పాతకాలనివి కొన్ని విడియోలు-అంటే నా చిన్నప్పుడి వీడియోలు

ఇప్పట్లా కాదుగాని చిన్నప్పుడు నిజంగా mesmerise చేసే షోలు వచ్చేవి డిడిలో. TRP రేటింగ్స్ అప్పట్లోవుండివుంటే బహుశా all time high రికార్డు నమోదు చేసేవి అవి. వాటిల్లొ కొన్నింటిని నెమరేస్తూ మీతో పంచుకుందామని ఈ పోస్టు.ఆదివారం ఉదయం జంగిల్ బుక్‌ను చూసేంతవరకు ఎక్కడికి కదిలేది లేదు. మౌగ్లి, షేర్‌ఖాన్, భగీర, భాలు- ఈ క్యారెక్టర్లు క్రియేట్ చేసిన మాయ అంతా ఇంతా కాదు. "జంగల్ జంగల్ బాత్ చలి హై పతా చలా హై...అరె చడ్డి పహన్కె ఫూల్ ఖిలా హై.." అనుకుంటూ సాగే టైటిల్ సాంగ్ జెస్సి-సమంతా కన్నా మాయ,mesmerise చేసేవి. ఇప్పటికి ఈ పాట వింటుంటే భగీర వీపు మీదఎక్కి కొండమీదనుండి దూకుతున్న అనుభూతి కలుగుతుంది. అబ్బో ఎంత చెప్పినా తక్కువే లెండి.
నా మతిమరపు బుర్ర గుర్తుపెట్టుకుంది నిజమేఅయితే ఈ సీరియల్ సోమవారం రాత్రి ప్రసారమయ్యేది. అప్పట్లో ఈ సీరియల్ మొదలయ్యే టైంకి పది నిముషాల ముందు మా ఏరియాలొ కరెంటువుండేది కాదు. ఆ గ్యాప్‌లో పక్క పక్క పోర్షన్లలో అద్దెకుండే మా పిన్నివాళ్లు మేము మేడ మీద వెన్నెల వెలుగులొ డిన్నర్ చేసేవాళ్లం. పదినిషాల్లో కరెంటు రావడం మేము TVకి అతుక్కుపోవడం ఆటోమేటిగ్గా జరిగిపోయేవి. దీంట్లో కొన్ని రోజుల తరువాత sindbad series మొదలయ్యింది. అందులో హీరో దగ్గర ఓ జిని, ఓ ఖడ్గం వుండేది. ఏ సమస్య వచ్చినా హీరో ఆ ఖడ్గం తీసి "యా అల్లా మేరి మదత్ కర్" అంటాడు అప్పుడు దాన్నుంచి ఉరుములు మెరుపులు వస్తయ్, ప్రాబ్లం solved. అలాంటిదోటి మందగ్గరావుండాలి అని అనిపించేది.
రామాన్ంద్ సాగర్స్ నుండి వచ్చిన సూపర్ మెగా హిట్టు. కొన్ని రోజులయ్యాక దీన్ని అరగంటకు కుదించాడు. ప్రోగ్రాం మొదలవ్వడం, ఓ పావుగంట వాణిజ్య ప్రకటనలు, కథ ముందుకు జరిగింది అనుకునే లోపు " హరే కృష్ణ...." అని ముగింపు పాట-suspense + నిరాశ కలిసి వచ్చేది.
ఛత్రపతి శివాజి, గాంధి, భగత్‌సింగ్ లాంటివాళ్లకన్నా ముందుగా నాకు ఓ నేషనల్‌హీరోని పరిచయం చేసిన ప్రోగ్రాం. వరుసపెట్టి పేలే ఫిరంగి గుండ్లు, అంబారిపైన వచ్చే పెన్సిల్ మీసాల టిప్పు సుల్తాన్ రాజసంగా అనిపించేవి."జై హనుమాన్"అనే పదాన్ని, హనుమంతుడిని ఈ సీరియల్ చేసినంతపాపులర్ అప్పట్లొ ఇంకోటి చేయలేదేమో!! సంజయ్ ఖాన్ నుండి మరో మార్వెల్. ఈ సీరియల్ మొదలైన చాన్నాళ్ల వరకు నాకు రెండు గదలు నచ్చేవి ఒకటి ఈ సీరియల్లో హనుమంతుడిది, రెండొది నలుపు-తెలుపు తెలుగు సినిమాల్లో NTR  వాడేది.
ఓ రెండెళ్ల కిందట రామానంద్ సాగర్‌వాళ్లు రామాయణం రీమేక్ చేసారు.ఆది చూసాక వచ్చిన చిరాకు అంతా ఇంతా కాదు, handsome + smiley హనుమంతుడు (హనుమంతుడంటే మాం....చి బాడి వుండాలని ఫిక్సయిపోయేల చేసింది పాత రామాయణ్, జై హనుమాన్), అమాయకంగా కనిపించే రాముడిని (రాముడంటే అందంగా, masculine personality కనిపించేట్టువుంటాడు అని ఫీలయ్యేవాణ్ణి) చూసి నవ్వాలో ఏడవలో అర్థం కాలేదు. 
ఇక ఏక్తకపుర్ అనే మహానుభావురాలు తీసిన  కహాని హమారి మహాభారత్ అయితే నాకు చిరాకుయొక్క peaksను పరిచయమ్ చేసింది. గ్రీకు వీరుల్లాగా ఆ డ్రెస్సింగులేందొ, ఒంటిమీద టాటులేందొ అర్థంకాక జట్టుపీక్కున్నంత పనైంది.
టైటిల్ సాంగ్ అయ్యాక ‘నేను ఓం....కారాన్ని’అంటూ ‘ఓం’ను సాగదీస్తు  మొదలయ్యేది. శివుడి పాత్రను సమర్ జయ్‌సింగ్ పొషినంత చక్కగా నేననుకోవడం ఇంకెవరు చేసుండరు.


science fiction కథ street hawk పిచ్చ పిచ్చగా నచ్చేది. especially అందులో హీరోవాడే బైకు.బైకులోనే గన్ను ఒకటి  ఉంటుంది.స్విచ్ వొత్తగానె బైక్‌లోంచి బుల్లెట్లు వస్తాయ‌. అలిఫ్‌ లైలాలో సింద్‌బాద్ కత్తి, స్ట్ర్రీట్‌ హాక్‌లో బండి నాక్కూడా కావాలి అని అనిపించేది.ఇవికాకుండా ‘తౌబా తౌబా'అనే డైలాగుండే కామిడి సీరియల్, డక్ టేల్స్, రామాయణ్‌, మహాభారత్,శక్తిమాన్, ఏక్ సె బడ్ కర్ ఏక్....చాలానేవున్నాయి. రియాల్టిషోల్లాంటివి లేకపొయినా చాలా ఎంటర్‌టేయినింగ్‌ వుండేది. ఇప్పుడూ వున్నయి లెక్కకు మిక్కిలి ఛానళ్లు, కొన్నింటిని మిహాయించి, అందులొ వచ్చే 24x7 కార్యక్రమాలు అబ్బో !^##$&% ఇప్పుడొద్దులెండి ఎందుకు అనవసరంగా టైం బొక్క.

15 వ్యాఖ్యలు.. :

Anonymous said...

డేంజర్ బోయ్ ను మరచినట్లు ఉన్నారు.

Anonymous said...

మిగతా వాటన్నింటి పేర్లు గుర్తున్నాయి కానీ, street hawk సీరియలు పేరు మాత్రం నాకు గుర్థులేదు. కానీ, దాన్ని చాలా ఇష్టంగా చూసేవాడ్ని. తెలియచేసినందుకు ధన్యవాదాలు. మీరు Giant Robot చూసారా? దాని గురించి నేను రాసిన టపా ఒకసారి చూడండీ.

http://akasaramanna.wordpress.com/2010/02/08/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%AE%E0%B1%81%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9C%E0%B1%86%E0%B0%AF/

Anonymous said...

Alif laila edi

Anonymous said...

sorry undi kada

..nagarjuna.. said...

@ఆజ్ఞాత1: మీరు చెప్పాలనుకున్నది ‘డేంజర్ బే’ అనుకుంటా.కాని ఎంత చించినా గుర్తురావటంలేదు బహుశా నాకు TV అంటే ఇది అని తెలిసేటప్పటికి ఆ series అయిపోయిందనుకుంటా.
@ఆకాశరామన్న:Street Hawk పేరు నాక్కూడా గుర్తులేదండి, డిడి విడియోల కోసం యూట్యూబ్ లొ వెతుకుతుంటే లక్కిగా దొరికింది. మీరు చెప్పిన gaint robotను చూడలేదు. మీ పోస్టు కామెంట్లలొ మాధవ్‌గారు gaint robot 1989లో టెలికాస్ట్ అయ్యెదని రాసారు.అప్పుడు నాకు రెండేళ్లు so no chance.. :)

మరికొన్ని పాత డిడి సీరియల్ లంకెలు ఇక్కడ

శేఖర్ పెద్దగోపు said...

అమ్మో మీకు చాలా బాగా గుర్తున్నాయండీ...మోగ్లీ నా ఆల్ టైం ఫేఫరెట్...

స్నిగ్ధ said...

భలేగా రాసారండీ అన్ని ప్రోగ్రాంస్ పేర్లను...
మళ్లీ చిన్నప్పటి రోజుల్లోకి తీసుకెళ్లారు.
అప్పట్లో ఆదివారం వస్తే ఆ రోజంతా డి.డి కార్యక్రమాలే...అప్పట్లో సమస్యేంటంటే మనకేమో హిందీ అక్షరం ముక్క అర్ధమయ్యేది కాదు అయినా మహాభారతాన్ని మాత్రం చూడ్డం మానలేదండోయ్..అది నా ఆల్ టైం ఫేవరిట్.ఇంకా "Stone Boy" అని ఒక సీరియల్ వచ్చేది.నాకంతగా గుర్తు లేదు కాని తరువాత అదే సీరియల్ని ఈ.టి.వి మొదలయ్యిన కొత్తలో మళ్లీ చూసాను.అది కూడా బాగుంటుంది. "Giant Robot" కూడా చూసినట్లు గుర్తు.
:)

Anonymous said...

స్నిగ్ధ గారికి పాదాభివందనం
మీరు కేవలం రెండు బ్లాగుల్లో మాత్రమే కామెంట్లు రాస్తున్నారు
మాకు చాలా బాధగా ఉంది
నా బ్లాగ్ లో మీరు ఇప్పుడు కూడా కామెంట్ పెట్టలేదు

స్నిగ్ధ said...

అఙ్ఞాత గారు,మీరు నాకు పాదాభివందనం అంటారేంటండీ.బాబొయ్..నేను మీ బ్లాగ్ పేరు అడిగాను కదండీ..మీరే ఇవ్వలేదు :( సౌమ్యగారి బ్లాగ్ లో ఫాలోవర్స్ లిస్ట్ లో ఉన్నాను అని అన్నారు..
అది ఏదో నాకు తెలియలేదు...
సో ఇందులో నా తప్పేమి లేదని మనవి చేసుకుంటున్నాను...
ఇప్పటికైనా మీ బ్లాగ్ పేరు ఇవ్వండీ...

Anonymous said...

స్నిగ్ధ గారు మీ స్పందన కి ధన్యవాదాలు

మళ్ళీ ఇప్పుడు నా బ్లాగ్ లో మీరు సడన్ గా కామెంట్లు రాస్తే లోకం నాలుగు రకాలుగా అనుకుంటుంది కామెంట్లు కొన్ని రోజులు అయ్యాక రాయడం మొదలెట్టండి

వివరాలకు సౌమ్య గారికి మెయిల్ పెట్టండి

Anonymous said...

మీరు కామెంట్లు రాయడం లేదు అని నేను ఇప్పుడు సౌమ్య గారి follower లిస్ట్ నుండి ఉపసంహరించుకున్నాను

Anonymous said...

నేను నా బ్లాగ్ పేరు ఇచ్చాను
moderation వరదలో కొట్టుకుపోయింది
ఒక్కసారి ఇచ్చినాక మళ్ళీ మాటి మాటికీ అడుగుతున్నారు

..nagarjuna.. said...

@Snigdha గారు: ఇన్ని రోజుల తరువాత ఈ పోస్టుకు వ్యాఖ్యలు రావడం సంతోషంగా ఉంది. తీరిక చేసుకొని ఈ టపాను వెతికి చదివినందుకు ధన్యవాదాలు :)

చెప్పాలంటే నాకు ఆ వయసులో హింది ఏం అర్థమయ్యేదికాదు...కాకపోతే ఆ సౌండ్‌ ఎఫెక్టులకి, కెమెరా ఎఫెక్టులకి మైమరచి చూసేవాళ్లం


@అజ్ఞాత: నా బ్లాగులో కామెంట్‌ మోడరేషన్ ఎప్పుడో తీసేసానండి. మీరుగాని మా ఆలమురు సౌమ్యగారి బ్లాగ్‌ గురించి మాట్లాడుతున్నారా...

నేస్తం said...

నా చిన్నపుడు అయితే (5 years) హీ..మేన్ ఇంకా విక్రం బేతాళ్ ,టిప్పు సుల్తాన్ ఇంకా రామాయణ్,మహా భారత్ ఇవి అంటే తెగ ఇష్ట్టం గా చూసేదాన్ని

..nagarjuna.. said...

మీ అనుభవాలు పంచుకున్నందుకు Thanks నేస్తం :)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis