కాలేజీలొ దీపావళి వేడుకలు, కబుర్లు

ఐ.ఐ.టి ఖరగ్‌పూర్ లో దసరా తరువాత అంత ప్రతిష్టాత్మకంగా జరిపే పండుగ దీపావళి. ఆ రోజున హాస్టల్స్ అన్నీ మట్టి దీపాలతో తమనితాము అలంకరించుకుంటాయి. 'ILLU' (Illumination కు పొట్టి పేరు) లో భాగంగా విద్యార్ద్రులు తమ తమ హాస్టల్స్‌లో తాము ఎంచుకున్న ఒక విషయాన్ని మట్టిదీపాలతో తీర్చిదిద్దుతారు. మరొక విభాగం 'Rangoli'లో భాగంగా సహజ రంగులను,సున్నం, మట్టి వగైరా వాడి నేలపై అపూర్వ చిత్రాలను అవిష్కరిస్తారు. ఈసారి పండుగ మొదట్లో కొన్ని హాస్టల్స్ ర్యాగింగ్ సంబంధిత విషయాల వల్ల దీపావళిని బహిష్కరిస్తామని చెప్పినా చివరకు అవన్నీ సద్దుమణిగి దీపావళి దిగ్విజయంగా, బ్రహ్మాండంగా జరిగింది.

మా హాస్టల్‌‌కు ILLU లో నాల్గొవ స్థానం లభించింది.


 ILLU కోసం దీపపు కుందులను సిద్దం చేస్తున్న విద్యార్దులు


నా రూమ్

RP (Rajendra Prasad) హాల్ విద్యార్దుల ILLU విడియో



పికాసలో  ILLU మిగతా ఫొటోస్ కోసం  ఇక్కడ నొక్కండి.

రంగోళి  స్లయిడ్ షో...



 Rangoli ఫొటోస్ కోసం ఇక్కడ నొక్కండి


దీపావళికి కొద్దివారాల ముందు కాలేజిలో ఉన్న తెలుగు సాంస్కృతిక సంఘం (TCA) నుండి తెలుగువారి కోసం తెలుగు సాంకేతిక నాటక సంఘం (Telugu Technology Dramatics Society - TTDS) ను నెలకొల్పారు.ఇప్పటికే ఇంగ్లీష్, హింది, బెంగాలి నాటక మండళ్లు ఉన్నాయి.కొత్తగా తెలుగు నాటక సంఘం. సంఘం ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యాతల టెంగ్లీష్ మాటల నడుమ 'నవసమాజం' నాటకం విజయవంతంగా ప్రదర్శింపబడింది.

అంతా బాగానే ఉంది ఈ 'సాంకేతిక' నాటక మండలి ఏమిటి అని ఆలోచిస్తున్నారా. మరేం లేదు, మా ఐ.ఐ.టి ఖరగ్‌పూర్ కు ఒక వింత ఆచారం ఉంది. కాలెజిలో కొత్తగా ఏదైనా కట్టడం చేసినా, సంఘాలు-బృందాలు ఏర్పడినా  వాటి పేరుకు ముందు ఒక తొండం (తోకైతే వెనక ఉండాలి, పేరుకు ముందు ఉంటుంది కాబట్టి తొండం అనమాట) లాగా Technology అనేది తగిలిస్తారు. Technology Gymkhana, Technology Swimming pool, Technology market, Technology Dance Society, Technology Literature Society.....ఇలా ప్రతిదానికి తొండం ఉంటుంది. అంతకు మించి 'సాంకేతికం' అన్నంత మాత్రాన ఆ లెవెల్ దృశ్యం ఉండదు.


హ....చెప్పాల్సిన సమాచారం ఐపోయింది ఇక సొంత సోది చెబుతా. ఓ రెండు నెలలుగా గమనిస్తున్నాను, బ్లాగింగుకు దూరంగా ఉన్నప్పుడు కూడా నా లైఫ్‌లోకి 'బ్లాగర్' గాడు చొరబడిపోతున్నాడు. ఏదైనా పని చేస్తున్నప్పుడుగాని, ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడుగాని లోపల ఉన్న బ్లాగర్‌గాడు బయటకొచ్చి 'ఈ సీన్ ఈ యాంగిల్‌లో బావుంటుంది', 'ఈ సమయంలో వీడి స్పందన ఇలా ఉంది' లాంటి సలహాలిస్తున్నాడు. అందువల్ల Experience తక్కువ Evaluation ఎక్కువ చేస్తున్నాను.
పైపెచ్చు సెమిస్టరు అయిపోవచ్చింది. ప్రాజెక్టు ప్రజెంటేషను, సెమినారు ఆ తరువాత ప్లేస్‌మెంట్ తంతు  ఉన్నాయి...

కాబట్టి  కొన్నాళ్లు బ్లాగింగుకు సెలవు......పునఃప్రవేశం నూతన సంవత్సరములో చేస్తా...


ఈలోపు ఏవైనా పండుగలు, ఎవరివైనా మనుషులవి/ కెమెరాలవి/కంప్యూటర్లవి/బ్లాగులవి గట్రా పుట్టిన రోజులు/పెళ్ళిరోజులు/వార్షికోత్సవాలు లాంటి శుభదినాలు ఉంటే నా తరఫున ముందస్తు ____________రోజు శుభాకాంక్షలు. ఖాళీలో తత్సంబంధిత రోజును, సందర్భాన్ని పూరించుకోగలరు... happybig grin


చాలా రోజులుగా వినిపిద్దామనుకుంటున్నా మీకు ఈ పాటను...ఇప్పటికి కుదిరింది. 'నేను మీకు తెలుసా' నుండి నాకిష్టమైన ఒక పాట...వెస్టర్న్ బీట్స్‌తో (Scorpion King సినిమా నుండి కాపి కొట్టారులెండి ) పూర్తిగా తెలుగు సాహిత్యం.



మరిక సెలవు. Have fun folks....

12 వ్యాఖ్యలు.. :

మనసు పలికే said...

నాగార్జున భలే ఉంది నీ టపా..:) చాలా బాగున్నాయి మీ ILLU ఇంకా రంగోళి ఫోటోలు.:)
ఇదంతా సరే కానీ చివర్లో ఈ విరామం ఏంటి బాబూ..:( అయితే నీ తరువాతి టపా కోసం మేము వచ్చే సంవత్సరం వరకూ చూడాలా..:( సరేలే, wait చేస్తే చేశాం కానీ నువ్వు చెయ్యబోయే పనులన్నిటిలో నీకు విజయం తోడుండాలని మనసారా కోరుకుంటున్నాను..:) I wish you all the best.. We will miss you buddy.

వేణూశ్రీకాంత్ said...

బాగున్నాయ్ కబుర్లు ఫోటోలూనూ.. హ్మ్ విరామమా అటులనే కానిమ్ము విజయోస్తు మిత్రమా. చేపట్టిన కార్యక్రమాలన్ని విజయవంతముగా ముగించుకుని తిరిగిరా అదృష్ట దేవత సదా నీవెంటఉండుగాక.

స్నిగ్ధ said...

chaalaa baagunnaayanDee deepaavaLi kaburlu...mee Chaayaa chitraalu kooDaa baagunnaayi...
all the best for ur presenation,seminar and placement...
:)

హరే కృష్ణ said...

:))
Picasa pics are just great

కాస్త మన రేంజ్ కి తగ్గట్టు GE or shell లో మంచి ప్లేస్మెంట్ రావాలి మరి

The most important phase of M.Tech మొదలయ్యింది అన్నమాట..!
ఈ నలభై రోజుల్లో జీవితాన్ని నిర్ధారించే సమయం మళ్ళీ రాదు..అన్ని కంపనీలు కూడా రావు
Wishing you all the best
do the best!

శుభమస్తు
ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

manasa said...

బాగున్నాయి మట్టి దీప అలంకరణలు. ఇంతకీ మీకు నాటకం లో పాత్ర ఉందో లేదో చెప్పలేదు. ఉంటే ఆ వీడియో కూడా పెట్టండి. Wishing you all the best.

Come back in New year with a Good news.

Manasa

శిశిర said...

బాగున్నాయి మీ దీపావళి వేడుకలు. ఇంటి దగ్గరే ఉన్నా కూడా ఇంత బాగా దీపావళి జరుపుకోవడం జరగదేమో. :) IIT దీపావళిని చూపించారు.
మీకు అన్ని విధాలుగానూ విజయం కలగాలని (కలగాలని ఏమిటి, కలుగుతుంది :))కోరుకుంటున్నాను. Wish u all success & Good luck.

శివరంజని said...

బ్లాగింగ్ కి దూరంగా ఉంటానంటే కొంచెం ఫీల్ అవుతున్నా మంచి ఫ్యూచర్ కోసం తప్పదు కదా ... మీరు చేసే పనులన్నీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను I wish you all the best.Come back in New year with a Good news....
చిన్న కాంప్లిమెంట్ : ఆ కార్టూన్ లో ఉన్న నాగార్జున గారు సూపరో సూపర్

Mopuri K Reddy said...

chaari garu,outside world ki illu ni baga present chesaru. chala bagundi mi టపా.......!

3g said...

I wish you all the best nagarjuna..... నువ్వు చెయ్యబోయే అన్నిట్లో నువ్వనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

మాలా కుమార్ said...

ఈ రోజే చూస్తున్నాను మీ పోస్ట్ . మీ హాస్టల్ లో దీపాల అలంకరణ , రంగోలీ చాలా బాగున్నాయి .
మీకు అన్నింటా విజయము కలగాలని , మీ ప్రయత్నాలు సఫలం కావాల్ని కోరుకుంటూ ,
బెస్ట్ ఆఫ్ లక్ .

..nagarjuna.. said...

పోస్టుకు వచ్చిన వ్యాఖ్యలకు చాలా....రోజుల తరువాత (రోజులేంట్రా ఫూల్ నెలలు ఐతేను అని మీరనుకుంటున్నారని అనిపిస్తుంది...ఫరవాలేదు ఇప్పటికిలా కానెచ్చేయండి :) ) తిరిగి వ్యాఖ్యానిస్తున్నందుకు ముందుగా బ్లాగ్మిత్రులకు క్షమాపణలు x క్షమాపణలు

పోస్టులో ’కొత్త సంవత్సరంలో వస్తాను’ అన్న భీష్మ ప్రతిజ్ఞ ఒకటి పెట్టాను కదాని ఇన్ని రోజులు తిరిగి కామెంటలేదు.

అభిమానంగా విషెస్ చెప్పినవారందరికి పేరుపేరునా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు.

మోడరేషన్‌లో ఉన్న కొన్ని కామెంట్లను పబ్లిష్ చేయడంలేదు... కారణం ఏమిలేదు (తొక్కలో లాజికులు తప్ప :D) మిత్రులు అన్యథా భావించవద్దు.

మీ అందరికి ఆలస్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు, చాలా ఆలస్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

త్వరలోనే కొత్త టపాతో రాగలనని ఆశిస్తూ...

have fun folks... :)

Ennela said...

వెల్కం బ్యాక్ ..మీరు మంచి మంచి పొస్ట్లు తొందరగా వ్రాయండి..విష్ యు ఆల్ ద బెస్ట్...

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis