ఫస్ట్ షో.....

జులై 19న ఖరగ్‌పూర్‌లో అడుగు పెట్టినప్పటినుండి ఈరోజుకి మూడువారాలు పూర్తి.
M.Tech కోర్సు oreintation ప్రోగ్రామ్‌ నుండి మొన్నటి lab session వరకూ అన్నీసమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉన్నాయి.

అసలే మొదటిసారిగా హాస్టల్‌లో ఉండాలి, పైగా వంగదేశంలో, ఎలా అని ఇక్కడికి వచ్చి చూస్తే నేను ఖరగ్‌పూర్‌లో ఉన్నానా లేదా అని అనిపించింది. అంతగా ఉన్నారు ఇక్కడ తెలుగు తమ్ముళ్లు, అన్నయ్యలు (తెలుగుదేశం వారో, ప్రజారాజ్యం వారో కాదులె..). మామూలుగా ఐఐటీల్లో ఆంధ్రప్రదేశ్‌ వాళ్ళు ఎక్కువ ఉంటారు అని విన్నాను, కాని మరీ ఇంతగానా....10 మందిని కెలికితే (విద్యార్థి పరిభాషలో పలకరిస్తే అని అర్థం) సుమారుగా అయిదుగురు అంధ్రదేశంనుంచే. మిగతా అయిదుగురిలో కనీసం ఒక్కడు మా హైదరాబాద్ ACE Academy వాడే. మేము ఉండే MMM హాస్టల్లో 60% స్టుడెంట్సూ, హాల్‌ మేనేజరూ, మెస్సు మేనేజరూ తెలుగే.
ఇతర రాష్టాల విద్యార్థి సంఘాలు ఫ్రెషర్స్‌ పార్టీలు పెట్టేస్తున్నాయి, మనవాళ్ళు ఎందుకు పెట్టడంలేదని అడిగితే, " వాళ్ల సమావేశాలకి ఓ ఆడిటోరియం సరిపోతుందిరా, మనం పెట్టాలనుకుంటే ఓ స్టేడియం కావాలిరా, దానికోసమే ప్రయత్నిస్తూన్నా"మని రిప్లై వచ్చింది. campusలోనే అనుకోంటే ఖరగ్‌పూర్‌ టౌన్‌లో మరీనూ. వీధికో తెలుగు దుకాణం (చిన్నా చితకా ఏంకావు), తెలుగు సినిమా పోస్టర్లూ (ఇక్కడ Big Bazaarకి వెళ్తుంటే ‘ప్రజారాజ్యం’ పోస్టర్‌ కనిపించింది, దీ**ల్లి ఇంతమంది తెలూగోల్లున్నారా అనిపించిందపుడు), ఆంధ్ర స్కూళ్లు.....అబ్బో, ఎంతగానంటే దారికనుక్కొడానికి నేను హిందీలో అడిగితే జనాలు ఫేస్‌రీడింగ్ చేసేసి తెలుగులో జవాబిచ్చేస్తున్నారు.
ఇట్టాగే కొనసాగితే ఖరగ్‌పూర్లో బెంగాలీబాబులు మైనార్టీలో పడిపోతారేమో అనిపించీంది....ఇక్కడ పరిచయమైన మళయాలీ ఫ్రేండొకడు ఒక్కసారికూడా ఆంధ్రరాలేదు, కాని మన సంఖ్యాబలం చూసి మాట్లాడటానికి మెజార్టీ వాళ్లు మనోల్లే కాబట్టి తెలుగు నేర్చేసుకుంటున్నాడు ( అడ్డమైన తెలుగు సినిమాలు డౌన్‌లోడు చేసుకొని చూసి ఆ డైలగులన్ని వాగేస్తున్నాడు....యెదవ)

మన రేంజ్ ఇంతగా పెరిగిపోయింది కాబట్టి నేననేదేంటంటే భవిష్యత్తులో జాతీయ తెలుగు మాహాసభలు ఎవైనా పెడితే ఇక్కడా పెడితే బాగుంటుంది, మాలాటోళ్ళకి దూరాభారం తగ్గుతుంది. అంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టిలు ఇక్కడి తెలుగు వాళ్ళ కోసం ప్రతేక ప్యాకేజి ప్రకటించాలి, బోల్డు వోట్లు ఉన్నాయి మరి. రైల్వే వాళ్ళు బెంగాల్‌-విజయవాడ-హైదరాబాదు-గుంటూరు మీదుగా కొత్త రైళ్ళు వేయకుండా ఇన్నాళ్ళు చాలా పోగొట్టుకున్నారు. ఇకనైనా వేస్తే బాగుపడతారు.

వచ్చిన వారం పదిరోజుల వరకూ కోర్సు confirm చేసుకోడానికి సరిపోయింది, తరువాత రజిస్ట్రేషననీ, రూమ్‌ సర్దుకొడనికీ, ఉన్న తెలుగు మొహాలని గుర్తుపెట్టుకోడానికి ,అసాధ్యం అని తెలుసు కాని అయినంతలో అయినంత కవర్‌ చేద్దామని, కంప్యూటర్‌ని మనం అడిగినప్పుడు మనక్కావాల్సింనంతసేపు ఇచ్చేవాడికోసం వెతకడానికి సరిపోయింది.
ఇవాళ నా రూమ్మేట్‌ జాహెద్‌ గాడు ఏదో పనిమీద వేరేవూరు వెళ్ళాడు. వాడి laptop ఇక్కడే వదిలివెళ్ళాడు...ఇప్పటి వరకూ ఆర్కుట్‌, ఫేస్‌‍బుక్, యాహూల్లో పండగ చేసుకొని బ్లాగుని బరుకుతున్నాను ( తలగోక్కోవొద్దు, విద్యార్థి పరిభాషలో బరకడం అంటే రాయడం అని అర్థంలెండి). వాడు వస్తే నాకు మా రూమ్‌లో నాతోపాటే సావాసం చేస్తున్న కంప్యూటర్‌కూ బంధం తెగిపోతుంది. వీలైనంత తోందరగా నేను కూడా సిస్టం కొనేసి దాంతో పండగ చేసుకుంటా.
అప్పటి వరకూ కాగితాలపైన బరుక్కుంటా.......రికార్డులూ, అసైన్‌మెంట్లూ ఉన్నాయి, వాటి గురించి చెప్తున్నా

తొందరలోనే మళ్ళి కలుస్తా.....అల్‌విదా, నమస్కార్‌, శుబోశి(ఇది బెంగాలీ తేలీని తెలుగు వాళ్ళకి. ఒకవేళ తెసినాకూడా కామ్‌గా ఫాలో ఐపోండి, దీని అర్దం నమస్కారం అని...)

2 వ్యాఖ్యలు.. :

మంచు said...

హస్టల్ లొ వంటొళ్ళూ కూడ తెలుగు వారె వుంటారు కానీ చెసెది మాత్రం చెత్త బెంగాలి ఫుడ్. దసరా, సెమిస్టర్ హాలిడెస్ లొ హస్టల్ మెస్ మూసెసినప్పుడు అర్ కె హాల్ లొ మన తెలుగు వాల్లు మెస్ పెడతారు. అప్పుడు ప్యూర్ తెలుగు భొజనం వుంటుంది. అప్పుడు ఫుల్ గా కుమ్మొచ్చు.

..nagarjuna.. said...

బెంగాలీ ఫుడ్‌పెట్టినా బావుణ్ణు, వీడు ఆలు మీద పిచ్చి ప్రేమ పెంచుకొని ప్రతీదాంట్లో వేస్తున్నాడు ఆఖరుకి చేపల పులుసు, కోడిగుడ్ల వేపుడులో కూడా..
మాకు ఆ‌ర్‌కె హాల్ దూరం అవుతుంది. పక్కనే జేసి బోస్‌ హాల్‌లో ఆంధ్రకాంటీన్‌ ఒకటి దొరికింది సాయంత్రంనుండి తెరుస్తాడు, ఇప్పటికి అందులో కానిచ్చేస్తున్నాం.సెమిస్టర్‌ హాలిడెస్‌లో ఆర్‌కె హాల్‌కి వెళ్లడం తప్పదనుకుంటా..

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis