మనమే! అయినా నీది నీదే...నాది నాదే.

Back in late 19th century there lived a scientist Boltzman who went on to frame the famous "Law of Entropy" for predicting atomic behavior.. this law,in other words, states that
"In an isolated system the entropy (disorder) always reaches its maximum"

బోల్‌ట్జ్‌మెన్ మహాశయుడి సిద్ధాంతం ఏంటంటే  ఒక అణు/పరమాణువుల సమూహానికి  బాహ్య శక్తి ప్రవహించనపుడు ఆ సమూహంలోని ఒద్దిక తగ్గుతూ గందరగోళం పెరుగుతూపోతుందీ అని. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సిద్ధాంతాన్ని ఆయన సామాజిక వ్యవస్థలకూ, మానవ సంబంధాలకూ అన్వయించాడు.
కొన్ని ఆశయాలు/నమ్మకాలు/ఇష్టాల ప్రాతిపదికన ఏర్పడిన ఏ వ్యవస్థ/సంబంధం అయినా దాన్ని అలాగే పట్టివుంచగల శక్తి (ప్రేరణ), commitment I'd say, లేనపుడు  ఆ వ్యవస్థ/సంబంధం కాలక్రమంలో నిర్వీర్యమైపోతుంది అని భావించాడు.

******************************************************

ఒక దేశంలోని ప్రజలను కలిపి ఉంచేది భాష అని సిద్దాంతీకరించి ఉద్యమాలు చేసి మన తెలుగు వాళ్లము ఒక రాష్ట్రంగా ఏర్పడటమే కాకుండా ఆ ప్రాతిపదికన మరిన్ని రాష్ట్రాల ఏర్పాటుకు కారణమయ్యాము.  ఈరోజు అదే భాషను ఒక సాకుగా చూపించి ఒకొళ్లకొళ్ల మధ్య మానసికంగా  Berlin wall కట్టేసుకొని, political గా విడిపోతున్నాం.

అయస్కాంతపు సజాతీ ధృవాల్లాగా కలిసి ఉండటం వీలుకాక విడిపోతే బాధపడాల్సిన అవసరం లేదు. కాని కలిసి ఉండటమనే విలువ తెలియక, చేతకాక  అలా ఉండేందుకు వీలుకానటువంటి పరిస్థితి కల్పించుకొని విడిపోతున్నాం. ఈ mindset ఉన్నాక అభివృద్ధిలో అందలమెక్కితే ఎంత అధః పాతాళానికి పడిపోతే ఎంత!

ఈ సందర్భంగా ఓ మిత్రుడి ఆవేదనను పంచుకుంటూ..,

 నిన్ను రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యపు జాతి మాది. క్షమించు తెలుగు తల్లీ, క్షమించు! 


with pity for all those who are incapable of looking beyond numbers, figures of a thing called development .--A Telanganite but not its supporter
(If identity matters)
ఓ చిట్టి (ప్రేమ)కథఅల్లంత దూరాన అందమైన విరివనంలోవిరబూసిందొక అందాల భరిణ. నక్షత్రాలలోని తళుకులన్నీ, వెన్నెలలోని స్నిగ్ధత్వాన్నంతా నింపుకొని సొగసంతా తానే అయి రూపుదాల్చిందా కుసుమం.
ముద్దాడి వెళ్లే పిల్లగాలికి తన ఈడువారితో ఊయలలూగుతూ  ముత్తయిదువల కొంగుచాటు నుండి ప్రపంచాన్ని చూస్తూ కాలం గడిపేది.ఈ సకుమారికి ఒకనాడు భావప్రపంచపు బాటసారి - పాట ఎదురైతే  ఆ మాటకారిని చూసి సిగ్గు మొగ్గలయిపోయింది... భువనాలను సమ్మోహనం చేసే సొగసు చూసి పాట ఆ చోటే నిలిచిపోయింది.ఒకరికొకరు గుండెవూసులు చెప్పుకుంటూ, సరాగమాడుతూ... ఓసారి తనకోసం పల్లవించమని పాటను అడిగింది గోముగా


మదిదోచిన పుత్తడిబొమ్మ కోసం పాట గలగల పారే సెలయేటి ప్రవాహమయింది, మధుపాతంలా వర్షించింది. తాను మధుర రాగాల జడివాన కురిపిస్తే  ఆ ముద్దుగుమ్మ  అమ్మ ఒడిలో హాయిగా ఆడుకొనే పాపలా సంతోషించింది,  శరత్ ఋతువులో పున్నమినాటి జాబిల్లిలా నవ్వింది, అలనాడు బృందావనిలో గోవిందుడి మురళీరవానికి పరవశించిన గోపిక అయింది.
ముచ్చటైన ఈ జంటను చూసి  ఏ తుంటరి తుమ్మెదకు కన్నుకుట్టిందో ఇద్దరి మధ్య ఓ చిలిపి తగవు వచ్చి కూర్చుంది. నువ్వుంటే నువ్వని పోరుపడి  పువ్వు అలిగి ముఖం తిప్పేసుకుంది. పాట చిన్నబోయింది.

దూరం అయ్యేది దరిచేరేందుకే కాబోలు!  విరహ వేదనలో ఒకరికోసం ఒకరు తపించిపోయి ఇక కలలోనైనా విడిపోవద్దనుకొని  పలకరించుకున్నాయి. కలిసి బ్రతుకుదామని బాసలు చేసుకున్నాయి.మనసేలిన స్వరానికై పువ్వు చేతులు చాచితే  నెచ్చెలిని తన కౌగిట ఆర్తిగా పొదివికొంది పాట.  ఒకటిగా పెనవేసుకున్న ఆ రెండు  మనసుల కథ ప్రణయమయ్యింది.      సంధ్యాసమయంలో, మరొక అందమైన రోజు మొదలవుతుండగా , చెట్ల కొమ్మలలో రెక్కలు విప్పుకుని కువకువ మంటూ పక్షులు ప్రాగ్దిశలో నింగికెగిసాయి....ఈ జంట కథను జగమంతా వినిపించేందుకు.
మరి మీరు విన్నారా ఈ కథను ?

ShareThis