1) పుట్టుకతో మూగ చెవిటి అయిన విశ్వేశ్వరరావు అనే అభ్యర్ధి PD కోటాలో ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకుంటే లంచం అడిగిన సంబంధిత శాఖ అధికారులు. సిగ్గుండాలి ఈ నా ______కులకి. సామన్యుడి దగ్గర చేయిచాస్తారు, అది సరిపోక వైకల్యం ఉన్నవాడు తనకాళ్లమీద తను నిలబడతానంటే అతని దగ్గరకూడా లంచం అడగటం. చూస్తే శవాలమీద చిల్లర ఏరుకునే బాపతులా అనిపిస్తుంది. పైగా ఈ _____కులకి సంఘాలు, ధర్నాలు......థూ
ధైర్యం చేసిన విశ్వేశ్వరరావు సదరు అవీనీతాగ్రేసరుడి పేరు బయటపెట్టడానికి కూడా తయారయి ముఖ్యమంతిని కలిసి తన బాధ చెప్పుకుందామని రాజధాని వస్తే అప్పాయింట్‌మెంట్ ఇవ్వకుండా జాప్యం చేసిన సెక్యూరిటి.
2) విశాఖలో ఒక యువతిపై ప్రేమోన్మాది దాడి......ఈళ్లకి మామూలుగా చెప్తే వినరు. అప్పుడొసారి వరంగల్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తే తప్పుబట్టాను....కాదు అలానే చేయాలి. అలాంటి వెధవలు బ్రతికుండి వేస్ట్, ఇంకొకళ్లనైనా వేధిస్తారు. లేపిపారేయండి వెధవల్ని......
Subscribe to:
Post Comments
(
Atom
)
20 వ్యాఖ్యలు.. :
నువ్వు చెప్పింది కరెక్ట్ నాగార్జున..
>>సామన్యుడి దగ్గర చేయిచాస్తారు, అది సరిపోక వైకల్యం ఉన్నవాడు తనకాళ్లమీద తను నిలబడతానంటే అతని దగ్గరకూడా లంచం అడగటం
ఇంతకన్నా దారుణం ఉండదేమో..
>>అలాంటి వెధవలు బ్రతికుండి వేస్ట్, ఇంకొకళ్లనైనా వేధిస్తారు. లేపిపారేయండి వెధవల్ని
వాళ్లకి ఇదే కరెక్ట్.. :@ :@
టాగూర్ లొ చిరు చేసినట్టు . మన బ్లాగర్లు అందరూ ఓక్ ఫోర్స్ గ తయారయ్యి లేపేస్తే పోద్ది . పీడా వదులుద్ది
ఏదో ఒక చానెల్ వాడు ఇదే footage ని రోజంతా వేస్తే సరిపోయేది
ఆ లంచం తీసుకుంటున్న అధికారిని హైలైట్ చేసి కుమ్మేయాలి కాని ఈరోజుల్లో ఛానళ్ళు కూడా అన్నీ తింటున్నాయి
శ్రీనివాస్
Control Control
పవన్
నన్ను ఆపొద్దు , వదులు , వదులు
మన ఆవేశం ఎంత సేపు? చిన్న తల అమృతాంజనం రాస్కున్నంత సేపు .... సినిమా చూసి ఉప్పొంగి బయటకి వచ్చాక భలే చేసాడురా ఆ హీరో గాడు అనుకుంటూ మన బండో, కారో బయటకి తీసేలోపే మర్చిపోతాం. మనకి తీరికేది ? ఒక సీరియస్ కామెంట్ తో మొదలయ్యి ఒక జోక్ తో అంతమయ్యే ఈ ఆవేశం ని సరైన దార్లో పెట్టే మార్గం వెతుకుదాం .... క్షమించండి తమ్ముళ్ళు.... నేనూ అంతే ... మనమంతా ఒకటే దారి అదేదో సామెత లాగా గుడిపూడి _____.ల్లాగా ... ఇది చూడండి ...http://lipilenibasha.blogspot.com/2010/08/blog-post_31.html
ఆత్రేయ గారు,
మీరుంటున్నది నిజమే ... అవేశం నీటి బుడగ లా ఉంటుంది .... అయితే అచరణ విషయానికి వస్తే తప్పు ఒక్కరి వైపే ఉండదు ... ఇరువైపులా ఉంటుంది . ఇంతకు ముందు ఏప్పుడో ఓసారి జరిగే సంఘటనలు ఇవాళా రోజు జరుగుతున్నాయి అంటె దానికి కారణం ఏంటి? మాగాడిది తప్పు లేదనను కాని అడవారిది అసలు తప్పులేదంటె ఓప్పుకోను .. ఇది సమాజం మాగాళ్ళలో మంచోళ్ళునారు ..అడ వాళ్ళలో రాక్షసులు ఉన్నారు అయితే సానుభుతి ఇద్దరికి సమానంగా ఉండదు అదే మన సమాజం.
@అపర్ణ: Thanks for sharing your emotions.
@ఆత్రేయగారు: నిజమే అలాంటి తప్పు చేసినవాడిని కఠినంగా శిక్షంచాలనుకునే ఆవేశం ఎక్కువసేపు ఉండకపోవచ్చు కాని ఇలాంటి మితిమీరిన పోకడలు సమాజం నుండి తరిమేయబడాలి అనే కోరిక అంత తొందరగా పోయేదికాదు. ఇప్పుడు ఈ విషయంలో ’శిక్ష’ అనే భావంతో బయటపడింది, మరో విషయంలో జస్ట్ ఒక ఆవేదన రూపంలో ఉండొచ్చు, వేరొక విషయంలో మనం చొరవ తీసునేట్లు చేయవచ్చు. మూడుగంటల సినిమానే అంత ప్రభావం చూపగాలేనిది చిన్నప్పటినుండి ఉండే స్నేహితులు, నేర్చుకున్న విద్య, తల్లిదండ్రుల ప్రవర్తన పెంపకం ఎంత ప్రభావం చూపగలగాలి. కాని జరుగుతున్నదేంటి. అంటే మనం సమాజాన్ని లైట్ తీసుకున్నట్టే మనవాళ్లను కూడా లైట్ తిసుకుంటున్నామా...?
@ పవన్ : నిజమే సోదరా.....తప్పు ఇరువైపులా ఉండొచ్చు..నిజానిజాలు మనకు తెలియనివి. అసలు మొన్నటి హైదరాబాదు ఘటనలో కూడా ఇలాంటి అనుమానాలే కలిగాయి. కాని ఏదేమైనప్పటికి ఒకరు తనమాట వినలేదనీ లేక తనంటే ఇష్టంలేదనీ చెప్పినంతమాత్రాన చంపేయడం ఎంత సబబు ?
@హరే: హ్మ్...రోజు అలాంటి దగుల్బాచీల గురించి వేస్తూనే ఉన్నారు. వీళ్లకు తగ్గటు చట్టాలు. ఆరోపణ రుజువయ్యి శాఖాపరమైన నివేదిక వచ్చేంతవరకు ఎటువంటి చర్యలూ ఉండకూడదట....నవ్వొస్తుంది...
@శ్రీనివాస్: హ్మ్....
nagarjuna
నువ్వు అంటున్నది నిజమే .... మాటవినలేదని చంపేయడం తప్పే కాని అతను చంపే వరకు వెళ్ళాడు అంటే ఆలోచించమంటున్నాను .. ఎందుకంటే ఎంతసేపటికి అడాళ్ళకు అన్యాయం జరుగుతుంది ... మగాళ్ళు మృగాలని టివి లలో ఉదర గొట్టేస్తుంటె ఆ మాట అన్నాను ... మార్పు మాగాడి లోనే కాదు అడవాళ్ళలోను రావాలి .... ప్రతి సారి మాగాడి వైపే తప్పుండదని అంటున్నాను అంతే కాని వాళ్ళు చెస్తుంది మంచి పని అని నా ఉద్దేశ్యం కాదు ... అడవాళ్ళకు అన్యాయం చేస్తున్నాడని
>>అప్పుడొసారి వరంగల్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తే తప్పుబట్టాను....కాదు అలానే చేయాలి.
అలా చేసినా ఇలాంటివి తగ్గట్లేదు కదండీ. ఇక్కడ హార్డ్ కంట్రోల్స్ కంటే సాఫ్ట్ కంట్రోల్స్ బాగా పనిచేస్తాయి. కొంచెం స్లోగానే అనుకోండి.
@పవన్: మీరు చెప్పింది(అమ్మాయి వైపుకూడా తప్పుండడం) హైద్రాబాద్ సంఘటన విషయంలో కొంచెం కరెక్టే కాని నాగార్జున రాసింది విశాఖ సంఘటన గురించి ఇక్కడ ఆ అమ్మాయి తప్పేమి లేదు కావచ్చు.
శ్రీనివాస్,
గుడ్ ఐడియా! ఎప్పుడు మొదలెడదాం ఫోర్స్?
నాగార్జున గారు బాగా చెప్పారు ... మీరన్నది నిజమేనండి ...మనుషులు అంతరిక్షం లోకి వెళ్ళే నాలెడ్జ్ సంపాదించికున్నారు కాని ఇలాంటి వాటిని మాత్రం మార్చలేకపోతున్నారు.... ఏమిటో ...ఇలాంటివి చూసి చూసి పేపర్ ఫోబియో ,T.V. ఫోబియోలు కూడా వచ్చేస్తున్నాయి
....
బాగుంది ... యు బ్లా స ఎజెండా నా ? …
@సుజాత గారు : మీ ఫోర్స్ లో నన్ను జాయిన్ చేసుకుంటారా?
సుజాత గారు :)
మరీ ఠాగూర్ రేంజి కాకపోయినా ఫోర్స్ గురించి నా దగ్గర ఒక ఆలోచన ఉంది త్వరలో పంచుకుంటాను. :)
@శివరంజని: ఎదోఒకటి, సామాన్యుడికి సమాజం అనే ఫోభియా రాకుండా ఉంటే చాలు
@సుజాతగారు, శ్రీనివాస్‌జీ: అదేంటొ తొందరగా చెప్పండి. ఏదో ఆవేశంలో రాసేసానుగాని ఈ చంపేయడాలు లేపేయడాలు మనవల్ల అయ్యేవికావు
@3g: సాఫ్ట్ కంట్రోల్.....హ్మ్...,అంటే సామాజిక చైతన్యం లాంటిదనుకుంటా...
శ్రీనివాస్ నువ్వు ఫోర్స్ తయారు చెస్తే మొసం చేసే అబ్బాయలను మాత్రమే కాదు మొసం చే్సే ఆడదానిని కూడా వదలద్దు ..... rule is rule for all
నాయనా సర్పంచి
మా ఫోర్సు కేవలం కరప్షన్ కె పరిమితం సుందరా
కరప్షనో కరక్షనో ... ఏదైనా సరే ... ఇద్దరిని కుమ్ము సోదరా .....
సుందరా naa ఏవడు ఆడు ... ఈ బ్లాగు లోకం లో సుందరుడు సుందరాంగుడు ఒక్కడె అతనే మా xxx
.. పేరు వద్దులే దడుచుకుంటావ్
@పవన్: ఆగు స్వామి నువ్వు అక్కడే ఆగు...ఇంకొంచెం ఉంటే బద్దలయ్యేట్టు ఉన్నావ్....శ్రీనన్నా...మావోణ్ణి ఎక్కువ డిస్టర్బ్ చేయమాక ఏ నిముషంలోనైనా పేలేట్టు ఉన్నాడు..
Post a Comment
మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ