మనమే! అయినా నీది నీదే...నాది నాదే.

Back in late 19th century there lived a scientist Boltzman who went on to frame the famous "Law of Entropy" for predicting atomic behavior.. this law,in other words, states that
"In an isolated system the entropy (disorder) always reaches its maximum"

బోల్‌ట్జ్‌మెన్ మహాశయుడి సిద్ధాంతం ఏంటంటే  ఒక అణు/పరమాణువుల సమూహానికి  బాహ్య శక్తి ప్రవహించనపుడు ఆ సమూహంలోని ఒద్దిక తగ్గుతూ గందరగోళం పెరుగుతూపోతుందీ అని. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సిద్ధాంతాన్ని ఆయన సామాజిక వ్యవస్థలకూ, మానవ సంబంధాలకూ అన్వయించాడు.
కొన్ని ఆశయాలు/నమ్మకాలు/ఇష్టాల ప్రాతిపదికన ఏర్పడిన ఏ వ్యవస్థ/సంబంధం అయినా దాన్ని అలాగే పట్టివుంచగల శక్తి (ప్రేరణ), commitment I'd say, లేనపుడు  ఆ వ్యవస్థ/సంబంధం కాలక్రమంలో నిర్వీర్యమైపోతుంది అని భావించాడు.

******************************************************

ఒక దేశంలోని ప్రజలను కలిపి ఉంచేది భాష అని సిద్దాంతీకరించి ఉద్యమాలు చేసి మన తెలుగు వాళ్లము ఒక రాష్ట్రంగా ఏర్పడటమే కాకుండా ఆ ప్రాతిపదికన మరిన్ని రాష్ట్రాల ఏర్పాటుకు కారణమయ్యాము.  ఈరోజు అదే భాషను ఒక సాకుగా చూపించి ఒకొళ్లకొళ్ల మధ్య మానసికంగా  Berlin wall కట్టేసుకొని, political గా విడిపోతున్నాం.

అయస్కాంతపు సజాతీ ధృవాల్లాగా కలిసి ఉండటం వీలుకాక విడిపోతే బాధపడాల్సిన అవసరం లేదు. కాని కలిసి ఉండటమనే విలువ తెలియక, చేతకాక  అలా ఉండేందుకు వీలుకానటువంటి పరిస్థితి కల్పించుకొని విడిపోతున్నాం. ఈ mindset ఉన్నాక అభివృద్ధిలో అందలమెక్కితే ఎంత అధః పాతాళానికి పడిపోతే ఎంత!

ఈ సందర్భంగా ఓ మిత్రుడి ఆవేదనను పంచుకుంటూ..,

 నిన్ను రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యపు జాతి మాది. క్షమించు తెలుగు తల్లీ, క్షమించు! 


with pity for all those who are incapable of looking beyond numbers, figures of a thing called development .







--A Telanganite but not its supporter
(If identity matters)




7 వ్యాఖ్యలు.. :

Anonymous said...

Well said sir..

Anonymous said...

map ni ala 2 peaces ga chudalante ne badha ga vundiii

అన్వేష్ said...

Well Said Mr. Nagarjuna.
Feeling very bad and have the feel of something lost in the family as soon as the News was heard

:(

Anonymous said...

Since childhood I've been accustomed to see the Andhra Pradesh map as it is now. But seeing a sliced Andhra Pradesh, for a birth day gift of a foreigner (Sonia) pained me a lot. But we have to accept the reality and re-build our region.

చాణక్య said...

Well said! రాష్ట్రం కలిసుండడం లేదా విడిపోవడం అనే విషయాల్లో నాకెటువంటి అభిప్రాయం లేదు. విడిపోవడంలో ఉండే బాధ కేవలం Nostalgia అని అనుకుంటాను. ఎందుకంటే ఈనాటి ఆంధ్రప్రదేశ్‌కు అరవైయేళ్ల క్రితం ఉనికి లేదు. అసలు తప్పు భాష పేరుతో రెండు భిన్నమైన చారిత్రక నేపథ్యాలున్న ప్రాంతాలను కలపడంలోనే జరిగింది. It's a failed marriage! ఇప్పుడు బలవంతపు విడాకులతో మరో తప్పు చేస్తున్నారేమో అనిపిస్తోంది. రెండు రాష్ట్రాలున్నా, మూడు రాష్ట్రాలున్నా తప్పేమీ లేదు. కానీ వాటి పేరుతో మ్యాప్‌లో గీతలతో పాటు, మనుషుల మధ్య గోడలు కూడా కట్టుకోవడం విచారించాల్సిన విషయం.

నాగరాజ్ said...

చాలా హృద్యంగా రాశారు. నేతలు, పాలకులు- అత్యంత కుటిల, స్వార్థపూరిత రాజకీయాలతో తెలుగు ప్రజానీకాన్ని చీల్చడమన్నది నిజంగా బాధాకరం. United we stand (win), Divided we fall (lose) అన్న సింపుల్ సూత్రం ఏ జాతికైనా వర్తిస్తుంది. చూద్దాం, ఏం జరుగుతుందో...?

Karthik said...

Chaalaa baagundi:-):-)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis