మనసుమాట

పసికందును లాలిస్తున్న
అమ్మ చెబుతుంది విను
మమత ఎంత నిష్కల్మషమో

నిలువెల్లా సోయగంతో అలరారే
ప్రకృతి  చెబుతుంది విను
ప్రాణమెంత అమూల్యమో

కవనము చేసే కవి కలం చెబుతుంది విను
తననుంచి జాలువారే అక్షరమెంతటి సమ్మోహనమో

ఎడబాటుతో రగిలే ప్రియుడి
విరహం చెబుతుంది విను
నెచ్చెలి అధరమెంత మధురమో


నిను కొలువుచేసుకొని ఆరాధించే
నామది చెబుతుంది విను
తనకు నువెంత అపురూపమో


33 వ్యాఖ్యలు.. :

..nagarjuna.. said...

Man O' Man.....this is just so beautiful.......mmuuaah

..nagarjuna.. said...

ఆరు నెలలుగా ఊరిస్తోంది ఈ కవిత(?). ఇప్పటికి పూర్తి చేయగలిగా

ఇందు said...

చాలా బాగుంది.మీకు బాగా నచ్చినట్టుందిగా కవిత :) మాకూ నచ్చిందీ :)

>>కవనము చేసే కవి కలం చెబుతుంది విను
తననుంచి జాలువారే అక్షరమెంతటి సమ్మోహనమో

నాకు ఇది బాగా నచ్చింది :)

Unknown said...

ఈ కవిత నిజంగా మీరు రాసిందేనా ??

స్నిగ్ధ said...

బాగా రాసారు...

మనసు పలికే said...

Naagarjuna, Very nice..:)

..nagarjuna.. said...

@ఇందిజీ,స్నిగ్ధజీ,అపర్ణ: Thank you thank you :)

@కావ్యజీ : సత్తెపెమానకంగా సెప్తున్నా అమ్మాయ్‌గారు,ఇది నేను రాసిందే....అమావాస్యకోసారి పున్నమికోసారి ఇలాంటి పనులు చేస్తుంటాననమాట :D

బాగోలేదా....పెట్టాబేడా సర్దేసుకోమంటారా.....:-/

స్నిగ్ధ said...

:D

భాస్కర రామిరెడ్డి said...

మదిలో కొలువై అపురూప ఆనందాన్నిచ్చే ఆ ధవళ కలువెవ్వరబ్బా ;)

చాలా బాగుంది నాగార్జునా.

Unknown said...

నాకు డౌటు ఎందుకొచ్చింది అంటే .. మీరే కవిత రాసేసి మీరే ఎందుకు పోగిడేసుకున్నర అని మీ మొదటి కామెంటు చూసి ..

కవితకేం అద్భుతంగా రాసారు .. మీ గాల్ ఫ్రెండ్ కి వాలెంటైన్ డే గిఫ్ట్ ఆ

..nagarjuna.. said...

భరారె గారు...అది పెద్ద సీక్రెట్, గప‌చుప్ అంతే :D

కావ్యగారు అది పుత్రోత్సాహం/పుత్రికోత్సాహం లాగా కవితోత్సాహం అన్నమాట (కాకిపిల్ల కాకికి ముద్దుమరి....)

పోతే నాపాటికి నేనేదొ 48 క్యారెట్ ప్యూర్ ఏక్‌నిరంజన్ జీవితం గడుపుతున్నా...మీరిట్టాంటి కొత్త కొచ్చన్లు/ఫిటింగులు పెడితే ఎట్టా... ః(

కంది శంకరయ్య said...

నాగార్జున గారూ,
మీ కవిత చాలా బాగుంది. అభినందనలు.
ఎదో చిత్తచాపల్యంతో దానిని మాత్రా ఛందస్సులో గేయంగా మలిచే ప్రయత్నం చేసాను. ఓ లుక్కేయండి.

పసికందును లాలించే
అమ్మ చెప్పుతుంది విను ...
మమత ఎంత నిర్మలమో!

నిలువెల్లా సోయగాల
అలరారే ప్రకృతి కాంత
మనకు చెప్పుతుంది విను ...
ప్రాణ మెంత అమూల్యమో!

కవనమ్మును చేయు కవుల
కలం చెప్పుతుంది విను ...
తాను జాలువార్చు అక్ష
రమ్మెంత మనోహరమ్మొ!

ఎడబాటున రగులు ప్రియుని
విరహం చెపుతుంది విను ...
తన నెచ్చెలి బింబారుణ
అధర మెంత మధురమ్మో!

నిన్ను కొలిచి పూజించే
నా మది చెపుతుంది విను ...
నీ దర్శన సౌభాగ్యం
నా కెంతటి అపురూపమొ!

veera murthy (satya) said...

నాగార్జున గారు మీ కవిత బావుంది..

శంకరయ్య గారూ..
మీది చిత్తచాపల్యం కాదు
కవితావాత్సల్యం
అనుసరనీయ మాదుర్యం

..nagarjuna.. said...

శంకరయ్యగారు....నాకు నిజంగా నమ్మశక్యంగాలేదు!!! మీరు నా బ్లాగుకు వచ్చి అడివి తుమ్మెద ఝంకారమును విద్వాంసుడు రాగయుక్తంగా మలచినట్టు మీరు నా పదాలను గేయంగా మలచడం నాకు చాలా చాలా అనందంగావుంది. సత్యగారన్నట్టు మీది ముమ్మాటికి కవితావాత్సల్యం. ధన్యోస్మి

సత్యగారు మీ ప్రశంసలకు ధన్యవాదాలండి

Unknown said...

ఏక నిరంజన్ ఆ .. అయితే కంగనా రానవాట్ మీద కన్ను పడిందా .. హ్మ్ ఈ అబ్బాయిలు మములోల్లు కాదు కదా ;)

శిశిర said...

మీ కవిత, కవితోత్సాహం రెండూ బాగున్నాయి. :)

..nagarjuna.. said...

థాంక్స్ శిశిరగారు :)

మీరు చాలా షార్ప్ కావ్యగారు...ఇట్టే పట్టేసారు. ఇంతలా బ్రిలియంట్ అవడానికి మీ బ్రెయిన్‌ను ఏ షార్పనర్‌నువాడి చెక్కారేంటి....సారి ఏ విద్యలు అభ్యసించారు..... :)

శివరంజని said...

>>>>>>పోతే నాపాటికి నేనేదొ 48 క్యారెట్ ప్యూర్ ఏక్‌నిరంజన్ జీవితం గడుపుతున్నా...మీరిట్టాంటి కొత్త కొచ్చన్లు/ఫిటింగులు పెడితే ఎట్టా... <<<<<<

48 క్యారెట్ ప్యూర్ గోల్డ్ = 24 క్యారెట్ నాగార్జున గారు + 24 క్యారెట్ వారి గాల్ ఫ్రెండ్......... అంతేనంటారా

శివరంజని said...

నాగార్జున గారు మీరు రాసిన కవిత ఎంత బాగుందో ఈ కవిత ని మీ గాల్ ఫ్రెండ్ . కి ప్రెసెంట్ చేస్తే నిజం గా ప్లాట్ అయిపోతుంది ఆవిడ

..nagarjuna.. said...

[ఆశ్చర్యంతో మైండ్ బ్లాక్ అయిన నాగార్జున]
శివరంజని...అసలు నీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో చెప్పవా..నీపేరు చెప్పుకొని మిగతా జీవితం ఎలాగోలా లాగిస్తా. కావ్యగారికి, భ.రా.రే గారికి ఎదో ఇంటెలిజెంట్ జవాబిచ్చానని ఫీలయ్యా ఇన్నిరోజులు

శివరంజని said...

>>>>[ఆశ్చర్యంతో మైండ్ బ్లాక్ అయిన నాగార్జున]
శివరంజని...అసలు నీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో చెప్పవా..నీపేరు చెప్పుకొని మిగతా జీవితం ఎలాగోలా లాగిస్తా. కావ్యగారికి, భ.రా.రే గారికి ఎదో ఇంటెలిజెంట్ జవాబిచ్చానని ఫీలయ్యా ఇన్నిరోజులు<<<<<<<<<<

[షాక్ అవ్వాలో లేదో తెలియక షాక్ అయిన శివరంజని ] .... హహహహ్హ ..పొగిడారా ??? తీట్టారా ???మీ థాట్స్ ముందు నా చావు తెలివితేటలు ఎంత చెప్పండి .. నిజం గా మీరు రాసిన కవిత చాలా చాలా బాగుంది

ఆ.సౌమ్య said...

కవిత నిజంగానే బావుందోయ్...శంకరయ్య గారి పాట ఇంకా అదుర్స్. మనకి కవితలూ అవీ అంతగా ఎక్కవుగానీ నువ్వు రాసినది నచ్చింది.

శిశిర said...

@నాగార్జున, @శివరంజని,
>>>>[ఆశ్చర్యంతో మైండ్ బ్లాక్ అయిన నాగార్జున]
>>>>[షాక్ అవ్వాలో లేదో తెలియక షాక్ అయిన శివరంజని]
ఇద్దరూ ఇద్దరే. :) :)

Anonymous said...

చాల చాల బాగుందని మీ కవిత.
చాల తేలికైన పదాలతో సాగింది మీ కవిత
సూపర్బ్
నిజం చెప్పండి ఎవరినో ప్రేమిస్తున్నారు కదూ

కావ్య,
నిజం చెప్పించు వదలొద్దు

Anonymous said...

కంది శంకరయ్య
మీరు మాకు గురుతుల్యులు. నేను కూడా నాగార్జున తో ఏకీబవిస్తునాను

kiran said...

చాలా బాగుంది నాగార్జున గారు.. :)

veera murthy (satya) said...

nagarjuna garu namaste!

మీకిదే కవితా పోటీకి ఆహ్వానం


http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html

మీ నుండి కవితని తప్పక ఆశిస్తాను!

మీ సత్య.

..nagarjuna.. said...

మీ అభినందనలకు ధన్యవాదాలు కిరణ్ గారు :)

@సత్య: ఆహ్వానానికి కృతజ్ఞతలు సత్య గారు. కవితను రాసి పంపించడానికి తప్పక ప్రయత్నిస్తాను

Mopuri K Reddy said...

చారి గారు, చాలా బాగా ఉందండి. కుమ్మెహారంతే....!

Ennela said...

అరె! కవిత మిస్ అయ్యాను..అక్కడ మంచు గారు ఇక్కడ మీరు అమ్మొ! విషయం తొందరగా తెలుసుకోవాలి. ఇంతకీ యీ కవిత యెవరు? 48 క్యారట్లు అనగా రోజు 48 క్యారట్లు తిని యేమైనా దీక్ష చేస్తున్నారా? ఏక్ నిరంజన్ ఎవరు, మీ పేరును ఎప్పుడు మార్చుకున్నారు? అమ్మా నాన్నకి యీ కవితని చూపించారా, లేక మేమెవరమైనా చూపిస్తామని ఆగారా? ఇత్యాది ప్రశ్నలకు తెలిసి కూడా సమాధానం చెప్పినచో 100 కామెంట్లు పొందెదరు గాక!

కవిత బాగుందండీ..మీ కవితకి శంకరయ్య మాస్టారి కలం తాకిందంటే బంగారానికి సువాసన అద్దినట్టే! మీరు లకీ.

మధురవాణి said...

కవిత? కాదు.. కవితే! చాలా బాగుంది.. Simple and sweet! :)

పరుచూరి వంశీ కృష్ణ . said...

శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ( కవిత బాగుంది )

Unknown said...

కవిత చాలా బావుంది .అలాగే కామెంట్లు కూడా :)) radhika (nani)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis