మై తెలుగువాలా హై-2

ఎవరివాదన ఎలావున్నా విషయంతేలీని ‘కుహనా’గాళ్ల గొడవ రోతగావుంది. తెలుగు, ఆంధ్రము వేరు  కాబట్టి తెలంగాణా, ఆంధ్ర వేర్వేరు రాష్ట్రాలవడంలో తప్పులేదనే మహానుభావులనుండి మేమొ మీకు తినడం నేర్పించాం ఇప్పుడు తెలంగాణానుండి వెళ్ళిపోమంటే మీరు బాగుపడనే పురాణపురుషులున్నారు. లెక్కలు పత్రాలంటూ వాదించే వారికి కొదవేలేదు. చూడండి మా బతుకులు అత్యంత దరిద్రంగావున్నాయనొకరు, అబ్బే అలాంటిదేంలేదు ఇక్కడ చూడు..... మనం నిండువెన్నల చంద్రుడిలా వెలిగిపోతున్నాం మాకన్నా మీరు మహబాగా వెలిగిపోతున్నారనొకరు. తెలుగునేలలో ఎవరుకూడా ‘ప్రాంతీయత’ కారణంగా దుర్భ్హరంగాకాని సంపన్నంగాకాని బ్రతకడంలేదు. ఇక్కడవున్నవి అసమానతలు, వాటిని పెంచిపోషిస్తున్నది పదవులకోసం,ముడుపులకోసంమాత్రమే బతుకీడుస్తున్న నాయకగణం, ఎంత దగాపడినా మళ్ళి ‘అన్యథా శరణఁనాస్తి త్వమేవశరణం మమః’ అంటూ అదే నాయకుల ఉచ్చులో పడుతున్న సామాన్య ప్రజలు.

మనలో మనకు ఐక్యతలేకపోవడమే ఈ పరిస్థితికి మూలమా అని ప్రశ్నించుకుంటే బుర్రలో ఏదోమూల అవుననె సమాధానం వినపడుతుంది నాకు. కారణం ‘భాష, దాని అనుబంధాలైన social lifestyle’ అంటుంది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో మొదటి రాష్ట్రం అయివుండి, పక్కనవున్న రాష్టాన్ని అదే కారణంచేత విలీనం చేయించుకొన్న ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలను ఒకే ‘తెలుగు’ గొడుగుకిందకు తేలేకపోయాం. పూర్తిగా ఒకరికొకరు ఉత్తర-దక్షిణ ధృవాల్లాగా వున్నారనికాదు కాని ఇన్నేళ్లుగా time తీసుకువచ్చిన సఖ్యత తప్ప ( ఓ గదిలో ఎక్కడేక్కడినుండో తెచ్చిన కోతుల్ని తెచ్చిపెడితే ముందు నానా పెంట చేస్తాయి...సమయం గడుస్తున్నకొద్ది వాటిల్లొ ఓ harmony వస్తుంది, కొట్టుకోకుండా వుంటాయి. వాటిల్లొ ఏఒక్కదానికి ‘కోతిబుద్ది’ పుట్టినా మళ్ళి అల్లరి మొదలు..అలావుంది పరిస్థితి) నిజంగా కలుపుగోలులేదు. మనల్ని ఐక్యంచేసిన భాషకి తిలోదకాలిచ్చాం. ఇప్పుడు తెలుగు టెలుగైపోయింది పొరుగు రాష్ట్రపు సోదరుడికి తన భాషమీదున్న అభిమానం మనకు కరువైంది. పోని సాంస్కృతికంగానైనా దగ్గరిచేసే ప్రయత్నాల్లేవ్‌. ప్రాంతీయ uniqueness పేరుతో తెలుగువాళ్లం ఒక్కరంకాలేదు. తెలంగాణోడికి ఇక్కడ రజకార్ల పోరాటం, నిజాం తెలుసు ఆంధ్ర-సీమ జిల్లాల యాస వేరని తెలుసు, అవతల పక్కా అంతే. కాని వేరుగావున్నప్పుడు మనం ఎలా జీవిచాం, అసలు తెలుగువాళ్ల మధ్య ఈ అంతరం ఎందుకు వచ్చింది, ఒకళ్ళుగా వున్నవాళ్లు ఎలా వేరుపడ్డాం ఎలా ఒక్కరయ్యాం ఎంతమందికి ఎఱక.తెలిసిందంతా 1956లోఆంధ్రా ఆంధ్రప్రదేశ్‌ అవడంచేత ఒక రాష్ట్రంలోవుంటున్నాం.  భేదం అంతరించేందుక్కాకుండా దాన్ని చూసి పౌరుషాలగడ్డనో,సాహితిపుణ్యభూమనో  ఎవరికి వాళ్లు మీసాలు మెలేసుకున్నారు. యాసని-ప్రాంతీయ జీవనానికి ఓ రంగేసి ఈ ప్రాంతం అంటే ఇలాంటి మనుషులు మాత్రమే అని అర్థమిచ్చేలా అలుపెరుగని కృషిచేస్తున్న సినిమారంగాన్ని గూరించి చెప్పనక్కరలేదు ( ఈ మాట అనడానిక్కారణం భారతదేశంలో హింది తరువాత తెలుగు సినిమా మార్కేటే ఎక్కువ. సినిమా చూసి హీరోయిజం/త్యాగాలు/సేవలు చేసేవాళ్లుండకపోవచ్చు కాని దాన్ని బుర్రలో పెట్టుకొనే వాళ్లు చాలానే)



అభివృద్దిని పంచకుండా అంతా ఓ దగ్గర కుప్పపోసాం. విలీనమైనప్పుడు ఈ రెండు రాష్ట్రాల భౌగోలిక స్థితిగతులు వేరు, వనరుల వినియోగతీరు వేరు,  వీటిని సమన్వయపరచడానికి తయారుచేసుకున్న ఒప్పందాలు తుంగలోతొక్కబడ్డాయి. కారణాలు విశేష్యమైనవి కాకపోవచ్చు ‘ప్రాంతీయ’భావం అప్పుడు లేకపోవచ్చు కాని అది జరిగిన ప్రదేశం మాత్రం విశేష్యమైనదే. మనం పొరుగునవుండి తగవుపడకుండా పరస్పరం సహరించుకుంటూ అభివృద్ది చెందుదామని ఒకటైనవారం.అలాంటి చోట అసమానతలకు అవకాశం ఇప్పించడం మనం ఏర్పరుచుకున్న వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. దొంగ చేతికి కన్నంవున్న ఇల్లు దొరికినట్లు మనం  అప్పుడు చేసిన పొరపాట్లు ఇవాళ బుర్రలేని తిక్కసన్నాసులు ఎంత వీలైతె అంత స్వప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారు.


అసలు 1969లోనే మహత్తరమైన సదవకాశం మనకువచ్చింది. వేర్పాటువాదం లేచిసద్దుమణిగినప్పుడు అందుక్కారణాలను వెతికి పరిష్కరించాల్సింది. ఓ చారిత్రిక అవకాశం రాజకీయ బురదలో కనుమరుగైంది. కొంతమేరకు తెలుగుదనం వికసించి ‘తెలుగువార’నే గుర్తింపు ప్రాంతీయ పార్టీఐన తెలుగుదేశం హయాంలో వచ్చింది.అలానే వుంటే బహుశా వేర్పాటువాదం కాలగర్భంలో కలిసిపోయేదేమో. పదవిరాలేదని ఒక్కడు మొదలుపెట్టిన యాగి అధిష్టానాన్ని సంతృప్తి పరచడానికి ఎంపీలను టోకుగా ఇచ్చేసిన ఇక్కడ భగవంతుడి పాలనలో పరిపూర్ణమైంది. ఒకవేళ వై.యెస్‌.ఆర్ వుండివుంటే KCR ఇంత సీన్ చేసేవాడుకాదేమో నెల-నెలన్న రోజులకోసారి చెప్పే సోది తప్పించి.


ఇప్పుడున్న సమస్యకు JPగారు ఓ విధంగా మంచి పరిష్కారమే సూచించారు "నిజంగానే విడిపోవాలనుకుంటే అలానేకానివ్వండి కాని ఒకళ్ళమీద ఒకళ్ళు విద్వేశాలు పెంచుకుంటూ కాదు,ఇలాంటి తరుణంలో వద్దు. కలిసేవుందాముకుంటే ప్రాంతీయ అసమానతలు రూపుమాపడానికి రీజనల్‌ కమిటీలు వేసుకుందాం, అధికార వికేంద్రీకరణ జరుపుదాం". కొట్టుకుంటూ విడిపోవడమో, ఏది తేలకుండా సద్దుమణిగాక మళ్లి తాడుబొంగరంలేని పూటకోమాటమార్చేటోల్ల చేతిలో విషయం నలగకుండా చూసుకుందాం


మా తెలుగు తల్లికి మల్లెపూదండా,
మాకన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి

గలగలా గోదారి కదిలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను....

నేను తెలుగువాడిగా పుట్టాను, తెలుగువాడిగానే వుంటా. స్వప్రయోజనం కోసం తెలంగాణాఅనో ఆంధ్రమనో అడ్డమైన గడ్డికరిచే సన్నాసులను నే లెక్కచేయను. 
మై తెలుగువాలా హై
---------------------------------------------------------------------------------------------------------------

PS- శరత'కాలమ్’: ఏం కెలుకుడుకి కొత్తపదం కనిపెడితివోగానిబాసు......దాన్ని కాస్తా కొత్త తిట్టుకింద వాడుకుంటూన్నారు జనాలు. కామేడికి మొదలుపెట్టింది కాస్తా సీరియసైపోయింది. pants off to you.....

6 వ్యాఖ్యలు.. :

శరత్ కాలమ్ said...

:))

Anonymous said...

మై తెలుగువాలా హై

First try to correct the above sentence. ;-)

..nagarjuna.. said...

@ శరత్: lol
@ అజ్ఞాత: కరెక్ట్ చేసేదిలేదు,అదంతే :)
@ నిజం:మీ కామెంటుని గూగుల్ గల్లంతు చేసిందండి, display అవటంలేదు.కామెంటు అభినందనలకు నెనర్లు.

Anonymous said...

అన్నమైతే నేమి రా
మరి సున్న మైతే నేమి రా ?
అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేతాము రా !
అన్నట్టుంది మీ వాదన !
తెలంగాణా గోస మీకు అవసరం లేదు.
తెలంగాణా తన మానాన తను బతకడం మీకు ఇష్టం లేదు .
నీతులు చెప్తారు.
సమైక్యాంధ్ర తెలుగు పదాలను బూతులుగా మార్చేసారు.
ఎందుకుచ్చిన దొంగ మాటలివి.

నిజం said...

ఒక తెలంగాణా ప్రాంతం వాడిగా చెపుతున్న......విడిపోవడం తెలంగాణా ప్రజలకు కూడా ఇష్టం లేదు కానీ సమైక్యం గ ఎన్ని రోజులు వున్నా తెలంగాణా అబివృద్ది చెందదు అని బావించి విడిపోవాలని కోరుకుంటున్నారు. కలిసినప్పుడు చేసుకున్న ఒప్పందాలు అమలు చేసి వుంటే ఇంత దొర్బాగ్యం పట్టేది కాదేమో. 610 GO కోసం వాటర్ కోసం గొడవ చేసిన ప్రతి సారీ ఆంధ్ర ప్రాంతం వారు దానిని వ్యతిరేకించి eppudu కలసివుందాం అనడం సరియిన విషయo కాదేమో.

..nagarjuna.. said...

@రెండవ అజ్ఞాత: సమస్యలు నాకేమి వినిపించట్లేదని చెప్పడంలేదు.పరిష్కారం విభజనే అయితే, తెలంగాణా స్వతంత్ర రాష్ట్రంగావుండాలనుకుంటే అది ఇప్పుడున్న నాయకుల చేతిమీదుగా వొద్దంటున్నాను.ఇప్పుడు గనుక తెలంగాణా వచ్చినట్ల్లైతే కేసిఆర్ గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. నా తెలంగాణాని అలాంటి ఊసరవెల్లుల చేతుల్లోకి వెళ్ళనివ్వడానికి నేను వ్యతిరేకం. ఆంధ్రప్రదేశ్‌లో మనకు అన్యాయం జరిగిందనుకుంటే తెలంగాణా వచ్చాక దాని అభివృద్దికి కుట్టుబడే నాయకత్వం ఇప్పుడుందని చూపించండి, నేను కూడా మీతో గొంతు కలుపుతాను.స్వతంత్ర తెలంగాణా కోసమే ఉద్యమం జరుగుతున్నట్లైతే ఇక్కడున్న రాజకీయ చీడపురుగులని కూడా తరిమికొడదాం.అంతేగాని ఉనికిని చాటుకోడానికి ప్రజలమధ్య విధ్వేషాలు రాజేసేటోల్లకు వంతపాడొద్దు.


@నిజం:
>>విడిపోవడం తెలంగాణా ప్రజలకు కూడా ఇష్టం లేదు కానీ సమైక్యం గ ఎన్ని రోజులు వున్నా తెలంగాణా అబివృద్ది చెందదు అని బావించి విడిపోవాలని కోరుకుంటున్నారు.కలిసినప్పుడు చేసుకున్న ఒప్పందాలు అమలు చేసి వుంటే ఇంత దొర్బాగ్యం పట్టేది కాదేమో. << I agree.

కలిసుందామనడంలో తప్పులేదు అది అక్కడి ప్రజల మనసులోమాట. నాయకుల ‘సమైక్య’రాగం ఎంత స్వచ్చమైనదనేదె పెద్ద ప్రశ్న .ఒకవేళ కలిసుండికూడా పరస్పరం సహకరించుకోకుంటే,అభివృద్దికి తోడ్పదకుంటే కలిసుండడం నిష్ఫలం.

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis