



ఏదో ఒకటి.., షోడా బాబులు (దీనికి సమాంతర ఆడ స్త్రీ లేడి మహిళా పదం ?), రాగ-మేళకర్తలు ఉన్నారుగా అని సంతోషిస్తుంటాను. ఇది ఈళ్లకు నచ్చదేమో, అశ దోశ అప్పడం ఆలు అని జంపు జిలానీలుగా తయారైనారు. పోన్లే ఒకరిద్దరే అని ఊరుకుంటుంటే హమ్మా...రోజురోజుకీ ఈ జాగాలో జంపు జిలానీల బ్యాచ్ ఎక్కువైపోతుంది. చెప్పులు లేవని జంపు, ఇళ్లు మారానని జంపు, మొలకలు వచ్చాయని జంపు, చెట్టు విరిగిందని జంపు....టూ మచ్ టూటూ మచ్. అందుకే అసల అస్సలు నచ్చట్లేదు

అప్పుడేపుడొ ఆ గోళీషోడాలమ్మే ఆయన జంపన్నాడు, కొద్దిరోజులకు ఆయన బెదరు కూడా పత్తాలేకుండా పోయాడు. వేరే షోడా బాబులు (మళ్ళి తెలుస్తలేదు, దీనికి సమాంతర ఆడ స్త్రీ లేడి మహిళా పదం) ఉన్నారు, వస్తున్నారు కాని ఎంతైనా old is gold కదా.... ఈ షోడా సంగతి పక్కన పెడితే మొన్నీమధ్య మంచిగోడులు చెప్పేటాయన ఓసారి నేనూ కూడా జంపోచ్ అని దాదాపు చాపచుట్టేసేంత పని చేసాడు ఇదేమిటయ్యా మగడా ఏమైనా పద్దతిగా ఉందా నీకు అనేసరికి కాదు కాదు టెంపరవరీ మౌనవ్రతం అని గమ్మునుండిపోయాడు. కబుర్లు చెప్పే కబుర్లమ్మ చెప్పా పెట్టకండానే వెళ్ళిపోయింది. అపుడు అసలేంత ఫీలయ్యానో వీళ్ళకేం తెలుసు యువరానర్ అధ్యక్ష్యా!!. ఆ తరువాత లాజిక్కులు, మ్యాజిక్కులు అడిగే ఓ ఆసామి అల్విదా అల్విదా అని పాట పాడేసి సినిమాలో జ్యొతిలక్ష్మిలా కనిపించి కనపడాకుండా వినిపించి వినపడకుండా తిరుగుతున్నాడు భూతంలాగా(ఈ మాట ఎవరైనా పుసుక్కునెళ్ళి ఆయనకు చెప్పేరు బాబ్బాబు అక్కఅమ్మలు ఆ పని చేయకండి. చెప్పాక గోడడానికి నేను, నేను గోడిన గోడులు రెండు మిగలవు,.ఆయనకో బ్యాచ్ టైపులో జనం ఉన్నారు మరి)...యే డైరెక్టుగానే రావచ్చుగా ఉహూ రారు.... ఊకనే మొండి చేస్తున్నారు నాకు తెలుసు.
ఇపుడు కొత్తగా, జస్ట్ టూ డేస్ బాక్, బెమ్మాండంగా పాడతారు అని పిలవబడే ఇంకొకరు యెళ్ళిపోయారంటా..నేనైతే ఆ సదరు పాటలు వినలేదు కాని ఎంతైన పాపులర్ పర్సనాలిటీ అంటే పాటలు బానే పాడతారనడంలో నిజం ఉండే ఉంటుంది కాబట్టి జంపు జంపే....చాప చుట్టేస్తానంటే వాతలు పడతాయనేమో కొత్త పథకం కింద లాంగ్‌లీవులు పెట్టేస్తున్నారు ఉద్యోగులు. అఫ్కోర్స్ ఇంకా అమృతధ్వని రాగంలో గోడేవాళ్లున్నారు కాని ఈళ్ళంతా ఇలా వరసపెట్టి జంపేస్తుంటే ఇక్కడ మాగతేంగాను మంచోళ్లందరూ మైనారిటీలో పడిపోతే జోగిజోగి కలిసి బూడిద రాల్చవూఊఊ...దీనికి సమాధానం చెప్పాల్సిందే అని బల్లగుద్ది, అవసరమైతే పక్కవాడి గుండుగిద్ది

అందుకే ఈ యవ్వారం నాకి హేమి నచ్చట్లేదు హై

******************************************************************
పోస్ట్‌లో ప్రస్తావించిన బ్లాగరులు, వారి అభిమానులు నేను ఏమైనా దెప్పిపోడిచే విధంగా మాట్లాడాను అని భావిస్తే క్షంతవ్యుడిని. అది నా అభిమతంకాదు. బ్లాగును విరమించడానికి వారి సొంత కారణాలు వారికున్నాయని చెప్పారు. ఎటొచ్చి ఇంతమంది తెలిసిన బ్లాగ్మిత్రులు వారి బ్లాగులు ఇకపై కనపడరు అనే తలపు పట్టలేక రాసినది, ఇంకెటువంటి భావనా లేదు.
I wish all of them good luck in their endeavors and hope they will get back to blogging again soon
