ఇంత బేవార్స్‌గాల్లేంట్రా బాబు

అసలే రాష్ట్రం తుఫానుతో అల్లాడిపోతుంది. అందులో నష్టపోయినవాళ్లకు ఉన్న బాధలు చాలవన్నట్లు ‘ఎలావుంది’ అంటూ ఫినాయిల్ తాగే ఫేసులేసుకొనొచ్చే నాయకులు. ఆల్లేమైయినా ఆరుస్తారా తీరుస్తారాంటే అదీలేదు, మెయిన్‌ ఎడిషన్ ఫ్రంట్‌పేజి ఫొటొకోసం నోటికేదొస్తే అది వాగిపారేయడం.
వరదతాకిడి గురైన నెల్లూరు జిల్లాలో పర్యటించిన మన ‘డైనమిక్‌’ మాజి CM బాబు తన పర్యటనలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చాడంటా
"రోశయ్య ఆకాశంలో తిరుగుతూ తుఫాను నష్టాన్ని తెలుసుకుంటుంన్నారు...ఆకాశంలో తిరిగితే ఉలవపాడులో మామిడి నష్టం తెలుస్తుందా..? బొడ్డువానిపాలేలో పొగాకు నష్టం తెలుస్తుంద..? కళ్లాల్లో తడిసిన వరి సంగతి తెలుస్తుందా..? బొప్పాయి రైతుల కష్టాలు తెలుస్తాయా..? పత్తి రైతుల ఇక్కట్లు తెలుస్తాయా..?"
 అసలు ఈయనగారు బుద్దుండే ఈ మాట మాట్లాడాడా అని కాసేపు బుర్రగోక్కున్నా. CM హెలికాప్ట్రర్‌లో కాకపోతే ఎడ్లబండిలో వస్తాడు, అయితే ఏంటట వరద నష్టం అంచనా వేయడం, నష్టపోయినవాళ్లకు స్వాంతన చేకూర్చడం ముఖ్యంగాని!
బాబుగారి మాట విన్నాక అదేదో సినిమాలో సన్నివేశం గొర్తొచ్చింది. అక్కడకూడా సేమ్ scene వరదలొస్తే ముఖ్యమంత్రో ఇంకొకల్ళో చూడ్డానికి వెల్తాడు. ఇందులోకూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామని ప్రతిపక్షనేత తన అసిస్టేంట్లతో ఇలా అంటాడు " ఒరేయి రేపు గనక వాడు రైలులో పరామర్శిండానికి వస్తే మన పేపర్లో ‘జనాలు అల్లాడిపోతుంటే తాపిగా రైలులో వచ్చిన CM’ అని హెడ్‌లైను పెట్టేయి. అదికాక హెలికాప్ట్ర్‌ర్లో వస్తే ‘జనం నేలమీద బాధలు పడుతుంటే గాల్లో తిరుగుతూ వచ్చిన CM' అని రాసెయ్." అచ్చం అలాగే, తొమ్మిదేళ్లు CMగిరి వెలగబేట్టి ఇప్పుడు ఫక్తూ లోకల్ చిల్లర పొలిటీషియన్‌లాగా ఆ అర్థం పర్థంలేని వ్యాఖ్యలేంటొ ఈయనకు. పొయినసారి అసెంబ్లీలో ‘కావాలనే అబద్దం చెప్పా’మన్నందుకు వచ్చిన చీవాట్లు చాలవేమో. ఈయనగారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షపార్టినేత. ఏం ఖర్మరా దేవుడా!! అన్నేళ్ళు CMగా వుండి, అంతకన్నా ఎక్కువకాలం రాజకీయాళ్లో కీలకపదవుల్లోవుండి ఈయన సంపాదించిన ‘విజ్ఞత’ ఏమైనట్టు?
ఈయనగారికి తోడు తానాతందానా బామ్మర్ది, ‘చరిత్ర సృష్టించాలన్నా మేమే, ఆ చరిత్ర తిరగరాయాలన్నామేమే’ అంటూ చరిత్ర సృష్టించిన పార్టికి ‘అవకాశం ఇస్తే’ సారథినౌతా అని డైలాగులు. తాతలు నేతులు తాగితే ఈళ్ల మూతుల వాసన ఎవడిక్కాలంట!


మన మెగానటుడిగారి రూటే సపరేటు. ఎంతసెపు ఆ సామాజిక న్యాయం, సామాన్య శాస్త్రం, నేనేం చేయాలో ప్రజలే చెప్తారు అని చెప్పుకుపోవడం తప్పిస్తే ఇంతవరకు ఒక్క అంశంమీద మా పంథా ఇదిఅని చెప్పిందిలేదు. అసెంబ్లీలో చేసిన performance చాలనట్టు రాజ్యసభక్కూడా వెళ్తార్ట. అవకాశం వినియోగించుకోవడంలో తప్పులేదుగా..నాక్కూడా అవకాశం వస్తే ఈయనకోటి చెప్పాలనుంది, ‘అయ్యా మీరంటే ఒకనటుడిగా మాకు ఇంకా చాలా గౌరవముంది.రాజకీయాల్లోకొచ్చి తలాతోకలేని నిర్ణయాలతో,మాటలతో దాన్ని పోగొట్టుకోకండి. టైం తీసుకున్నా ఫరవాలేదు  మీరు చేద్దామనుకుంటున్న ప్రజారాజకీయలపైన అవగాహన వచ్చాకే రండి’ అని. ఎన్నటికి కుదిరేనో.

అధికారపక్షం  చిన్నబాబుది ఇంకో స్టయిలు. ధరలుపెరిగి, పనుల్లెక పంటల్లెక తిండిలేక జనమేడుస్తుంటే అయ్యపోయిన సుమారు ఏడెనిమిది నెలల తరువాత ఓదార్పు యాత్రంట. నవ్వుకోడానిక్కాకపోతే ఇప్పుడు  ఆ పోయినాయనని తల్చుకొని ఎవడు బాధపదుతున్నాడొ?, వాళ్ల జీవితం మీది వాళ్లె బాధపడేవారు తప్పిస్తే. పైపెచ్చు ఆ బాధపడే వర్గమేదో ఆయన చనిపొయినప్పుడే రికార్డు లెవెల్లో పోయారుకదా. చూస్తూంటే శవంమీద చిల్లర ఏరుకునేట్లు కనిపిస్తుంది యవ్వారమంతా. బాబుగారు ‘ఫ్యూచర్ ముఖ్యమంత్రి’. హ్మ్ విధి వైపరిత్యంకాకపోతే ఏంటి ఇది!!  ఇంతచేసినా బాబుగారి బాజా భజంత్రీలకు కొదవేలేదు
" జనం జగన్‌తో ఉన్నారండి, వాళ్ల మనసులో జగనేఉన్నాడు.."
"రెడ్దిగారిలో ఎవైతే లక్షణాలుండేవొ అవన్ని జగన్‍లోకనపడ్డాయి నాకు"
"జగన్ జనం గుండేల్లో వున్నాడండి.."

ఛీ... ఇంత దరిద్రమేంట్రా బాబు అనిపిస్తుంది తలచుకుంటే.
భగవంతుడా....ప్లీజ్ సేవ్ మై పీపుల్‌9 వ్యాఖ్యలు.. :

N S S Sarath Chandra said...

అన్నాయ్...... నేటి రాజకీయాలు ఇంతే....అందరూ దొంగలే దొరికితే!!!!!!!!
అందరిని తిట్టు కుంతూ పొవదం కష్టం.. ..తమరు కొందరినే తిడితే మిగిలిన వాళ్ళు మంచోళ్ళు అయినట్టు అనిపిస్తాది..ఏకి పారేయంది అందరినీ!!

Anonymous said...

Super ga chepparu

కొత్త పాళీ said...

yes, so true

..nagarjuna.. said...

@చందు : అందరినీ ఎదో తిట్టేయాలనికాదులే..,న్యూస్ చదువుదామని ఇవాళ పేపరు తెరిస్తే వీళ్లందరూ ఒకేసారి ఇలా అర్థంపర్దం లేకుండా మాట్లాడారనిచూసి తిక్కరేగి ఇలా కక్కాను.

@అజ్ఞాత, కొత్తపాళీ : కృతజ్ఞతలు :)

చదువరి said...

బాబు స్టేట్‍మెంటు మాత్రం జోకే! "CM హెలికాప్ట్రర్‌లో కాకపోతే ఎడ్లబండిలో వస్తాడు, అయితే ఏంటట వరద నష్టం అంచనా వేయడం, నష్టపోయినవాళ్లకు స్వాంతన చేకూర్చడం ముఖ్యంగాని!" -బాగా చెప్పారు.

సభలో బాబు చేసుకున్న ఆ సెల్ఫుగోలు బాబును జీవితాంతం వదలదేమో! :)

..nagarjuna.. said...

@చదువరి గారు: అర్థంకానిదేంటంటే చంద్రబాబుగారివ్ వ్యవహార శైలి నానాటికి తీసికట్టుగా తయారవుతుంది అది పార్టి కూదేలవుతుందన్న బాధవల్లో, ఎలక్షన్లు ఓడిపోతున్నందుకో...

స్పందనకు నెనర్లు :)

Unknown said...

nagarjuna చారి గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

కవిత said...

asalu ento ee rajakiyanayakula theeru...evvari ki artham kaavu....antha dongale....retirement age lo rastranni eladaniki vachaaru mana CM garu....idhe chance ani rechipothunnadu KCR ...em cheptham andi .....prajala gurinci alchince nayakudu okkadu ledu....

..nagarjuna.. said...

@హారం ప్రచారకులు : నేనూ ఎప్పుడొ హారంలో చేరాను. హిట్లు, వ్యాఖ్యలు సంపాదించున్నానండి.
సమయం వెచ్చించి వ్యాఖ్య రాసినందుకు నెనర్లు.
@కవిత గారు: లైట్ తీసుకొండి. వీళ్లు మారరు, మారాల్సింది మనమే. ప్రజలగురించి ఆలోచించే నాయకులు ఉన్నారు కాని వాళ్లను నమ్మేవాళ్లె తక్కువ...కాని ఇది మారుతుంది తప్పకుండా...ఆ రోజు ఎంతో దూరంలో లేదు.

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis