రొబో! రొబో! ఈ సినిమా చాలా ఖరీదు గురూ...

ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ రియల్ లైఫ్ కామెడి ట్రాజెడి థ్రిల్లర్ మూవి. మీకు ఇలాంటి సినిమాలు నచ్చకపోతే  మీ  బ్యాడ్‌ లక్  నేనేమి చేయలేను.

అవి మేము పవర్ పులిని చూసి వాతలు పెట్టించుకున్న రోజులు. అందుకు ఎలాగైనా పగ ప్రతీకారం తిర్చుకోవాలని, పోగొట్టుకున్నచోటే వెతుక్కొవాలని తహతహలాడిపోతున్న రోజులు. సరిగ్గా అదే సమయంలో ఒకానొక రోజు తలైవార్ రజిని సినిమా వస్తుందని తెలిసి మంచి ఛాన్స్ వచ్చిందని మా ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ మొదలుపెట్టా..
 "గుడ్, మంచి ఛాన్స్‌ఇది. దీన్ని వదలొద్దు. నువ్వు టికెట్లు బుక్ చెయ్యి. మిగతా స్కెచ్చు తర్వాత రాద్దాం" అన్నారు.
ఏంటి మనందరికి నేను బుక్ చెయ్యాలా....ఎప్పటికైనా  reimbursement అవ్వుద్దారా  అని దీనంగా మొహం పెట్టి నివేదించుకున్నా. ఆ పాషాణ హృదయాలు కరగకపోవడంతోతప్పక  నాతోపటు  ఆరుగురికి బుక్ చేయాల్సొచ్చింది. సినిమా చూడాల్సిన రోజు వచ్చింది.  సైన్యం 14 మందిని  పోగేసుకొని కాలెజ్ నుండి  టాక్సీలో స్టేషన్ చేరుకున్నాం. హౌరాకు ఎక్స్‌ప్రెస్ టికెట్లు తీసుకొని ట్రైన్ కొసం ఎదురు చూస్తున్నాం.
అరగంటైంది ఒక్క ట్రైను రాలా.....
గంటైంది...ఒక్క ఎక్స‌ప్రెస్   ట్రైను రాలా. వచ్చిన లోక్‌ల్ ట్రైన్‌లను మావాళ్లు వదిలేస్తున్నారు మూడు గంటలు అందులో గడపడం ఇష్టం లేక. అసలే చలికాలం కావడంతో ఎండకు ఒళ్లు చివుకు చివుకుమంటుంది. పైగా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఒరేయ్  ఇలాగైతే మనం శుభం కార్దు పడే సమయానికి చేరుకుంటామేమోరా...ఎదో ఒక ట్రైను ఎక్కేసి తొందరగా పోదాంరా అన్నాను.
"ఆగు బే...హడావిడి చేస్తావెందుకు. ఎళ్లగానే మనకు రెడ్ కార్పెట్టెసి వెల్కం ఏం చెప్పరు. ఐనా  వెళ్లేది ఫస్ట్ షో కు కదా...కాసేపాగ" న్నాడు బాక్స్ సంతోష్‌గాడు. నోర్మూసుకొని ఉండిపోయాన్నేను. ఇంకో అరగంట అయ్యాక మమ్మల్ని ఉద్దరించడాని అన్నట్లు ఎక్స్‌ప్రెస్ రైలొకటి వచ్చింది. ఖరగ్‌పుర్ నుండి హౌరా మధ్యలో అది ఒక్కసారే ఆగుతుంది... పైగా హౌరా ఆఖరు స్టేష‌న్ కాబట్టి స్లీపర్లో సీట్లు చాలామటుకు ఖాళీగా ఉన్నాయి  సభాశ్ అనుకొని ఎక్కడానికి నిశ్చయించుకున్నాం. అసలే తీసుకున్నది జనర‌ల్ టికెట్లు, అందరం ఒకే బోగీలో ఎక్కితే ఏదైనా ప్రాబ్లం అవుతుందని మేము నాలుగు గ్రూపులుగా (G1, G2, G3, G4 అనుకోండి) విడిపోయి మూడు బోగీల్లో(B1, B2, B3 అనుకోండి) ఎక్కాం. నేను నాతో ఇంకో ముగ్గురు ( G2)  కలిసి  ఒక బోగీలో(B2) ఉన్నాం. సీట్లు ఖాళీగా ఉండడంతో ముగ్గరం RAC సీట్లో ఇంకొకడు పక్కన లోయర్ బెర్తు సీటులో సెటిలయ్యాం. రైలు కదిలింది...సుమారు గంటన్నర తరువాత అది ఆగాల్సిన స్టాపుకూడా దాటేసింది, ఇక ప్రాబ్లం ఏమి ఉండదనుకొని సొల్లు కబుర్లేవో చెప్పుకుంటున్నాం.

అంతలో మావాడొకడు "అరె మన B1 బోగీలోవున్న నలుగురు G1 గాళ్లు ఏంచేస్తున్నారో చూసొస్తా"నన్నాడు. కాసేపయ్యాక వాడు పరిగెత్తుకుంటా వచ్చి " ఏ...వాళ్లను స్క్వాడ్ పట్టుకున్నాడు. బాబులు ఫైన్ కడుతున్నార"న్నాడు. Waste fellows అనుకొని శంకర్ గురించి, ఐశ్వర్యారాయ్ గురించి etc etc గురించి మా కబుర్లలో మళ్లా మునిగిపోయాం. కాసేపటికి స్క్వాడ్ మా బోగీలొ కనిపించింది. ఎలాగైనా ఫైన్ తప్పించుకోవాలని ఇంటెలిజంట్‌గా ఆలోచించి ఒక బ్రిలియంట్ ప్లాన్ వేసాం. మా నలుగురిలో ఒకడు పక్కన ఉన్న లోయర్ బెర్తులో, ఒకడు అప్ప్ర్‌ర్ బెర్తులో నిద్రపోతున్నట్టు జీవించాలని, మిగతా ఇద్దరు కూర్చున్న RAC సీట్లోనే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్లలా కటింగ్ ఇచ్చుకుంటూ సెటిల్ అవ్వాలని ప్లాన్. నేనూ మా  రాహుల్‌గాడు RAC సీట్లో కూర్చుండిపోయాం రజినిని మించి నటిస్తూ.  ముగ్గురు స్క్వాడ్స్ ఒక్కొక్కరు మా సీటు దాటుకొని వెళ్ళారు ఒక్కరుకూడా మమ్మల్ని ఏమి అడగలేదు. బ్రిలియంట్ ప్లాన్ వండర్‌ఫుల్‌గా పని చేసిందనుకొని పొంగిపోతున్నాన్నేను....హ్మ్ నాకెంతెలుసు in front crocodile festival అని. అందరికన్నా ఆఖరునవున్న స్క్వాడ్ దగరకొచ్చి 'టికెట్ ప్లీజ్' అన్నాడు. ఇంకేముంది ఖేల్ ఖతం. జేబులో ఉన్న జనరల్ టికెట్టు తీసి చూపించా.
"ఇది జనరల్ టికెట్, స్లీపర్‌లో చెల్లద"న్నాడు
"అంటే..సీట్స్ ఖాళిగా ఉన్నయని ఎక్కాం"
"అలా కుదరదు....ఫైన్ కట్టండి" . " అవునూ టికెట్ నలుగురికి తీసుకున్నావుగా మిగతా ముగ్గురేరి"  అని తన మిగతా స్క్వాడు మిత్రులని పిలుస్తూ అన్నాడు.
యాక్టింగ్‌లో  జీవిస్తున్న ముగ్గురిని తట్టిలేపి స్క్వాడ్‌కు చూపించాను. నలుగురికి ఫైన్ రాస్తున్నారు స్క్వాడ్.
"ఎంత?" ప్లాపయిన సినిమా ప్రొడ్యూసర్ మొహం పెట్టుకొని అడిగాను.
"330"
"ఒహ్..నలుగురికి కలిపి అంతేనా....చాలా చీప్ అయ్యాయి ట్రైన్ జర్నీలు" మా ఫ్రెండ్‌తో అన్నాను.
"ఒక్కొక్కరికి 330 " ఆ గుంపులో ఉన్న ఒకానొక తెలుగు స్క్వాడ్‌ నుండి రిప్లై...

!@#(*%&((%#

"సార్...కొంచెం తగ్గించండి...అసలే స్టూడెంట్స్‌ మేము" దీనంగా వేడుకున్నాం.
"నథింగ్ డూయింగ్" అని వాళ్లు చలాన్లను బరబరా బరికేస్తున్నారు. నలుగురమూ ఆ ఫైన్ కట్టేసి ఎదవ టైమింగ్ అనుకొని సెటిలయ్యాం.
"శంకర్ ఈ సినిమా కోసం 160 కోట్లు ఖర్చు పెట్టించాడు...మనం ఆఫ్ట్రాల్ 330 పెట్టలేమారా" బాక్స్ సంతోష్ గాడు సెలవిచ్చాడు. ఆ పాయింటు నాకు financialగా సరిగా అనిపించకపోయినా  logicalగా బావుందనిపించి ఊరుకున్నా.
తాయిలం సమర్పించుకున్నాక G1 గ్రూపు నుండి అనిల్‌గాడు  వచ్చి " ఏరా పర్సులు ఖాళి చేయించుకున్నారా" అని ఒకటైపు చులకనగా ప్రశ్నించాడు.
"లేదురా... మీరు ఫైన్ కట్టడం చూసి మేము ఒక బ్రిలియంట్ ఐడియా వేసి తప్పించుకున్నాం" అని ఈసారి ఇంకెక్కువ జీవించేసి చెప్పాం వాడికి.
"బొంగేం కాదు...మీరు డబ్బులు కడుతుంటే నేను డొర్ దగ్గర నిలుచొని చూస్తూనేవున్నా"
ఆ మాటకు గాలి తీసేసిన ట్యూబులా చల్లబడి మీరెంత కట్టార్రా అని ఆరా తీసాం. ఈసారి వాడు గాలి తీసిన టైరు మొహం పెట్టి " ఫైన్ కట్టండి అన్నప్పుడు డబ్బులు లేవని చెప్పామురా...వాళ్లు మా పర్సులు తీసుకొని అందులో నొట్లన్నీ బయటకు తీసుకొని వాళ్ల చలానా రాసుకొని మిగిలిన 400 తిరిగిచ్చారు. దరిద్రం ఏంటంటే  వాడు రాకముందు మా దగ్గర 1800 ఉన్నాయో 2000 ఉన్నాయో తెలిసి చావట్లేద"ని ఒక మాదిరి వైరాగ్యపు నవ్వుతో అన్నాడు.

ఈలోపు మా రాహుల్ గాడు B3 బోగీకి వెళ్ళి కొత్త ఇన్‌ఫర్మేషన్‌ మోసుకొచ్చాడు. ఏం జరిగిందిరా అని అడిగితే.." హైలైటమ్మా... G3, G4 (ఈ గ్రూపులో ఇద్దరే ఉన్నారు) ఒకే బోగీలో ఎక్కారు ఒకరు ఈ చివర ఇంకొకళ్ళు అటు చివర కూర్చున్నారు. G3కు మనకులాగే  బొక్క పడింది."
"మరి G4 అయినా సేఫా" ఆత్రంగా అడిగాము.
"ఆళ్లదే ట్విస్టు. వీళ్ళిద్దరు అక్కడ లోయర్ బెర్తులో కూర్చుంటే కరెక్టుగా స్క్వాడ్స్ అందరూ వాళ్ల ఎదురు బెర్తులో రెస్టు తీసుకోవడానికి కూర్చున్నారంట. మనోళ్లు గుమ్మడికాయ దొంగల తరహాలో ఉండటం చూసి వాళ్లక కూడా కోటింగ్ ఇచ్చారు" ఒకింత గర్వంగా చెప్పాడు. ఆ మాట విని ఒకటే నవ్వు.

రైలు హౌరా వచ్చింది. నాలుగు గ్రూపులు ప్లాట్‌ఫాం పై చేరుకొని ఒకళ్ల మొహాలు ఒకరం చూసుకొని 14 మందిమి  అందరం ఏకరీతిన పట్టుబడ్డందుకు (  తుచ్చమైన ఈ ప్రపంచములో దాని పరిభాషలో చెప్పాలంటే వెధవలమైనందుకు )  ఈఈ అని నవ్వుకున్నాం. (స్వగతం: హుం ఇంకా నయం అంతకు ముందురోజు స్నేహితులు ఇంకొందరు ఇదే ట్రైనులో వెళ్ళి ఇలాగే పట్టుబడి మమ్మల్ని ఈ ట్రైను ఎక్కొద్దని చెప్పారని చెప్పానుకాదు). స్టేషను బయటకొచ్చి టాక్సీలు మాట్లాడుకొని సుమారు గంట ప్రయాణం తరువాత సరదు మల్టీప్లెక్స్ ఉన్న మాల్‌కు బయల్దేరాము. థియేటర్ చేరగానే గుర్తొచ్చిందేటంటే పొద్దటినుండి అసలే తినలేదని. మాల్‌లో KFC కనపడగానే అరికాళ్లలో ఉన్న ప్రాణం లేచొచ్చింది. ఇంకేముంది అందరం ఛలో KFC. 
లోపలికెళ్ళాక  ఎవడిక్కావాల్సింది వాడు ఆర్డరిస్తున్నాడు. నాది + నా G2 స్నేహితుల ఆర్డర్ చెప్పడానికి క్యూలో వెయిట్ చేస్తున్నా. పక్క క్యూలో వెరే గ్రూపు మెంబరొకడు " మామా నా కార్డు swipe చేస్తే బిల్లింగ్ అవడంలేదురా...నీ కార్డ్ ఇస్తావా. కాలేజ్‌కెళ్ళాక సెటిల్ చేస్తా"నన్నాడు. ఇప్పుడున్న బొక్కలకు తోడు ఇదొక బొక్కనాకు, వీడెప్పుడు సెటిల్ చేసేనో అని మనసులో అనుకొని " sure మామా నీకన్నా ఎక్కువనారా" అని నవ్వుతూ వాడికి కార్డిచ్చాను. Brunch (breakfast + lunch = brunch ) చేసాక  కౌంటర్లో  టికెట్లు తీసుకొని థియటలోకి వెళ్లాం.

ఇప్పుడోక చిన్న ఇంటర్వెల్....ఈలోపు మీరు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ గట్రా పుచ్చుకొనిరండి. నేను వెయిట్ చేస్తూవుంటా..

**********************************************************************************


అందరం సీట్లలో సెటిలయ్యాం.  హాల్‌లో లైట్లార్పేసారు. రొటీన్ ప్రకటనలు ఐపోయాయి. సినిమా సర్టిఫికెటు డిస్ప్లే అయింది. ధియేటర్లో ఒకటే ఈలలు. గోల గోలగావుంది. టైటిల్లు పడుతున్నాయ్. ఈలలు ఇంకా ఎక్కువయ్యాయి. RAJINI అని  ఒక్కొక్కటే అక్షరాలు పడుతుంటే మాకు థియేటర్లో సౌండ్ సిస్టం  బాలేదనిపిచ్చింది. అదే మన APలో ఐతేనా.. సినిమా టైటిల్ పడుతుంటే DTS హోరులో  హాలు దడదడలాడిపోయేది. ఏం చేస్తాం రజిని సినిమాకు కూడా కాలం కలిసి రాలేదని బాధపడిపోయి సినిమా అలాగే చూసేసాం.


సినిమా అయిపోయింది. మాల్ బయటకు వచ్చాం. చుట్టుపక్కన ఎక్కడా ఆటొలు టాక్సీలు గట్రా కనిపించలా. అక్కడేవున్న సెక్యూరిటీని అడిగితే అది సిటి outskirts కాబట్టి అంత రాత్రిపూట ఆటొలు టాక్సీలు ఉండవన్నాడు. మరెలా అని అనుకుంటుండగా ఓ పది నిముషాలు నడుచుకుంటా వెళ్తే అక్కడ చౌరస్తా వస్తుంది. అక్కడినుండి టాక్స్లీ/ఆటో దొరకొచ్చని సెలవిచ్చాడు. మా ప్రాప్తాన్ని తిట్టుకోడన్నిక్కూడా ఓపికలేక అలా నడుచుకుంటూ  వెళ్తున్నాం. పదినిముషాలు అలా నడుస్తూనేవున్నా  కూడలి ఏదీ కనిపించలేదు. దారిన పోయేవాళ్లని ఒకరిని అడిగితే ఇంకో పది నిముషాలు నడవండి వస్తుంది అన్నారు. అప్పుడు చూడాలి మా స్థితి. (ఇక్కడ డైలాగులేమన్నా expect చేస్తున్నారా ? భలేవారే...ఇంత ట్రాజెడిలో కూడా డైలాగులెందుకు సార్/మేడమ్ ). మొత్తానికి అలా నడిచాక  చౌరస్తా చేరుకొని ఒక అరగంటపాటు దొరికిన ఆటోలను టాక్సీలను వాళ్లు ’మేం రాము’ అంటున్నా ’దాదా చలో, దాదా ఆవో’ అని అడుగుతూనేవున్నాం. చివరకు దయగల ఒక దాదా మా వేడుకోలుకు జాలిపడి ఇంకొక ఆటొను పిలిచి మమ్మల్నందరిని హౌరా చేర్చాడు. అక్కడనుండ ఖరగ్‌పూర్ స్టేషన్, స్టేషన్ నుండి  కాలేజ్ చేరుకునే  సరికి అర్దరాత్రి మూడు అయింది మరియూ  ఒక్కొక్కడికి కేవలం కేవలం రూ. 1000 ఖర్చయింది. ఒకరికొకరం  ’గుడ్‌నైట్’ ’గాడిద గుడ్డు’ చెప్పుకొని మంచం మీద వాలిపోయాం.


మర్నాడు ఉదయం లంచ్ దగ్గర అందరం కూడుకొని గతదినం తాలుకు తీపి సంఘటనలను నెమరు వేసుకుంటున్నాం. అంతలో నిన్న మాతోపాటు రాని నరేష్‌గాడు వచ్చాడు. "ఏరా సినిమా బావుంది కదా...శంకర్ ఎక్సలెంట్‌గా తీసాడు" అని చెప్పాడు. "ఆ...అవున్లే బాగా తీసాడు. ఇంతకీ నువ్వెప్పుడు చూసావు.  DC++ లోనా ( ఇది కాలేజ్‌లో ఉండే ఓ internal కంప్యూటర్  నెట‌వర్క్. సినిమాలు, పాటలు, సాఫ్ట్‌వేర్లు విద్యార్దులు ఇందులో ఇచ్చిపుచ్చుకుంటారు ) ? అని అడిగాన్నేను. " లేద్రా...బాంబే థియేటర్లో మధ్యాహ్నం చూసానురా. నిన్న మధ్యాహ్నం నుండే వేసాడు తెలుగు వెర్షన్‌" అని రిప్లై ఇచ్చాడు. వాడిచ్చిన సమాధానానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటారా...... సదరు బాంబే థియేటరు క్యాంపస్‌ నుండి సైకిల్‌పై అరగంట దూరం..... :(


"టికెట్ ఎంతరా" విషణ్ణవదనుడనై అడిగాను వాడిని.
బ్యాక్‌గ్రౌండులో మంద్రంగా సంగీతం వినపడటం మొదలుపెట్టింది నాకు.
"ముప్ఫై రూపాయలు రా" అని చిద్విలాసంగా సెలవిచ్చాడు నరేష్‌గాడు.


హరిమా హరిమా నేనో సింహపు కొదమా, నువ్వో జింకై వస్తే కొమ్మా వదలనులెమ్మా....
పాట ఫుల్‌గా వినపడుతుంది నాకు. అప్పుడు పులి చేతిలో, నిన్న సింహం చేతిలో...ఛీ వెధవది...



***********************************************************************************

ఇతి రోబో చిత్ర దర్శనార్థం మత్‌ చే కర్మాణి సమస్థ అవస్థయహః సమాప్తహః
కావున ప్రజలారా, ఈ కథను విన్నవారు కన్నవారు రైలు ఎక్కేప్పుడు తమ టికెట్టు పరిధిని ఒకటికి పదిసార్లు చూచుకుందురని. సీట్లు ఖాళీగా ఉన్నాయని ఏ కంపార్టుమెంటు కనపడితే ఆ కంపార్టుమెంటు ఎక్కవద్దనీ. సినిమాకు వెళ్లెముందు పూర్తి అవగాహనతో వెళ్లెదరని. తద్వారా సఖపడెదరనీ  ఖరగ్‌పురాణం ద్వితీయార్థం సినిమా పర్వములో నాగార్జునాచార్యుడు ప్రపచించెను.

ఆఆ సినిమా ఐపోయింది. ఇంకా కూర్చున్నారేంటి. లేవండి లేవండి. వెళ్లేటప్పుడు సినిమా చూసినందుకు డబ్బులు కట్టి వెళ్లండి.


29 వ్యాఖ్యలు.. :

Malakpet Rowdy said...

Looool :))

Anonymous said...

Good to see you after a long time and as usual nice post. Seems the break in writing blogs has killed your skills...

..nagarjuna.. said...

Thanks malak :)

@Anon: Many thanks for dropping your frank opinion

నిశాంత్ said...

Hahahahahaha
Chaalaa baagaa raasaaru
(sorry mee avasthani chusi navvutunnanduku) :-D

..nagarjuna.. said...

@nishant: thanks for your laughs here bro...they are welcome....

by the way నీకు ఓ చిన్న coincidence చెప్పాలి. కొన్ని నెలల తరువాత ఇవాళ మధ్యాహ్నం నా బుక్‌మారక్స్‌ను అప్‌డేట్ చేస్తుండగా మీ బుక్‌మార్క్ వద్ద ఆగాను. చెక్ చేస్తే మీ బ్లాగులో చాలా రోజులుగా కొత్త పోస్టు వెయ్యలేదని తెలిసింది. ఈ ముక్క మీ బ్లాగులోనే చెబుదామనుకున్నా....and see you've some here to comment on my post :)

హరే కృష్ణ said...

తెలుగు సినిమా కోసం ఇన్ని కష్టాలా..:(
Bicentennial Man అని DC ++ లో ఒక్క సెర్చ్ కొడితే దొరికేసేది కదా


తెలుగు సినిమా రిలీజ్ అయితే రూర్కీ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ కి తెగ వచ్చేవారు కాకపోతే 170kms కదా రోడ్ కనెక్టివిటీ కూడా బావుంటుంది

మీరు ఖరగ్ పూర్ to హౌరా :)

..nagarjuna.. said...

ROBO = Bicentennial man !!
wah what a comparison sir ji....

మేము హౌరా వెళ్లడం ఫర్లేదు అనుకోవచ్చు...రూర్కి వాళ్లు ఢిళ్లి దాకా వచ్చేవాళ్లా...OMG!!
hats-off to their patience

హరే కృష్ణ said...

హహ
roorkee to ISBT-4 hrs
ISBT to IIT- 1hr
IIT to Noida/gurgaon
మరో 1.30 hr :)
బస్ జర్నీ కదా ఇలాంటి అవస్తలేమి ఉండవు కాకపొతే UPSRTC బస్ లే దారునాతి దారుణం

మనసు పలికే said...

హహ్హహ్హా.. నాగార్జున కెవ్వు.. సూ...పర్‌గా రాసావు టపా:)
కానీ నాకో డవుట్..;) బ్రంచ్ అంటే లంచ్ కన్నా ముందు కదా చేసేది.. అదయ్యాక సినిమాకెళ్లి, బైటికి వచ్చేసరికి అర్థ రాత్రి అయిందా..?
హిహ్హ్హిహ్హి.. ఇలా అసలు టపానొదిలేసి పిచ్చి లాజిక్కులు అడుగుతుంటే ఇప్పుడు నీకేదో సామెత గుర్తొస్తుంది కదూ.. మీ కష్టాలు మాత్రం కేక;) ఇక కథ ముగింపు ఉంది చుసావూ అద్భుతం అంతే..:))))

..nagarjuna.. said...

@అపర్ణః లంచ్‌కు ముందు చేసామా తరువాత చేసామాన్నది కాదు పాయింటు, రెండు కలిపి ఒకేసారి చేసాం కాబట్టి బ్రంచ్...got it :P
నీ లాజిక్‌లో తప్పులేదులే...మేము చేరుకునే సరికి మధ్యాహ్నం మూడైంది ఆ బ్రంచ్ చేసి మాల్‌లో కాస్త ఉత్తుత్తి షాపింగ్ చేసి సినిమా చూసాం.

@హరేః బాబు ఆ UPSRTC బస్సులో వెళ్ళానుగా నేను. ఈ కలకత్తా బస్సులతో పోల్చుకుంటే చాలా బెటర్ అవి. ఈసారి కలకత్తా వెళ్తే నీ కోసం వాటి ఫొటోలు పట్టుకొస్తాలే చూసి సంభ్రమాశ్చర్యాలు పడుదువు

Unknown said...

నాగార్జున గారు పులి దెబ్బ మీకు తగిలిందా .. నాకు కూడా తగిలింది ..
అసలు ఆ రోజు గురించి రాస్తే అది ఒక పెద్ద పోస్టు కుడా అవుతుంది .. అందుకే రోబో సినిమా టికెట్లు తీసుకుని మరీ వెనక్కి ఇచ్చేసాం ..
అసలే వీక్ హార్ట్ .. ఇలాంటి బయంకర దృశ్యాలు అది చుస్తే తట్టుకోలేదు అని .. నెట్ లో చూస్తేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది :)
అయిన బలే రాసారు ఫన్ని గా .. సూపర్ అంతే :) ... అయినా టి టి వచ్చినప్పుడు ఎంచక్కా బాత్ రూం లో దాక్కోవచ్చుగా .. ఆ అయిడియా తట్టలేదా ???

Sravya V said...

బావున్నాయి మీ రోబో కష్టాలు :)
బ్రంచ్ అంటే breakfast + lunch అది లంచ్ కి ముందూ కాదు వెనుకా కాదు :)

Unknown said...

మద్యలో ... బ్రేక్ ఫాస్ట్ కి లంచ్ కి మద్యలో చేసేది బ్రంచ్
లంచ్ కి డిన్నర్ కి మద్యలో చేసేది లన్నార్ :)

..nagarjuna.. said...

కావ్యగారు.....వెనకో ముందో ఆ హైబ్రిడ్ మీల్స్‌కు కూడా క్రానాలాజికల్ ఆర్డర్ అవసరమా. ఈ విషయంలో నాకు శ్రావ్యగారి లాంటి ప్రొఫెషనల్స్ సపోర్ట్ ఉంది మీరుకూడా ఒప్పేసుకోండి ఓ పనైపోద్ది

@శ్రావ్యగారుః :)

Unknown said...

నో నేనసలే మోనార్క్ ని .. ఎవరి మాట వినను .. అయిన చుక్కల వల నిపుణులు చెప్తే అసలు వినను .. మా SAP ఫీల్ అవుతుంది :)

Ennela said...

//అవి మేము పవర్ పులిని చూసి వాతలు పెట్టించుకున్న రోజులు//..నాకు అర్థం కాలా!

//శంకర్ ఈ సినిమా కోసం 160 కోట్లు ఖర్చు పెట్టించాడు...మనం ఆఫ్ట్రాల్ 330 పెట్టలేమారా//
సూపరు


మరి మీరు సదరు నరేష్ గారిని కోపం తో నాలుగు దులుపుళ్ళు దులిపి ఉండాలే, మీకూ చెప్పొచ్చుగా ఆ విషయం అని...యేమైనా మీరు తెగ నిదానస్తులు సుమీ!,.పాపం,మా నాగర్జున గారి కార్డుకి పెద్ద చిల్లే పడింది మరి!
టపా చాలా బాగుందండీ...చెణుకులు చమక్కుమన్నాయి...హహహ

స్నిగ్ధ said...

అబ్బో చారి గారు...సూపరండీ...మీ టపా.... మరి తలైవర్ సినిమా చూడాలంటే ఆమాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా...
>>ఇతి రోబో చిత్ర దర్శనార్థం మత్‌ చే కర్మాణి సమస్థ అవస్థయహః సమాప్తహః..
కెవ్వ్..కేక....
ఆచార్యుడి ప్రవచనాలను గుర్తుపెట్టుకుని పూర్తి అవగాహనతో సినిమాకి వెళ్ళెదము... ప్రవచనములకు ధన్యవాదములు...
:p

..nagarjuna.. said...

@కావ్యగారు: పోన్లెండి ఎవరి క్రియేటివిటి వారికానందం..మీరలగే కంటిన్యూ అవండి
BTW " టిటి వచ్చినప్పుడు బాత్రూంలో దాక్కొవచ్చు" అవిడియా కేక...ఈసారి ఎప్పుడైనా వెళ్తే అసలు టికెట్టే తీసుకోకుండా మీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా :D

@ఎన్నెలమ్మ: పవర్ పులి ని లింకులో పెట్టాను. అది నొక్కి చూడంది అర్దమౌతుంది. క్లుప్తంగా చెప్పాలంటే కొమరం పులి చూసి బొక్కపెట్టించుకున్నాం.

@స్నిగ్ధాజీ: మా దివ్యమంగళప్రదమైన ఆశీస్సులు మీకు సర్వదా ఉంటాయి. శుభమస్తు :)

ఇందు said...

మీరు ఖరగ్పూరా? కొల్కతాలో గంగూలీని ఎప్పుడైనా చూసారా? ఈసారి చూస్తే...నా పేరు మీద ఆటోగ్రాఫ్ తీసుకోండే! :) అది తరువాత నేను మీ దగ్గర తీసుకుంట :) అలగే గంగూలీని అడిగానని చెప్పండి.'ఇందు మీకు భీకరమైన ఫాన్' అని కూడా చెప్పండీ!!

మీ కష్టలు చాలా ఫన్నిగా ఉన్నాయ్! ;) శంకర్ సరే....ఒక సినిమాకి వెయ్యినూటపదహార్లు చదివించుకున్నరుగా! మీరు అసలు కేక! :))

ఈ బ్రంచ్ ఏంటో..లన్నర్ ఏంటో...అసలె పాపం ఆకలయ్యి ఏదొ దక్కిందే దక్కుదల అని తింటే! మీరేమీ పట్టించుకోకండి నాగర్జునగారు :)

..nagarjuna.. said...

గంగులి ఆటోగ్రాఫా....., ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకుంటా. ఇవ్వనూ అని బెట్టు చేస్తే ఇందు మేడం ఇవ్వమన్నారని చెప్పిమరీ తీసుకుంటా :)

>>ఈ బ్రంచ్ ఏంటో..లన్నర్ ఏంటో...అసలె పాపం ఆకలయ్యి

థాంక్స్ ఇందుగారు కనీసం మీరైనా అర్ధం చేసుకున్నారు భావం ముఖ్యమని. ఇందుగ్గాను మీకు టన్ను చాక్లెట్లు పార్సెల్‌ల్‌ల్‌ల్‌....

ఇందు said...

ఐతే ఇంకేంటీ! గంగులీకి నా బ్లాగ్ కూడా చూపించేయండీ.భాష అర్ధం కాకపోయినా పర్లేదు.మీ ఫాన్ బ్లాగ్ అని చెప్పండీ..అలాగే ఒక కామెంటు కూడ కొట్టమనండీ. గంగులీ నాకు కామెంట్ పెట్టాడని నేను ఒక టపా వేసుకుంటా :))

నేనెప్పుడూ అంతే!! గుడ్ గర్ల్ కదా! :))
అరటన్ను చక్లెట్లే! అయ్యబాబొయ్! [కళ్ళు తిరిగి పడిపోయిన ఇందు]

Unknown said...

ఇందు కి కుళ్ళు నా పద ప్రయోగం అంత పాపులర్ అయిపోతుంది అని :) అందుకే పట్టించుకొద్దు అని చెప్తోంది .. బ్రాంచ్ లన్నర్ అందరు వాడి తీరాల్సిందే
లేకపోతె ఈ బ్లాగులో ధర్నా చేస్తా

..nagarjuna.. said...

>>[కళ్ళు తిరిగి పడిపోయిన ఇందు]
అలో...ఇందుగోరు లేచారా అండి..ప్లీజ్ కళ్లు తెరవండి. అసలే మీ పుట్టినరోజు...మీకు ఇలా స్పృహ తప్పేట్టు షాకులిచ్చానని తెలిస్తే మీ అభిమానులు నాపై దండయాత్ర చేసేయగలరు :(

@కావ్యగారు:
>>బ్రాంచ్ లన్నర్ అందరు వాడి తీరాల్సిందే <<
వాడము అని ఎవరన్నారండీ బాబు...ఎటొచ్చి వేరోకలాగా వాడాతాము...

ధర్నా చెత్తారా...యాండే పప్పుగారు..ఓపాలి ఇటొస్తారా మీ శిష్యురాలు ఎదో కొత్త ప్రయోగం చేస్తానంటుంది

Anonymous said...

అయ్యో పాపం నాగ్ గారు మీ కష్టాలు అన్నీ కలిపితే మళ్ళీ ఒక సినిమా అయ్యేలా ఉందిగా

కావ్య లన్నర్ కేక

ఇందు said...

ఆ ఇప్పుడే మీ కామెంటు చూడానికి కళ్ళు తెరిచానండీ :)) ఏంటామ్మ కావ్...యా లన్నర్ అందరూ వాడాలా?? ఇంకా నయం ఆకలేసినా అందరు బ్రంచ్,లన్నర్ మాత్రమే తినాలి అనలేదు.అప్పౌడు మళ్ళి కళ్ళు తిరిగి పడిపోతాము :))

..nagarjuna.. said...

ఆహ్లాదగారు, మీరుగనక ఈ బ్లాగులోకంలో తిరుగుతూ మీ పొరపాటువల్లో నా అదృష్టంవల్లో ఈ కామెంటును చూస్తే ఒక చిన్న రిక్వెస్టు...మీ బ్లాగును చూసి కామెంట్ పెడదామని ఎంత ప్రయత్నించిన కావడంలేదు. కామెంట్ బాక్స్ పూర్తిగా కనపడటంలేదు...టెంప్లెట్ వల్ల అనుకుంటా....మరొకటి కామెంట్లకు మోడరేషన్ పెట్టి వర్డ్ వెరిఫికేషన్‌ను తీసేయండి.

ముందే చెప్పాగా పోస్టు ఒక సినిమా అని. మీ కామెంటుకు ధన్యవాదాలు.
********************************

అది అలా అ(క)డగండి ఇందుగారు....అడిగేవారెవరు లేరనుకుంటున్నారు కావ్య

Mopuri K Reddy said...

chaari gaaru, bavundandi comedy, keep rocking........!

శిశిర said...

హ్హహ్హహ్హ.. సినిమా చూడడానికి ఇన్నిపాట్లా?

SJ said...

nice post,chalaa baga rasaru..keep posting...

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis