ఒకసారి ఒకబ్బాయి.. ముజఫ్ఫరాబాద్ బీహార్ లో ఉందనుకున్నాడు. ఇతను ఉగ్ర రూపం దాల్చి.. 'అదేంటి ? ఆ మాత్రం తెలియదా? పీ ఓ కే లో ఉంది. అక్కడ జనాలు అంతమంది చస్తుంటే.. మీకు కనీసం ఎక్కడుందో ఐడియా కూడా లేదా ? అని హుంకరించాడు. నేను కలగచేసుకుని.. 'అతనికి తెలియదు.. ఓ కే.. నువ్వు చెప్పు కర్ణాటక సీ ఎం ఎవరో చెప్పు మొదలు..' అంటే చెప్పలేకపోయాడు. మూడేళ్ళపాటు ఉంటున్నావు బెంగళూర్లో. నీకామాత్రం తెలియదు. ..? ' అంటే.. నవ్వేసి.. 'యూ గాట్ మీ ఆన్ దట్ ' అని వెళ్ళిపోయాడు.
అతని స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఆ కోపాన్ని అలాగే కొనసాగించే వారు. అతనో కాశ్మీరి పండిట్ కుటుంబానికి చెందినవాడు. పండిట్ల పట్ల కాశ్మీర్‌లో జరుగుతున్న అకృత్యాలను తెలిసినవాడు. అతను పై సందర్బంలో కోప్పడడంలో తప్పులేదనిపించింది....అయినా చివరకు తేలికయ్యాడు. మనలో ఎంతమంది అలా చేయగలం ?
పోస్టు మొత్తం చదివాక గుండె బరువెక్కిపోయింది. అతను ఎక్కడ ఉన్నా క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నా...ఆ ఫీలింగ్ నుండి బయట పడడానికి పాటలు వినడం, వేరె బ్లాగులు ఓపెన్ చేయడం, నా బ్లాగుకి వచ్చిన వ్యాఖ్యలు చూడడం మొదలుపెట్టా...ఉహూ అస్సలు వీలవలేదు. ఎదో తెలియని బాధ. అదే సమయంలో అంతకు ముందురోజు చూసిన వజ్రాల తవ్వకాలలో నలిగిపోతున్న ఆఫ్ర్రీకా ప్రజలమీద తీసిన బ్లడ్ డైమండ్ సినిమా, నా తెలంగాణాలోంచి మిగతావారిని తరిమేయాలని కేసిఆర్ చేస్తున్న చర్యలు, అప్పుడేపుడొ చేతన్ భగత్ three mistakes of my life పుస్తకంలో ఒక కాశ్మిరీ పండిట్ పాత్ర గుర్తుకొచ్చాయి. అప్పటిదాకా మనస్సులో ఉన్న బాధ ఎక్కువై కళ్లలో నీళ్లు తిరిగాయి.
అసలు మన దేశంలో ఉన్నవారి గురించి మనకేం తెలుసు. కాశ్మీర్‌లో ప్రజలు పడే బాధలు, ఈశాన్య భారతంలో సైనికుల అకృత్యాలు, విప్లవం పేరుతొ మావోయిస్టులు శాంతి పేరుతో పోలీసులు-ప్రభుత్వాలు చేస్తున్న దురాగతాలు , తిండిలేక నిర్లక్ష్యపు వరదలో కొట్టుకుపోతున్న జనం మనకేం తెలుసు (నేనేమి మినహాయింపు కాదు). బండేసుకు తిరగడానికి తక్కువ ధరలో పెట్రోలు, మాట్లాడటానికి చేతిలో సెల్లు, వీకెండ్స్ ఆనందంగా గడపడానికి పార్కులు పబ్బులు ఉన్నాయని సంబరపడుతున్నాం. రెండంకెల జీడిపి ని తలుచుకొని మురిసిపోతున్నాం. నాణేనికి మరోవైపు ఇంత చీకటి ఉన్నాకూడా. అన్నీ బాగుండాలి, నాకో idealistic ప్రపంచం కావాలని కాదు, కాని ఇన్నేళ్లుగా సమస్య అలాగే ఉన్నా స్తబ్థత ఎందుకు మనలో, ఎందుకు ఈ నిర్లక్ష్యం ?
సమీర్ గురించి చదివాక శ్రీశ్రీ గారి కవితలు కొన్ని గుర్తోచ్చాయి...
ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం...
లేదు సుఖం, లేదు సుఖం
లేదు సుఖం జగత్తులో
బ్రతుకు వృధా, చదువు వృధా
కవిత వృధా!,వృధా,వృధా!
మనమంతా బానిసలం
గానుగులం, పీనుగులం
ఆలోచన, ఇంగితం ఉన్న మనుషులుగా పుట్టాక తినడానికి ముప్పూటలా తిండి, చుట్టూ అభిమానించే జనం,చేయడానికి శ్రమ సంపాదించుకోలేమా...? ఎందుకీ ద్వేషాలు, పౌరుషాలు, మోసాలు...
I realize that the world is more sinner and cynic than i thought it to be and I do believe that it has much more love and humanity to rescue this place from the tyranny and brutality of human oppression . But will we ever let it show up ?



