ఓ చిట్టి (ప్రేమ)కథ



అల్లంత దూరాన అందమైన విరివనంలో



విరబూసిందొక అందాల భరిణ. నక్షత్రాలలోని తళుకులన్నీ, వెన్నెలలోని స్నిగ్ధత్వాన్నంతా నింపుకొని సొగసంతా తానే అయి రూపుదాల్చిందా కుసుమం.




ముద్దాడి వెళ్లే పిల్లగాలికి తన ఈడువారితో ఊయలలూగుతూ  ముత్తయిదువల కొంగుచాటు నుండి ప్రపంచాన్ని చూస్తూ కాలం గడిపేది.



























ఈ సకుమారికి ఒకనాడు భావప్రపంచపు బాటసారి - పాట ఎదురైతే  ఆ మాటకారిని చూసి సిగ్గు మొగ్గలయిపోయింది... భువనాలను సమ్మోహనం చేసే సొగసు చూసి పాట ఆ చోటే నిలిచిపోయింది.











ఒకరికొకరు గుండెవూసులు చెప్పుకుంటూ, సరాగమాడుతూ... ఓసారి తనకోసం పల్లవించమని పాటను అడిగింది గోముగా


























మదిదోచిన పుత్తడిబొమ్మ కోసం పాట గలగల పారే సెలయేటి ప్రవాహమయింది, మధుపాతంలా వర్షించింది. తాను మధుర రాగాల జడివాన కురిపిస్తే  ఆ ముద్దుగుమ్మ  అమ్మ ఒడిలో హాయిగా ఆడుకొనే పాపలా సంతోషించింది,  శరత్ ఋతువులో పున్నమినాటి జాబిల్లిలా నవ్వింది, అలనాడు బృందావనిలో గోవిందుడి మురళీరవానికి పరవశించిన గోపిక అయింది.




ముచ్చటైన ఈ జంటను చూసి  ఏ తుంటరి తుమ్మెదకు కన్నుకుట్టిందో ఇద్దరి మధ్య ఓ చిలిపి తగవు వచ్చి కూర్చుంది. నువ్వుంటే నువ్వని పోరుపడి  పువ్వు అలిగి ముఖం తిప్పేసుకుంది. పాట చిన్నబోయింది.





దూరం అయ్యేది దరిచేరేందుకే కాబోలు!  విరహ వేదనలో ఒకరికోసం ఒకరు తపించిపోయి ఇక కలలోనైనా విడిపోవద్దనుకొని  పలకరించుకున్నాయి. కలిసి బ్రతుకుదామని బాసలు చేసుకున్నాయి.



మనసేలిన స్వరానికై పువ్వు చేతులు చాచితే  నెచ్చెలిని తన కౌగిట ఆర్తిగా పొదివికొంది పాట.  ఒకటిగా పెనవేసుకున్న ఆ రెండు  మనసుల కథ ప్రణయమయ్యింది.



      సంధ్యాసమయంలో, మరొక అందమైన రోజు మొదలవుతుండగా , చెట్ల కొమ్మలలో రెక్కలు విప్పుకుని కువకువ మంటూ పక్షులు ప్రాగ్దిశలో నింగికెగిసాయి....ఈ జంట కథను జగమంతా వినిపించేందుకు.
మరి మీరు విన్నారా ఈ కథను ?

36 వ్యాఖ్యలు.. :

Sravya V said...

Wow ! Very nice Nagarjuna !

తృష్ణ said...

ఈ పూలు డార్క్ పింక్ కలర్ లో కూడా ఉంటాయండి. సువాసన కూడా బాగుంటుంది. బాగా రాసారు చిట్టి కథ :-)

వేణూశ్రీకాంత్ said...

Wow Wow Wow.. Simply Awesome sir..
ఫోటోలు కథ రెండూ ఎంత బాగున్నాయంటే మాటల్లో చెప్పలేనంత. అమేజింగ్..

Mopuri K Reddy said...

:)

బంతి said...

చాల బాగుంది

బులుసు సుబ్రహ్మణ్యం said...

బాగున్నాయి రచన, ఫోటోలు.
మీరు కూడా భావుకత బాట పట్టారు. వెరి గుడ్.

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ బాబోయ్...

ఆ కుఠోలేమిటీ? ఆ భావుతకత్వమేమిటీ? అప్పు లా తయారయ్యేలా ఉన్నావు గా ఇలాగే వదిలేస్తే??

సూఊఊఊఊఒపర్.. ఇరగదీస్తివి

శిశిర said...

ఆ కుఠోలేమిటీ? ఆ భావుతకత్వమేమిటీ?

కదా.. :)))) భావుకత నాకర్థం కానీ సబ్జక్టే కానీ ఆ ఫోటోలూ, ఆ మాటలూ.. అమేజింగ్.

మాలా కుమార్ said...

ఫొటోలు చిట్టికథా రెండూ చాలా బాగున్నాయి.

KumarN said...

Simply Superb !

kiran said...

kevvvvvvvvvvvvvv......heights of creativit :)

శశి కళ said...

super photos ....super narration

జయ said...

ఎంతబాగుందంటే ....ఇంద్రధనుస్సంత బాగుంది.

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగుంది నాగార్జునా !
>>మదిదోచిన పుత్తడిబొమ్మ కోసం పాట గలగల పారే సెలయేటి ప్రవాహమయింది, మధుపాతంలా వర్షించింది. తాను మధుర రాగాల జడివాన కురిపిస్తే ఆ ముద్దుగుమ్మ అమ్మ ఒడిలో హాయిగా ఆడుకొనే పాపలా సంతోషించింది, శరత్ ఋతువులో పున్నమినాటి జాబిల్లిలా నవ్వింది, అలనాడు బృందావనిలో గోవిందుడి మురళీరవానికి పరవశించిన గోపిక అయింది.

భావుకత కొంచెం అప్పు కావాలి :) .... చాలా బాగుంది పోస్ట్

జలతారు వెన్నెల said...

ఇప్పుడే ఎంతో ఆలశ్యం గా చూసననుకుంటా ఈ టపా. ఈ టపాకి మీకు ప్రేరణ ఎక్కడినుంచి వచ్చిందండి? ఎందుకో కూసింత అనుమానం గా ఉంది. జోక్స్ ఎపార్ట్.ఎంత అందంగా ఉందో ఈ టపా...చాలా వైవిధ్యం గా...ఎంతో అందమైన చిత్రాలు, ఆ చిత్రాలు మీ అక్షరాలలో వ్యక్తపరిచిన భావాలు... ఓహ్.....సింప్లి సూపర్బ్!

శిశిర said...

ఎంతబాగుందంటే ....ఇంద్రధనుస్సంత బాగుంది.<<<

భావుకత కొంచెం అప్పు కావాలి :)<<<

జయగారూ, వంశీ.. భలే చెప్పారు.

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

యెంత బావుందంటే,వాన చినుకుకు తడిసి ప్రతి కొమ్మ,రెమ్మ,మొగ్గ,పువ్వు కూడా ఆనందంగా తలలు ఊపుతూ తమ హర్షాన్నిప్రకటిస్తూ ..... తమ చెలి ని మనసార ఆశీర్వదిస్తున్నట్లు గా

ఫోటాన్ said...

Wow ! Very nice Nagarjuna !

స్వాతిశంకర్ said...

ఫోటోలు, కథ రెండు చాలా చాలా బాగున్నాయండి

Priya said...

Wow!!! ఫోటోలు, కథా, మాటలూ.. మూడూ ముచ్చటగా అద్భుతంగా ఉన్నాయండీ :)

మధురవాణి said...

Sooo cute.. both story and pictures! :-)

..nagarjuna.. said...

@శ్రావ్యగారు, తృష్ణగారు, MK Reddy, బంతి : మీ వ్యాఖ్యలకు, అభినందనలకు ధన్యవాదాలు :)

@వేణూ గారు: మీ ’వావ్ ’ కౌంట్ చూసి నాకు నేను శభాష్ చెప్పుకొని కెవ్వుమనుకున్నాను. మెనీ థాంక్స్ :)

@బులుసుగారు: ఉత్తినే గురూజీ... సహారా ఎడారిలో వర్షం పడ్డట్టు అన్నమాట ఈ పోస్ట్. ధన్యవాదాలు :)

@రాజ్: అపర్ణ, మధురగారి లాంటి గారు అక్కడెక్కడో చిటారుకొమ్మన ఉంటారు నాయనా వాళ్లతో పోల్చితే అపరాధం కదూ. దహా ;)

@శిశిరగారు: ’నాకర్దం కాని సబ్జెక్టే’ - గొప్పోళ్లందరికీ ఇలా అనడం కామన్ అయిపోయింది మరి. Thanks for commenting :)

..nagarjuna.. said...

@మాలా గారు, కుమార్ గారు, ’వెన్నెల’ కిరణ్ , శశి గారు: చాలా థాంక్సండీ :)

@జయ గారు: వర్షాలు పడుతున్నాయిగా అందుకే ఇంధ్రధనస్సు వెలిసిందనుకుంటా. Thanks for your appreciation :)

@vamsi: ఎంతకావాలంటే అంత అప్పు తీసుకో అబ్బాయ్... ’గోపిక’లను ఇంప్రెస్ చేసెయ్ ;)

..nagarjuna.. said...

@జలతారు వెన్నెలగారు: మీకు పుణ్యం ఉంటుందండీ ప్రేరణ, అనుమానం అంటూ బ్లాగ్జనులకు లేనిపోని అనుమానాలు కలిగించద్దు.నన్ను నమ్మండి, నేను 24 కారెట్ల గోల్డును :)
thanks for your comment.


>>వాన చినుకుకు తడిసి ప్రతి కొమ్మ,రెమ్మ,మొగ్గ,పువ్వు కూడా ఆనందంగా తలలు ఊపుతూ తమ హర్షాన్నిప్రకటిస్తూ ..... తమ చెలి ని మనసార ఆశీర్వదిస్తున్నట్లు గా

చాలా చాలా బాగుంది పూర్వ ఫల్గుణి గారు, చాలా అందమైన ప్రశంస ఇచ్చారు. ధన్యవాదాలు :)


..nagarjuna.. said...

@ ఫోటాను: నీ కామెంట్లను నువ్వు రాసేయకముందే కాపీ చేసేవాళ్లు ఎక్కువైనట్టున్నారు... జాగర్త అబ్బీ ;)
thanks for the response :)

@స్వాతి గారు, మధురగారు: చిట్టి కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం :)

@ప్రియగారు: మీ కామెంట్ లో మూడు ఆశ్చర్యార్ధకాలు కూడా బాగున్నాయండీ...పోస్ట్‌ను మెచ్చినందుకు ధన్యవాదాలు :)

Anonymous said...

పూలరెక్కలూ... కొన్ని తేనెచుక్కలూ...! అందమైన కథనం.

ఇహ పోతే... పిడకల వేట. మధుపాతం పదం తప్పు కాకపోయినా... అందం ఒక్క రవ్వ తగ్గినట్టు నాకు అనిపించింది.అదేదో ఉల్కాపాతం చెల్లెల్లా ఉంది.

జలతారు వెన్నెల said...

మీరు నా కామెంట్ ని అపార్ధం చేసుకున్నారు.. మీరిటీవల చూసిన సినిమా వలన ఏమైనా ప్రభావితం అయి, మీలో ఉన్న సున్నితమైన హృదయాన్ని ఇలా ఆవిషరించారేమోనని చిన్న సందేహం అంతేనండి.

A Homemaker's Utopia said...

పోస్టు,ఫోటోలు,మీ పదాలు చాలా చక్కగా కుదిరాయండీ.చాలా చాలా బాగుంది..:-)

..nagarjuna.. said...

@ఫణిగారు: హహ్హహ్హ.... జలపాతం, హిమపాతం పదాలు చూసి 'తేనెజల్లు కురిపించింది ' అనేదానికి పర్యాయంగా రాశాను.. మీరు ఉల్కాపాతం తో సంబంధం కలిపేశారా, బాగుంది బాగుంది :)

@నాగిని గారు: థాంక్యూలు థాంక్యూలు :)

@జ.వెన్నెలగారు: ఎవరన్నా అడుగుతారేమో, అడిగితే చెప్దాం అని కాచుకొని కూర్చున్నానండీ.... అడిగినందుకు థాంక్స్. మీ అనుమానం 'మల్లెలతీరం ' గురించి అనుకుంటున్నాను..... actually ఆ సినిమా రిలీజ్ అవడానికి ఓ ఐదారు రోజుల ముందు ఆఫీన్ కాంపస్ లో ఈ చెట్లు కనిపిస్తే మా కొలీగ్ ఒకడు ఓ పువ్వు తీసుకొచ్చి రెండో ఫొటొలో ఉన్నట్టు తీసి చూపించాడు. ఇదేదో బాగుంది కదా అని నేను నా so called క్రియేటివిటికి పని చెప్పి 2,4 ఫొటోల్లో ఉన్నట్టు తీసి వాటిని FB లో పెట్టేద్దాం అనుకున్నా. తీరా తీశాక ఓ కథ అల్లేసి బ్లాగ్ లో పెట్టేద్దాం ఎలాగూ పోస్టుల్లేక బ్లాగు ఎండిపోతుంది అని మిగతా ఫొటోలు, కథ రెడీ అయ్యాయి... లాస్ట్ ఫొటోకు మాత్రం సినిమా చూశాక ఐడియా వచ్చింది.


ఇదంతా చదివాక ఎరక్కపోయి అడిగాన్రా బాబూ అనుకోవడంలేదు కదా (just kidding) :)

నిషిగంధ said...

Sweet and Beautiful!!
మీ క్రియేటివిటీకి వీరతాళ్ళు :-)

..nagarjuna.. said...

Thank you Nishi gaaru,very happy to see you on my blog :)

చాణక్య said...

మీ ఊహకు నా వందనాలు! ఈ పరిమళాన్ని సదా కాపాడుకోండి. :)

రాధిక(నాని ) said...

చాలా బాగుంది మీ బావుకత ,ఆ ఫోటోలు supar ... fantastic ..mind blowing (దూకుడు లో మహేష్ బాబు అన్నట్టు అంటున్నా ) మీరు ప్లస్ లో నాగార్జున గారా ?నేనెంత స్పిడో చూసారుగా ...ఎప్పుడో 2010లో రాఖి పోస్ట్ లో కామెంట్ రాసినప్పుడు చూసా నెమో మీ బ్లాగ్ కానీ ఏమీ గుర్తులేదు .ఇప్పుడు చూసా మళ్ళి ..చాలా బాగుంది

..nagarjuna.. said...

@రాధిక గారు: మీకు నచ్చినందుకు సంతోషమండీ and మీ ప్రశంసలకు ధన్యవాదాలు.నేను కూడా ఫొటోల కోసం అప్పుడప్పుడూ మీ బ్లాగ్‌ను చూసేవాడిని..ప్లస్ మరియూ గోదావరి వాసుల పుణ్యమానీ మళ్ళీ తరచుగా చూస్తున్నాను. కాబట్టి నేను కూడా స్పీడే :)
ఆ ప్లస్ nagarjuna నేనేనండీ.


చాణక్యకు చాలా ఆలస్యంగా, many thanks :)

Karthik said...

Superb superb superb:):)

..nagarjuna.. said...

Thanks Karthik :)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis