పేరులో ’నేముంది’

అసలీ పెపెంచకంలో ఓ మనిషికి చాలా బాగా నచ్చేది ఏంటి? ఎవళ్ల సంగతో ఎందుగ్గాని నామటుకైతే ఎవరికైనా వాళ్ల వాళ్ల పేర్లు నచ్చుతాయి అని అనుకుంటున్నా...అందుకే మరి చిన్నప్పటినుండి వ్యాకరణ భాగాలలో మనకు నచ్చిందేంటయ్యా అంటే నామవాచకం, సర్వనామం ( సర్వనామం అంటే అమృతం సీరియల్లో సర్వర్ సర్వం పేరనుకునేరు...అదికాదు). నా ఈ ఇష్టం ఎంత ముదురంటే పక్కవాడు ఎవరిదన్నా లేక ఏదైన వస్తువు, ప్రదేశం పేరు తప్పుగా పలికితే చాలు నాలో ఠాగూర్ నిద్ర లేస్తాడు. పలికేది నోరు తిరగని అరబ్బు పేరైనా సరే, కరేక్టుగా పలకాల్సిందే. లేకపోతే మెజార్టి జనం పలికినట్టు అనాల్సిందే, అంతవరకు వదిలేవాణ్ణి కాదు. అలాంటిది నాకు, నాతో, నాపట్ల  నా పేరు సరిగా వినడానికి  తిప్పలు పడాల్సివచ్చింది....అదేదో సామెతలొ అందరికి శకునం చెప్పే బల్లి తనే కుడితిలో పడ్డట్టు.

మన పేరు నాగార్జున చారి. స్కూళ్లొ ఉన్నప్పుడు నాగార్జున అనొకడు, చారి అనొకడు ఎవరికి నచ్చిన పార్టు వాడు ఊడగొట్టి పిలిచేవాళ్లు. ఇరగ్గొడితే ఇరగ్గొట్టారు సరిగానే పలుకుతున్నారుకదా అని అనుకున్నా ఇంటర్‌ వచ్చాక తెలిందేంటంటే అది ఇష్టం కాదు convenience అని. ‘నాగార్జున ’ అనే నాలుగు శబ్దాల పదంకన్నా జనాలకు ‘చారి’ అనే రెండ శబ్దాలపేరే  పలకడానికి తేలికనిపించింది. ఇంజనీరింగ్‌లో మా ఇంటర్ ఫ్రెండ్స్ ఉండడంతో పొడుగు పేరు చెప్పించుకుందామనుకున్నా పొట్టి పేరు  పాపులరైపోయింది. ఈ స్టేజిలో వచ్చిన సమస్య స్పెల్లింగుతో....ఇంగ్లీషులొ నా పొట్టి పేరు chary అని ముద్రితమైపోయింది. అలా కాక e-mailsలో, orkut scraps లో, SMS లో char‘i’ అని ఎవరైనా రాస్తే గుండెలు తోడేసినట్టుండేది. ఇదెలాగూ తప్పేట్టు లేదని బ్లాగ్లోకంలో అయినా సరిగా పిలిపించుకుందామని display name ను ‘nagarjuna’ అని ఇంగ్లీషులో ‘చారి’ ని తెలుగులో రాసేసా. అందరు ఇక చచ్చినట్టు సరిగా రాస్తారు, పలుకుతారు అని.  
తరువాత మొదలైంది మొసళ్ల పండగ. నా పోస్టులకు వ్యాఖ్యలు రాసేఫ్ఫుడు, నే రాసిన వ్యాఖ్యలకు జవాబిచ్చేఫ్పుడు, ఇక్కడ కూడా convenience ప్రకారమో ఏమో,  పొట్టి పేరును ఎంచుకున్నారు బ్లాగర్లు. కుంటే కున్నారు మర్యాదకోసమో ఏమో దాని చివర ‘గారు’ అని అలంకారమొకటి నేనేదో పెద్దవాణ్ణైనట్టు!! అదీకాక ‘@ చారి గారు’ అంటుంటే ‘ఢీ’ సినిమాలో బ్రహ్మి గుర్తొచ్చేవాడు. ఇహ ఇలాక్కాదని ఈ రోజే ఆ పొట్టి పేరుని ఏకి పీకి పారేసా.....చూద్దాం ఈ లాజిక్ ఎన్నాళ్లు పని చేస్తుందో..

బెంగాల్‌లో పేరు కష్టాలు ఇంకో ఎత్తు. ఇక్కడ పేరు చివర  చాలామందికి అకారం ధ్వనిస్తుంది ‘బందోపాద్యాయా’, ‘భట్టాచార్యా’,‘ఆచార్యా’ ఇలాగ. కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో కంటి చెకప్ చేయించుకోడానికి డాక్టర్‌ను  కలుద్దామనివెళ్లా అక్కడ రిసెప్సెషన్‌ దగ్గర..
రిసె:  నామ్
నేను: నాగార్జున చారి
రిసె: నాగార్జున్‌ ఆచార్యా ?
నేను: నహి, నాగార్జున చారి...
రెసె: ఓహ్.., నాగార్జునాచార్యా..?
నేను: మనసులో " నీ బెంగాల్ బుద్ది తగలెయ్య".. నహీ భయ్ నాగార్జున చారి
రెసె: అచ్చా...ఠీక్ హై.
వీడిని దాటుకొని డాక్టర్ రూంలో వెళ్లాను
డా: హ్మ్...(రెసెప్షెన్లో ఇచ్చిన చీటీ చూస్తూ) నాగార్జునాచార్యా...what do u do?
నేను: మనసులో " నీ బొంద చేస్తుంటాను. నా పేర్రా.."  బయటకు- ఇట్స్ నాగార్జున చారి సర్... అయామ్ స్టడియింగ్ ఇన్ IIT
డా: హా..నాగార్జున..? ఆంధ్ర?..

కష్టాలు ఇక్కడితోనే ముగిసాయని నేననుకుంటే అవి మా క్లాస్‌రూంలో తిష్ట వేసాయి. మాకు GDR అని ఓ చంఢసాసన ప్రొఫెసరున్నాడు ఆయనతో మాట్లాడాలంటే  చాలామందికి కింద పడిపోయేది.  నేను ఈయన కోర్సు  రెండో సెమిస్టరులో తీసుకున్నా... మిగతా ప్రొఫెసర్లెవరు attendance తీసుకునేవారు కాదు ఏదో అమావాస్యకో పున్నమికో తప్పిస్తే..ఈయన మాత్రం నిష్ఠాగరిష్టుడిలా రోజు ఓ నాలుగైదు పేర్లు అడిగేవాడు...ఆ నాలుగైదుగురిలో నేనొకన్ని. నాపేరును రిజిష్టర్‌లో ఎలా రాసుకున్నాడొకని రోజుకో పేరుతో పిలిచేవాడు. పోపులో కరివేపాకును కలిపినట్టు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అనేవొడు. అందులో కొన్ని ఆణిముత్యాలు
‘నాగార్జు‍న్ ఆచార్యా’- ముందుగానే అలవాటైంది కాబట్టి ఏమనిపించలేదు
‘నాగార్జునాచార్యా’- ఇదికూడా
‘నాగారాజునా’ ఆ.....
‘రాజునా’
‘రాజునా చార్యా’ 
‘నాగారాజునాచార్యా’- వామ్మో....

ప్రొఫెసరిచ్చిన దెబ్బకు క్లాసులో తెలుగు స్నేహితులు తెగ నవ్వుకునేవాళ్లు. ఈయనొక్కడే అనుకుంటే క్లాస్‌లో బెంగాల్ ఫ్రెండొకడు కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించాడు. ‘చారి’ ని హిందిలో ‘చార్ ఈ’  = 4E గా మార్చేసాడు. తిక్కరేగి  లెఫ్టు రైటు ఇచ్చేసరికి ఆ పేరు ఎక్కువ రోజులు నిలవలేదు.
ప్రొఫెసరేంట్రా బాబు ఇలా వాయొంచేస్తున్నాడు నేనేం పాపం చేసానుకుంటే ఓ రోజు దగ్గరికొచ్చి రిజిష్టర్‌ చూపించి ‘ఈజ్ యువర్ నేమ్ ఎంటర్డ్ కరెక్ట్లి’ అన్నాడు. అందులో చూస్తే naga rajuna chary అని ఏ పార్టుకాపార్టు విరగ్గొట్టి రాసుకున్నాడు. ఇందుకా మహానుభావా ఇన్ని రోజులు ఆడుకున్నావు నాపేరుతో అనుకొని అదికాదు సార్ మధ్యలో gap లేదు అని సరిచేయించుకొన్నా ఇకనుండి విషాదశ్రవణయోగముండదుకొని ఆనందపడుతూ...
మరుసటి రోజు క్లాసులో ఆయన attendance తీసుకోడానికి బయల్దేరాడు. నా పేరు పిలిచే వంతొచ్చింది.
మా క్లాసువాళ్లు... ఓ సెలిబ్రిటి రాకకోసం ఎదురుచూస్తున్నవాళ్లలా
నేను.... కేసు ముగించి రిపోర్టు సమర్పించే CBI వాళ్లకోసం ఎదుర్చూసే మీడియా వాళ్లలాగా
ప్రొఫెసరు.... పెద్ద భయకరమైన వార్త చేప్పెవాడిలా కాసేపు ఆగి
" ద్రొణాచార్యా..."

అంతే....మిగతావాళ్లు పెదాలు మూసుకొని లొలొపల ప్రొఫెసర్‌కు వినపడకుండా తలలు దించుకొని రెండు సెకన్లకోసారి నన్ను చూసుకుంటూ విపరీతంగా నవ్వుకుంటున్నారు, నేనేమో విగత జీవుడులా అలా చూస్తూ ఉండిపోయా. కనీసం రెండు వారాలు పట్టింది మావాళ్లు దీన్ని మర్చిపోడానికి.
ఆ తరువాత సెమిస్టర్ పరీక్షలోచ్చాయ్....మొదటి సంవత్సరమైపోయింది. ఇకనుండి క్లాసులుండవు, ఆయన చేసే ప్రయోగాలుండవు కాస్తంత relaxation....కాని స్నేహితులకు ఆ పేర్లు ఇంకా గుర్తున్నాయి....వెధవలకి

33 వ్యాఖ్యలు.. :

Anonymous said...

>> మొసళ్ల పండగ.

తప్పు. యాదవ వంసంలో పుట్టింది "ముసలం" మొసలి కాదు. "ముసళ్ళ పండగ" అంటే చివర్లో ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం.

కుడితిలో పడ్డ ఎలక అనాలి. అది ఇంకో తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అని ఊరికే అన్నారా?

భాస్కర రామిరెడ్డి said...

Hilarious :D

అసలు char 'i', 4E సుపరో సూపరు. ద్రోణాచార్యా చదివి గట్టిగా నవ్వేసాను :-). ఇంతకీ మీ పేరు నాగా రజునా చార్యా నుంచి ద్రోణాచార్యా గా ఎలా మారింది?

కత పవన్ said...

నైస్..:)))
బారారే గారి సందేహమే నాదిను
నాగా రజునా చార్యా నుంచి ద్రోణాచార్యా గా ఎలా మారింది? :))))

చదువరి said...

:) :)
చారి గారూ, అదరగొట్టేసారండి :)

శరత్ కాలమ్ said...

:))

హరే కృష్ణ said...

ఈలలు చప్పట్లు
కుమ్మేసారు
char'i' కేకో కేక :D

waiting for the next part

Anonymous said...

నాకూ అదే డౌటు. ద్రోణాచారి ఎలా?

..nagarjuna.. said...

@అజ్ఞాత : భలే పట్టేసారండి అప్పు తచ్చులను...చాలా పేపరలో ‘మొసళ్ల పండగ’ అని చదివేసరికి అదే సరైంది అనుకున్నా. ఇక ఎలక సంగతి కొస్తే...మొన్నే ఈనాడులో చదివా, బల్లి అందరికి శకునం చెప్తుందట అలాంటిది అదే కుడితిలో పడటం అంటే తన భవిష్యత్తు తానే ఊహించుకోలేకపోయింది అన్నట్టు.

@భరారే,అభిజ్ఞ్య,పవన్: ఏమోనండి.., అది మా ప్రొఫెస్రుకే తెలియాలి. ఆయన చేసిన ప్రయోగం ఇంకోటి ఉంది. మా క్లాసులో ప్రణతి అనే అమ్మాయుంది ఓరోజు యథాలంపంగా attendance తీసుకుంటూ పంకజ్ అని పిలిచాడు, ఎవరికి అర్థంకాలా ఈ పంకజ్ ఎవడో. కాసేపయ్యక ఆ పిల్లకి బల్బు వెలిగి ‘యస్ సార్’ అని రెస్పాండ్ అయింది అదే పరంపరలో నన్ను ద్రోణాచార్యా అనుంటాడు. ఇప్పటికి ఆ ప్రయొగాలు తలచుకొని తెగ నవ్వుకుంటాం.
@చదువరిగారు: నాకు హస్తశోష కలగడం తప్ప ఫలితం లేదన్నమాట. నేను మీకన్నా చిన్నవాడను పేరు పక్కన ఆ అలంకారపు ‘గారు’ను పీకేయండి గురు.
@ శరత్ గారు : నెనర్లు :)
@ హరే కృష్ణ: ఏంటి ఇంకో పార్టా...అంటే నాకు ఈ పేరు కష్టాలు ఇంకా కొనసాగాలనుకుంటున్నావా బాస్....

..nagarjuna.. said...

@ అభిజ్ఞ:చిట్టిపాప కబుర్లు భలేవున్నాయి.బాపు-రమణతో మాట్లాడేయనా...సీగానపెసునాంబకు చెల్లెలు దొరికనందుకు చాలా సంబరపడిపోతారు.

మంచు said...

@EEEE... నువ్వు ఎలెక్ట్రికల్ ఎంజినీరింగ్ అంటే మూడు E లే కదా.. ఈ నాలుగో E ఎక్కడనుండి వచ్చింది :-))
GDR అంటే నాన్-లీనియర్ కంట్రొల్స్ చెబుతాడు అతనా ?

..nagarjuna.. said...

@మంచుపల్లకి గారు: EEEE కాదు మహానుభావా 4E. మీరు అనవసరంగా నాకు కొత్తపేర్లు పెట్టేట్టున్నారు. 4E కి వివరణ పోస్టులో ఇచ్చానుగా మళ్ళి చెప్పేదేముంది.
ఇంతకీ నేను ఎలెక్ట్రికల్ ఎంజినీరింగ్ అని మీకు ఎలా తెలిసిందబ్బా..!!! నేనెక్కడా చెప్పలేదే. మా GDR పేరు చూసి కనిపెట్టారా? అవును ఆయన కంట్రోల్ సిస్టంస్ చెబుతాడు. మీరూ ఇక్కడ ఎలెక్ట్రికల్ ఎంజినీరింగ్‌లో చదివారా?

మంచు said...

చార్ E అంటే EEEE కదా...
నువ్వు MM హాస్టల్ అనుకుంట కదా :-))

ఆ.సౌమ్య said...

chaar'i' గారూఊఊఊ పేరుతో తెగ కష్టాలు పడినట్టున్నారు మీరు :)
ద్రోణాచార్య మాత్రం కేక, ప్రణతికి పంకజ్ అని పిలిచాడా మహానుభావుడు...సూపరో సూపరు.

నా పేరుతోను కష్టాలున్నాయండి. నన్ను అందరు సౌజన్య అని పిలుస్తారు. ఎవరికి సౌమ్య అన్న పేరు గుర్తు ఉండదు. వెంటనే సౌజన్య అనేస్తారు. అసలు నాకర్థం కాదు సౌమ్య అన్నపేరు సులువుగా గుర్తు ఉంటుందా సౌజన్య గుర్తు ఉంటుందా అని. సౌజన్య కన్నా సౌమ్య అన్నది పలకడం ఎంత ఈజీ కద, అదేమిటొ ఈ మనుషుల గోల నాకర్థం కాదు. మొన్న కూడా ఒకావిడ సౌజన్య అని పిలిచారు. నాకు ఎంత చిర్రెత్తుకొచ్చిందో చెప్పలేను.

..nagarjuna.. said...

@మంచు : అదే చెప్తున్నా... మావాడు అన్నది 4E అని అందులో ఏమైనా implications ఉన్నాయో లేదో అనవసరమండి. నామటుకునాకు 4E not equal to EEEE. పైగా వాడు పెట్టింది అలా పెట్టింది కూడా నేను ECE వాణ్ని అని digital format లో నన్ను పిలవడానికి hex code అట. :) :(
అవునండి మా బ్యాచ్ students అందరికి MM allot చేసారు. ఇంతకు మునుపు నా పాత పోస్టులో అడిగారు కదా...

@సౌమ్య గారు: ఊఊ....చేస్తున్నా అన్నీ అబ్జర్వ్ జేస్తున్నా సెగెట్రీవోరు బాగానే ఆటపట్టిస్తున్నారు మమ్మల్ని. దీన్ని తీవ్రంగా ఖండితున్నా అద్దెచ్చా.. :)
మా ప్రొఫెసరు చేసాడంటే అర్థం చేసుకోవచ్చు మిమ్మల్ని చాలా‘అందరు’ సౌజన్య అని పిలవడేవిటట...వింత కాకపోతే. ఈసారి ఎవరైనా అలా అంటే ప్ర.పీ.స.స లోంచి ఓ తిట్ల దండకమో, అన్నాయ్ రాసిన ఓ కథో వినిపించండి, సర్దుకుంటారు దెబ్బకు.. :))

మంచు said...

నేను అడిగినట్టు గుర్తులేదే.. GDR పేరు చూసి కాలేజ్ వెబ్సైట్ లొ ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసా ..

భావన said...

ఏం నవ్విచారండి ద్రోణ ఆచర్య... వోసారి ద్రోణ్చార్..వో సారి ఆచారి.. అబ్బ సారి అండీ.. చారి గారు. అయ్యో పూర్తి పేరు కదు.. బాగా నవ్వించేరండి నాగార్జునాచారి గారు ;-)

..nagarjuna.. said...

@మంచు : పాత పోస్టు ఫస్ట్ షో లో తారసపడ్డాంలేండి. దాని గురించి చెప్పా...
@భావన గారు:నేను నవ్వించినదానికన్నా మీరు ఎక్కువ నవ్వించారు నన్ను, మీ సంధులు, సమాసాలతో... :)
బ్లాగేశ్వరం పోయినా కష్టేశ్వరం పోలేదు అన్నట్లు తయారైంది ...కానివ్వండి

krishna said...

4E గారూఊఊ !
చాలా చాలా జాలి వేస్తుంది అండి మీ కష్టాలు చదివి. పేరుతో నేను కూడా చాలా బాధలు పడ్డాను. అందులో మచ్చుకు కొన్ని ఇక్కడ చెబుదామని మొదలు పెట్టా! మన కష్టాలు లిస్ట్ పెద్దది లెండి కామెంటు కాస్త టపా అయ్యి కుర్చుంది. కాస్త చదివి సానుభూతి చూపండి :-)
http://venkatakrishnanaram.wordpress.com/2010/06/06/ఔనౌను-పేరులో-నేముంది/

krishna said...
This comment has been removed by a blog administrator.
bondalapati said...

అవునూ సంధులూ సమాసాలూ అంటే గుర్తుకొచ్చింది...
నాగార్జున + ఆచారి = నాగార్జునాచారి
ఇది సవర్ణ దీర్ఘ సంధి కదా. చారి అనే పదానికి వేరే అర్ధం ఉందా?

మేం కూడా ఖడ్గపురం లో నే చదివామండోయ్. ఏ హాల్లో ఉంటున్నారు? మిష్టీలూ రొషొగొల్లా లూ బాగున్నారా?

..nagarjuna.. said...

@బొందలపాటి :ఇంగ్లీషు chary కి అర్థం తెలుసుకాని తెలుగు చారి అంటే ఏంటో తెలీదు. నా పేరుకి అర్థం నాకే తెలవనందుకు ఇంకేన్ని కష్టాలొస్తాయో :(

మీరు ఖర్గపురమేనా...!!ఎహెయ్ మీది ఖర్గపురమే మాది ఖర్గపురమే మనది ఖర్గపురమే... :)
రొషగొల్లాలు తెలుసు, ఈ మిష్టీలేంటి చెప్మా...??

మంచు said...

ఖర్గపురమే మాది ఖర్గపురమే మనది ఖర్గపురమే.. భారారె ది కూడా
మిస్టి అంటే తీపి అని అర్ధం.. జామూన్లకి ఇంకొ పేరు

నేస్తం said...

చారి గారు శుబ్బరంగా నాగార్జున అని పెట్టెసుకుని సైలెంట్గా ఉండచ్చుగా..మళ్ళా ఈ పోస్ట్ రాసారు..ఇక మీ పేరు చారే ...అవునన్నా కాదన్నా :)

Mopuri K Reddy said...

bavundayya chari nee ' naam mey kya hien'.....!

మాలా కుమార్ said...

మీ పేరు కష్టాలు బాగా రాసారండి :-))

..nagarjuna.. said...

@ నేస్తం, రెడ్డి, మాలా కుమార్: స్పందనకు థాంకులు :)

శివరంజని said...

పేరు కష్టాలు నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని నాగార్జున గారు అని పిలుస్తానులేండి .......
ఆహా మీ పోస్ట్ నా పోస్ట్ కంటే అద్బుతం గా ఉందండి ...
ద్రొణాచార్యా ఈ మాట ని మర్చిపోవడానికి మాకయితే రెండు వారాలు సరిపోదేమోనండి ...అప్పటివరకు లోలోపల నవ్వుకుంటున్నా దాన్ని కాస్తా "ద్రొణాచార్యా" అన్న మాట తో నవ్వాపుకోలేక పెద్దగా నవ్వేసానండి బాబు ఆఫీస్ అన్న స్పృహ కూడా లేకుండా .....

sunita said...

haha! ee paerla Tapaani chaalaa saradaagaa raasaaru.

ఊకదంపుడు said...

నాగార్జునాచారి గారూ,
:) :)
ఆచారి, నాగార్జునా , శివరంజని ఇలాంటి పేర్లు నచ్చడలేదంటే - ఈ దేశం సరి ఐన దిశలో ముందుకు పోతుందని అర్ధం.. ఈ టపా ఏమన్నా కాస్త పనికి వస్తుందేమో చూడండి. elangovan అని ఒక మిత్రుడు, IT వ్యామోహం లో e-LAN-go-WAN అని తన షరా మామూలూ సంతకంగా వేగు చివర ఉంచేవాడు.. ఆ ప్రొఫెసర్ గారు పాత కాలమనుకుంటా, లేక పోతే అ char కి కంప్యూటర్ భాషల్లో char కి సంబంధం కలిపేవాడు
భవదీయుడు
-ఊకదంపుడు

..nagarjuna.. said...

@శివరంజని, సునిత, ఊకదంపుడు : మొదటగా మీరు మై బ్లగుకు విచ్చేసినందుకు స్వాగతాలు, టపా నచ్చి వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు :)

@శివరంజనిగారు: అఫీసులో ఉన్నాననికూడా మరచి నవ్వేసారా.!! ధన్యోస్మి ఈ టపా రాయడంలో సగం ఉద్దేశ్యం తీరిపోయింది. ఇకపోతే నాగార్జున అని పిలచినా, చారి అని పిలచినా అభ్యంతరం లేదండి కాకపోతే పేరు చివర ’గారు’లాంటి suffix వద్దని నా మనవి :)

@ఊకదంపుడుగారు: అబ్బే నాపేరు నాకు నచ్చలేదని ఎవరు చెప్పారు మహాప్రభూ....పేరును ఎగ్గొట్టి దిగ్గొట్టడం నచ్చలేదు అన్నాను కదా.

elangovan = e-LAN-go-WAN. హహ్హహ ఇది కెవ్వు మాష్టారు. ఇలాంటి వీరప్రేమికులను మనం చేసేది ఏంలేదు అలా చూస్తూ ఉండడం తప్ప :)

కొత్త పాళీ said...

Funny!
On a similar note, Telugu profs at our college used to butcher all Northie names - so, it all balances out! :)

..nagarjuna.. said...

@కొత్తపాళిగారు:మీకు టపా నచ్చి వ్యాఖ్యానించినందుకు నాకు చాలా :)గా ఉంది

ఇకపోతే మనతెలుగువాళ్లకు ఉత్తరాదివారి పేర్లు పలకడం కష్టం కాదేమో!! నా నా అనుభవంమటుకు ఒక్క బెంగాలీవాళ్ల పేర్లే ఉచ్చారణలో కష్టంగా ఉంటాయి

Unknown said...

పొస్ట్ సూపర్ ! చాలా బాగా రాసారు .అబ్బో ! మీకిన్ని పేర్లున్నాయని ఇప్పటి వరకూ తెలియదండి ద్రోణాచార్య గారు :)) radhika (nani)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis