From home with love...

క్యాప్షను: ఇవి కొంచెం హాట్ గురూ.....


ఏందట్ల జూస్తున్నరు.......ఫొటొ ఏందనా...? ఇయ్యి ఇంటినుండి  ఇయాల్నె ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌ల ఒచ్చిన దసరా వంటలు. పైనుండి గడియారం ముల్లు తిరిగే పద్దతిల ( clock wise direction స్వామి) మురుకులు, గర్జలు, అప్పాలు. మరిగ మీతాన ఈటిని ఏమంటరో నాకు తెల్వది (కింద కామెంట్ డబ్భా ఒకటి ఉంటది అన్ల చెప్పుండ్రి ఏమంటరో ) .....కరప్పూసలు అంటే మురుకులు అన్‌కుంటున్న కరెక్టేనా?

ఈటితోని  సున్నుండలు ఒచ్చుండాలిగాని మిస్ ఐనై....కొడకో జర బరువు పెంచు అని అమ్మ నాయ్న సున్నుండలు పంపిస్తా అన్నరుగాని పంపియ్యలే...యాద్ మర్శినట్లున్నరు. వచ్చేంతశేపు ఒకటే భయం ఉండే...ఒచ్చినంక ఇయన్నీ జాతీయం ఐపోతయేమోనని, అంటే హాస్ట్‌ల్‌ల ఉంటున్నంగదా మన సొమ్ము దోస్తుల సొమ్ము అన్నట్టు దోస్తుల సొమ్ము మన సొమ్ము అన్నట్టు. కాని ఆళ్లుగూడ సంచులు సంచులు తెచ్చుకున్నరు.....నయంగాదు, కొన్ని దినాలదాంకనైన ఇవి భద్రంగుంటయ్.....


బరువు అంటే గుర్తొచ్చింది‌...ఇయ్యాల్రేపు మొగోళ్లను, ఆడోళ్లను ఏం అడగొద్దో ఏం అడగాలో సమజైతలేదు. ఒకళ్లేమో " మగాడి హైటు ఆడాళ్ల వెయిటు (బరువు) అడగొద్దు" అంటరు.....ఇంకోళ్లెమో " ఆడోళ్ళ యేజు (వయసు) మగోళ్ల వేజు (సంపాదన) అడగొద్దు" అంటరు. అంటే ఆడోళ్లను హైటు అడగొచ్చు, సంపాదన అడగొచ్చు అనా ? శానా confusing ఐతుందనుకో...అరే తెల్వక అడుగుతా ఆడోళ్లని హైటు ఎందుకు అడుగుతం బై, ఏం అవసరం దాంతోని? ఆళ్లపక్కన నిలబడితే అందాజాగా చెప్పలేమా ఎంత హైటుంటరో !! పోని సంపాదన ఎంత అని అడిగితెనేమో యేడ ఆడ స్త్రీ లేడి మహిళా సంఘాలు దాడి జేస్తయేమోనని భయం......ఇగ నాకు సమజైందేందంటే ఆడోళ్లను ఏం అడగొద్దన్నట్లు....... ఆళ్లు అడిగితె మాత్రం మనం జెప్పాలె :(

ఇగ ఇయ్యాల్రేపు  మొగోళ్ళెమో అడగక పోయినా ’ఇంత బరువు తగ్గిన’, 'అంత బరువు పెరిగిన' అంటున్రు....యేజ్ అడుగుదామంటే ప్రతొక్కడు నెత్తికి రంగేసుకుంటుండాయే.....ఇంగేమడగాలే....

గిట్లనే ఓపాలి కాలేజ్‌ల ఉన్నప్పుడు రక్తదానం జరిగినుండే...ఆ టైంల మా సీనియర్లు ఓతాన కూసొని ముచ్చట బెడుతుంటే ఆళ్ల దగ్గర్కుబోయి అందరు చేశిండ్రుగదా అని అడిగిన....ఆ చేశ్నం అనిచెప్పి ఈ అమ్మాయి చేయలేదు అని చెప్పిండ్రు. నేనూకొవచ్చుగదా...లే... ఆమెని ’ఎందుకు చేయ్యలే’ అని అడిగిన. ’ఉండాల్సిన బరువు లేను ’అన్నది. కనీసం ఇప్పుడైన నోర్మూసుకోవచ్చుగద నేను...ఉహు...మనకేమో పైన జెప్పిన మాటలు తెల్వవాయే...ఎమ్మటే " ఏం XY కేజీలు గూడలేవా?" అన్న.
బస్, అంతే బై....గప్పుడు ఆ అమ్మాయి, ఆళ్ల ఆడ దోస్తులు ఓ సూపు జూశిండ్రు జూడు ...( మగ సీనియర్లేమో శిన్నగ నవ్వుతుండ్రు)  అబ్బో శెప్పేడ్ది కాదు అది. ’షటప్ ’ అనిగూడ అన్నదిమల్ల.....అప్పడికి వాళ్లు మాకుగుడ్క దోస్తులనుకో అదివేరే  ముచ్చట. ఇదే scene ఇంకెవళ్లతోనన్న ఐతే నా ఇజ్జత్  యేమయ్యేడ్దో!!!!

పని ముచ్చట్ల బడి ఇటువైపు (బ్లాగులు) సూస్తలేను......ఫాలో అయ్యే బ్లాగులు సదివి కామెంట్లను వాయిదాల పద్దతిన ఇచ్చుకుంట...ఉంట మల్ల

జైహింద్‌

20 వ్యాఖ్యలు.. :

హరే కృష్ణ said...

భయపెట్టావు కదయ్యా నాగార్జునా!
వానపాములు ప్యాకెట్ లో వేసుకోచ్చాడు ఏంటి అని కంగారు పడ్డా
మిగతా పదార్ధాలు చూసాక అర్ధమయ్యింది :P


పక్క రూమ్ లో నా లాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్త.. తొందరగా తినేసేయ్ ఒక పూటలో

మనసు పలికే said...

హిహ్హిహ్హీ.. నాగార్జున భలే పోస్ట్ పండగ సీజన్‌లో..:) నీ దగ్గర ఈ పిండి వంటలు అయిపోతే చెప్పు నాకు, నేను కొరియర్ చేస్తా..;)
ష్..హరే కన్ను మాత్రం పడనివ్వకు వీటి మీద..:))

హరే కృష్ణ said...

మనసు పలికే :)
పిండి వంటలు చేతులతో కాదు .. కంటి చూపుతో తినేస్తా :))

మనసు పలికే said...

హహ్హహ్హా.. కృష్ణ.. అందుకే కదా నీ "కన్ను" పడనివ్వద్దని చెప్పాను..:)

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Nice post :)

ఇందు said...

>>>భయపెట్టావు కదయ్యా నాగార్జునా!
వానపాములు ప్యాకెట్ లో వేసుకోచ్చాడు ఏంటి అని కంగారు పడ్డా
మిగతా పదార్ధాలు చూసాక అర్ధమయ్యింది

'హరే' గారు సేం నేను కూడా ఇలాగే అనుకున్నా అండీ... :)

నాగార్జున గారు టపా బాగుంది...ముఖ్యాంగా హాస్టల్ లో జరిగేవి...రాగింగ్...ఇంకా ఆ స్లాంగ్.nice.

వేణూశ్రీకాంత్ said...

హ హ కారణం తెలియదు కాని నేను కూడా అరక్షణం హరేకృష్ణ లానే భయపడినా :-D
టపా మస్తుగ రాసినవ్ బో తమ్మీ..

అందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు నిన్నెవరైన ఏదైనా అడిగినప్పుడు నీకు ఏం చెప్పడం ఇష్టం లేకపోతే అది అబ్బాయిలను అడగ కూడదు అని జెప్పేయడమే...

Sai Praveen said...

అయ్ బాబోయ్ నీ కోసం ఇయ్యన్నీ రైలెక్కి ఒచ్చీస్నియ్యా. సూపర్ కదా :)
మా ఊర్లో అయితే మురుకులు=జంతికలు,గర్జలు=కజ్జికాయలు
అప్పాలు మాత్రం not sure. కారప్పూస అంటే సన్నగా ఉంటుంది.
సున్నుండలు మిస్ అయ్యవన్నమాట. నాకు కూడా సున్నుండలు చాలా ఇష్టం :)
అవి చూసి అందరికి వాన పాములు అని ఎందుకు అనిపించిందో కాని, నాకు ముందు అవి నూడుల్స్ లాగా కనిపించాయి. ఇంటి నుంచి నూడుల్స్ పంపడం ఎంటబ్బా అనుకున్నా :)

3g said...

నాగార్జునా.......అసలే ఆస్టల్లో సెక్యూరిటీ సరిగ్గా ఉండదు ఇన్ని రకాలు నువ్వేట్టా దాసుకుంటవ్గాని...ఆ కజ్జికాయలు అవే గర్జలు ఇట్టా ఏసుకో.... మేందాసిపెడతాం. :)

శిశిర said...

గర్జలు అంటే కజ్జికాయలా? ఇవేమయ్యుంటాయా అని ఆ మాట చదివినప్పటినుండి తెగ ఆలోచించి చస్తున్నా. కామెంట్లలో ఎవరైనా చెప్పుంటారులే అనుకోవచ్చు కదా. మట్టిబుర్ర. సాయిప్రవీణ్ గారు, థాంక్స్. :)

ఆడోళ్లను ఏం అడగొద్దన్నట్లు....... ఆళ్లు అడిగితె మాత్రం మనం జెప్పాలె :(

మీకు చాలా నిజాలు తెలుసు నాగార్జునా :)
చాలా బాగుంది టపా.

శివరంజని said...

నాగార్జున గారు మురుకులు ని ఇక్కడ కారప్పూస అని అంటారు గర్జలుని కజ్జికాయలు అని అంటారు ...


సున్నుండలు మిస్స్ అయ్యాయన్న విషయం మీకు ఎలా తెలిసిందబ్బా ... ట్రైన్ లో ఎవరూ చూడలేదే అయినా ఎలా తెలిసిందబ్బా?????????

ఆ.సౌమ్య said...

మాతాన జంతికలు, కజ్జికాయలు, చెక్కలు అంటారు వాటిని.

ఆ.సౌమ్య said...

యాస బావుంది, ఇలా కొన్ని పోస్టులు రాయండి.

స్నిగ్ధ said...

ద్రోణాచార్య గారు, కేప్షన్ చూసి మీరెప్పుడు పాక శాస్త్ర ప్రవీణులయ్యారా అని అనుకుంటున్నాను...వెరైటీగా నూడుల్స్ తో కొత్త వంటని ఏమైనా ట్రై చేసి మాకు చెప్తున్నారేమో అని అనుకున్నా ఒక నిమిషం..మొత్తానికి మురుకులు,కజ్జికాయలు,అప్పాల తో దసరాని బాగా చేసుకున్నరన్నమాట... కాలేజ్ ముచ్చట్లు బాగున్నాయి...
:)

..nagarjuna.. said...

@హరే: బాసు నేనుంటున్నది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చైనా సరిహద్దుల్లో కాదు...వానపాములు తినే స్టేజికి ఇంకా రాలేదు. వచ్చినా మీతో పంచుకోకుండా తిననులే.. :D

@అపర్ణ: >>నీ దగ్గర ఈ పిండి వంటలు అయిపోతే చెప్పు నాకు, నేను కొరియర్ చేస్తా..<<

మాతల్లే మాతల్లే...ఎంతమంచిదానివో...నిజంగా నువ్వు బంగారానివే...ఇకనుండి ఫుల్ సపోర్ట్ నీకే!! :)

@పొలిటిషియన్‌ జీ: థాంకులు :)

@ఇందుగారు: టపాను, యాసను మెచ్చుకున్నందుకు మీకు రెందు థాంకులు :)

@వేణూశ్రీకాంత్ : మస్తు మాట చెప్పినవన్నో.. ;)

@ప్రవీణు: సున్నుండలు అంటే నీకూ ఇష్టమేనా..? ఓసారి అపర్ణను అడుగు పార్సిల్ చేస్తుందేమో :)

..nagarjuna.. said...

@3g గారు:>>ఆ కజ్జికాయలు అవే గర్జలు ఇట్టా ఏసుకో.... మేందాసిపెడతాం <<
హమ్మా... ఆస దోస అప్పడం ఆలూవడ...కజ్జికాయలొక్కటే కావాలా...ఈసారి అసలే బెల్లం-కందిపప్పు వేసి చేసారు...ఊకనే ఇచ్చేస్తనేంది :P

@శిశిరగారు:నాక్కూడ ’కారప్పుస’ అని రాసినప్పుడు ఇంకేదో పేరు ఉండాలి కదా అని అనుమానం వచ్చింది...ఎంతసేపు ఆలోచించాలి అనుకొని పక్కనెట్టేసాను.
చాలా బాగుంది అన్నందుకు చాలా థాంకులు :)

@శివరంజని:సున్నుండలు పంపిస్తాను అంతకు ముందు రోజు రాత్రి అన్నారులే... :P పొద్దున్నే వెళ్ళి తిసుకొనిరావడం మర్చిపోయారనుకుంటా..

అపర్ణ ఆల్రెడి అడిగింది, నేను మళ్ళి అదుగుతున్నా...కొత్త టపా ఎప్పుడు రాస్తున్నావ్..??

@సౌమ్యాజీ: ఇంకొన్ని పోస్టులు రాయాల్నా..., గట్లనే మేడం.. :)

@స్నిగ్ధగారు: పాకశాస్త్ర ప్రావీణ్యమా..! అదికూడా అయ్యిందిలేండి.., పండగ సందర్భంగా హాస్టల్ మెస్సు మూసేస్తే రూమ్‌లోనే వంటచేసుకున్నాం..ఆ విషయాలు, విజయ-దీన గాధలు ఇంకెపుడైనా చెబుతాను. కామెంటుకు థాంకులు :)

హరే కృష్ణ said...

మీకేంటి బాసూ పక్కనే నేపాల్ వాళ్ళ మోమోస్ భలే ఉంటాయి
Taste కి taste,energy కి energy


కజ్జికాయలొక్కటే కావాలా...ఈసారి అసలే బెల్లం-కందిపప్పు వేసి చేసారు...ఊకనే ఇచ్చేస్తనేంది :P
@3g గారు:వంద కామెంట్స్ చేస్తే నాగార్జున ఇస్తాడు అనుకుంటా :)
అప్పటికి మిగిలేది ఖాళీ ప్యాకెట్ కదా..

ఇక్కడెవరో కొరియర్ అంటున్నారు నాకు మూడు లకారాల చెక్ కూడా బాకీ ఉన్నారు అది పంపమని చెప్పు నాగార్జున సున్నుండలతో పాటు

మనసు పలికే said...

నాగార్జున.. థాంకులు, సపోర్ట్ నాకే అన్నందుకు.:) సాయి ప్రవీణ్‌కి కూడా సున్నుండలు పార్సల్ చెయ్యాలా..! తప్పకుండా సిరివెన్నెల అభిమానులం కదా ఖచ్చితంగా చేస్తా..:)

ఇక ఇక్కడ ఎవరో మూడు లకారాలకి చెక్కు కావాలంటున్నారు. నన్ను మార్పు శిఖామణి అని అనడం మానేశరు, అలాంటప్పుడు ఎందుకు కొరియర్ చెయ్యాలి అని కొరియర్ ఆఫీస్ వరకూ వెళ్లి మరీ వెనక్కొచ్చేశా..;) ఈ మెసేజ్ పాస్ చెయ్యి నాగార్జునా.. :D :D

..nagarjuna.. said...

హరే, మోమో పేరు చేయకు బాబు....తట్టుకోలేకపోతున్నా.....నాకేమో అవి పిచ్చ పిచ్చగా నచ్చేసాయి, మా ఫ్రెండ్స్‌కు ఎందుకోమరి నచ్చలేదు ఎపుడైనా అలా బిగ్ బజార్‌కు వెళ్ళినపుడు తిందాంరా అంటే ’ఛీ సన్నాసి అవేలా తింటర్రాబాబు’ అని నీరుగార్చేస్తారు... :(


లకారములగొడవ: వాదప్రతివాదములు విన్నపదప సమస్యను మీలోమీరే చర్చించుకొని పరిష్కరించుకోమని తీర్పునివ్వడమైనది... :D :P

Anonymous said...

:) :) :)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis