RK Narayan - భారతీయ ఆంగ్ల సాహితీ లోకంలో ఈ పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. 'మాల్గుడి' అనే అధ్బుత కాల్పనిక లోకాన్ని ఆవిష్కరించిన ఘనుడు ఆయన. చిన్నపుడు దూరదర్శన్ లో మాల్గుడి కథలు ప్రసారమయేవి, కాలక్షేపానికి బానే అనిపించేవిగాని ఓ పట్టాన అర్ధమయ్యేవికావు. కొంచెం పెద్దాయ్యాక పాఠ్యపుస్తకాల్లో ఆయన రచనలు కొన్ని ఉండేవి. చిన్న చిన్న కథలు అవి. నేటివిటి ఉన్నా అంతగా ఆకట్టుకోలేదు. ఇంజనీరింగ్ వచ్చాక స్నేహితుడొకడి దగ్గర ఆయన రాసిన The English Teacher ఉంటే తెచ్చుకొని చదవటం మొదలుపెట్టా. అప్పటికి మా-టివి లో మాల్గుడి కథలు పునః ప్రసారమౌతుండేవి కాని ఆ డబ్బింగ్ వినలేక వదిలేసా. నవల చదవటం మొదలు పెట్టానోలేదో ఆ శైలి నన్ను కట్టి పడేసింది. అరే! చాలా సాధారణమైన పరిసరాల వర్ణన, ఆర్భాటం లేని మనస్థత్వలతో పెద్ద మాయలు చేసాడు. చెప్పాలంటే ఆయన రచనల్లో జలపాతాలో, పూలతోటలో కాకుండా మామూలువి అనుకునే ఓ టేబుల్, ఓ పెన్ను, ఓ చెంబు, దేవుడి గూట్లో అగర్బత్తి లాంటివే ఎక్కువుంటాయి. అవే కథలో రమణీయతకు సహాయం చేస్తాయి. మాల్గుడి ప్రస్తావన తీసుకువస్తే పాఠకుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తనూ ఆ ఊర్లో భాగమైపోవాల్సిందే. అన్ని కథలు ఆ మాల్గుడిలోనే జరుగుతాయ్, ఆ ఊరితో ఏదో సంబంధం ఉంటుంది, అయినా ఎన్నిసార్లు ఆవూరి ప్రస్తావన వచ్చినా విసుగనిపించదు పైపెచ్చు 'ఈ సారి ఊర్లో ఏం జరగబోతుందో !' అనే కుతూహలం కలుగుతుంది.అలా ఆయనకు పెద్ద పంఖానైపోయి మొన్నీమధ్య ( అంటే ఓ ఏడెనిమిది నెలల ముందు) Waiting for the Mahatma పుస్తకం కొన్నా. కాలేజిలో ఉండంగా వారానికో పేజీ చొప్పున చదివీ చదవలేక పక్కనపడేసా. ఇంటికొస్తూ టైంపాస్ కోసమని రైల్లో చదవటం మొదలుపెడితే ఇంటికొచ్చేసరికి పూర్తయింది :). ఇప్పటివరకు నే చదివిన నారయణ్ గారి పుస్తకాల్లో ది బెస్ట్. భారతి-శ్రీరాం-మాహాత్ముడి చుట్టూ కథ నడుస్తుంది. శ్రీరాం చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోతే నానమ్మ పెంపకంలో పెరుగుతాడు. మైనారిటీ తీరాక శ్రీరాం పేరిట బ్యాంకులో ఉన్న డబ్బును తనకే అప్పజెబుతుంది నానమ్మ. అసలే కుర్రోడు పైగా బ్యాంకు బ్యాలెన్సువుంది కనుక పనీపాట లేకుండా అవసరంవున్నా లేకపోయినా డబ్బు ఖర్చు చేస్తూ దర్జగా బతికేస్తుంటాడు.
ఇదిలా ఉండగా ఒక రోజు బజారులో శ్రీరాంకు భారతి కనపడుతుంది, ఆ ఆమ్మాయి అందానికి ముగ్ధుడైపోతాడు. ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తే స్వాతంత్ర్యోద్యమ భాగంలో గాంధీగారి గ్రామసభ ఏర్పాట్లు చూసుకునే సభ్యురాలు అని తెలుసుకుంటాడు. ఇంటిదగ్గర నానమ్మ సంగతి మర్చిపోయి భారతిని వెతుక్కుంటూ వెళతాడు. చివరికి భారతిని కలుసుకొని ఆమెపట్ల తన ఇష్టం గురించి చెప్పి ఆమే స్పందన కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ తరువాత భారతి ఏం చెప్పింది, దానికి శ్రీరాం ఏం చేశాడు అసలు వీళ్లిద్దరి కథకు మహాత్ముడికి సంబంధం ఏంటొ తెలియాలంటే- పుస్తకం కొనండి, చదవండి
కథ చాలావరకు శ్రీరాం చుట్టు తిరుగుతుంది. భారతి కోసం తనేం చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్లాడు, ఎటువంటి పరిస్థుతులను ఎదుర్కున్నాడు అని. ఐతే నన్ను ఆకట్టుకున్న పాత్ర భారతి, తను ప్రత్యక్షంగా లేనపుడు శ్రీరాం ఆలోచనల్లో భారతి.She's one with a firm attitude and the way she conducts herself, guides Sriram is just wonderful. మిగతా ఆకర్షణగా నారాయణ్ గారి హ్యూమరసం, మాల్గుడి ఉండనే ఉన్నాయి.
(Photo collected form Penguinbooksindia.com )
ఇక ఇప్పుడు మీకు రాంబాబును పరిచయం చేయాలి. ఎవడు, ఎవరయ్యా ఈ రాంబాబు అంటారా. వస్తున్నా అక్కడికే వస్తున్నా. రాంబాబు ఈజ్ ఎ సీనియర్మోస్ట్ వెటరన్ బడ్డింగ్ పార్ట్‌టైమ్ జర్నలిస్ట్-జాయింట్ ఎడిటర్ (ఆల్మోస్ట్ ఎడిటర్ ) ఆఫ్ సుజనమిత్ర -థి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ప్రోగ్రెసివ్ తెలుగు డైలి పబ్లిష్డ్ ఫ్రం చింతల్‌బస్తీ. చూసారా పరిచయం చేయడానికే ఇంత శ్రమ పడాల్సొచ్చిందంటే ఆయనెంత గొప్పవాడో మీరే ఊహించుకోండి. రాంబాబుకు ఆసక్తి కలిగించని అంశంలేదు సంగీతం, సాహిత్యం, సైకో అనాలసిస్సు, రాజకీయం, మరదలుని అప్పుడప్పుడు పక్కింటమ్మాయిని ప్రేమించడం...అబ్బో ఒకటేమిటి ఏది ఎదురైతే దాంట్లోకి ప్రవేశం చేయాలనుకుంటాడు. అన్నిటికన్నా ఎక్కువ ఆసక్తి డైరీ రాయడం. ఆ ఆసక్తి పాఠకులకు టన్నులకొద్దీ హాస్యాన్ని పంచే దివ్యౌషదం. రాంబాబు డైరి కనుక చదువుతున్నారు అంటే జంధ్యాలగారి సినిమాలు back-to-back చూసినట్టే. అతని మేధోసంపత్తిని ఉదహరించే కొన్ని ఆలోచనలు మీకోసం,
౧) ఇంగ్లీష్ అంత దరిద్రపుగొట్టు భాష మరోటి ఉండదు. తెలుగులో గాడిదా అంటే ఆ పదాన్ని ఎప్పుడు ఎక్కడ వాడినా దానర్ధం గాడిదే. కాని అదేంటో ఇంగ్లీష్‌లో animal=పశువు , husband= భర్త,minister= మంత్రి కాని animal husbandry minister= పశుభర్తృత్వశాఖా మంత్రి అంటె తప్పంటారు, Non-Political = అరాజకీయం అంటే తప్పంటారు. స్టుపిడ్ !
౨) అలాగే క్రికెట్టంత దరిద్రపుగొట్టు ఆట మరోటిలేదు. ఎప్పుడూ బ్యాట్స్‌మెనే ఔటౌతారంట. యే ఆ బౌలర్లు, ఫీల్డర్లు ఔటావచ్చుగా, పైగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ మీదకు పదకొండు మంది దాడి చేస్తుంటారు. ఇది చాలా అన్యాయం. దీన్ని ఖండించాలి.
౩)ఎన్నికలపుడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఎన్నికల అనంతరం దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెసు, భా.జ.పా కలిసిపోవాలి. లేకపోతే ఒకరిమీద మరొకరు సోదాలు చేసుకుంటూ సమయం డబ్బూ రెండూ వృథా.
౪)చార్లీ చాప్లిన్ కు అసలు నటనే రాదు రాజ్ కపూర్‌ను అనుకరించటం తప్ప. అది కూడా రాజ్ కపూర్ పుట్టకముందే అతణ్ణి అనుకరిస్తూ నటిస్తాడు.
ఇలాంటి మహత్తరమైన ఆలోచనలతోపాటు మీకు నర్మగర్భాలంకారం, అన్యాపదేశాలంకారం లాంటి సరికొత్త భాషా ప్రయోగాలు కూడా తెలియాలనుకుంటే రాంబాబు ను పలకరించాల్సిందే. నండూరి పార్థసారధిగారు మూడు భాగాల్లో అందించిన హాస్యపు విందు భోజనం రాంబాబు డైరి.
అతలుకైతే ఈ టపాలో ముచ్చటగా ఏ ఫ్పదో డెబ్బైయ్యో సంగతులు చెప్పేద్దామనుకున్నా. కాని ముచ్చటగా ఎప్పుడూ మూడే ఉండాలంట. అలాగైతేనే కుదురుతుందని కొత్త మేష్టారు చెప్పారు. అందుకని మూడు మాత్రమే చెప్పుకుందాం.
మరి మూడనగానే మీకేం గుర్తొచ్చింది ?
గాంధీగారి మూడు కోతులు.
మరి కోతులెక్కడ ఉంటాయి?
కొమ్మలమీద.
చూసారా చెప్పాలనుకున్న పుస్తకం పేరు మీతో ఎలా చెప్పించానో 'కోతి కొమ్మచ్చి' అని.
%#$(*$@)(*
వద్దు మీరు నా ప్రతిభా పాటవాలను మెచ్చుకోకండి, నే తట్టుకోలేను.
తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రుడైన పిడుగు బుడుగును సృష్టించిన రమణ, బాపుతో కలిసి ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమాలు తీసిన రమణ, రాత-గీత ద్వయంగా నిలచిన స్నేహంలోని రమణ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశిష్ట విషయాలు చెప్పుకోవచ్చు ఆ మహానుభావుడి గురించి. ఆయన ఆత్మ-బాపుకథ కోతికొమ్మచ్చి, చాలా కుంచెం ఆలస్యంగా దొరకబుచ్చుకున్నా. మూడు భాగాలుగా ఉన్న ఈ పుస్తకంలో ఆయనను గురించి ఆయనకు పరిచయంవున్నవాళ్ల గురించి నిర్భయంగా చెబుతుంటే ఒకోసారి 'వావ్ నిజంగానా' అనిపిస్తుంది ఒకోసారి 'వార్ని! ఇలాటి కతలు కూడా ఉన్నయ్యా' అనిపిస్తుంది. ఔను మరి 'ఇది రాయాలి, ఇలానే రాయాలి' అని అనుకోకుండా మనసుకు ఏది గుర్తుకువస్తే అది రాస్తే, నిజాలు రాస్తే అలానేవుంటుంది. ముందైతే కోతికొమ్మచ్చిలో మొదటిభాగం మాత్రమే కొన్నా, చదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపించడంతో ఏకబిగిన అలా చదువుతూఊఊ వెళ్లిపోయా, రెండురోజుల్లో అయిపోయింది. హమ్మయ్య, వావ్ నేనేనా ఇలా చదివేసింది అని అనుకుంటుండగా అనిపించింది రోగం తెచ్చే మందైనా, రోగం కుదిర్చే మందైనా కుంచెం కుంచెం సేవించాలి తరించాలి అని. ఆ పద్దతిలో మిగతా రెందు భాగాలు ఆడుతూ పాడుతూ ముగించా. మొత్తంగా చూస్తే కోతి కొమ్మచ్చి లో మొదటి భాగం పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎందుకూ అని అడిగితే అందులో రమణ బాల్యంవుంది, బాపుతో మొగ్గతొడిగిన స్నేహంవుంది, చెన్నై నగరంలో పడిన సాపాటు పాట్లు ఉన్నాయ్, ఆ పాట్లలో పాడుకున్న పాటలున్నయ్, పాత్రికేయుడిగా అనుభవాలు ఉన్నాయ్, ఒక స్థాయికొచ్చాక తాను వెలిగించిన సిగరొత్తుల పొగరెట్ కథలు అవి ఇచ్చిన వగరు రుచి వుంది. పుస్తకం చదివేముందు ముందు చదివిన వెనకమాటలో చెప్పినట్టు దరిద్రాన్ని ఇంత రొమాంటిక్‌గా కూడా చూడవచ్చా !? అనే ఆశ్చర్యం కలుగుతుంది.
రెండు మూడు భాగాల్లో బాపుతో కలిసి మొదలుపెట్టిన సినిమా ప్రస్థానం వుంది. రెండవ భాగం అయ్యాక ముడొభాగం చదివేందుకు కొంచెం బాధ కలిగింది, చెప్పవలసిన విషయాలు చెప్పకుండానే వెళ్లిపోయాడా పెద్దమనిషి, ఆయన లేరనే విషయం గుర్తొచ్చేది.
ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవితం మొదలుపెట్టిన తొలినాళ్లలో రమణ కథలు,వ్యాసాలు గట్రా రాసుకొని, బాపుతో బొమ్మలు గీయించుకొని పత్రిక కార్యాలయాలకు వెళ్లేవాడట అవి చూసి ఇడ్లీ కంటే పచ్చడి బావుంది అనేవారట. అచ్చం అలానే పుస్తకంలో కొన్ని చోట్ల రమణ రాసిందానికన్నా బాపు వేసిన బొమ్మలు ఆకట్టుకుంటాయ్. మొదటి భాగంలో రమణ అమ్మగారు పచారికొట్టువాడి కాంట్రాక్టు పోయినందుకు భయపడలేదు అని చెప్పడానికి బాపు వేసిన బొమ్మ భలేగా అనిపించింది. అరే అంతపెద్ద కష్టాన్ని ఆయన సింపుల్‌గా చెప్పడమేంటి ఈయన అంతకంటే సింపుల్‌గా నవ్వొచ్చేట్టు వేయడమేంటి అనిపిస్తుంది. అంతగా అర్ధం చేసుకున్నారా ఒకరినొకరు అనుకునేంతలోపే బాపుతో కూడా లడాయిలు వేసుకున్నా, ఆయనతో కూడా బడాయికిపోయా అని ఒప్పేసుకుంటాడు.
ఇంకొన్నేళ్లు బ్రతికివుంటే మరిన్ని కొమ్మలు ఎక్కి మరింత సంబరం కలిగించేవారు రమణ.
పుస్తకంలో రమణ అంటాడు, రాముడు తనపై చాలా ప్రేమను కురిపించాడని. రామాయణం రాయించుకునే పనిలో తనకు పుణ్యం ఇచ్చి, సంపూర్ణ రామాయణం తీయించి, ఆపై ఈ-టివీ భాగవతం లో మరోసారి కరుణించాడని. విధి విలాసమో ఏమో ఈసారి మరోసారి రాముడి కథను తెరకెక్కిస్తుంటే ఆ రాముడే తనదగ్గరకు పిలిపించుకున్నాడు.

11 వ్యాఖ్యలు.. :
మీరు చెప్పిన పుస్తకాల్లో ఇంగ్లిష్ టీచర్, వెయిటింగ్ ఫర్ మహాత్మా, కోతి కొమ్మచ్చి చదివాను. రాంబాబు డైరీ చూస్తాను ఈసారి దొరుకుతుందేమో..
మిస్ కాకుండా చదవండి కృష్ణాజీ, డైరీలోని రాతలతోపాటు వాటికోసం బాపు వేసిన బొమ్మలు కూడా నవ్విస్తాయి. ధన్యవాదః
చాలా బావుంది మూడు పుస్తకాల పరిచయం.
Waiting for Mahatma ఇక్కడ మిషిగన్ వివిలో ఒక అమెరికను ఆంగ్లసాహిత్య ఆచార్యులవారు బోధిస్తుంటే పాఠం వినే భాగ్యం దక్కింది. విద్యార్ధుల చర్చలు భలే సరదాగా ఉండేవి.
నండూరి పార్ధరారధిగారిది భలే చురుక్కుమనిపించే వ్యంగ్యం. సాహిత్యహింసావలోకనం అని ఒక చిన్న నవల చదివాను. ఈ పుస్తకం చదవలేదు, సంపాయించాలి.
బాగుంది ...మాల్గుడి డేస్ నాకు కూడా చాలా ఇష్టమైన పుస్తకం ..ది మిస్సింగ్ మెయిల్ , ఈశ్వరిన్ , ఆస్ట్రలజర్స్ డే బాగా ఇష్టం
ఇక కోతి కొమ్మచ్చి కొస్తే చదివాను , చదువుతూ ఉన్నాను ,ఇంకా చదువుతూనే ఉంటాను ..
@కొత్తపాళిగారుః పుస్తక సమీక్షలు విన్నానుగాని, పుస్తకం పై చర్చలా. ఆసక్తికరంగా వుంది. thanks for sharing your experience.
@వంశీః నారాయణ్ గారికి నాకన్నా పెద్ద వీరాభిమానిలా ఉన్నావ్, నువ్వు చెప్పినదాంట్లో మాల్గుడి డేస్ మినహా ఏది చదవలా. దొరుకుతాయేమో చూస్తా. కోతి కొమ్మచ్చి అభిమాన సంఘంలోకి స్వాగతం :)
అవును, ఇక్కడ (అమెరికాలో) సాహిత్య క్లాసులు తమాషాగా ఉంటాయి. ఆచార్యులు చదివి పాఠం చెప్పడం ఉండదు. ప్రతి క్లాసుకీ విద్యార్ధులు సుమారు 50 పేజీలు చదువుకుని రావాలి. క్లాసులో చర్చ జరుగుతంది. ఆచార్యులు ఆ చర్చకి సంధానకర్తగా ఉంటారు. ఈ పద్ధతి హైస్కూలు దగ్గర్నించీ ఉన్నది. ఈ పుస్తకం గురించిన చర్చల్లో ఒక ఘట్టాన్ని ఇక్కడ చదవచ్చు.
http://kottapali.blogspot.com/2009/07/blog-post_03.html
మరో చిన్నమాట. మా వూళ్ళో తెలుగు సాహిత్య సమితిని (DTLC) మొదలుపెట్టి ఇంచుమించు 13 యేళ్ళయింది. ముందే నిర్దేశించబడిన పుస్తకం చదువుకుని వచ్చి, నెలకోసారి కలుసుకుని అక్కడ చర్చించుకుంటాము. ఈప్పుడు అమెరికాలో అనేక నగరాల్లో ఇటువంటి సమావేశాలు జరుగుతున్నాయి.
చిన్న పొరపాటు ...మాల్గుడి కధల్లో ఆ కధలు నచ్చాయని చెప్తున్నాను :) )
@కొత్తపాళిగారుః మీ టపా చూసాను, పాఠకులలో విమర్శకుడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం బాగుంది. నావరకైతే నవల చదువుతున్నపుడు ఆ కథలో లీనమైపోతున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఆ కథ ద్వారా కథలుడు ఏం చెప్పాలనుకున్నాడనేది కథకుడు పాఠకుడు ఇద్దరి మీద ఆధారపడుతుంది (అన్నివేళలా నిజం కాకపోవచ్చు).
@వంశీః లెక్క తప్పిందోయ్ :) . పొరపాటు నీది కాదు నాది, పైగా పెద్దది - అంటే blunder అన్నమాట. Man eater of Malgudi ని Malgudi Days గా ఊహించేసుకున్నా. Thanks for correcting.
అందరూ ఇలా పుస్తకాలు చదివేస్తే ఎలా..?????howw ..??
మొదట R .K గారి పుస్తకం ఒకటైన చదవాలనిపించింది..
తరువాత..సెలవపెట్టి వెళ్లి రాంబాబు పుస్తకం కోనాలనిపిస్తోంది..
ఆ తరువాత రమణ గారిది చదవగానే ఎలాగో అయిపొయింది :(..ఈ పుస్తకం ఉంది ..త్వరలో మొదలు పెట్టాలి...
కామెంటడానికి ఆలశ్యమైనాది బ్రదర్...సారి...ఏంటండి నా డిపార్ట్మెంట్ పైన పడ్డారు...:)
చాలా మంచి బుక్స్ ని పరిచయం చేసారు..కోతి కొమ్మచ్చి నేను స్వాతి లో రెగులర్ గా ఫాలో అయ్యేదాన్ని...మా లైబ్రరీలో పుస్తకం ఉంది...పార్ట్ పార్టుగా కాక ఈ సారి ఏకబిగిన చదివేస్తా...
ఆర్.కె నారాయణ్ గారి రచనలు ఎప్పట్నుంచో చదవాలనుకోవడం...కుదరడంలేదు...ఈ సారైనా చూడాలి....
రాంబాబు గారి డైరి..ఇప్పుడే వినడం..దొరుకుతుందేమో చూస్తాను...
@కిరణ్ః ఎలా, how అంటే కొందరు బొమ్మలేస్తుంటారు మరికొందరు ఆ బొమ్మల్లాంటి కథలున్న పుస్తకాలు చదువుతారు. అంతే, సింపులు.
@స్నిగ్ధః అంటే ఆ డిపార్టుమెంటు నాది కూడానండీ, ఎటొచ్చి పెద్దోరు మీరు మొదలుపెట్టాక నేను ఫాలో అవుదామని ఆగాను :)
మీ ఇద్దరికి హ్యాపీ రీడింగ్ :) :)
Post a Comment
మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ