అసలేం జరుగుతుంది

ఎప్పుడో బ్లాగులు పుట్టిన కొత్తలో కొన్ని జరక్కూడని పరిణామాలు జరిగాయంట, నాక్కూడా తెలియదు, బ్లాగు సోదరి గారివి బ్లాగు వీక్షణం గారివి పోస్టులు చూసాక కొంచెం అర్థమౌతున్నాయి.....దరిద్రం ఏంటంటే నేను కూడా కొన్నిసార్లు ఏదోఒక వైపు ఉండి కొన్ని కామెంట్లు చేసా supportiveగా. ఆ గొడవకాదుగాని నాక్కొన్ని అనుమాలున్నాయి ఎవరన్నా (నేనడగబోయే వాళ్లు చెప్తే మరీ మంచిది) చెప్పండయ్యా...

1)  గూగుల్‌ బజ్‌లో ఒకరు  ఇంకొకరిని  తిట్టేవాళ్లంట....అందుకోసం బ్లాగులో ఆళ్లను తిడుతున్నారంట.....నాకర్థం కానిది బజ్‌లాంటి ప్రైవేట్‌ అప్లికేషన్‌లో ఒకరినొకరు అనుకుంటే దాన్ని ఓపెన్‌ప్లేస్‌లాంటి  బ్లాగులో ఎందుకు రచ్చచేయడం. శ్రీనుగారిని బ్లాగులో కూడా తిట్టారాన్నారు...కాని బజ్‌ సంగతి బ్లాగులోకెందుకు

2)"If you have issues with it please stay out of it." ఎంతసేపు చదివినా ఎన్నిసార్లు చదివినా నాకెం అర్థం కావట్లేదు ఇది. రాసేవి అభిప్రాయాలు మాత్రమే అని చెప్పేస్తే అలానే రాస్తే ఏ సమస్యలేదు. కాని మహేష్‌గారు రాస్తూ అవి facts అంటారు పూర్తి conviction ఉందంటారు పైపెచ్చు ఆయనది ఓ పబ్లి‌క్ బ్లాగ్...ఎవరైనా చూడవచ్చు.....మరలాంటపుడు stay out of it అంటే ఎలా. ఇప్పుడు నేను రోడ్దు మీదకు వెళ్ళి నాకు తోచింది మాట్లాడతా నచ్చనోళ్ళు పొండేహె అంటే ఎలా ఉంటుంది.....
************************************************************************
ఇక్కడ బ్లాగ్లోకంలో జరుగుతున్న రభసను తొలగించడానికి బ్లాగుసోదరిగారు చేస్తున్న కృషికి అభినందనందనలు.....

15 వ్యాఖ్యలు.. :

Anonymous said...

>> గూగుల్‌ బజ్‌లో ఒకరు ఇంకొకరిని తిట్టేవాళ్లంట....అందుకోసం బ్లాగులో ఆళ్లను తిడుతున్నారంట.....


provoking అన్న మాట, ఇప్పుడు నేను నిన్ను ఇక్కడ తిడితె నీకు వినపడదు, సో, నేను నీకు తిట్లు మైల్ చేస్తాను, తరువాత ఎక్కడ పడితే అక్కడ నీ గురించి వాగుతాను, సో, నువ్వు గొడవ ఎక్కడ వేసుకుంటావు? ఫోన్ చేశావు? నేను ఎత్తను, బజ్ లో, మైల్ లో ఐతే బ్లాక్ చేస్తాను, సైట్లో కామెంట్లు వుండవు, సో మరి ఏమి చెయ్యాలి చెప్పు??

Kathi Mahesh Kumar said...

మీరు నిజంగా నా బ్లాగు చదివారా?

Kathi Mahesh Kumar said...

ఇక కాంట్రవర్సీల సంగతి మరింత హాస్యాస్పదం. నా ఆలోచనలు think of the unthinkable తరహాలో వివాదాస్పదంగా ఉండవచ్చేగానీ, కేవలం టపాలద్వారా వివాదాలు సృష్టించి "పబ్బం గడుపుకోనే" అవసరం నాకైతే ఖచ్చితంగా లేదు. బ్లాగు నా emotional outletకే తప్ప ఎటువంటి ఆర్థిక లాభాలనూ అపేక్షించి కాదే ! ఇక సామాజిక (బ్లాగులోకంలో) విలువంటారా, అది వివాదాన్ని సృష్టిస్తే వచ్చే అవకాశం అస్సలు లేదు. మరి వేటికోసం నేను వివాదాలు సృష్టించాలి?

నా ఆలోచనలతో, అభిప్రాయాలతో విభేధించేవారికి నా బ్లాగులో ఎప్పుడూ సముచిత స్థానం ఉండనే ఉంది. వారు తమ విభేధాలను నిస్సంకోచంగా పంచుకోనూవచ్చు, నా అభిప్రాయాలను తీవ్రంగా ఖండించనూవచ్చు. ఇక నేను రాసింది నేను చాలావరకూ విశ్వసించి (వీలైనంత వరకూ దానికి సంబంధించిన సమాచారం సేకరించి) రాస్తానుగనక నా అభిప్రాయాలకు మద్దతుగా వాదనలు వినిపించే హక్కు నాకూ ఉందని నమ్ముతాను. ఆ హక్కును "పిడివాదం" అంటే, వారు హేతువును చూపకుండా కేవలం నమ్మకాల ఆధారంగా చేసేదికూడా అదేకదా !

మన తెలుగువారిలో, వ్యతిరేకతను అంగీకారాత్మకంగా తెల్పే (disagree agreeably) లక్షణం చాలా తక్కువన్న నా నమ్మకాన్ని చాలా మంది నిజం చేసారంతే. ఏది ఏమైనా, నా బ్లాగు నా వ్యక్తిత్వానికి ఒక అద్దం లాంటిది. నన్ను నిజజీవితంలో అందరూ అభిమానించనట్లే ఇక్కడా కొందరు ద్వేషిస్తారు, మరికొందరు అభిమానిస్తారు. అభిమానానికి సహేతుకమైన కారణం చాలావరకూ ఉంటుందికానీ, ద్వేషానికి.... ఒక్క అపోహ లేక వారు జీవితాన్ని చూసే ధృక్కోణం వ్యతిరేకమైతే చాలు. అయినా ఆలోచనలు వేరైనంతమాత్రానా వ్యక్తుల్ని ద్వేషించాలని నేను అనుకోను. అందుకే ఎప్పుడూ అంగీకారాత్మకంగా విభేధించడానికి ప్రయత్నిస్తాను. ఇక అంతకుమించి హద్దుదాటితే చురక అంటించగలిగే భాష ఎలాగూ నాదగ్గరుందని. అంతేకాక మర్యాదపుర్వకంగా నిరసించగలిగే సంస్కారం కూడా నా పెంపకం, నేను నేర్చుకున్న చదువూ నాకందించాయి అని నేను భావిస్తాను.

నా బ్లాగులో నేను మనస్ఫూర్తిగా నమ్మినవీ లేక తీవ్రంగా విభేధించేవీ రాస్తుంటాను. If we all agree, do we really have anything to discuss? అందుకే నా అస్తిత్వం నేను నేనులా ఉండటంలో ఉందని నమ్మినట్లే, నా బ్లాగూ నా బ్లాగులాగానే ఉంటుంది. అందరికీ నా బ్లాగులో స్వాగతం...as long as you have an apatite for disagreement and difference of opinion.

..nagarjuna.. said...

@తారగారు: హ్మ్...ఈ పాయింటు పై కొంచెం ఆలోచించాలి నేను.

@మహేష్‌: ఈ కాంట్రొవర్సి‌ గురించి మీరు తాజాగా ఏదైనా పోస్టు రాసుంటే అది చదవలేదుగాని జనరల్‌గా నేను మీ బ్లాగు రీడర్లలో ఒకడిని. పైగా నేను రాసింది మీరు బ్లాగు సోదరిగారు చెప్పినదానికి ఇచ్చిన రిప్లై గురించి.

Kathi Mahesh Kumar said...

@నాగార్జున: at least please read the whole comment I wrote on బ్లాగుసోదరి blog.

Anonymous said...

to better understand katti please see this

http://parnashaala.blogspot.com/2010/03/blog-post_6692.html

Kathi Mahesh Kumar said...

భారతదేశ చరిత్రని,శిల్పసాంప్రదాయాల్నీ, ఐకనోగ్రఫీనీ వాటిలోని sacred feminine మర్మాల్నీ అర్థం చేసుకోలేని mindless middle class moralists కి నా పై పోస్టు "అసహ్యం"గా ఉంటే అది వారి మానసికస్థితే తప్ప, ఆ విగ్రహాలలో ఎటువంటి అసహ్యమూ లేదు.

ఆ టపాలో పెట్టిన ఫోటోలన్నీ కొన్ని వందల మంది హిందువులు తిరుగాడే పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నవే. అయినా, ఇది భయంకరంగా కనిపించిందంటే, its nothing but a sick mind manifestation. Nothing else. అలాంటి వాళ్ళు చర్చకు ఎలా తయారవుతారు? If they have nothing to discuss, they seize to have right to complaint about their ignorance, accusing me of outrageous preposition.

Anonymous said...

katti just tell me one thing.

What exactly you want tell with this post ? to whom you want tell ?

Kathi Mahesh Kumar said...

@అజ్ఞాత: ఆ టపా మొదట్లో నేను రాసిన intro చదువు.It was a continued discussion about my earlier post; http://parnashaala.blogspot.com/2010/03/blog-post_8949.html

..nagarjuna.. said...

@అజ్ఞాత: అది ఈ పోస్టులో నేను అడిగినదానికి సంబంధం లేదేమో ?
@మహష్‌గారు: I did read the post and your comments there sir and i am only surprised to see you ask her to stay out of your blog when you've said that you have rationale and proof of what you write. They are facts,you believe, you write and not just opinions to say not to look into your blog if they can not accept them.

Anonymous said...

http://malakpetrowdy.blogspot.com/2010/08/blog-post_24.html

this is how he treats women

Kathi Mahesh Kumar said...

@నాగార్జున: If they have nothing to discuss, they seize to have right to complaint about their ignorance, accusing me of outrageous preposition....this is the context in which I have asked her to stay out.

Anonymous said...

Katti - Nagarjuna knows enough about you. Go and try to sell somewhere else

Anonymous said...

ఈడి వాదనలో పసలేనప్పుడు stay out of it అంటా వుంటాడు

http://parnashaala.blogspot.com/2010/04/blog-post_24.html

..nagarjuna.. said...

Thank You all for responding

@పై అజ్ఞాత:భాష కొంచెం చూసుకోవాల్సింది బాస్

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis