‘మద్య’వర్తి.....

వారం రోజుల క్రితం గుజరాత్‌లో కల్తీమద్యం తాగి సుమారు 130 మంది మరణించారు. గుజరాత్‌ రాష్ట్రంలో 1961 నుండి మద్యనిషేదం అమల్లొవుంది. కాబట్టి సహజంగానే అక్రమ మద్యవ్యాపారం అక్కడ బాగానే జరుగుతుంది. దినికి బానిసలైనవారు ఎలాగూమానలేరు కాబట్టి వ్యాపారులు అక్రమ మద్యం తయారుచేయడం మాత్రమేకాక దాన్ని కల్తీ కూడా చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత, అక్రమమద్య వ్యాపారుల స్వార్థం అన్నీ కలిసి ఇటీవలి మరణాలకి కారణం అయ్యాయి.
దీమిపైన చాలా దుమారమే చెలరేగింది. మద్యంపైన నిషేధం ఉన్నాక్కూడా అక్రమమద్యం ఎలా దొరుకుతుందనీ, అసలు గాంధీ రాష్ట్రంలో మద్యంతాగి ప్రజలు చనిపోవటం ఏంటని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నానాయాగి చేశాయి.


ఈ సిన్లో ఒకాయన చేసిన వ్యాఖ్య కొన్ని రోజులుగా నాకు చికాకు కలిగిస్తుంది ( తిక్కరేగ్గొడుతుంది అంటే బావుంటుంది ). సందట్లో సడేమియాలాగా ఆయనగారు తన వ్యాపారవ్యూహాలను ఇలాంటి సందర్భంలో దూర్చాలనుకోవడం మరీ రోతగా ఉంది. ఆ మనిషి ‘లిక్కర్‌కింగ్‌’గా పిలవబడే బిజినెస్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా.
సంఘటన జరిగిన కొన్ని రోజులకు కింగ్‌గారు విలేఖరుల సమావేశంలో ఈ విధంగా అన్నారు ,"మన రాజకీయ hyopocrites ఇకనైనా మేల్కోవలసిన సందర్భమిది. ప్రజలకు ఏం కావాలో వాళ్లే నిర్ణయం తీసుకునేటట్లు శాసనకర్తలు తగిన మార్పుచేస్తే బాగుంటుంది. ప్రభుత్వం మద్యనిషేదం విధిచడం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం దీనిగురించి పునరాలోచించాలి ."

మొదటి రెండు వాక్యాలు పర్లేదు...మిగతా లైన్లతోనే తంటా వచ్చిపడింది. పోనీ పెద్దోళ్ళ మాటలను మీడియా వక్రీకరిస్తుంది అంటారుకదాని ఆ మాటలకుండగలిగే అర్థాలేంటో ఆలోచించాను. రెండు భావాలు చిరిగినాయి...అవి
మొదటిది:‘ప్రభుత్వం మద్యనిషేదం విధించింది కాబట్టి ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.....ప్రజలు స్వచ్ఛందంగా మానుంటే సమస్య లేదు’
రెండవది: ‘ ప్రభుత్వం మద్యనిషేదం విధించింది కాబట్టే ఇదంతా.....నిషేదం ఏత్తేస్తే వారికి (జనానికి) చట్టబద్దంగా నాణ్యమైన మద్యం దొరుకుతుంది......మరణాలుండవు. so, నిషేదం ఎత్తేయాలి’
మెడకాయ మీద తలకాయున్న ఎవరికైనా మాల్యా మొదటి అర్థంతో చెప్పాడంటే నమ్మరు.
ప్రభుత్వం కాకపోతే ఎవరు నిషేదం విధిస్తారు...? ‘సేన’లా, మత సంస్థలా......నో ఛాన్స్‌. ఒకవేళ విధించినాకాని ఈ కింగ్‌లోళ్లే కేసు వేసిమరీ అమ్మించుకుంటారు.

నిషేదం ఉన్నాకాని సచ్చినోళ్ళు తాగి సచ్చారంటే.....శానా బాగా ఎడిక్ట్‌ అయ్యుంటారు. గవర్నమెంటు మందమ్ముకునే లైసెన్సు ఇచ్చుంటే నా బీరురంగా....... ఐ.పీ.ఎల్‌ అవసరం లేకుండానె కుప్పలుగా డబ్బులొచ్చేవని బహుశా కింగ్‌ అనుకొని ఉంటాడు. పైకి చెప్పలేక భారి డైలాగులు పేల్చాడు.
దీన్నిగూర్చి ఆలోచిస్తుంటే సామాన్య ప్రజలకు మన దేశంలో మద్యం అమ్మడం అవసరమా అన్న ప్రశ్న వచ్చింది. ఇది ఎందుకంటే మా ఏరియాలో బస్టాపు దగ్గరే ఓ మందు దుకాణం ఉంది. దానికి కొంచెం దూరంలో జూనియర్ కాలేజి ఉంది (ప్రభుత్వం నిర్దేశించిన దూరానికి ఓ పది మీటర్ల అవతల). సాయంత్రం అయ్యిందంటే దుకాణం దగ్గర జాతర జరుగుతుంది. పీకలదాకా తాగినోళ్ళు, తాగాలనుకుంటున్నోళ్ళు అంతా అక్కడే. అదే టైముకి కాలేజి వదలడం. ఆ బస్టాపులో ఎలా wait చేస్తారో వాళ్లు. సరిహద్దుల్లో ఉండే జవాన్లుకు, అపర దేవదాసులకైతే ఫరవాలేదు- అమ్మినా వాళ్ళ పనేదో అది చేసుకుపోతారు. ఎటొచ్చీ మిగతా వాళ్లకే అవసరమా. మానదా ఎదో కొన్ని నెలలు తప్పితే సంవత్సరాంతం చలి దారుణంగా ఉండే దేశంకాదు ( మందు బాబులను ఎందుకు తాగుతున్నావురా అంటే మూడొంతుల మంది చెప్పే జవాబు ఇదే- ఒళ్ళు వేడి చేసుకోడానికి) ఐనా తాగుతారు.... తాగి రభస చేయడానికి, ఎక్కువైనోడు చచ్చి ఇలా ఈవిధంగా ‘మద్య’వర్తిలు నోరొపారేసుకోడానికి, నాయకులుతో వారి కుటుంబాలు పరామర్శించబడటానికి.

3 వ్యాఖ్యలు.. :

Kathi Mahesh Kumar said...

మీరెప్పుడైనా గుజరాత్ వెళ్ళారా?

Anil Dasari said...

కల్తీ మద్యం తాగి పోయినోళ్ల గురించి బాధ పడటం వేస్టు. వాళ్ల కుటుంబాల గురించే పడాలి.

ఆడాళ్లకీ తాగుడలవాటు చేసి దేశంలో తాగుబోతుల శాతం విచ్చలవిడిగా పెంచేసి లాభాలు రెట్టింపు చేసుకునే దిశలో వ్యూహాలు నడుపుతున్నాయి ప్రస్తుతం మాల్యా వంటి వారి మద్యం సంస్థలు (ఈ మధ్య సినిమాల్లో విరివిగా హీరోయిన్లూ, అమ్మాయిలూ తాగుతున్నట్లు చూపించే సరొగేట్ యాడ్స్ ఎవరి ప్రోద్భలంతో వస్తున్నాయో ఊహించండి)

ఇక సేనలూ, మత సంస్థలూ ఈ విషయంలో ఉద్యమాలు చేస్తాయని మనమనుకుంటే అమాయకత్వమే. పగలు సంస్కృతి పేరుతో ఉపన్యాసాలు దంచి రాత్రవగానే తాగి తొంగొనేవాళ్లే వీళ్లలో అధికం. సారా వ్యతిరేక ఉద్యమాలు వీళ్లెందుకు చేపడతారు? మహా ఐతే అమావాస్యకో పౌర్ణానికో పబ్బుల మీద దాడి చేసి పేపర్లకెక్కటమే వీళ్లు చేసే పని.

..nagarjuna.. said...

@కత్తి మహేష్‌ కుమార్‌
ఇంతవరకైతే వెళ్లలేదు. తెలీకుండా ఏమైనా బ్లాగానా బాసూ.

@అబ్రకదబ్ర
నిజం చెప్పావు బాసు. తాగినోళ్ల గురించి కాదుగాని వాళ్లు సచ్చినందుకు ధర్నాలు, బస్సులు తగలబెట్టుడు చేశారంట....అంతటి దివ్య జ్ఞానులున్నారు ఇక్కడ. ఈళ్లను బాగు చేయడానికి కర్రుచ్చుకొని ఎవరు వస్తారో...

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis