మీరెమంటారు

కీసరగుట్ట దేవాలయ పరిసరాల్లో జరుగుతున్న సంఘటనలపై NTv కధనం చూడండిసారాంశం మీకు అర్థమయ్యేవుంటుంది, గుడి పరిసరాలను యంగ్ కపుల్స్- మీడియా భాషలో ‘ఒళ్ళు బలుపు’వున్నవాళ్ళు పార్కుల్లాగా వాడేసుకుంటున్నారని  అంటుంది. ఈ వీడియో చూసిన చాలామందికి  కూడా అలానే అనిపించుండొచ్చు-ఒళ్ళు బలుపు అని.
ఇక ఈ టాపా రాయడానికి ముఖ్యకారణం కట్టా విజయ్ గారి బ్లాగులోని ఈ టాపా, దానికి వచ్చిన వ్యాఖ్యలు. అక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటంటే ప్రపంచం నాగరికమౌతుంది, మగాడు తాగగాలేంది ఈ రొజుల్లొ అమ్మాయిలు తాగితే తప్పేంటి అని. ఒకవేళ తాగినా అది వారి వ్యక్తిగతమైన విషయం, దాన్ని గురించి చర్చిండం ఎందుకని.

ఇక్కడ నేను మాట్లాడదలచింది ఆడవాళ్ల హక్కుల గురించి కాదు, వీడియోలో చూపించింది తప్పోవొప్పో చెప్పడానికి అంతకన్నాకాదు.  మాట్లాడలనుకుంటుంది ఈ రెండు సంఘటనల వెనకవున్న అసలు attitude గురించి- ఆధునిక నాగరికపు సమాజపు పోకడగా చెప్పబడుతున్న స్వేచ్చ గురించి. ఒక్కసారి ఆలోచించండి, ఆ వార్తాకథనం కనుక గుడి దగ్గర జరుగుతున్న రొమాన్స్ ని కాకుండా ఏ పబ్లిక్‌ పార్కులోనో, సాగర్ చుట్టుపక్కలో  జరుతున్నవీర రొమాన్స్ చూపిస్తే మనకు కలిగే అభిప్రాయంలో ఏమైనా మార్పుండేదా? నేననుకోవడం కొద్దోగొప్పో అదే భావనవుంటుంది.  ఇప్పుడు  కట్టాగారి టాపాగురించి మాట్లాడుకుందాం, ఓవేళ అక్కడవున్నది నిజంగానే ఆల్కహాలైనా,  రూంలోకాకుండా బార్లోనే తీసుకుంటున్నారని చూపించేట్టుగావున్నా వ్యాఖ్యల్లో తేడావుండేదికాదు. అందులో తప్పేంటి అని అనేవారే.

అయితే ఈ రెండు విషయాల్లోనూవున్న కామన్‌పాయింట్ ఒక్కటే. they were exercising their choice granted by their liberty. మరి రెండొ సంఘటనలో తప్పనిపించని స్వేచ్చ, మొదటి సంఘటనలొ తప్పుగా ఎందుకు తోస్తుంది. రెండిట్లోనూ సరదాకోసమో మనస్ఫూర్తిగానో ఇతరులకు నష్టంకలక్కుండా వాళ్ళు చేయలనుకున్నది చేసారు. మరి ఒకటి తప్పు మరొకటి తప్పుకాదన్నట్టు ఎందుకనిపిస్తుంది.

కాకతాళియంగా ఇవాళ ఫ్రెండ్స్ తో MMS scandals,  సినిమాల గురించి మాట్లాడుతుంటే మాటల్లో స్వేచ్చ ప్రస్తావనొచ్చింది. మావాడొకడిలా అన్నాడు " ఇలాగే స్వేచ్చ అనుకుంటూ కంటిన్యూ అయితే ఇంకో 10-15 ఏళ్లలో మన సొసైటిలో ఆడవాళ్లపై ఉన్న గౌరవం పోతుంది"అని. వాడు చెప్పాలనుకున్నది మగాడికివున్న స్వేచ్చ ఆడవాళ్లకు ఉండకూడదని కాదు, స్వేచ్చ అంటూ అనుసరితున్న పోకడల పట్ల విమర్శ మాత్రమే.గమనిక: కట్టాగారి టాపాలోని విషయాన్ని ఉదాహరణ కోసం ప్రస్తావించాను. అంతేగాని అది తప్పా సరైందా చెప్పడానికికాదు. కాబట్టి ఫెమినిజం అంటూ ఆడ స్త్రీ  లేడిస్‌ను కించపరిచానని అన్యధా భావించవద్దు. అది నా అభిప్రాయంకాదు.

2 వ్యాఖ్యలు.. :

మైత్రేయి said...

ఏవి విలువలు అన్న మాట పక్కనుంచి, అసలు విలువలు బలవంతాన రుద్దితే రావండి. అవి మరో అనర్దానికి దారి తీయటం తప్పించి.
ఉదాహరణకు కేరళలో ఇద్దరు చిన్నపిల్లలు (మైనర్లు) క్లోజ్ గా ఉన్నవిషయం mms తీసి చూపటం ద్వారా అలాంటి వాళ్ళను నిలుపు చేద్దామను కొన్నాడు ఒక పెద్ద మనిషి. వాళ్ళిద్దరూ ఆత్మ హత్యచేసుకొన్నారు.
అలాగే ఈ విడియోలో పిల్లలు ఎమన్నా చేసుకొంటే ఎవరు వాళ్ళను చంపినట్లు?
చిన్నతనం లో ముఖ్యం గా టీన్స్ లో ఏదో చేస్తుంటారు వాళ్ళను అంత పబ్లిక్ గా అవమానం చెయ్యటం అవసరమా?
మీ వాళైతే ఏమి చేస్తారు అన్నారు ఒకరు, నా వాళైతే ఇంట్లో కోప్పడతా బయట గలభా చేస్తానా?
గుడి ఆవరణ లో అలాంటి వాతావరణం ఉండ కూడదనుకొంటే గుడి వాళ్ళు చూసుకోవాలి. మీడియాకు అవసరమా?
ఒకళ్ళ ప్రైవేటు కదలికల్ని ప్రదర్శించటం తప్పనే రూల్ రావాలి.

Anonymous said...

totally agree with మైత్రేయి గారు. the ntv channel should be slapped with chappals. నీవు బ్లాగులో ఈ విడియో పెట్టడం చవుకబారుగా ఉంది. మగవెధవలు చేస్తున్న నీచమైన పనులకు ఆడవాళ్ళు బలిఅవుతున్నారు. you have very detestable taste.

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis