తెలుగ బ్లాగులు పచ్చగా పిచ్చ పిచ్చగా ఎవళ్ల పని వాళ్ళు చేసుకుంటున్న తరుణంలో మళ్ళి దాదులు మొదలయ్యాయి....ఒకప్పుడు దాడికి ప్రతిదాడి కాన్సెఫ్టుతో ప్రారంభమైనదే కెలుకుడు బ్లాగర్ల సంఘం (కెబ్లాస). ఈ సంఘం ఆధ్వర్యంలో దాడులు భీకరంగా సాగేవి అప్పుడప్పుడు సంబరాలు కూడా చేసుకునేవారు. ఈ సంఘంలో ఒక సభ్యుడు శరత్ వీలు చూసుకొని తన హిడెన్ ఎజెండా బయటపెట్టాడు. ఊరంతా ఒకదారైతే ఉలికిపిట్టదొక దారని...మిగతా వాళ్లంతా మానవ హక్కులు వంకాయ బీరకాయ అంటే ఈయన LGBT హక్కులు, adult హక్కులు అని వాపోతుండేవాడు...ఈయన నస పట్టలేక జనాలు ఈయనకో సంఘం గుంపగత్తుగా ఇచ్చేసి పండగా చేసుకో నాయనా అని తేల్చేసారు. ఇక దాన్ని ఆయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనుకొని ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు. పైగా ఉన్న సంఘానికి అనుభంధంగా పిల్ల సంఘాలు....ఆయన లోకంలో ఆయనున్నాడు. ఐతే ఈ కెబ్లాసలోంచి మరీ ముఖ్యంగా టపాలు రాసే పనిలోంచి పెళ్లికాని ప్రసాదు ఒకరు వెళ్ళిపోవడంతొ గతకొద్ది కాలంగా దాడులు తగ్గుముఖం పట్టాయి. వెళ్ళిపోయిన సదరు సభ్యుడిలోటును ఈ మధ్య ఓ ఫ్రూఫులు అడిగే అతను భర్తి చేస్తున్నాడు. మాట్టాడితే ఫ్రూఫులు ప్లీజ్, స్టాట్స్ ప్లీజ్ అని దాడి చేయడం ఈయన మార్కు
ఒకవ్యక్తిపై జరిగే దాడులలో ముఖ్యంగా ఈ కెబ్లాసకు అనుభంద సంస్థ ఒకటి, అమెచ్యూర్ బ్లాగర్లు కలిసి పెట్టుకున్న సంఘం ఒకటి ముఖ్యమైనవి. వీళ్లు రాసే మాటల తూటాలకు అప్పట్లో అగ్రిగేటర్లు మహేష్‌బాబు కొట్టకుండానే దిమ్మతిరిగి బ్లాకయ్యెవి :)
ఐతే దాడి కి ప్రతిదాడి భావంనుండి కాక అభిమానం వల్ల కూడా దాడులు జరిగాయి. ’బావ కళ్ళ్లలో ఆనందం కోసం’లా తమ అభిమాన బ్లాగరు నేస్తం రాసే టపాల్లో ఎప్పటికైనా వంద కామెంట్లు చెయ్యాలనుకొని కామా చూడలనుకొని సిండికేట్ అయ్యిన బ్లాగర్లు కొందరు తీరా ఆ భాగ్యం కొత్తగా వచ్చిన బ్లాగరిణి కొట్టేయడంతో పట్టలేని ఆవేశంలో ఆక్రోషంతో సదరు బ్లాగరిణి బ్లాగులో కామెంట్లదాడి మొదలెట్టారు. యెన్నో వ్యయ ప్రయాసల తరువాత ఆ కొట్టుకోవడానికి భరతవాక్యము, కొత్త స్నేహానికి నాంది వాక్యము జరిగినాయి. అలా పుట్టిందే వబ్లాస (వంద కామెంట్ల సంఘం)...పుట్టిపుట్టంగానే, in fact పిండరూపంలో ఉండగానే, మూడు బ్లాగుల్లో ‘శతక్కోట్టుడు’ చేయడం దీని ప్రత్యేకత. కొన్నాళ్ళకు సభ్యుల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, వైవిధ్యం చూపించే బ్లాగర్లను ప్రోత్సహిమ్చాలని దీన్నే యు.బ్లా.స (యువ బ్లాగర్ల సంఘం) గా మార్పు చేయడం జరిగింది. దీనికీ ఓ ప్రత్యేకత ఉంది...బ్లాగులోకంలో అపాలజీలు చెప్పే బాధ్యతను ఈ సంఘంలో ఒక బ్లాగరిణి తీసుకోవడం అని జనాలతో చెప్పించుకోవడం . ఇలా చేయడం వల్ల మనల్ని ఎవరూ లెక్కచేయట్లేదు తల్లోయ్ అని సభ్యులే పులి సినిమాలో లా ’అమ్మ తల్లీ...’ అని అందుకుంటున్నారు...... ప్చ్. తను మాత్రం "మీ అభిమానం చుక్కల పద్దతిన కాకుండా లీటర్ల పద్దతిన ఉంది నేనాగలేను ఇప్పుడు" అని అలా పరిగెడుతూనే..................ఉంది. ఎప్పటికి ఆగేనో మరి !!
ఐతే ఓ పెద్ద చెట్టుకింద ఓ చిన్న చెట్టు ఎదగాలంటే మాటలా.......ఎప్పుడో భూమిపుట్టినప్పుడు మొదలైన సంఘాల మద్య్హలో ఇప్పుడో కొత్త సంఘం అనగానే పాతవాళ్ళు షివరింగ్ అయ్యారు......ఇంగ దాడి షురు.పనిలేని మంగళి పిల్లతల గొరిగినట్టు మీ సంఘంలో సభ్యులెంత, ఆఫీసెక్కడ, జమా ఖర్చులెంత అని ఈకలూ తోకలూ చూపించమన్నారు.ఈ దాడి చేసిందికూడా ఓ యువ బ్లాగరే కావడం ప్చ్ అహ్ శోచనీయం ... :( ఇందులో అతడితోపాటు కెబ్లాస లక్షణాలను తోసెయ్యలేం :D :(
ఇది చాలదన్నట్టు తన రాజ్యంలో అన్ని పాత్రలను తానే ఏకపాత్రాభినయం చేసుకుంటూ, సంతానవతుడయ్యుండి అస్ఖలిత బ్రహ్మచారిని అనే చెప్పుకుంటూ తనుకు తాను కుర్రాడిలా ఫీలయ్యే శరత్‌గారు నేను కుర్రాన్నెనోచ్ నన్నూ కలుపుకోండి అని వాలిపోయాడు. మనవాడే పైగా పరిచయస్తుడే అని దాదాపుగా కలుపుకుందా మనుకునేలోపు ఈయన గూరించి యుబ్లాసకు అప్పటికి అప్రకటిత సభ్యులొకరు ఉప్పందించారు. కర్ర విరగొద్దు పాము చావాలి అన్న చందంగా పరిశీలిస్తున్నాం అని చెప్పటం జరిగింది. ఆయనమాత్రం యుబ్లాస సభ్యుడినేనంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. పెద్దల నుండి నిరాకరణ జరగొచ్చునేమోనని ముందుచూపుతో కొందరిని తమ సంఘానికి సలహాదారులుగా నిమమించుకుంది......ఇక తేలాల్సింది విధివిధానాలు. వీటిపైనే ఇప్పుడు దాడి......హ్మ్. అందుకే ఈ బ్లాగు ముఖంగా కొన్నిటిని నివృత్తి చేయదలచాం
1)మా సంఘంలో ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు ఉండబోరు....అందరూ కార్యవగ్గ సభ్యులే. అందరూ సమానమే.
2) ఒకే విషయం పై నా దృక్కోణం అనీ, పక్కవాడి దృష్టికోణం, లంబకోణం, వక్రకోణం అని చెప్పే సోదితో విసిగిపోయాం బాబు. కాబట్టి యుబ్లాస సభ్యత్వం తీసుకోదలచినవారు వైవిధ్యభరితంగా నసపెట్టకుండా రాయవలెను :)
౩) యుబ్లాస లో గరిష్ట వయసు పరిమితి 32-34 సం. 32 రాగానే క్రియాశీల కార్యవర్గంనుండి తప్పుకుంటారు. 34 దాటినవారు సలహాదారులుగా ఉంటారు......వయసుతో కూడిన అనుభవం వల్ల వచ్చిన మార్గ్దదర్శనం చేయడానికి. వయసుతో సంభంధం లేకుండా మనసు ద్వారా మేం యువకులమే అనేవాళ్ళు బ్లాగులోకంలో చాలామంది ఉన్నారు. సోది పెట్టనంతవరకూ అందరికీ స్వాగతం :)
ఈతరం బ్లాగులో కొత్త్గగా ఒక వ్యక్తిపై దాడి జరుగుతుంది. అతడే బ్లాగు బాబ్జి అనే కాండిడేటు. అడవి యాసతో అందరిని కెలికుతూ పూర్వపు కెబ్లాసను తలపిస్తున్నాడు. ఇతగాడు తనబ్లాగులో తప్పవేరే బ్లాగుల్లో కామెంటకపోవడం, బ్లాగ్లోకంలో కొందరితో (PhD candidates తో) తనకు ఆల్రెడి పరిచయం ఉందని చెప్పడంతో ఇతగాడు వెళ్ళిపోయిన పెళ్ళికాని ప్రసాదేమోనని ప్రశ్నల దాడితో వేధించారు....బ్లాగులోకంలో అంతో ఇంతో తెలిసిన ప్రతి సాల్తీతో అంటగట్టడం మొదలెట్టారు. తిక్కరేగి తాను ఎవరిని కాదు అని చెప్పి కొద్దిపాటి నమ్మకం కలిగించాడు.
పోతే అతినూతనంగా ప్రారంభమైనదాడి అభం శుభం తెలీని బ్రహ్మచారులపైన. ఒక సీనియర్ బ్లాగర్ మొదలెట్టిన గోడు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు, జోగి జోగి రాసుకొని బూడిద రాల్చినట్టు (నోటిదూల :D) మొగుడ్స్- పెళ్ళామ్స్ గోలలోంచి పుట్టిందే బ్రహ్మచారుల బ్లాగర్ల సంఘం ( బ్ర బా స ). ఐతే మిగతా నూతన సంఘాలకు ఎదురైనట్టుగానే దీనికి దాడులు ఎదురైనై. పెట్టిన మరుసటి రోజే ఓ సభ్యుడు పెళ్ళి చేసుకోవడం ఊహించని మలుపుకాగా, పెట్టిన కొత్త్లోనే ఇది బ్రహ్మి గూపు అనే టాగు మరో దెబ్బ, అక్కడికి బ్రహ్మచారులంతా సాఫ్ట్‌వేర్‌వాళ్ళె ఐనట్టూ.....మిగిలిన దెబ్బలు కుటుంబరావులు, సతీ సక్కుబాయిలనుండి ఎదురౌతుంది. అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే నిన్నగాక మొన్నటివరకు బ్రహ్మచారి జీవితాన్ని మూడు లైన్లు అరు బీట్లతో గడిపిన ఓ మాజి బ్రహ్మచారి చేయడం. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు.........ఐనా బ్రబాస సభ్యులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకో ఐదేళ్ల తరువాతైనా ఈ హీరోగారు తమ సహాయం కోరకపోతారా అని. దీనికి తోడు ఇందాక చెప్పిన ఏకఛత్రాధిపత్యం చేసే సదరు సాల్తీ తానుకూడా బ్రహ్మచారినే అంటూ తననీ చేర్చుకోవాలంటూ కామెంట్ల దాడి చేస్తున్నాడు. మేము చూస్తున్నాం కట్టే విరక్కుండ పాము చచ్చేట్లు.........!!
అదండీ సంగతి ప్రస్తుత తెల్గూ బ్లాగ్లోకం ముడు గ్రూపులు ఆరు ప్రతి గ్రూపులు చందాన తాన అంటే తందానా అంటూ సాగుతుంది. ఈ పరిణమాం ఎటుపోతుందో మరి.....ఖచ్చితంగా హర్షాతిరేకాలకు కారణమవ్వాలని కోరుకుంటూ అందరికి
య్యాపి Engineer's Day :)
Just for fun........
Subscribe to:
Post Comments
(
Atom
)
25 వ్యాఖ్యలు.. :
మొదటి కామెంట్ నాదే
జై వ బ్లా స
ఏందయ్యా నీ పరిక్షలు వదిలేసి బ్లాగులు రాస్తున్నావా
ఈ హడావుడి తరువాత మొదలెడదాం
మైనర్ complete అయ్యిందా ఇప్పుడు ?
:)) Good one.
ఈ మధ్య ఓ ఫ్రూఫులు అడిగే అతను భర్తి చేస్తున్నాడు. మాట్టాడితే ఫ్రూఫులు ప్లీజ్, స్టాట్స్ ప్లీజ్ అని దాడి చేయడం ఈయన మార్కు..
evaroo idi
చాలా బావుంది నీ నిరసన పోస్ట్
Happy Engineers Day!
@హరే: మాది ఖరగ్పూర్ సార్... రెండొ యేడు మైనర్లు పిల్లర్లూ ఉండవ్...
మరి పాసయ్యేదెలా?
మైనర్లు ఉంటే పాసవ్వరు సార్..ఏకంగా మేజరే.. :)
@తారజీ: అదో పెద్ద పజిల్ కనుక్కోమ్డి చూద్దాం :)
@పొలిటీషియన్: :)
ఈమధ్య ఎల్జీబీటీ, గే హక్కులూ అంటే ఎవరూ పట్టించుకోవడం లేదు బ్రదరూ. మాకూ తెలుసులేవోయ్ అన్నట్లుంటున్నాయి వాళ్ళ చూపులు. ఎంతకాలం ఒకే చేతితో చప్పట్లు కొడతామని చెప్పేసి ఈమధ్య బిడిఎస్సెం తలకెత్తుకున్నాగా. ఇప్పుడొస్తోందీ మళ్ళీ మజా. మళ్ళీ నన్ను పట్టించుకుంటున్నారు జనాలు. ఏదో పోర్నూ గట్రా అనీ టపాలు వేసి బిడిఎస్సెం, పోర్నూ ఢాం ఢాం అని నినాదాలిస్తున్నారుగా!
నేను ముందే సెలవిచ్చినట్లు శారీరకంగా సంసారినీ, మానసికంగా అస్ఖలిత బ్రహ్మచారినీ ( ఎక్కడా...మానసికంగా స్ఖలిద్దామంటే ఈ అగ్రిగేటరోళ్ళు ఒప్పుకొని ఛస్తేగా!). అంచేత మీదాంట్లో సభ్యత్వానికి టెండర్ వేస్తే కనీసం గౌరవ సలహాదారు పొస్టేమన్నా దక్కుతుందేమోనని దింపుడుగళ్ళం ఆశ నాదీ.
నాగ రాజునా చర్యా,
ఆఫీస్ లో కొంచెం బిజీ గా ఉండి బాగా వెనక పడిపోయాను. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?
ఇంత జరుగుతోందా నాకస్సలు తెలిదే ఇన్ని గ్రూపులున్నాయని వామ్మో! Good post :)
జనాలకి ఈ మద్య పనేమి లేనట్టుంది... :-)
@ కామ్రేడ్ తార ,
>> 1)మా సంఘంలో ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు ఉండబోరు....అందరూ కార్యవగ్గ సభ్యులే. అందరూ సమానమే. >>
ఇదేదో సమానత్వం , సొరకాయ పచ్చదీ అంటుండారు , ఎటాఖ్ ;)
కేక...... ఇంతకీ ఈ పోస్టు ఏ సంఘం తరపున రాసినట్టు వ.బ్లా.స, యు.బ్లా.స, బ్ర.బ్లా.స?
>>నిన్నగాక మొన్నటివరకు బ్రహ్మచారి జీవితాన్ని మూడు లైన్లు అరు బీట్లతో గడిపిన ఓ మాజి బ్రహ్మచారి చేయడం>>
ఇదెవరు
నాగార్జున గారు: ఈ సంఘాలేమిటండి బాబు ... ఇంకో సంఘమేదో పెడతాను అని నేస్తం గారి బ్లాగ్లో చెప్పారు మీరు అది ఎంత వరకు వచ్చిందండి .... అయ్య బాబోయ్ ! ఇంతకీ ఆవేశం , ఆక్రోశం ఎవరిమీద వచ్చాయి.. నేస్తం గారి కామెంట్లు ఎత్తుకెల్లిపోయిన బ్లాగరిణి ని తిట్టినట్టా?? పొగిడినట్టా?? .. అయ్య్ అయినా నేస్తం గారి కామెంట్లు ఎత్తుకెల్లిపోవడమేమిటీ ఆ రాక్షసి.. పోనీలేండి తెలియక చేసుంటుంది
@శరత్: నే చెప్పాల్సింది ఏంలేదు...మీ పని మీరు కానివ్వండి. మిగతా సంగతి బ్లాగర్లు చూసుకుంటారు
@ప్రవీణ్ : అందుకేనా కనబడ్డంలేదు..., సంగతేందంటే కొన్నిరోజుల క్రితం బ్రహ్మచారుల సంఘం ఆవిర్భవించింది. దాని పైన, యుబ్లాస పైన ఓ పోస్టు పడింది. దానికి రిప్లై ఇది
http://nenu-naa-svagatam.blogspot.com/2010/09/blog-post.html
http://ongoluseenu.blogspot.com/2010/09/blog-post_14.html
@మంచు: నాకు వేరే బ్లాగుల్లో కామెంట్లురాసే పనితప్ప నా బ్లాగులో పనుండట్లేదు...అందుకే ఇలా నస :)
@3g: హిహ్హిహ్హి హి....... భగవానుడు ఏరూపంలో కొలిస్తే ఆ రూపంలో దర్శమిచ్చెట్టు, ఎవరి తరఫున రాసాననిపిస్తే వాళ్ల తరఫున
@శ్రీనన్నా: ఛా....ఏం తెలీనట్టు ఆ కొసెనింగోటి, చిలిపి :P
@కృష్ణ: ఇప్పుడు ఇక్కడ తారాగారితో డిబేటు ఎందుకు స్వామి....
@శివరంజని: తిట్టానో పొగిడానో తనే చెప్పాలిమరి. పోతే నేస్తం బ్లాగులో ఆవేశంకొద్ది ఏదో చెప్పాను, ఉన్న సంఘాలనే మైంటైన్ చెయ్యలేక ఉన్నాను, ఇంకో కొత్తదా......నో......
>>రాక్షసి...<< హేమిటి హంత మాటనేసావ్, తనేమో నీకు బూస్టు, హార్లిక్స్ తీసుకొద్దామని వెళ్తేను :)
@అజ్ఞాత: అవి పుట్టుకొచ్చేవరకు మాకూ తెలియలేదండి :)
నాగార్జున.. మొదటగా నన్ను క్షమించెయ్యవా ప్లీజ్.. అదేంటో గత కొన్ని టపాలుగా నేను నీ టపాలని మిస్ అవుతున్నాను.:(
టపా మాత్రం సూ...పర్..:) నాకసలు నవ్వాగలేదు. ఆ బ్లాగరిణి నేనే కదూ!! హహ్హా.. కానీ మన యు.బ్లా.స / వ.బ్లా.స గురించి చెప్పావు చూడు. చాలా బాగుంది.
>>ఒకే విషయం పై నా దృక్కోణం అనీ, పక్కవాడి దృష్టికోణం, లంబకోణం, వక్రకోణం
నవ్వి నవ్వి చచ్చిపోయాను..:))
@అపర్ణ: అబ్బా....ఒకరు సారిలు చెప్పడం, ఒకరు క్షమాపణలు చెప్పడం. ఇలాగైతే ఉన్న సంఘాన్ని ఎలా మైంటైన్‍౬ చేసి చచ్చేది (అదేదో సినిమాలో రాజేంద్రప్రసాద్ స్టైల్లో ) :)
ఆ బ్లాగరిణి నువ్వోకాదో తెలవదుకాని, శివరంజని నిన్ను ఎదో అన్నట్టుంది చూసుకున్నావా..? ;)
అవునవును నాగార్జున.. చెప్పినందుకు ధన్యవాదాలు. నేను గమనించలేదు సుమా..
శివరంజని నన్ను తిట్టిందా..? అయ్.. నేస్తం అక్క బంగారాన్ని, జాజిపూలి అభిమానిని, యు.బ్లా.స./వ.బ్లా.స మెంబర్ ని.. హన్నా.. ఎన్ని గుండెలు.. ఎన్నెన్ని ఎముకలు ఇంకెన్ని రక్త కణాలు..??
>>పోనీలేండి తెలియక చేసుంటుంది .
అన్నది కాబట్టి బ్రతికి పోయింది..;);) :D
అయ్యో అపర్ణ నిన్ను కాదు అంటా..నన్ను నేనే అనుకున్నా .... నేస్తం గారి కామెంట్ లు ఎత్తుకెల్లిపోయింది అంటే నేనేమో అనుకున్నా ... అందుకే రాక్షషి అన్నాను ...బంగారాన్ని ఎవరైనా రాక్షసి అంటారా చెప్పు ...నిన్ను బంగారం అని అంటుంటే .నాగార్జున గారు జెలసీ ఫీల్ అయ్యి అలా చెబుతున్నారు అంతే...నువ్వు నమ్మకేం. నువ్వు ఫీల్ అయ్యావా...... సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ
హమ్మయ్య సారీ లు చెప్పేశావ్ గా..:)) నా కడుపు నిండి పోయింది..;))
నేను కూడా ఊరికే అన్నాను రంజనీ.. మనమంతా ఫ్రెండ్స్ అనుకున్నాం కదా.. నిన్నెందుకు తిడతాను చెప్పు..:)
@శ్రియ, అపర్ణ: (మల్లీశ్వరీ సినిమాలో గౌతంరాజు లాగా), ’నావల్ల కాదండీ, నావల్ల కాదంతే'.....ఇలా పబ్లిక్‌గా సారీలు, క్షమాపణలు వద్దంటున్నా చెప్తున్నారే.... :)
చూశావా నాగార్జున. ఇక్కడ మేమిద్దరం తిట్టేసుకుంటున్నామని నువ్వు బాధ పడిపోతూ ఉంటే అక్కడ కృష్ణ ఏమో, ఆనందపడిపోతున్నాడు..:(
హహ్హహ్హహ్హ.....ఎంతైనా కృష్ణుడి పేరు పెట్టుకున్నాడుగా, టైటిల్ జస్టిఫికేషన్ అన్నమాట...
i think i can never understand why people cant stay calm and want to create some or other sensations by creating out of track stuff.
When allowed to survive, they give us names and call us with those names , laughing at us.
ఏమో ఎవరి పిచ్చి వారిది ఎవరి ఆనందం వారిది, వద్దన్నా గానీ పదే పదే అదే పనిని మరో మరో విధంగా రిపీట్ చేసి లేని ఇమేజ్ సంపాదిన్చాలన్నది కొందరి సమస్య
దీన్ని అసలు మనం పట్టించుకోవాలా?
రహ్మాన్ భాయ్ మీరు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారేమో...అస్సలంత సీన్ ఊహించుకోకండి. This was just a satirical post on another satirical post.......things that you might have had thought-of when commenting are completely out of my concern and its bloggers, between whom such issues arise, who have to settle them
కామెంటినందుకు మీ స్టైల్లో థాంక్లు :)
Post a Comment
మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ