నా గత పొస్టు మీరెమంటారు పబ్లిష్ చేసిన తరువాత ప్రయాణంలొవుండడంతో స్పందించడం కుదరలేదు. వచ్చిన వ్యాఖ్యలని చూస్తే నేను చెప్పదలచిన విషయాలని సరిగా అర్థమయేలా చెప్పలేదేమోనిపించింది (సరిగ్గా అనే సంగతి పక్కనపెడితే అసలు అర్థమైందా అనేది ఇంకో విషయం). బహుశా అక్కడ చెప్పిన ఉదాహరణలు out of context లా అనిపించేలా చెప్పాననుకుంటా.
ఆ subject పైన నాకున్న కొన్ని ప్రశ్నలను ఇంకొంచెం clarity ఇచ్చి అడగాలని ఈ టాపా రాస్తున్నాను.
To begin with, నా పాత పోస్టులో మొదటి instance, young couples moving intimately around temple premises. నా వుద్దేశంలో వాళ్ళకు కలిసితిరిగే స్వేచ్చ ఉంది, సాన్నిహిత్యాన్ని అనుభవించొచ్చు అందులో ఎటువంటి సందేహంలేదు. అయితే అంతటి సాన్నిహిత్యాన్ని, more precisely intimacyని కోరుకునేవాళ్లు భక్తితో మెలగాల్సిన ఆలయ పరిసరాల్ని ఎంచుకొవడందేనికి? ఏదొ ఒకటొ రెండొ సందర్భాలో emotional heightsకి చేరి అలా జరిగితే పట్టించుకోనవసరంలేదు. కాని వీడియోలొ చూపించినదాన్ని బట్టి చూస్తే అలా అనిపించదు. They seem to have take it granted to explore that place for disclosing their intimacy. అది వాళ్లకిచ్చిన స్వేచ్చని misuse చేసినట్టుకాదా? అయితే ఇదే ప్రశ్న పాతపోస్టులో సరిగా పెట్టలేదనుకుంటా, కేవలం ఆడవాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసి రాసానని వ్యాఖ్యవచ్చింది.
ఇక రెండవ ఉదాహరణ విజయ్ గారి పొస్టు పైన. స్వాతంత్ర్యం వుందికదాని, నేను (మగాడు) సంకనాకిపోయానని ఆడవాళ్లు అదేచేస్తే అది సరైందే అని ఎలాఅనుకోవాలి? దాన్ని ఎలా సమర్దించగలం?(తప్పు అని అనడంలేదు, సరైంది కాదంటున్నా, గమనించగలరు). అలాగే మగాళ్లు మాత్రమే తాగాలిఅని అనడంలేదు. నేను దానికీ వ్యతిరేకమే. శీతల వాతావరణం ఉండే అప్రాచ్యపు దేశాల్లొ( ప్రాచ్యం= తూర్పు, అప్రాచ్యం= తూర్పుకాని) ఉండేవాళ్లకు అవసరంకాని మనకేందుకు social elitenes చూపించుకోడానికో డబ్బులు తగలేయడానికి కాకపోతే. అభ్యంతరం లేదనుకుంటే రేపు స్కూల్లల్లో ఉపాద్యాయులకు విద్యార్థులకు ఇదే freedom of expression వల్ల బేధాలొస్తే అంగీకారమేనా?
ఇంకో ఉదాహరణగా MF Hussain గారిగురించి మాట్లాడుకుందాం. ఎటువంటి సందేహం లేకుండా , ఇప్పుడున్న వివాదాస్పద పెయింటింగ్స్ పక్కన పెడితే, ఆయన గొప్ప కళాకారుడు. ‘పద్మశ్రీ’, ‘పద్మవిభూషణ్’ బిరుదాంకితుడు రాజ్యసభలో ఎంపీగా కూడా చేసినవాడు. ఎంతమంది సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ల తరఫున ఆయన్ను గౌరవించుంటారో అర్థం చేసుకోవడనికి పెద్ద మేధావి అవ్వాల్సిన అవసరంలేదు. మరి అంత గొప్ప కళాకారుడు ‘నువ్వు వేసే ఈ రకం బొమ్మలు మాకు బాధ కలిగించేలవున్నాయి బాబు’అని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అలాంటివే వేయడం ఎంత సమర్దనీయం? ఆయన్ని సమర్దించడం ఎంత సరైంది?
ఇక్కడ సందర్బం వచ్చింది కాబట్టి ఆయన్ని వెనకేసుకొచ్చేవాళ్లను అడుగుతున్నా, ఆర్ట్ లో ప్రతి రంగుకీ, భంగిమకి, expressionకి ఓ అర్థముంటుందిగా (అనే అనుకుంటున్నా) మరి హుస్సేన్ గారి సీతాపహరణం పెయింటింగ్‌లో రావణుడూ,హనుమంతుడు,సీతను ముగ్గురినీ అచ్చాదనలేకుండా చూపించడంలో ఆయన ఏం చెప్పదలచుకున్నాడు. మీకు ఓ వేళ తెలిస్తే పెద్ద పెద్ద పదప్రయోగాలు చేయకుండా సరళంగా చెప్పండి. అలాగే skewed హిందుభావజాలమంటూ మొదలెట్టకండి- I am no religious man.
రాజ్యాంగం మనకు భావప్రకటన స్వేచ్చను ఇచ్చింది. దానర్థం నీకు తొచినట్టు నువ్వువాగు, పనులు చేసుకో అనా లేక నీకు ఒక పని/భావం సరైంది అని అనిపించినప్పుడు దాన్ని ఎవరైనా అణిచివేస్తారేమో అన్న భయం లేకుండా వ్యక్తపరిచేందుకు హక్కువుందనా?
పాతపోస్టులో మైత్రెయిగారు వ్యాఖ్యానిస్తూ విలువలు బలవంతాన రుద్దితే రావన్నారు. నిజమే. అయితే freedom of expressionని అనుసరిస్తున్నపుడు ఏదొ దశలొ హద్దుదాటామెమో అని అనిపిస్తుంది. ఈ హద్దు ఎవరు నిర్ణయిస్తారు-వ్యక్తి వ్యక్తికి వేరు వేరు హద్దులు వుండాలా లేక అందరికి ఒకేలా సమాజం నిర్ణయిస్తుందా.
మీరెమంటారు
కీసరగుట్ట దేవాలయ పరిసరాల్లో జరుగుతున్న సంఘటనలపై NTv కధనం చూడండి
గమనిక: కట్టాగారి టాపాలోని విషయాన్ని ఉదాహరణ కోసం ప్రస్తావించాను. అంతేగాని అది తప్పా సరైందా చెప్పడానికికాదు. కాబట్టి ఫెమినిజం అంటూ ఆడ స్త్రీ లేడిస్‌ను కించపరిచానని అన్యధా భావించవద్దు. అది నా అభిప్రాయంకాదు.
సారాంశం మీకు అర్థమయ్యేవుంటుంది, గుడి పరిసరాలను యంగ్ కపుల్స్- మీడియా భాషలో ‘ఒళ్ళు బలుపు’వున్నవాళ్ళు పార్కుల్లాగా వాడేసుకుంటున్నారని అంటుంది. ఈ వీడియో చూసిన చాలామందికి కూడా అలానే అనిపించుండొచ్చు-ఒళ్ళు బలుపు అని.
ఇక ఈ టాపా రాయడానికి ముఖ్యకారణం కట్టా విజయ్ గారి బ్లాగులోని ఈ టాపా, దానికి వచ్చిన వ్యాఖ్యలు. అక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటంటే ప్రపంచం నాగరికమౌతుంది, మగాడు తాగగాలేంది ఈ రొజుల్లొ అమ్మాయిలు తాగితే తప్పేంటి అని. ఒకవేళ తాగినా అది వారి వ్యక్తిగతమైన విషయం, దాన్ని గురించి చర్చిండం ఎందుకని.
ఇక్కడ నేను మాట్లాడదలచింది ఆడవాళ్ల హక్కుల గురించి కాదు, వీడియోలో చూపించింది తప్పోవొప్పో చెప్పడానికి అంతకన్నాకాదు. మాట్లాడలనుకుంటుంది ఈ రెండు సంఘటనల వెనకవున్న అసలు attitude గురించి- ఆధునిక నాగరికపు సమాజపు పోకడగా చెప్పబడుతున్న స్వేచ్చ గురించి. ఒక్కసారి ఆలోచించండి, ఆ వార్తాకథనం కనుక గుడి దగ్గర జరుగుతున్న రొమాన్స్ ని కాకుండా ఏ పబ్లిక్ పార్కులోనో, సాగర్ చుట్టుపక్కలో జరుతున్నవీర రొమాన్స్ చూపిస్తే మనకు కలిగే అభిప్రాయంలో ఏమైనా మార్పుండేదా? నేననుకోవడం కొద్దోగొప్పో అదే భావనవుంటుంది. ఇప్పుడు కట్టాగారి టాపాగురించి మాట్లాడుకుందాం, ఓవేళ అక్కడవున్నది నిజంగానే ఆల్కహాలైనా, రూంలోకాకుండా బార్లోనే తీసుకుంటున్నారని చూపించేట్టుగావున్నా వ్యాఖ్యల్లో తేడావుండేదికాదు. అందులో తప్పేంటి అని అనేవారే.
అయితే ఈ రెండు విషయాల్లోనూవున్న కామన్‌పాయింట్ ఒక్కటే. they were exercising their choice granted by their liberty. మరి రెండొ సంఘటనలో తప్పనిపించని స్వేచ్చ, మొదటి సంఘటనలొ తప్పుగా ఎందుకు తోస్తుంది. రెండిట్లోనూ సరదాకోసమో మనస్ఫూర్తిగానో ఇతరులకు నష్టంకలక్కుండా వాళ్ళు చేయలనుకున్నది చేసారు. మరి ఒకటి తప్పు మరొకటి తప్పుకాదన్నట్టు ఎందుకనిపిస్తుంది.
కాకతాళియంగా ఇవాళ ఫ్రెండ్స్ తో MMS scandals, సినిమాల గురించి మాట్లాడుతుంటే మాటల్లో స్వేచ్చ ప్రస్తావనొచ్చింది. మావాడొకడిలా అన్నాడు " ఇలాగే స్వేచ్చ అనుకుంటూ కంటిన్యూ అయితే ఇంకో 10-15 ఏళ్లలో మన సొసైటిలో ఆడవాళ్లపై ఉన్న గౌరవం పోతుంది"అని. వాడు చెప్పాలనుకున్నది మగాడికివున్న స్వేచ్చ ఆడవాళ్లకు ఉండకూడదని కాదు, స్వేచ్చ అంటూ అనుసరితున్న పోకడల పట్ల విమర్శ మాత్రమే.
గమనిక: కట్టాగారి టాపాలోని విషయాన్ని ఉదాహరణ కోసం ప్రస్తావించాను. అంతేగాని అది తప్పా సరైందా చెప్పడానికికాదు. కాబట్టి ఫెమినిజం అంటూ ఆడ స్త్రీ లేడిస్‌ను కించపరిచానని అన్యధా భావించవద్దు. అది నా అభిప్రాయంకాదు.
మై తెలుగువాలా హై-2
ఎవరివాదన ఎలావున్నా విషయంతేలీని ‘కుహనా’గాళ్ల గొడవ రోతగావుంది. తెలుగు, ఆంధ్రము వేరు కాబట్టి తెలంగాణా, ఆంధ్ర వేర్వేరు రాష్ట్రాలవడంలో తప్పులేదనే మహానుభావులనుండి మేమొ మీకు తినడం నేర్పించాం ఇప్పుడు తెలంగాణానుండి వెళ్ళిపోమంటే మీరు బాగుపడనే పురాణపురుషులున్నారు. లెక్కలు పత్రాలంటూ వాదించే వారికి కొదవేలేదు. చూడండి మా బతుకులు అత్యంత దరిద్రంగావున్నాయనొకరు, అబ్బే అలాంటిదేంలేదు ఇక్కడ చూడు..... మనం నిండువెన్నల చంద్రుడిలా వెలిగిపోతున్నాం మాకన్నా మీరు మహబాగా వెలిగిపోతున్నారనొకరు. తెలుగునేలలో ఎవరుకూడా ‘ప్రాంతీయత’ కారణంగా దుర్భ్హరంగాకాని సంపన్నంగాకాని బ్రతకడంలేదు. ఇక్కడవున్నవి అసమానతలు, వాటిని పెంచిపోషిస్తున్నది పదవులకోసం,ముడుపులకోసంమాత్రమే బతుకీడుస్తున్న నాయకగణం, ఎంత దగాపడినా మళ్ళి ‘అన్యథా శరణఁనాస్తి త్వమేవశరణం మమః’ అంటూ అదే నాయకుల ఉచ్చులో పడుతున్న సామాన్య ప్రజలు.
మనలో మనకు ఐక్యతలేకపోవడమే ఈ పరిస్థితికి మూలమా అని ప్రశ్నించుకుంటే బుర్రలో ఏదోమూల అవుననె సమాధానం వినపడుతుంది నాకు. కారణం ‘భాష, దాని అనుబంధాలైన social lifestyle’ అంటుంది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో మొదటి రాష్ట్రం అయివుండి, పక్కనవున్న రాష్టాన్ని అదే కారణంచేత విలీనం చేయించుకొన్న ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలను ఒకే ‘తెలుగు’ గొడుగుకిందకు తేలేకపోయాం. పూర్తిగా ఒకరికొకరు ఉత్తర-దక్షిణ ధృవాల్లాగా వున్నారనికాదు కాని ఇన్నేళ్లుగా time తీసుకువచ్చిన సఖ్యత తప్ప ( ఓ గదిలో ఎక్కడేక్కడినుండో తెచ్చిన కోతుల్ని తెచ్చిపెడితే ముందు నానా పెంట చేస్తాయి...సమయం గడుస్తున్నకొద్ది వాటిల్లొ ఓ harmony వస్తుంది, కొట్టుకోకుండా వుంటాయి. వాటిల్లొ ఏఒక్కదానికి ‘కోతిబుద్ది’ పుట్టినా మళ్ళి అల్లరి మొదలు..అలావుంది పరిస్థితి) నిజంగా కలుపుగోలులేదు. మనల్ని ఐక్యంచేసిన భాషకి తిలోదకాలిచ్చాం. ఇప్పుడు తెలుగు టెలుగైపోయింది పొరుగు రాష్ట్రపు సోదరుడికి తన భాషమీదున్న అభిమానం మనకు కరువైంది. పోని సాంస్కృతికంగానైనా దగ్గరిచేసే ప్రయత్నాల్లేవ్. ప్రాంతీయ uniqueness పేరుతో తెలుగువాళ్లం ఒక్కరంకాలేదు. తెలంగాణోడికి ఇక్కడ రజకార్ల పోరాటం, నిజాం తెలుసు ఆంధ్ర-సీమ జిల్లాల యాస వేరని తెలుసు, అవతల పక్కా అంతే. కాని వేరుగావున్నప్పుడు మనం ఎలా జీవిచాం, అసలు తెలుగువాళ్ల మధ్య ఈ అంతరం ఎందుకు వచ్చింది, ఒకళ్ళుగా వున్నవాళ్లు ఎలా వేరుపడ్డాం ఎలా ఒక్కరయ్యాం ఎంతమందికి ఎఱక.తెలిసిందంతా 1956లోఆంధ్రా ఆంధ్రప్రదేశ్ అవడంచేత ఒక రాష్ట్రంలోవుంటున్నాం. భేదం అంతరించేందుక్కాకుండా దాన్ని చూసి పౌరుషాలగడ్డనో,సాహితిపుణ్యభూమనో ఎవరికి వాళ్లు మీసాలు మెలేసుకున్నారు. యాసని-ప్రాంతీయ జీవనానికి ఓ రంగేసి ఈ ప్రాంతం అంటే ఇలాంటి మనుషులు మాత్రమే అని అర్థమిచ్చేలా అలుపెరుగని కృషిచేస్తున్న సినిమారంగాన్ని గూరించి చెప్పనక్కరలేదు ( ఈ మాట అనడానిక్కారణం భారతదేశంలో హింది తరువాత తెలుగు సినిమా మార్కేటే ఎక్కువ. సినిమా చూసి హీరోయిజం/త్యాగాలు/సేవలు చేసేవాళ్లుండకపోవచ్చు కాని దాన్ని బుర్రలో పెట్టుకొనే వాళ్లు చాలానే)
అభివృద్దిని పంచకుండా అంతా ఓ దగ్గర కుప్పపోసాం. విలీనమైనప్పుడు ఈ రెండు రాష్ట్రాల భౌగోలిక స్థితిగతులు వేరు, వనరుల వినియోగతీరు వేరు, వీటిని సమన్వయపరచడానికి తయారుచేసుకున్న ఒప్పందాలు తుంగలోతొక్కబడ్డాయి. కారణాలు విశేష్యమైనవి కాకపోవచ్చు ‘ప్రాంతీయ’భావం అప్పుడు లేకపోవచ్చు కాని అది జరిగిన ప్రదేశం మాత్రం విశేష్యమైనదే. మనం పొరుగునవుండి తగవుపడకుండా పరస్పరం సహరించుకుంటూ అభివృద్ది చెందుదామని ఒకటైనవారం.అలాంటి చోట అసమానతలకు అవకాశం ఇప్పించడం మనం ఏర్పరుచుకున్న వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. దొంగ చేతికి కన్నంవున్న ఇల్లు దొరికినట్లు మనం అప్పుడు చేసిన పొరపాట్లు ఇవాళ బుర్రలేని తిక్కసన్నాసులు ఎంత వీలైతె అంత స్వప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారు.
అసలు 1969లోనే మహత్తరమైన సదవకాశం మనకువచ్చింది. వేర్పాటువాదం లేచిసద్దుమణిగినప్పుడు అందుక్కారణాలను వెతికి పరిష్కరించాల్సింది. ఓ చారిత్రిక అవకాశం రాజకీయ బురదలో కనుమరుగైంది. కొంతమేరకు తెలుగుదనం వికసించి ‘తెలుగువార’నే గుర్తింపు ప్రాంతీయ పార్టీఐన తెలుగుదేశం హయాంలో వచ్చింది.అలానే వుంటే బహుశా వేర్పాటువాదం కాలగర్భంలో కలిసిపోయేదేమో. పదవిరాలేదని ఒక్కడు మొదలుపెట్టిన యాగి అధిష్టానాన్ని సంతృప్తి పరచడానికి ఎంపీలను టోకుగా ఇచ్చేసిన ఇక్కడ భగవంతుడి పాలనలో పరిపూర్ణమైంది. ఒకవేళ వై.యెస్.ఆర్ వుండివుంటే KCR ఇంత సీన్ చేసేవాడుకాదేమో నెల-నెలన్న రోజులకోసారి చెప్పే సోది తప్పించి.
ఇప్పుడున్న సమస్యకు JPగారు ఓ విధంగా మంచి పరిష్కారమే సూచించారు "నిజంగానే విడిపోవాలనుకుంటే అలానేకానివ్వండి కాని ఒకళ్ళమీద ఒకళ్ళు విద్వేశాలు పెంచుకుంటూ కాదు,ఇలాంటి తరుణంలో వద్దు. కలిసేవుందాముకుంటే ప్రాంతీయ అసమానతలు రూపుమాపడానికి రీజనల్ కమిటీలు వేసుకుందాం, అధికార వికేంద్రీకరణ జరుపుదాం". కొట్టుకుంటూ విడిపోవడమో, ఏది తేలకుండా సద్దుమణిగాక మళ్లి తాడుబొంగరంలేని పూటకోమాటమార్చేటోల్ల చేతిలో విషయం నలగకుండా చూసుకుందాం
మా తెలుగు తల్లికి మల్లెపూదండా,
మాకన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గలగలా గోదారి కదిలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను....
నేను తెలుగువాడిగా పుట్టాను, తెలుగువాడిగానే వుంటా. స్వప్రయోజనం కోసం తెలంగాణాఅనో ఆంధ్రమనో అడ్డమైన గడ్డికరిచే సన్నాసులను నే లెక్కచేయను.
మై తెలుగువాలా హై
---------------------------------------------------------------------------------------------------------------
PS- శరత'కాలమ్’: ఏం కెలుకుడుకి కొత్తపదం కనిపెడితివోగానిబాసు......దాన్ని కాస్తా కొత్త తిట్టుకింద వాడుకుంటూన్నారు జనాలు. కామేడికి మొదలుపెట్టింది కాస్తా సీరియసైపోయింది. pants off to you.....
Subscribe to:
Posts
(
Atom
)