సృష్టిరచన దిశగా ఆధునిక విశ్వామిత్రుడు

జీవపరిణామ క్రమంలో మనిషి అవతరించాక అతనికి తన ఉనికి తెలిసినప్పటినుండి ఆ ఉనికి కారణమేంటో అన్వేషించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో తనకుతాను వేసుకున్న ఒక్కో ప్రశ్నకు అవాంతరాలను అధిగమిస్తూ జవాబు వెతుక్కుంటూవున్నాడు. ప్రస్తుతం ఆధునిక మానవుడికి అంతుచిక్కకుండావున్న రెండు ముఖ్యమైన ప్రశ్నలు స్థూలంగా...

1. విశ్వం ఆవిర్భావానికి కారణమైన బ్రహ్మ పదార్ధం ఎక్కడినుండి వచ్చింది ? అది ఎందుకు విస్ఫోటనం చెందింది ?

2. జీవం అనే సంక్లిష్టమైన స్థితికి  కారణం అలౌకికమా లేక కేవలం రసాయనిక చర్యలేనా ?

ఈ రెండు ప్రశ్నలకు సమాధానాల కోసం తరాలుగా ఎడతెరిపిలేని ప్రయత్నం జరుగుతుంది.  ఇటీవల జరిగిన పరిశోధనల ఫలితంగా శాస్త్రవేత్తలు పైన చెప్పిన రెండవ ప్రశ్నకు సమాధానం రాబట్టి తద్వారా  జీవం ఆవిర్భావానికి తోడ్పడిన కారణాలను విశ్లేషిస్తున్నారు.

అమెరికన్ బయాలాజిస్టు జే.క్రెయిగ్ వెంటర్ తమ పరిశోధనలలో భాగంగా బాక్టీరియా కణంలోకి పరిశోధనాశాలలో రూపొందించిన కృత్రిమ జీనోమ్‌ ను ప్రవేశపెట్టి ఆ కణాన్ని విజయవంతంగా పని చేయించగలిగారు. పరిశోధన ఫలితాలు విశ్లేశించేముందు అసలు ఈ  కణాలు, జీనోమ్ అంటే ఏంటొ ఒకసారి చూద్దాం.

ఒక ఇంటిని నిర్మించడానికి ఇటుకలను ఎలాగైతే పేర్చుతామో అలాగే ప్రతి జీవి శరీరము కణాలు అనే ఇటుకలతో నిర్మించబడుతుంది. మానవ శరీరం కోట్లాది కణాలతో శరీరములోని ఒక్కో భాగము ఒక్కో విధమైన కణాలతో నిర్మితమైవుంటుంది. ఇటుకలకు ఎలాగైతే రంగు, ధృఢత్వం లాంటి లక్షణాలుంటాయో కణానికి కూడా అలాంటి లక్షణలుంటాయి - ఆ కణము చేసే పని ఏంటి అని. కణంలోని జీనోమ్ కణం పనితీరుని నియంత్రిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆహారం నుండి శక్తి ఉత్పాదన, ప్రత్యుప్పత్తికి ఇతర జీవక్రియలకు కావలసిన జీవరసాలను తయారుచేసేవి కణాలైతే యే యే కణాలు ఏ పని చేయాలో నిర్దేశించేవి వాటిలోని జీనోమ్ అన్నమాట. మనం అప్పుడప్పుడు DNA అని వింటూ ఉంటాం కదా ఈ జీనోమ్ ఆ DNA అనే కార్బన మూలకానికి సంబంధించినదే.

చిత్రంలో ఎరుపు రంగుతో గుర్తించిన ప్రాంతంలో శక్తి ఉత్పాదన జరుగుతుంది, నీలం రంగుతో గుర్తించబడ్డ ప్రాంతంలో (Nucleus - కణ కేంద్రకం ) DNA వుంటుంది.

ఇప్పుడు విషయానికి వస్తే సదరు శాస్త్రవేత్తలు చేసిందేమిటంటే ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేసిన జీనోమ్‌ను కణంలో ప్రవేశపెట్టారు. కృత్రిమ  జీనోమ్ ప్రవేశపెట్టినప్పటికి కణం యథాలాగనే పనిచేసింది. కాని ఇక్కడ జీనోమ్ ఒక్కటే కృత్రిమం......తక్కిన కణభాగాలన్నీ బ్యాక్టీరియాలోనే వున్నాయి కాబట్టి దీనిని మనిషి చేసిన 'జీవం' అనలేము. అయితే ఈ  ప్రయోగాన్ని అనుసరించి మరొక శాస్త్రవేత్తల బృందం మొత్తంగా ఒక కృత్రిమ కణాన్నే రూపొందించేందుకు పూనుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు  cell membrane ( కణం యొక్క గోడ) ను తయారు చేయగలిగారు. మిగతా కణభాగాలను అభివృద్ది చేయడానికి ఇంకా కొన్నాళ్ళు పట్టవచ్చు. అటు తరువాత జీనోమ్‌ను ప్రవేశపెట్టి కణానికి ప్రాణం పోయగలగడం లాంఛనమే........

కృత్రిమ కణాన్ని సృష్టిస్తున్నాం మరైతే మనుషులను తక్కిన జీవులను కృత్రిమంగా తయారు చేయవచ్చా ? అనే సందేహం వస్తుంది కదూ.....దానికి సమాధానం 'చేయవచ్చు కాని అనుకున్నంత సులువుకాదు'. ఎందుకంటే ప్రస్తుతం మన కంటికి కనిపించే, చాలావరకు కంటికి కనపడని ప్రాణుల్లో కోట్లాది కణాలుంటాయి. ఒక్కో కణానిది ఒక్కో ప్రత్యేకత పైగా వాటి మధ్య సమన్వయం వుంటుంది. ప్రస్తుత ప్రయోగాలను అనుసరించి అంత సంక్లిష్టత సాధించడం కష్టంతో కూడుకున్నది......మన సమీప భవిష్యత్తులో కుదరకపోవచ్చు.

అయితే........కొన్ని సూక్ష్మక్రిములు వుంటాయి వాటి శరీరంలో ఒకే ఒక కణం వుంటుంది. ఈ ప్రయోగాల ద్వారా అటువంటి ఏకకణ ప్రాణిని  సృష్టించినా చాలు తరాలుగా మనిషిని సమాధానం దొరకని ప్రశ్నకు తెరదించడనికి......తద్వారా 'దేవుడు' అనే భావనను అర్ధం చేసుకోవడానికి. ఆరోజు అసాధ్యం మాత్రం కాదు.

పోస్టులోని చెప్పిన ప్రయోగాల విషయం ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ నొక్కండి

ఆర్టికల్ courtesy : FB link by a friend

బులుసు సుబ్రహ్మణ్యం గారు తన ఈ-మెయిల్‌లో సూచించిన మరికొన్ని ఆర్టికల్స్

Dr. Venter తో BBC వారి ఇంటర్వ్యూ
ది టెలిగ్రాఫ్‌లో ని ఆర్టికల్
నేచర్ న్యూస్‌ వారి ఆర్టికల్

8 వ్యాఖ్యలు.. :

Unknown said...

బాగా రాసారు .. కాని నాకో డౌటు ..
ఇప్పుడు మీరు చెప్పేది . కృత్రిమంగా ప్రాణాన్ని తయారు చెయ్యచ్చు అనా .. ఇలాంటి సృష్టి విరుద్దమైన పనులు కూడా చేయ్యగాలమంటార ..
నాకొకటి అనిపిస్తోంది .. ఇప్పుడు వాళ్ళేదో తాయారు చేసి ఆ ప్రాణికి ఆలోచించే స్వతహాగా .. లక్షణం కల్పిస్తే అది మన వినాశనానికి దారి తీస్తుందేమో ... హ్మ్ .. నాకు సబ్జక్ట్ అంత రాదు .. సో ..నేనేమి విస్లేశించలేను ..:)

ఏక లింగం said...

హాయ్ నాగార్జున,
కరెంట్ సైన్స్ మీద మీలాంటి కొందరు బ్లాగర్లు రాయడం సంతోషం కలిగించే విశయం.

క్రెగ్ వెంటర్ బృందం చేసిన ఈ పరిశోధన సైన్స్ లో ఒక కొత్త అధ్యయనానికి తెరతీసినా, ప్రకృతిని, జీవాన్నీ, జీవావిర్భావాన్ని అర్థం చేసుకోవడంలో మాత్రం మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నామనే చెప్పొచ్చు. ఈ పరిశోధన సృష్టికి ప్రతిసృష్టి కాదు, కేవలం అనుకరణన మాత్రమే. కృత్రిమంగా తయారు చేసిన జన్యుక్రమంతో కణాన్ని పనిచేయించం ఒకప్పుడు ఊహకే పరిమితం, దాని వెంటర్ బృందం ప్రయోగశాలలో చేసి చూపించారు. నిజంగానే ఇది ఒక ముందడుగు. ఈ బృందం ఇప్పుడు కృత్రిమ కణాన్ని తయారు చేసే దిశలో ప్రయోగాలు చేస్తుంది. వీళ్ళ ప్రయోగాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి.


ఇంకా ఇలాంటి సైన్స్ విశయాలు తరచుగా రాస్తావని ఆశిస్తూ...

..nagarjuna.. said...

అవును శ్రీనుగారు జీవశాస్త్రంలో పురోగతి భౌతికశాస్త్ర పురోగతి కన్నా తక్కువగా అనిపిస్తుంది. బహుశా biology లో ఉన్న సంక్లిష్టత కారణం కావచ్చు.

and thanks a lot for taking time out of your schedule to go through the article.

@కావ్య:పోస్టు రాసినంతమాత్రానా నేనేమి ఇందులో ఎక్స్‌పర్ట్ అనుకునేరు.....ఇంజనీరు స్టూడెంటుని సో నాక్కుడా పెద్దగా తెలియదు. ఆర్టికల్ చదువుతున్నప్పుడైతే ఎప్పుడో పదో తరగతిలో చదివిన DNA, RNA, ATP...గుర్తొచ్చి తెగ కన్‌ఫ్యూజ్ అయ్యా....

ఇక ఆ సైంటిస్టులు చేస్తున్న పని లక్ష్యం అదే, కృత్రిమ ప్రాణాన్ని సృష్టించడం దానిద్వారా మనకు 'సృష్టి' అనేదానిపై ఉన్న భావాలను మరింత మెరుగు పరుచుకోవడం. అయితే శ్రీను‌ గారు చెప్పినట్టు మనకు తెలిసింది కొంతే కాబట్టి అది అంత సులభం కాకపోవచ్చు......మీరన్నట్టు ఆ 'డేంజరస్' కృత్రిమ ప్రాణిని సృష్టించడానికి మరో రెండు మూడొందల సంవత్సరాలు పట్టొచ్చు. ఈలోగా ఇంజనీర్లు తయారుచేసే రోబోట్లే వినాశనం చేస్తాయేమో
Thanks for your comment.

..nagarjuna.. said...

బులుసు సుబ్రహ్మణ్యం గారి కామెంటు ఈ-మెయిల్ ద్వారా..
---------------------------------------
మీరు బహుశా ఈ కింది న్యూస్ ఐటెమ్ చూసే ఉంటారు. BBC homepage లో అనుకుంటాను చూసి ఇక్కడ పెట్టాను. Related articles కూడా అక్కడ ఉన్నాయి. వీలైతే చూడండి.

ఈ విధమైన playing god ప్రయోగాలు, Ethics of Genetic research, manipulations గురించి చాలా చాలా చర్చలు జరిగాయి. ఆ కాలం లో. ఇప్పుడు కూడా ఇంకా జరుగుతున్నాయి. Research ఫండ్స్, అవి కంట్రోల్ చేశారు. కొన్ని కొన్ని ఏరియాల్లో రీసెర్చ్ కుదరదన్నారు.



ఏది ఏమైనా సృష్టి రహస్యం తెలుసుకోవడం బహుశా ఇంకో 50- 75 సంవత్సరాలలో జరుగుతుందేమో. కానీ సృష్టించడానికి ఎంత కాలం పట్టుతుందో చెప్పలేము. అది scientists నిర్ణయం కాదు కదా పాలిటీషియన్సుది.
-------------------------------

సుబ్రహ్మణ్యం గారు ప్రస్తావించిన BBC లోని క్రెయిగ్ వెంటర్‌గారి ఇంటర్వ్యూ, కృత్రిమ కణం పై nature journal ఆర్టికల్ ను ఇప్పుడు పోస్ట్‌లో లంకెగా పెట్టాను. ఆసక్తి ఉన్నవారు చదవవచ్చు.

సుబ్రహ్మణ్యంగారికి బ్లాగుముఖంగా ధన్యవాదాలు

మధురవాణి said...

మీకు అభినందనలు.. బాగా రాశారండీ! పైన మీరు చెప్పినదాని ప్రకారం మీరు ఇంజనీర్ అయ్యుండి కూడా బయాలజీ వ్యాసాన్ని చక్కగా రాశారు :)
పైన శ్రీను గారి కామెంటుతో ఏకీభవిస్తున్నాను. కృత్రిమంగా ఒక కణాన్ని పూర్తిగా తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని. ఒకవేళ అది జరిగినా కూడా వెనువెంటనే, చకచకా ప్రాణులని పుట్టించెయ్యలేము.. మీరన్నట్టు కంప్యూటర్లు, భౌతిక శాస్త్రంతో పోలిస్తే జీవంలో చాలా సంక్లిష్టత ఉంది .. దాని వల్ల జీవం వెనక ఉన్న రహస్యాలని చేధించడం మరింత కష్టం! కానీ, శ్రీను గారన్నట్టు సైన్సు ముఖ్య ఉద్దేశ్యం ప్రకృతిని, జీవాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించడమే గానీ, ప్రతి సృష్టి చేయాలి అనుకోడం కాదు.
బులుసు గారన్నట్టు, ఏ రీసెర్చ్ అయినా నిధులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వాల మీదే ఆధారపడి ఉంటుంది. ;)
I don't know how far this is relevant here...
There is always a huge debate about this transgenic organisms.
Many developed countries are against genetically modified crops and food products. They carry out the research there. But, 90% of the field trials were carried out in developing countries like India and some african countries! :(

శివ చెరువు said...

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు

Anonymous said...

I really like your post. Will continue reading your blog. :)

Ennela said...

బయాలజీ అంటె భయమని వదిలేసి పొరపాటు చేసా..!!! ఇప్పుడు చదివితే బాగా అర్థం అయ్యింది..అయ్యో...డాక్టరు అయ్యే చాన్స్ పోగొట్టుకున్నానే :(

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis