Writer లక్షణాలు

 'The Alchemist', 'The Pilgrimage' వంటి ప్రపంచ ప్రసిద్ద నవలలు రాసిన బ్రెజిల్ రచయిత, ఆథ్యాత్మికవేత్త Paulo Coelho తన  పదిహేనవయేట తన తల్లితో తాను పెద్దయ్యాక రచయితను అవ్వాలనుకుంటున్నానని చెప్పాడట. అపుడు వాళ్లమ్మగారు ' మీ అంకుల్ ఓ డాక్టురు, కావాలంటే నువ్వు కూడా ఏ ఇంజనీరో అయ్యి ఖాళీ సమయాల్లో రాయొచ్చు. పైగా అసలు writer (రచయిత/రచయిత్రి) అంటే ఏంటో నీకు ఖచ్చితంగా తెలుసా?'ని  అడిగిందంట. దానికి సమాధానంగా ఖాళీ సమయాల్లో పుస్తకాలు రాసే రచయిత కాకుండా పూర్తిస్థాయి రచయిత కావాలనుకుంటున్నాను అని చెప్పేసి రచయిత అంటే ఎవరు, ఏమిటి అని కొన్నాళ్లపాటు పరిశోధన చేసాడు. వాటిని తన అమ్మగారికి చెప్పేసేసి అటుతరువాత ఎలాగో అలా ప్రసిద్ద రచయిత అయ్యాడనుకోండి. ఐతే తాను రచయిత/రచయిత్రి ల పై జరిపిన పరిశోధనల తాలుకు ముఖ్యవిషయాలను తన పుస్తకం 'Like the Flowing River'  'ముందుమాట'లో చెప్పాడు. అవి మీతో పంచుకుందామని ఈ పోస్టు....

౧)రచయిత అనేవాడు ఎల్లప్పుడు కళ్లజోడు పెట్టుకొని, తల దువ్వుకోకుండా ఉంటాడు.
ఏంటీ...మీకు కళ్లజోడు లేదా, రచయితలం కాలేమూ అంటారా! మరీ ఇలా డీలా పడిపోతే ఎలాగండీ. కావాలంటే అప్పుడప్పుడు రౌడిగారిలా దర్శనమివ్వండి. వీలుపడితే మా నేస్తం అక్క చెప్పినట్టు ఏసీ లో కూడా చలువ కళ్లద్దాలు వేసుకోండి.


౨) రచయిత దాదాపు ఎవరిమీదనో కోపంగానో లేకపోతే బాధపడుతూనో ఉంటాడు. ఏదన్నా మాట్లాడితే బాగా లోతుగా మాట్లాడతాడు. తను ఈమధ్యే ప్రచురించిన పుస్తకాన్ని ఏవగించుకుంటూనే తన తదుపరి పుస్తకం కోసం అమోఘమైన ఆలోచన ఉందని ఫీలవుతుంటాడు.


౩)సమాజం పట్ల తనకు ఓ మహత్తర బాధ్యత ఉన్నదని అది నెరవేర్చడం తన కర్తవ్యమనీ, ఈ నిజాన్ని తన తరం వారెవరూ గ్రహించలేరని, తనను అర్ధం చేసుకోలేరని అనుకుంటాడు. ఒకవేళ అర్ధం చేసుకుంటే తాను మేధావి అనిపించుకొవడం కుదరదనుకుంటాడు.


౪) మామూలు జనం మాట్లాడే భాషను రచయిత వాడడు. సగటు మనిషి ఓ 3000 పదాలు వాడితే రచయిత పదకోశం లోని మిగతా పదాలన్నీ వాడతాడు. ఎందుకంటే తాను సగటు మనిషికాదు.


౫)కేవలం ఇతర రచయితలే తనను అర్ధం చేసుకోగలరు అనుకొంటాడు. అనుకుంటునే మనసులో ఇతర రచయితలను ఏవగించుకుంటాడు,  most complicated book రాసిన రచయితగా పేరుతెచ్చుకొవడానికి పోటిగా ఉన్నారని.


౬) ఎవరినన్నా ఉలిక్కిపడేలా చేయలనుకున్నపుడు 'ఐన్‌స్టీన్ ఒక వెధవ' అనో 'టాల్‌స్టాయ్ ఓ బూర్జువా' అనొ అంటాడు.


౭) ఆడవాళ్లను ఇంప్రెస్ చేయడానికి తాను ఓ రచయితనని చెప్పి అక్కడికక్కడ కంటికి కనిపించిన ఓ కాగితం ముక్కమీదో, రుమాలు మీదో ఓ కవిత రాస్తాడు.


౮)తన మిత్రులదో, ఇతర కవుల/రచయితల పుస్తకాలకు సమీక్ష రాయాల్సొచ్చినపుడు "అసలీయనగారు పుస్తకం చదివారా లేదా?" అనే అనుమానం వచ్చేట్టుగా 'జీవితపు ద్వైదీభానల సమ్మేళనం' వంటి పెద్ద పెద్ద పద ప్రయోగాలు చేస్తాడు.


౯) తమరు ప్రస్తుతం ఏం చదువుతున్నారు అని అడిగినపుడు ఎవరూ పేరు కూడా వినుండని ఏదో పుస్తకం పెరు చెప్తాడు.





అలా పరిశోసధించేసి వాళ్లమ్మగారికి చెప్తాడు. దానికి ఆవిడేమంది, ఈయనేం చేసారనేది మీరే కనుక్కొండి. మందుమాటలో చెప్పాడు కాబట్టి brief గానే ఉంటుంది. మిగతా పుస్తకమంతా ఆయన వివిధ వార్తపత్రికలలో ప్రచురించిన కథలు, వ్యాసాల సంకలనం. Coelho రచనల్లో చాలామటుకు mysticism ఉంటుంది మానవ జన్మకు ఓ పరమార్ధం ఉందని, పుట్టిన ప్రతి మనిషి అది నెరవేర్చడానికి పునుకొవాలని అందుకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఇలాంటివాటిపై నమ్మకం ఉంది-లేదు అని పక్కనపెడితే కార్యసాధనకు కావాల్సిన బోలెడు విషయాలు ఆయన రచనల్లో వెతుకోవచ్చు.

10 వ్యాఖ్యలు.. :

ఆ.సౌమ్య said...

బావుంది బావుంది...ఆయన రాయడం, నువ్వనువదించడం...రెండూ బావున్నాయి. ఆయన నిజంగా రాసాడో, నవ్వుతాలుకి రాసాడోగానీ చమత్కారంగా బలే ఉన్నాయి అన్ని పాయింట్లూ!

చిన్న సలహా: ఏం లేదు నీ పోస్ట్ చదివాక ఎందుకో అలా కిందకి చూస్తే "అచ్చేశింది" అని కనిపించింది. అక్కడ కత్తెర శ కాదు...మామూలు స వాడాలి. "అచ్చేసింది" అని రాయాలి....సవరించు.

..nagarjuna.. said...

ఆ విషయాలు ఆయనకు పదిహేనేళ్లున్నపుడు చేసాడని చెప్పాడు కదండి, బహుశా తెలిసీ తెలీకుండా తీర్మానించేసుకున్నాడేమో.

>>అచ్చేశిం(సిం)ది
అది కావాలనే అలా రాసాను, ఆ పక్కనే " ఇప్పడ్వరకు రాశినవి" అని కూడా ఉంది, చూడలేదా !?
ఏదో లోకల్ లాంగ్వేజి మీద లవ్వు :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

1. నాకు కళ్ళజోడు ఉంది
2. నాకు ముక్కుమీద కోపం అందరిమీదా కసి ఉంది.
3. నేను మేధావినే. మీకేమైనా డౌట్ ఉందా ?
4.నేను ఉపన్యాసం ఇచ్చానంటే విన్న వాళ్ళు కొత్త నిఘంటువులు తయారు చేసుకోవాలి.
మిగతా కండిషన్స్ కూడా నాకు కొద్దో గొప్పో సరిపోతాయి.
అమ్మయ్య నేను రచయితనే.

ఇందు said...

నాగార్జున గారూ...ఎక్కడ తీసుకొచ్చారండీ..భలే ఉన్నాయ్! నేను తన 'ఆల్కెమిస్ట్' చదివాను! నాకు తప్ప నా ఫ్రెండ్స్ ఎవరికీ నచ్చలేదు :))

కానీ ఈ రచయిత/రచయిత్రులకు ఉండాల్సిన లక్షణాల్లో నాకు ఆ ముక్కుమీద కోపం తప్ప ఏవీ లేవండీ...

అదిగో..ఇప్పుడు నేను రచయిత్రి కాదు అంటే... చంటబ్బాయిలో శ్రీలక్ష్మి చెప్పిన కపిత్వం ట్యుషన్ చెప్పేస్తా! జాగ్రత్త! ;) :P

రవికిరణ్ పంచాగ్నుల said...

అదిరింది నాగార్జునగారూ..

మీ 'జీవితపు ద్వైదీభానల సమ్మేళనం' ఒక ఎత్తైతే, బులుసుగారి కామెంటు అద్భుతం. :-)

..nagarjuna.. said...

@బులుసుగారుః గురూగారు ఇప్పటికే మీరు కనిపెట్టిన ద.హా, అ.హా వగైరా వగైరా పదాలను నిఘంటువులలో చేర్చే పనిలో ఉన్నాం. మీరు రచయిత కాదు అని ఎవరు అనగలరు చెప్పండి. మ.హా.

@ఇందుః 'అల్కేమిస్టు' నచ్చలేదా....!! ఏదో కొన్నిచోట్ల బాగోలేదు అంటే ఓకే కాని మొత్తంగా నవలే నచ్చలేదా పాపం! వాళ్లకు ఫాంటాసీలు నచ్చవేమో ఇందుగారు.

మీరు రాయిచ్చుకు కొట్టడాలు, మీద వేడినీళ్ళు పోయడం వంటివి చేయకుండానే ఉద్ఘాటించేస్తున్నా..... ఈ శతాబ్దపు రచయిత్రి మీరే ఇందుగారు మీరే !!

@రవికిరణ్‌: మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు :)

శిశిర said...

"రచయిత దాదాపు ఎవరిమీదనో కోపంగానో లేకపోతే బాధపడుతూనో ఉంటాడు."
ఇది బాగుంది. :)
నాకో సందేహం. రచయిత అనిపించుకోవాలంటే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా ఉండి తీరాలా? కొన్ని ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా?

..nagarjuna.. said...

>>ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా

ఏమో, ఇందుగారిలా 'వినమ్ర్‌' కే సాథ్ బోలేథో రచయితలవ్వొచ్చు. మిగతా మినహాయింపులు కూడా కావాలంటే నేను ఓ బృహత్ పరిశోధన చేపట్టి, ఓ పుస్తకం రాసి దాంట్లో రాసేస్తాను, మీరు చదివేయండి- రచనలు చేయండి. :)

kiran said...

హహహ..బాగున్నాయి..మీరు రాసిన పాయింట్స్..:)
paulocoelho రాకాహనలు నాకు కూడా ఇష్టం..:)

Surya said...

రచయిత లక్షణాలు నాలో పుష్కలంగా ఉన్నాయని మీ post ద్వారా గ్రహించగలిగా...

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis