ఈమధ్య అందరూ మహబాగా మురిసిపోతున్నారు...ఎందుకటా..? వాళ్ల బ్లాగు పుట్టినరోజట. ఓహో అలాగా....బాగు బాగు. మరి పుట్టినరోజన్నాక విషెస్ చెప్తాం కదా...నేను కూడా రాముడు మంచి బాలుడు టైపులో శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెళ్తున్నాను.
ఉన్నట్టుండి ఏమైందో...నా బ్లాగు అలిగి కూర్చుంది. అరే ఇప్పుడేమైందని మూతి ముడుచుకొని కూర్చున్నావ్ ఎందుకు అలిగావ్ అని అడిగా. " అసల్ నీకు బుద్దుందా వయ....బ్లాగుబెట్టి నీ ముచ్చట నిదేగాని నా గురించి ఒక్కరోజైన పట్టించుకుంటివా...సూర్యగ్రహణానికోసారి రాశే నీ ఇంగిలిపీసు బ్లాగుకి ఎప్పుడో బొడ బొచ్చె ఓ వంద మంది వచ్చిండ్రని మస్తు గారాలు బొయినవ్...ధూం ధాం జేశ్నవ్. నేనేమన్న తక్వ జేశ్ననా నీకు. అసల్ ఇయ్యాల గిట్ల నువ్వు ఈ బ్లాగులు రాశే ఓ పదిమందికైన ఎర్కఉన్నవంటె అది నాతోని అయిందికాదు.....? మల్ల నాకేం జేశ్నంవయా నువ్వు? ఓ పుట్టినరోజు లేదు, సదివెటోళ్ళు 'ఈరోజు' ఎక్వ వచ్చిండ్రు అని శెప్పిందిలేదు నేను మాత్రం నువ్వు అన్నట్టల్ల ఆడాలే తాన అంటే తందాన అన్నట్లు.....ఛల్ హట్" అనేసి చేతులు కట్టుకొని కోపంగా నావైపు చూస్తుంది. ఇప్పుడు ఈ కొత్త గోలేంట్రా బాబు, ఉన్న తిప్పలు చాలవన్నట్టు అనుకొని 'ఇంద్రధనస్సు'ని ఎలా శాంతింపజేయాలా, ఏంచేసి బుజ్జగించాలా అని అలోచిస్తూ ఉన్నా....అప్పుడే ఓ అనుకోని సంఘటన జరిగింది.
బ్లాగు హిట్ కౌంటరు 7999 నుండి 8000 చేరుకుంది. ఇది చాలు నా ప్రియమైన బ్లాగుకు నేను అభినందనలు తెలపడానికి.
Congratulations ఇంద్రధనస్సు....
ఈరోజు Renton, Washington DC నుండి Windows 7 లో IE8 నుండి నా బ్లాగును చూసి 8000వ హిట్ ఇచ్చిన రీడర్ గారు...మీకు ధన్యవాదాలు :) :)
అలోచించిగా ఆలోచించగా ఇంకో తమాషా సంగతి తట్టింది. ఇన్నేళ్ల (ఛా...ఎన్నో యేళ్ళుగా ఐనట్టు పొజొకటి) బ్లాగు జీవితంలో నేను చూసిన అత్యధిక సున్నాల రికార్డ్ ఇది....అయిదు సున్నాలున్నాయి మరి 8000 లో. 'కళ్ళు గాని దొబ్బాయా...ముడు సున్నాలేగా ఉన్నాయ్' అని లాజిక్కులు లాగొద్దు నా లాజిక్ నాది. నిజంగా అయిదు సున్నాల హిట్ రావాలంటే అంటే లక్ష హిట్లు (మనసులోంచి బ్లాగారాం గాడు : లక్ష హిట్లా...ఏది ఓసారి ఫేస్ టర్నంగ్ ఇచ్చుకోరా నువ్వు....కామెడిలు చేస్తే అతికినట్లుండాల్రా... యెదవ) రాలాలి....నా వల్లయ్యేనా..!!
ఇంకో విష్యం, ఒక సైన్సు మనిషిగా (అంటే non-art field లో ఉన్నవాడిగా స్వామి..) లెక్కలు వేస్తే వచ్చినది...ఇందాక ఐదు సున్నాలున్నాయని అన్నానుకదా...
(0! + 0! +0!)! + (0!+0!) = 8;
(0! +0!)^ (0!+0!+0!)= 8;
(maths బ్యాక్‌గ్రౌండ్ లేనివారి కోసం, 0!=1, 1! =1, 2!=2,3!=6 )
అబ్బో, నాలో కూడా ఓ సంఖ్యా శాస్త్రవేత్త ఉన్నడన్న మాట..గుడ్ గుడ్.
బ్లాగు వార్షికోత్సవాలు జరుపుకునేవారికి అభినందనలు...వారి బ్లాగుకు శుభాకాంక్షలు. Have fun
మరిక సెలవు....
Subscribe to:
Post Comments
(
Atom
)
28 వ్యాఖ్యలు.. :
Congratulations Nag :)
Srikrishna
నాగార్జున.. అభినందనలు.:) ఏదో ఒక రోజు అసలైన ఐదు అంకెల హిట్ రావాలని మనసారా కోరుకుంటూ.. నువ్వు సపోర్ట్ చేస్తానన్న బంగారం..;)
ముందుగా అభినందనలు.
హ్యూమరు బాగుంది, చక్కిలిగింతలు పెట్టేలా.
ఇంటరు లెక్కలు ఇప్పుడు కొంచెం మరుపు పడ్డాయి - ! అంటే ఫేక్టోరియల్ కదా -
0! = 1 ఎలాగ??
Congratulations!
గిప్పుడ్నే అభినందనల్ముచ్చట నీగు సెప్పాల్నా, నీ బలాగుకా. ఎట్టగైతెనే ఎనిమిది సున్నలు వచ్చేసినయ్. ఇంత లావు లెఖ్ఖలు బుర్రలోకెక్కవ్ గాని 8000 లో ఎనిమిదిల పైన కింద రెండు సున్నలు మిగతా మూడు సున్నలు కలిపి మొత్తం ఐదుసున్నలనేసికుంటంలే.
శుభాకాంక్షలు మిత్రమా!
శుభాకాంక్షలు
అవునా కంగ్రాట్స్ నాగార్జునా.. మరైతే నా బ్లాగ్ నన్ను ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసి ఫోల్డ్ కూడా చేయాలి.. ఏం తోచకపోతే నా బ్లాగ్ హిట్ కౌంటర్ మీద పడి దాన్ని మారుస్తూ ఉంటా :)
లక్ష హిట్లు త్వరలో అందుకోవాలని ఆశిస్తూ
సంతోషం.ఒక్కొక్క మైలు దాటుతూ లక్షకి చేరుకోవాలని కోరు కుంటున్నాను.అది ఎంతో దూరం లేదు.మొదటి అడుగులే కష్టం. ఇక ముందు వేగం గా పరుగులు తీస్తారు.టపా బాగుంది.కితకితలు పెట్టినట్టు ఉంది, కొత్తపాళీ గారన్నట్టు.అబినందనలు
హ హ హ బాగుంది నాగార్జున :-) అభినందనలు త్వరలో లక్ష హిట్లకు చేరువ కావాలని కోరుకుంటున్నా.
3g గారన్నట్లు ఇంత కాంప్లెక్స్ లెక్కలు మనకెందుకు గానీ 8 లో పైనో సున్నా కిందో సున్నా కలిపి 5 సున్నాలు లెక్కేసుకుందాం. నీకో సీక్రెట్ జెప్పనా నీ బ్లాగు ఎప్పుడో 6888 వ హిట్ కే 7 సున్నాలకు జేరుకుంది ఇంక పండగ జేస్కోమరి :-D
బ్లాగ్ కౌంటర్ ని చూసి మోసపోకుమా మిత్రమా..లక్ష నుండి కూడా మొదలవుతున్నాయి ఈ మధ్య ఏదో ప్రోబ్లం వచ్చి :)
ఇంతమంది అభిమానం సంపాదిన్చుకున్నాక ఇవన్నే చిన్ని చిన్ని తీయని విజయాలు ..అందులో చిన్ని మైలురాయి అంతే..అభినందనలు :)
సరే మాకు పార్టీ ఇచ్చే చాన్స్ ఎందుకు వదులుకోవాలి చెప్పు ..
Congrats & బాగున్నయ్ మీ జోకులు.
ఇంద్రధనుస్సుకు శుభాకాంక్షలు. నాగార్జునకు అభినందనలు :)
ఇన్నాళ్ళు make 5 with 4 3's, make 20 with 4 9's ఇలా విన్నా కానీ, 1 (అదే 0!) తో అంకె తెప్పించే లెక్క ఇప్పుడే చూస్తున్నా. బాగుంది :)
Congrats Nag :-)
BTW Kottapaali gaaru:
0! = 1 - this is correct and logical. There are several proofs available but i like this simple one.
n!/n = (n-1) ! because n! = n* (n-1)!
assume n = 1 .. then
1!/1 = (1-1)! which becomes
1/1=0! = 1
:)అభినందనలు.
అభినందనలు చాల బాగ నవ్వించారు.
ముందుగా వ్యాఖ్యలు రాసిన అందరికి సారిలు....ఆలస్యంగా బదులు ఇస్తున్నందుకు. పోస్ట్ రాసేసి ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వేళ్లాను ఇప్పుడే రావడం.
@ శ్రీకృష్ణగారు,శిశిరగారు,అశోకగారు,విజయ్‌గారు,సుబ్బారావుగారు,రెడ్డిగారుః మీ అభినందనలకు ధన్యవాదములు :)
@అపర్ణః ఐదంకెల హిట్టు దూరంలో లేదులే... అనుమానం ఉన్నది ఐదు సున్నాల హిట్ పై...పోనిలే నువ్వూ అదే చెప్పాలనుకొని అలా అనుంటావు. కోరుకున్నందుకు థాంక్స్ :)
'చేస్తానన్న' ఎంటి, నేను నిన్ను ఆల్రెడి సపోర్ట్ చేస్తుంటే...
@కొత్తపాళిగారుః అవునండి అది ఫేక్టోరియలే...మంచుగారి వివరణ సరిపోయిందనుకుంటా...
@సునితగారుః హమ్మయ్య...,సునిత గారు చాలా థాంక్స్ అండి. అప్పుడెపుడో ఖలేజ సినిమా టికెట్లు కోసం ఒకరి బ్లాగులో అడిగాను ఎవరువారు, ఆ బ్లాగు ఏంటి అని 'హారం'లో నా రికార్డ్‌లన్నింటిని తెగ వెతికాను. లాభంలేకపోయింది.ఇప్పుడు మీరొచ్చి వ్యాఖ్యానించి ఆ వెతుకులాటను ఆపుచేసారు :)
@3gగారుః ఆ ముచ్చట బ్లాగుకే చెప్పుండ్రి కొంచెం హ్యాపి ఫీలైతది. మీరుశెప్పినట్లు ఎనిమిదిల గూడ సున్నాలు కలుపుకొనే ఐదు సున్నాలు అన్న.
@నేస్తం:మీ అభినందనలకు చాలా థాంక్స్ అక్కా :)
@సుబ్రహ్మణ్యంగారుః ధన్యవాదాలు :)
@వేణూగారుః అరే...ఈ లాజిక్ ఇంకా బావుంది అప్పుడే ఏడు సున్నాల రికార్డ్ వచ్చేసిందా..!! ఐతే పండగxపండగ చేసుకోవాలి :)
@హరే, సాయిః Thanks buddies... :)
అయినా హరే ముందు నువ్వు ఇవ్వాల్సిన పార్టి సంగతి తేల్చు....తర్వాత చూద్దాం నేను ఇవ్వడం.
@మంచుగారుః మీ అభినందనకు, కొత్తపాళి గారికి ఇచ్చిన వివరణకుగానూ డబుల్ ధన్యవాదాలు :)
Hi Nagarjuna
Actually 0! =1 is an axiom .. so none of the proofs really makes sense including the above mentioned one.
Thanks to Tara for correcting me :-)
@manchu: Yes machu gaaru...the result 0!=1 follows only logically, because as per definition factorial is only for a positive integer. n!=n*(n-1)*(n-2)......*1. I think 0!=1 is established to accommodate results like nC0, nCn.....తారగారు మీరేమైన ఇంకాస్త చెప్పగలరా 0!=1 ను axiom గా తీసుకోవడానికి కారణం ఏమిటో...
n! syntax came from Combinatorics, earliest examples can be seen in our Vedas(?), it went smoothly until discovery of 0. So, logical proof can be found only by its original definitions.
n! is number of ways choosing n items with out repetition, so how many ways can you choose 0 items? out of any n its only 1, this is how this logical solution was found. Similarly how many ways can you select 0 items of n given is always 1?
okay if you are not still convinced, ok, you have n items, you have to distribute those n items between A and B, how many ways can you do it such that B gets 0 items? Its only 'one' right?
And thats it 0! = 1, selecting 0 out of 0 :-)
But if you take Analysis before Combinatorics, its a custom to consider 0! = 1 as an Axiom, and avoid unnecessary discussion in the class :-), so most analysis text books mention 0! = 1 as definition.
---
Taara
thanks for the info taara gaaru....
Congrats,నాగ్ గారు,మొత్తం మీద ఐదు సున్నాల రికార్డు సాధించారన్నమ్మాట...
త్వరలో అసలైన ఐదంకెల సంఖ్యకు చేరుకోవాలని ఆశిస్తూ,మీ బ్లాగ్కి అభినందనలు చెప్పకపోతే ఫీల్ అవుతుంది కాబట్టి మీ బ్లాగారాంకి కూడా అభినందనలు...
థాంక్స్ స్నిగ్ధగారు... :)
మీరు తొందరగా ఇంకో పోస్టు వేయండి....నీతి కథ చదివాక కొత్తపోస్టు కనపడక 'ఈ క్షణమూ గడచిపోతుంది' అనుకోవాల్సొస్తుంది... ;)
అలా అంటారా...మీరు సరే బహు బ్లాగువేత్త...అలా అలవోకగా అన్ని విషయల పై టపాలు రాసేస్తారు..మేము ఇంకా బుడి బుడి అడుగుల స్టేజ్లో ఉన్నాము...కొంచం టైమివ్వండీ ప్లీజ్..
>>బహు బ్లాగువేత్త << :-o :-/
anywayz, i enjoyed the satire in your comment snighdha ji :)
హెంత మాట అనేసారండీ...మీ పైన సెటైర్ వేయడమా...
నాగార్జునగారుః .. అభినందనలు.
లక్ష హిట్లు త్వరలో అందుకోవాలని ఆశిస్తూ
Post a Comment
మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ