విజయవాడలో జరిగిన రైతు సదస్సులో జే.పి గారు చేసిన ప్రసంగం ఇక్కడ పెడుతున్నాను. టివి ఛానళ్లు ఇది ప్రసారం చేసుండరనుకుంటా....వాళ్లకు అంత ఓపిక-తీరిక ఉండవుగా
2వ భాగం
3వ భాగం
ఆ ప్రసంగం విన్నాక నాకు కలిగిన అభిప్రాయాలు స్థూలంగా ఇవి.
౧)వ్యవసాయ ప్రధానమైన దేశంలో వ్యవసాయాన్ని బతికించుకోవడానికి పరితపించడం ఏమిటో......!! చూడబోతే తెలుగునేలలో ఉంటూ తెలుగును బ్రతికించుకొవడానికి చేస్తున్న ప్రయత్న ఉదంతంలా ఉంది. మన ఈ ప్రయత్నం చూసి ఆనందించాలో, 'బతికించుకొడానికి' చేస్తున్నాం కాబట్టి బాధపడాలో అర్ధం కావడంలేదు.
౨) వ్యవసాయ రంగం పట్ల రోజురోజుకి తగ్గుతున్న ఆసక్తి- పట్టణాల్లో పుట్టిపెరిగినవాళ్లు ఎలాగు నూటికి 99.9% వ్యవసాయం వైపు వెళ్లరు కాని గ్రామాల్లో ఉండేవారు కూడా వ్యవసాయాన్ని వదలటం ఏమిటి!? కారణాలు విశ్లేషిస్తే నాకు తోచినవి మౌలిక వసతులలేమి, వ్యవసాయన్ని లాభదాయక రంగంగా గుర్తించక నిర్లక్ష్యం చేయడం.
౩)మౌలిక వసతులు: వ్యవసాయానికి అనుకూలం, రైతు బంధువులం అని చెప్పుకోగానే సరిపోదుగా అది మనుగడ సాగించేందుకు తగిన వనరులను కూడా సమకూర్ఛాలి. పంటకు సరిపడా నీరు, చేతికొచ్చాక మార్కెట్‌కు తరలించడానికి మెరుగైన రవాణా వ్యవస్థ, నిల్వ చెసుకోడానికి గిడ్డంగులు కావాలి. ఇలా తక్కిన వాటిని వొదిలేసి రుణమాఫీలతో సరిపెట్టేస్తే ఎలా. వ్యవసాయం అనేకాదు ఇవాళ చాలా పట్టణాల్లో, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచవలసిన అవసరం ఉంది. అది రవాణా కావచ్చు, ప్రాథమిక విద్య కావచ్చు, ఆరోగ్య సంబంధితమైనది కావచ్చు , నీటి సదుపాయం కావచ్చు. కావలసింది వీటి అభివృద్ధి....ఇవి అయ్యాక వాటిపై కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చి ఆర్ధిక రంగాన్ని ఎంత దూరమైనా పరిగెత్తించవచ్చు.
౪) రైతులే తమ పంటకు ధరను నిర్ణయించుకోవాలి--- ఈ విషయంలో నాకు కొంత విభేదం ఉంది. ఉత్పత్తిదారుడి చేత ధర నిర్ణయింపబడిన వస్తువులు మనరోజువారి ఆహారంలో ఉండవు కదా. నిత్యావసరాలైన బియ్యం, గోధుమలు...పప్పుదినుసుల ధరలపై నియంత్రణ లేకపోతే వాటి ధరలు ఇష్టమొచ్చినట్లు పెరిగిపోతాయి. అలా చేసేదనికన్నా రైతే నేరుగా తన పంటను మార్కెట్‌లో అమ్మేట్టు, మధ్యలో ఉండే దళారీలను కట్టడిచేస్తే బాగుంటుంది.
౫) సుమారు 70% నూనె సంబంధిత ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకుంటున్నామట. నోరువిప్పితే Energy Sustenance ( శక్తి స్వయంసమృద్ది (?) ) గురించి మాట్లాడే అమాత్యులు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించుకోడానికి వీలున్న పామ్‌ఆయిల్, ఇథనాల్‌ను దేశియంగా ఉత్పత్తి చేయడం గురించి ప్రణాళికలు రూపొందించరేం.....పెట్రోలియం ఆయిల్ కంపెనీలు లాభాలు ఆర్జించేందుకా. ఇంటర్మీడియట్‌లో ఉన్నపుడు చదువుకున్నా చెరకుపంటనుండి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయొచ్చనీ దాన్ని పెట్రోల్‌తో కలిపివాడితే సంప్రదాయ Fossil Fuel ( తెలుగు పదం ? ) వాడకం తగ్గించవచ్చనీ.....ఇంకా ఆ దిశగా ఏమి చేసినట్టులేదు !!
10 వ్యాఖ్యలు.. :
Fossil fuel = శిలాజాల ఇంధనము లేక శిలాజ ఇంధనము
నేను కూడ ఈ ప్రసంగం చూసాను. చూసిన తరువాత అర్ధం ఐంది . అసలు మన ప్రభుత్వం వ్యవసాయం గురించి ఏమైనా పట్టించు కుంటుంద అని. రైతుల ను చాల దారుణం గా ఒక పధకం ప్రకారం మోసం చేసి వాళ్ళకి తిరిగి ఏదో సహాయం చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవటం ఎంతో దారుణం. విదేశి రైతు ఉత్పత్తులకు సుకం నుంచి మినహా ఇంపు ఇచ్చి వారిని ప్రోత్స హించి. స్వదేశి రైతుల నోట్లో మట్టికుడుతున్న వైనం నమ్మలేక పోయాను. JP గారు చెప్తున్నా ఇంతటి విలువైన విషయాలని తెలుగు మీడియా ఎక్కడ focus చేయల్లేదు. మీరు ఈవిషయం బ్లాగ్ లో రాసి చాల మందికి తెలియచేసారు.
మాది వ్యవసాయాధారిత కుటుంబమే. నా చిన్నప్పటికీ ఇప్పటికీ పరిస్థితులలో చాలా మార్పు వచ్చింది. నిజంగానే వ్యవసాయాన్ని బ్రతికించుకోవడానికి చాలా ప్రయత్నించాల్సి వస్తూంది. అపారమైన నీటి వనరులున్న మా ప్రాంతంలోనే దాదాపు గత నాలుగైదు సంవత్సరాల నుండీ రెండో పంట ఉంటుందో, ఉండదో అని ఏ యేటికాయేడు ఎంత టెన్షన్ పడుతున్నారో ఇక్కడి రైతులు.
గ్రామాల్లో ఉండేవారు కూడా వ్యవసాయాన్ని వదలటం
కారణాలంటూ విశ్లేషించడం మొదలుపెడితే మీరు చెప్పినవాటితో పాటు ఇంకా అనేకానేక కారణాలు రైతు విసిగిపోయేలా చేస్తున్నాయి. రాయితీలూ, ఋణమాఫీలూ ఎంతమంది అర్హులకి అందుతున్నాయనేది ఆలోచించాల్సిన విషయం. మిగతా అన్నిటిలోలాగే ఈ రంగంలో కూడా పరపతి ఉండి సిఫారసులు చేయించుకోగలిగితేనే రాయితీలైనా, ఋణమాఫీలైనా.
లాభాల మాట అటుంచి ఈ యేడు నష్టాన్ని ఎలా తగ్గించుకోగలము అని ఆలోచించాల్సి వస్తూంది. ఇక రైతులకి గిట్టుబాటు ధర లభించడం అనేది ఒక ప్రహసనం.
నా వ్యాఖ్యే ఒక టపా అయిపోయేలా ఉంది. :) అందుకే ముగిస్తున్నాను.
మీ సూచనలు బాగున్నాయి. చాలా మంచి పోస్ట్ రాశారు.
శ్రీధరగారు, ధన్యవాదాలు గుర్తుచేసినందుకు.
@Truely: అవునండి మెయిన్ స్ట్రీమ్ విజువల్ మీడియా ఇలాంటి వాటిపై కాకుండా అనవసర సోది కబుర్ల పై ఎక్కువ ధ్యాస పెడుతుండటం బాధాకరం
@శిశిరగారుః నెను సూచనలు చేయడమా !! ఎదో, జే.పి గారు చెప్పిన వాటిని అటుతిప్పి ఇటుతిప్పి ఇంకోరకంగా చెప్పాను... :)
మీకు తెలిసిన విషయాలు పంచుకున్నందుకు సంతోషం. ఈ రంగంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారినుండి మరింత తెలుసుకోవాలని ఉంది...
సూచనలు కాకపోతే అభిప్రాయాలులెండి. :) మీ అభిప్రాయాలు బాగున్నాయి.
జేపీగారి పరిష్కారాలు-ఆలోచనలన్నిటితో ఏకీభవించకున్నా, రైతులకి నిజాలు చెప్పుతూ ఇతర నాయకుల మాయమాటల్లో పడకూడదని చేసిన ప్రయత్నం బాగుంది.
మంచి ప్రసంగం పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
కనీసం వారానికొక్కసారైన ఈ ఆలోచనొస్తుంది - నగరాల్లో పుట్టి పెరిగినా నాకు కనీసం నేను తినే ప్రతిదీ ఎక్కడినుండి వస్తుందో తెలుసు, ఏ పంట ఏంటి అని గురించగలను. కానీ నా తరంలోనే చాలామంది డబ్బు సంపాదన తప్పితే మనం తినే పిజ్జా/మసాల దోశ/కాపుషినో కాఫీ కి కావలసిన ముడిపదార్ధాలు ఎక్కడినించి వస్తాయో అక్కరలేదు.
శ్రీ జయ ప్రకాశ్ గారికి అభినందనలు. రైతు సమస్యలపై వారు నూరు శాతం నిజాయితీ తో మాట్లాడుతున్నారు. రైతు చైతన్య యాత్రను వారు పట్టు విడవకుండా అంతు తేల్చేవరకూ కొనసాగించాలి. ఓటు సమీకరణ రాజకీయాలకు అలవాటు పడ్డ సాదా సీదా రాజకీయ పార్టీలకు భిన్నంగా నడుస్తున్న లోక్ సత్తాకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. జై కిసాన్!
నాగార్జున, నీకు నీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.:)
మీ సూచనలు బాగున్నాయి.నాగార్జునగారు దీపావళి శుభాకాంక్షలు.:)
@JB గారు,Obul reddy గారుః మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.
@అపర్ణ,శివరంజని,తక్కిన బ్లాగ్‌మిత్రులకుః దీపావళి శుభాకాంక్షలు.
Post a Comment
మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ