంటె జెప్పరాదే జల్ది, నాకు శానా పనుంది...

see these 2 videos, you can put on weight in a healthy way.Proceed, Good Luck !

http://www.youtube.com/watch?v=2XPktrTQr8k&feature=PlayList&p=89C60681F2CAFCD8&playnext_from=PL&playnext=1&index=44

http://www.youtube.com/watch?v=lHL18q5r15c&feature=PlayList&p=89C60681F2CAFCD8&playnext_from=PL&index=45&playnext=2

శ్రీవాసుకి said...

నాగార్జున గారు

వర్డ్ ప్రెస్ బాగుంటుంది. కామెంట్ పెట్టడం బ్లాగర్ కన్న దీనిలోనే సులువు అని నా అభిప్రాయం. బ్లాగర్ లో కామెంట్ పెట్టే ప్రతీసారి ఏదో ఒక ఎర్రర్ వస్తోంది ఎందుకో అర్థం కావటలేదు. మీ బ్లాగ్ టపాలు చూసాను బాగున్నాయి.

..nagarjuna.. said...

@raju : మీ సమయం వెచ్చించి లంకెలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

@శ్రీవాసుకి గారు: మీ అభినందనకు కృతజ్ఞతలు.మీరన్నట్లు వర్డ్‌ప్రెస్‌లోనే వ్యాఖ్య పెట్టడం సులువు, ఎలాంటి లాగిన్లుగట్రా అవసరంలేదు. కొన్ని వర్డ్‌ప్రెస్‌ బ్లాగుల్లో వ్యాఖ్య పెట్టిన తరువాత దాన్ని స్వికరించినట్లు ధృవీకరణ కనిపించకపోవడంతో ఇంకొన్నిసార్లు ప్రయత్నించి చివరకు నన్నునేను స్పాంలోకి పంపుకున్నా...;) ఆయాసం, ఆక్రోశం పట్టలేక ఇలా విన్నవించుకున్నా,అన్యథా కాదు.
మీ బ్లాగుని ఓ లుక్కేసాను, గోదారి పరవళ్లలాగే నిర్మలంగావుందండి. సమయాభావంవల్ల పూర్తిగా చూడలేదు. తీరికచేసుకొని చదువుతా :)

కొత్త పాళీ said...

నేనూ గూగుల్ బ్లాగరినే. మరి నేను వర్డ్‌ప్రెస్ బ్లాగుల్లో వేసిన వ్యాఖ్యలు అచ్చవుతూనే ఉన్నాయే!

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis